ఆంధ్ర ప్రదేశ్

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ విశ్వరూపం చూపిస్తున్న కరోనా, గత 24 గంటల్లో 700 దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య, రాష్ట్రంలో 3,469కి పెరిగిన ఆక్టివ్ కేసులు

Team Latestly

గడిచిన ఒక్కరోజులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 175 కోవిడ్ కేసులు నమోదు కాగా, గుంటూరు నుంచి 127, విశాఖపట్నం నుంచి 98, మరియు కృష్ణా నుంచి 80 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా....

Kurnool Airport Inauguration: నెరవేరిన కర్నూలు జిల్లా వాసుల చిరకాల స్వప్నం, ఓర్వకల్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మార్చి 28 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం

Team Latestly

ఆర్‌సిఎస్ ఉడాన్ పథకం కింద షెడ్యూల్ కింద ఇండిగో విమానయాన సంస్థ ఓర్వకల్ విమానాశ్రయం నుంచి తొలిదశలో బెంగళూరు, విశాఖపట్నం మరియు చెన్నై నగరాలకు రెండేళ్ల పాటు సర్వీసులు నడపటానికి ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 28 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతున్నాయి.....

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 585 కోవిడ్ కేసులు నమోదు, నెలలో కోటి మందికి టీకా పంపిణీ జరిగేలా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్19 మళ్లీ విజృంభిస్తుంది, రోజూవారీ కేసుల సంఖ్య ఐదు వందలు దాటింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాబోయే రోజుల్లో ఏపిలో కోవిడ్‌ 19 వ్యాక్సినేషన్‌ ప్లాన్‌పై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.....

AP Covid Report: ఏపీలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులు, తాజాగా 585 కేసులు నమోదు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 128 కేసులు, రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో ఏకంగా 585 కేసులు నమోదు కావడం ఆందోళనను పెంచుతోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 128 కేసులు నమోదయ్యాయి. రెండో స్థానంలో 99 కేసులతో గుంటూరు జిల్లా ఉండగా... 8 కేసులతో కడప జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇదే సమయంలో చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,121కి పెరిగింది. ఇదే సమయంలో 8,84,978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 7,197 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

Collector Gandham Chandrudu: మండుటెండలో చెప్పుల్లేకుండా పలుగు పార పట్టిన కలెక్టర్ గంధం చంద్రుడు, ఉపాధి హామీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనంతపురం జిల్లా కలెక్టర్

Hazarath Reddy

చెప్పులేసుకోకుండా మండుటెండలో గడ్డపార చేతపట్టి మట్టి తవ్వతూ కూలీల్లో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్సాహం నింపారు. వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన ఇవాళ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు.ఆత్మకూరు మండలం వడ్డిపల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించిన కలెక్టర్ (Collector Gandham Chandrudu) కూలీలను అడిగి పలు అంశాలపై ఆరా తీశారు. పనులు (MGNREGA Work in Anantapur) ప్రతి రోజు కల్పిస్తున్నారా ?, క్రమం తప్పకుండా డబ్బులు అందిస్తున్నారా? అని కూలీలను అడిగారు. అనంతరం కూలీల్లో ఉత్సాహం నింపేందుకు పలుగుపార చేతబట్టి ఉపాధి పనులు చేశారు.

West Godavari Shocker: దెందులూరులో దారుణం, పురుగులు మందు ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం, ఇద్దరు మృతి, కొనఊపిరితో మరొకరు, విషాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దెందులూరులోని సింగవరం గ్రామంలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య (Family Committed Suicide) చేసుకుంది. ఆ కుటుంబంలో ఏం జరిగిందో తెలీదు గానీ వారంతా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు (Family Committed Suicide, West Godavari ) పాల్పడ్డారు.

AP ZPTC and MPTC Elections: జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించలేను, వేరే వారు నిర్వహిస్తారని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్, ఈ నెల 31వ తేదీతో పూర్తి కానున్న ఎస్ఈసీ పదవీకాలం

Hazarath Reddy

ఈ నెల 31తో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను (AP ZPTC and MPTC Elections) నిర్వహించలేనని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ తెలిపారు. ఈ బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయలేనని వివరించారు.

