ఆంధ్ర ప్రదేశ్

MLA Chevireddy Bhaskar Reddy: రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి, హెలికాప్టర్‌ సాయంతో ఆహార పంపిణీ చేపట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే

Hazarath Reddy

చంద్రగిరి నియోజకర్గం పరిధిలో వరదముంపు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (MLA Chevireddy Bhaskar Reddy) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌ సాయంతో ఆహార పంపిణీ చేపట్టారు. రామచంద్రపురం మండలంలో రాయల చెరువు గండి పడే అవకాశం ఉండటంతో 18 గ్రామాలు ఖాళీ చేయించారు. తిరుపతిలో పునరావసం కల్పించారు.

AP Assembly Winter Session 2021: కులాలవారీగా బీసీ జనగణన, ఏపీ అసెంబ్లీలో తీర్మానం, బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్ అని తెలిపిన మంత్రి వేణుగోపాల కృష్ణ, ఏపీ శాసనమండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుపై చర్చ

Hazarath Reddy

నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Winter Session 2021) ప్రారంభమయ్యాయి. నేటి నాలుగవ రోజు సమావేశాల్లో (AP Assembly Winter Session 2021 Fourth Day) కులాలవారీగా బీసీ జనగణన తీర్మానం చేయాలని తీర్మానించారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.

Mudragada Padmanabham: అయ్యా చంద్రబాబు.. నన్ను నా భార్యను ఎంతగా అవమానించారో గుర్తుకు తెచ్చుకోండి, నీ పతనం చూడాలనే ఇన్నాళ్లు చావకుండా బతికి ఉన్నా, చంద్రబాబుకు లేఖ రాసిన సీనియర్ కాపు నేత ముద్రగడ

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి మాజీ మంత్రి, కాపు ఉద్యమ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో (Mudragada Padmanabham Writes Letter to Chandrababu) పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

APPSC Recruitment 2021: ఏపీపీఎస్సీ గెజిటెడ్‌ ఉద్యోగాలు, నెలకు వేతనం రూ.29,760 నుంచి రూ.93,780 వరకు, ఇప్పుడే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి, ఎలా అప్లయి చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)... వివిధ విభాగాల్లో గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 25గా ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే.. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

Advertisement

Corona in AP: ఏపీలో కొత్తగా 127 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 22 చొప్పున కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 127 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 22 చొప్పున కేసులు నమోదయ్యాయి. కడప జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో కరోనా కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Three Capitals Bill Withdraws: వికేంద్రీకరణపై వెనక్కు తగ్గేది లేదు, కొత్త బిల్లు ద్వారా సమాధానం ఇస్తాం, మరింత మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తామని తెలిపిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

Hazarath Reddy

గత ఎన్నికల సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించారని సీఎం (AP CM YS Jagan) తెలిపారు. హైదరాబాద్ వంటి సూపర్ మోడల్ సిటీ వద్దే వద్దని, అలాంటి చారిత్రక తప్పిదానికి పాల్పడరాదన్న అభిప్రాయాలను బలపరుస్తూ 2019లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని అన్నారు.

AP Assembly Session 2021: కొలిక్కిరాని ఏపీ రాజధాని, పూర్తి సమగ్రమైన బిల్లును ప్రవేశపెడతామని తెలిపిన సీఎం జగన్, ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన

Hazarath Reddy

చంద్రబాబు అంచనా ప్రకారమే అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు కోసం లక్షకోట్లు ఖర్చవుతాయని, ఇప్పుడు లక్షకోట్ల అంచనా అంటే పదేళ్ల తర్వాత లక్ష కోట్లు ఆరేడు లక్షల కోట్లు కావొచ్చునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఈ డబ్బుతో రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వేయడం కూడా సాధ్యం కాదన్నారు.

AP Assembly Session 2021: అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల రద్దు బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసిందని తెలిపిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ ముందుకు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు చర్చకు (AP Assembly Session 2021) వచ్చింది. ఈ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట‍్టగా.. బిల్లుపై చర్చకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనుమతించారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిల్లును ప్రవేశపెట్టి దానిపై నిశితంగా మాట్లాడుతున్నారు.

Advertisement

Three Capitals Bill Repealed: మూడు రాజధానుల బిల్లు రద్దు, ఇంటర్వెల్‌ మాత్రమే అయింది, శుభంకార్డు ఇంకా పడలేదని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి, 10 నిమిషాలు ఆగితే అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపిన మంత్రి కొడాలి నాని

Hazarath Reddy

మూడు రాజధానుల బిల్లు (Three Capital Bill) ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయపరమైన చిక్కుల వల్లే ఈ పరిస్థితి ఉండొచ్చు. కేబినెట్‌ సమావేశంలో నేను లేను. పూర్తి వివరాలు తెలీదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం

Andhra Pradesh Shocker: ముసలోడే కాని కామాంధుడు, కుర్చీలో కూర్చుని 5 ఏళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేసిన 65 ఏళ్ల వృద్ధుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గుంటూరు పోలీసులు

Hazarath Reddy

గుంటూరు జిల్లాలోని పెద కాకానిలో ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేసిన ఘటనలో నిందితుడిపై (Andhra Pradesh Shocker) కేసు నమోదు అయింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల ముస్లింపాలెంకు చెందిన షేక్‌ సుబాని చిల్లరకొట్టు నిర్వహిస్తున్నాడు.

