ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల సమాచారం..జనవరి 10 నుండి వైకుంఠ ద్వారా దర్శనం, వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటించిన టీటీడీ
Arun Charagondaతిరుమల వైకుంఠ ద్వారా దర్శన టికెట్ల షెడ్యూల్‌ను జారీ చేసింది టీటీడీ. ఈనెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‍లైన్‍లో శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుండగా 24న ఉదయం 10 గంటలకు ఆన్‍లైన్‍లో ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.
Weather Forecast: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Hazarath Reddyనైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపుగా దూసుకొస్తోందని, దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది
Vizag Student Dies in Canada: కెనడాలో గాజువాక విద్యార్థి అనుమానాస్పద మృతి, స్పందించిన నారా లోకేష్, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి
Hazarath Reddyవైజాగ్‌కు చెందిన ఓ యువకుడు కెనడాలోని తన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వైజాగ్ నగరంలోని గాజువాక ప్రాంతానికి చెందిన పిల్లి ఫణి కుమార్ (36) కెనడాలోని కాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సప్లయ్ చైన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నాడు
Leopard Dies in Metlapalli: రైతు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుత పులి మృతి, గన్నవరం మండలం మెట్లపల్లిలో విషాదకర ఘటన
Hazarath Reddyకృష్ణాజిల్లా(Krishna District) కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుతపులి(Leopard) మృతి చెందింది. ఉదయాన్నే రైతు పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి కనిపించింది.
Andhra Pradesh: జనసేన నేత పుట్టినరోజు వేడుకలు..రేవ్ పార్టీ, యువతుల అశ్లీల నృత్యాలు..ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన...వీడియోలు వైరల్
Arun Charagondaజనసేన నేత పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీ నిర్వహించగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం క్రొవ్విడి లో అశ్లీల నృత్యాలు వైరల్‌గా మారాయి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర..జన్మదినం సందర్భంగా క్రొవ్విడి శివారు రైస్ మిల్లులో పార్టీ నిర్వహించారు.
Andhra Pradesh Cabinet Meeting: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినేట్ భేటీ.. రాజధాని నిర్మాణంలో యువత భాగస్వామ్యం, పరిశ్రమలకు భూ కేటాయింపు, కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుండగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి ప్రాంతంలో చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్చించనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, బ్యాంకులో క్యాషియర్ మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని బెదిరించిన దొంగ
Hazarath Reddyబ్యాంకు ఉద్యోగి మెడ పై కత్తి పెట్టి బెదిరించిన దొంగ...తిరపతి రూరల్ మండలం రేణిగుంట రోడ్డులోని బ్యాంకులోకి దొంగ కత్తితో చొరబడ్డ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాషియర్ దగ్గరకు వెళ్లి మెడపై కత్తి పెట్టి బ్యాగులో డబ్బులు వేయాలని బెదిరించాడు.
Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం
Hazarath Reddyఅల్పపీడనం మరింత బలపడి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, యానాంలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అదికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు
Hazarath Reddyగుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం డిసెంబర్ 17న జరిగింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్ సర్టిఫికెట్స్ కోర్స్ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు.
Chain Snatching in Guntur: వీడియో ఇదిగో, తాడేపల్లిలో ఐదు నిమిషాల్లోనే రెండు చోట్ల చైన్ స్నాచింగ్స్, రోడ్లపై వచ్చేందుకు వణికిపోతున్న మహిళలు
Hazarath Reddyగుంటూరు జిల్లా తాడేపల్లి(Tadepalli)లో చైన్ స్నాచర్లు(Chain snatchers) రెచ్చిపోతున్నారు. తాజాగా తాడేపల్లి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి(Kothur Anjaneya Swamy Temple) సెంటర్‌లో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహిళ మేడలో బంగారు గొలుసు(Gold Chain) లాక్కుని పారిపోయారు.
Narendra Varma Raju Vegesana: వీడియో ఇదిగో, మందేసి చిందేసి బీజేపీ నేతకు ముద్దులు పెట్టిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ బర్త్‌డే పార్టీలో రచ్చ చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ
Hazarath Reddyసతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు.
One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Hazarath Reddyలోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, 48 గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే రంగంలోకి దిగుతా, ఎక్సైజ్ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyఏపీలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రూపంలో మళ్లీ పాత విధానం అమలులోకి వచ్చింది. తాజాగా మద్యం అమ్మకాలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, బుల్డోజర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 20 నుంచి 30 మంది వరకు గాయాలు
Hazarath Reddyతిరుపతిలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది
TTD Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల.. 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyచంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అధికారులు ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, తెలంగాణ నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం అక్రమ రవాణా, అసెంబ్లీ వేదికగా నిజమేనని తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ నుంచి రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమ రవాణా జరుగుతుందని అసెంబ్లీ వేదికగా బాంబ్ పేల్చారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా పోతున్నాయని తెలిపారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏం తోచక కేజీన్నర వెంట్రుకలను తినేసిన బాలిక, సర్జరీ ద్వారా తొలగించిన వైద్యులు
Hazarath Reddyఅమలాపురం ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 సంవత్సరాల బాలికకు మూడు నెలలుగా తరచుగా వాంతులు రావడంతో బాలిక తల్లిదండ్రులు భయపడి ఆసుపత్రికి తీసుకెళ్ళగా.. డాక్టర్ గంధం విశ్వనాథ్ ఆమె పొట్టలో జుట్టు ఉన్నట్లు స్కానింగ్ ద్వారా గుర్తించారు