MHA Fresh Guidelines: దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా నూతన మార్గదర్శకాలను జారీచేసిన కేంద్ర ప్రభుత్వం, ఏప్రిల్ 1 నుంచి కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన

Team Latestly

ఈ నూతన మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి మరియు ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. MHA జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి....

Advertisement

AP MPTC and ZPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేం, ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు, తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా

Hazarath Reddy

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలను (AP MPTC and ZPTC Elections) నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) ఈరోజు విచారించింది.

No Special Status to AP: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు, స్పష్టం చేసిన కేంద్రం, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని తెలిపిన కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని (No Special Status to AP) మోదీ సర్కారు స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం (special status) లేదన్నారు.

AP Coronavirus: ఏపీలో మళ్లీ పుంజుకున్న కరోనా, కొత్తగా 492 కేసులు, ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 168 కేసులు, అప్రమత్తం అయిన ప్రభుత్వం, వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన సమీక్ష

Hazarath Reddy

ఏపీలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 33,634 కరోనా పరీక్షలు నిర్వహించగా... 492 మందికి పాజిటివ్ (Andhra Pradesh) అని నిర్ధారణ అయింది. ఇక ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 168 కేసులు గుర్తించారు. జిల్లాలోని రాజమండ్రిలో ఓ కాలేజీలో 163 మంది కరోనా ( Covid-19 cases) బారినపడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 256 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 2,616 మంది చికిత్స పొందుతున్నారు.

AP Coronavirus: ఏపీలో కరోనావైరస్ సెకండ్ వేవ్ వార్తలు, అప్రమత్తమైన ఏపీ సర్కారు, వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచన

Hazarath Reddy

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ వార్తల నేపథ్యంలో సర్కారు అలర్ట్ అయింది. రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతున్న సంధర్భంగా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన మంగళవారం సమీక్ష (AP Ministers Alla Nani And Buggana Rajendra corona Review) నిర్వహించారు.

Advertisement

Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే మృతి, ఒకరి పరిస్థితి విషమం, టాటా ఏస్ వాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీ కొట్టిన పాల వ్యాను, దువ్వూరు వద్ద విషాద ఘటన

Hazarath Reddy

నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకు వెళ్తున్న టాటా ఏస్ వాహనాన్ని వెనుక వైపు నుంచి పాల వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

YSR EMC at Kopparthi: గుడ్ న్యూస్..వైఎస్సార్‌ ఈఎంసీ నిర్మాణానికి కేంద్రం తుది అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు, గ్రాంట్‌ రూపంలో రూ.350 కోట్లు మంజూరు, మూడు విడతల్లో విడుదల, మొత్తం 540 ఎకరాల్లో రూ.748.76 కోట్లతో కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ నిర్మాణం

Hazarath Reddy

ఇప్పటి దాకా సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతున్న ఏపీ సర్కారు ఐటీ వైపు కూడా తన చూపును తిప్పింది. తాజాగా ఈఎంసీ–2 పథకం కింద వైఎస్సార్‌ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (వైఎస్సార్‌ ఈఎంసీ) (YSR EMC at Kopparthi) నిర్మాణానికి కేంద్రం తుది అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం 540 ఎకరాల్లో రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం గ్రాంట్‌ రూపంలో రూ.350 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పరిశ్రమలు (State Industries Department), పెట్టుబడులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) లేఖ రాసింది.

AP Covid Report: రాజమండ్రిలో కరోనా కల్లోలం, ఒకే కాలేజీలో 163 మందికి కరోనా, రాష్ట్రంలో తాజాగా 310 మందికి పాజిటివ్, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 51 కేసులు, 7,191కి చేరిన కరోనా మృతుల సంఖ్య

Hazarath Reddy

రాజమండ్రిలోని ఓ కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం ఈ కాలేజీలో 13 కేసులు రాగా, ఆదివారం 10 కేసులు వెలుగుచూశాయి. సోమవారం నాడు ఒక్కరోజే 140 పాజిటివ్ కేసులు రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Half Day Schools in AP: ఏప్రిల్ 1 నుంచి విద్యార్థులకు ఒంటిపూట బడులు, కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య, తాజాగా 368 మందికి కోవిడ్ పాజిటివ్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులు (Half Day Schools in AP) ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలవుతుందని ఆయన (State Education Minister Adimulku Suresh) చెప్పారు. ఉదయం 7.45 నుంచి 12.30 వరకు తరగతుల అనంతరం మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

AP Police Bagged 125 Awards: దేశంలోనే ఉత్తమ డీజీపీగా గౌతం సవాంగ్, 125 జాతీయ అవార్డులను దక్కించుకున్న ఏపీ పోలీసులు, ఈ ఏడాదే 17 అవార్డులు కైవసం, పతకాలు సాధించిన పోలీస్ అధికారులను ప్రశంసించిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర పోలీసు శాఖ జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని జాతీయస్థాయిలోని మూడు సంస్థలు (స్కోచ్, ఫిక్కీ, ఎన్‌సీఆర్‌బీ–నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో/కేంద్ర హోంశాఖ) గుర్తించి అవార్డులను ప్రకటించాయి. అత్యుత్తమ పోలీసింగ్‌లో ఒకేరోజు ఏకంగా 13 అవార్డులను అందుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. అంతేకాక.. ఏపీ పోలీసు శాఖ మొత్తం 125 జాతీయ అవార్డులను (AP Police Bagged 125 Awards) దక్కించుకోగా, ఈ ఏడాదే 17 అవార్డులను అందుకుంది.

COVID-19 Cases in AP: ఏపీలో మళ్లీ కరోనా విశ్వరూపం, తాజాగా 368 మందికి పాజిటివ్, ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 79 కొత్త కేసులు నమోదు, 8,93,734కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో మరోసారి 300కి పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 31,138 కరోనా పరీక్షలు నిర్వహించగా 368 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 79 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 49, అనంతపురం జిల్లాలో 40, చిత్తూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 263 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు ఏపీలో 8,93,734 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,357 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,188 మందికి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,189గా నమోదైంది.

YSR Bima 2021: వైఎస్సార్‌ బీమా పథకంపై ఏపీ సీఎం కీలక నిర్ణయం, పథకానికి అర్హత ఉండి, దాని పరిధిలో లేని వారికి కూడా వైఎస్సార్‌ బీమా వర్తింపు, రూ.258 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపిన సెర్ప్‌

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ బీమా పథకానికి అర్హత ఉండి, దాని పరిధిలో లేకుండా మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ప్రకారం బీమా (YSR Bima Scheme 2021) వర్తించడానికి అవకాశంలేని ఈ కుటుంబాలకు కూడా భరోసా కలిగించేందుకు జగన్ సర్కారే వీరికి సంబంధించిన ప్రీమియంను చెల్లించనుంది.

AP SEC Nimmagadda: మరోసారి హైకోర్టుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్, గవర్నర్‌తో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు లీక్, దీనిపై దర్యాప్తు జరిపేలా కేంద్ర హోం శాఖను, సీబీఐని ఆదేశించాలని పిటిషన్

Hazarath Reddy

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టు గడప తొక్కారు. తాను గవర్నర్‌తో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ లీక్‌ అయ్యాయని, దీనిపై ఫిర్యాదు చేసినా ఆయన ముఖ్య కార్యదర్శి విచారణ జరపడంలో విఫలమయ్యారంటూ ఏపీ హైకోర్టులో (High Court) పిటిషన్‌ దాఖలు చేశారు. తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై దర్యాప్తు చేసేలా కేంద్ర హోం శాఖను, సీబీఐని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు.

Advertisement
Advertisement