Andhra Pradesh Floods: వరదలతో ఏపీ విలవిల, బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, లీటరు వంట నూనె, కేజీ ఉల్లి పాయలు, కేజీ బంగాళ దుంపలు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Hazarath Reddy

భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. వరద పోటు తగ్గడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో వంతెనలు కుప్పకూలుతున్నాయి.. రోడ్లు కొట్టుకుపోతున్నాయి.. రైలు పట్టాలు తేలుతూ కనిపిస్తున్నాయి. ఊర్లు ఏరులవుతున్నాయి..

Corona in AP: ఏపీలో కొత్తగా 174 మందికి కరోనా పాజిటివ్, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 24,659 కరోనా పరీక్షలు నిర్వహించగా, 174 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 కొత్త కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 29, గుంటూరు జిల్లాలో 26 కేసులు వెల్లడయ్యాయి.

Advertisement

Three Capitals Bill Repealed: మరో బిల్లు తెరపైకి, ఏకైక రాజధాని అమరావతా, వైజాగా, కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటించనున్న సీఎం వైఎస్ జగన్, ఏపీ రాజధానిపై సర్వత్రా ఆసక్తి

Hazarath Reddy

మూడు రాజధానులు (Three Capitals Bill) లేవని.. ఇక ఏకైక రాజధాని ఉంటుందని అదే ఏంటనేది సస్పెన్ గా మారింది. కాసేపట్లో ఈ పాలనావికేంద్రీకరణకు సంబంధించి మరో బిల్లును ప్రవేశపెట్టే అసెంబ్లీ వేదికగా జగన్ సర్కార్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం.

Three Capital Bill Withdrawn: మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం, కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారికంగా ప్రకటన

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి (Three Capital Bill Withdrawn) తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు. మూడు రాజధానులపై (Three Capitals Bill) అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) అధికారికంగా ప్రకటిస్తారని ఏజీ కోర్టుకు తెలిపారు.

CM YS Jagan Review: విపత్తులో సాయం చేస్తూ మృతి చెందిన వారికి వెంటనే రూ. 25 లక్షలు పరిహారం ఇవ్వండి, వారికి వెంటనే కొత్త ఇల్లు మంజూరు చేయండి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం జగన్

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద సహాయక చర్యలపై అసెంబ్లీ చాంబర్‌లో కలెక్టర్లు, అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం (CM YS Jagan Review) నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులుకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Corona in AP: ఏపీలో కొత్తగా 164 కరోనా కేసులు, ఒకరు మృతి, 196 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్

Hazarath Reddy

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 25,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 196 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు.

Advertisement

AP Floods: వరదల్లో విషాదం..తండ్రి కొడుకులను కాపాడి.. తన ప్రాణాలు కోల్పోయిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, నివాళి అర్పించిన ఏపీ పోలీస్ శాఖ

Hazarath Reddy

వరదలో చిక్కుకున్న (Rescue operation nellore district) తండ్రీకొడుకులను కాపాడిన శ్రీనివాసరావు తాను నీటిలో మునిగిపోయారు.ఆయన లైఫ్ జాకెట్ జారిపోవడంతో వరద ఉద్ధృతికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రాణాలను కాపాడిన ఆ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవడం ఆ తండ్రీకొడుకులను కలచివేసింది.

Andhra Pradesh Floods: ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయండి, వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే వరకు తోడుగా నిలవండి, అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్

Hazarath Reddy

భారీ వర్షాలతో అతలాకుతమైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే (CM YS Jagan Aerial Survey) నిర్వహించారు.

Andhra Pradesh Floods: మృతి చెందిన కండక్టర్‌ కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం, రాజంపేట దుర్ఘటన దురదృష్టకరమని తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

Hazarath Reddy

కడప జిల్లా రాజంపేట మండలంలో వరద నీటిలో (Andhra Pradesh Floods) చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు (APSRTC Managing Director Dwaraka Tirumala Rao ) సంస్థ తరుఫున రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Chandrababu Naidu: త్వరలో వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటిస్తా, బాధితులకు అండగా నిలుస్తానని ప్రకటించిన చంద్రబాబు నాయుడు, బాధితులను ఆదుకోవాలని టీడీపీ శ్రేణులకు సూచన

Hazarath Reddy

భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను త్వరలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల నాయకులతో శనివారం మాట్లాడారు. టీడీపీ శ్రేణులు బాధితులు ఆదుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement