ఆంధ్ర ప్రదేశ్

AP Covid Update: మూడు జిల్లాల్లో నమోదు కాని కొత్త కేసులు, ఏపీలో తాజాగా 74 మందికి కోవిడ్ పాజిటివ్, కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13 మందికి తాజాగా పాజిటివ్, గత 24 గంటల్లో 61 మంది రికవరీ

Hazarath Reddy

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,907 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా... వారిలో 74 మందికి పాజిటివ్ గా (Andhra Pradesh Coronavirus) నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 13 మందికి కరోనా పాజిటివ్ (Coronavirus) వచ్చింది. ఇదే సమయంలో అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరోవైపు ఇదే సమయంలో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చెప్పున కరోనా వల్ల మరణించారు.

Andhra Pradesh Shocker: అన్నని, అక్కని నరికేసిన తమ్ముడు, రూ. 5 లక్షల కోసం శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన, ఇద్దర్నీ చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

Hazarath Reddy

రూ. 5 లక్షల డబ్బు కోసం తొడబుట్టిన అక్కని, అన్నని ఓ తమ్ముడు చంపేసిన దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పరిహారం విషయంలో తలెత్తిన మనస్పర్థలు కుటుంబంలో దారుణ హత్యకు (younger brother killed his elder brother and elder sister) దారి తీశాయి.

India Covid Updates: తెలంగాణలో 18 మందికి యుకె కరోనా స్ట్రెయిన్, రాఫ్ట్రంలో తాజాగా 111 మందికి కరోనా, ఏపీలో 136 కొత్త కేసులు, దేశంలో తాజాగా 18,599 మందికి కరోనా పాజిటివ్, తమిళనాడు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిలో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా (UK covid Strain) ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు.

Free Sanitary Napkins: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ను (Free Sanitary Napkins) పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రారంభించనున్నారు.

Advertisement

MLA Balakrishna: చెంపదెబ్బ కొట్టినా ఆయనంటే నాకు పిచ్చి అభిమానం, అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపిన అభిమాని

Hazarath Reddy

సినీ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన శనివారం హిందూపురంలోని 9వ వార్డు లక్ష్మీపురంలో చోటు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ అభ్యర్థి ఇంట్లోకి వెళ్లగా.. స్థానికులు ఫొటోలు తీసుకుంటున్నారు.

AP Ex-Ranji Cricketer Held: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పుకుంటూ రూ. 40 లక్షలకు టోకరా, ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

Team Latestly

వివిధ కంపెనీలు మరియు కార్పోరేట్ ఆసుపత్రులకు సంబంధించిన వెబ్‌సైట్లలో ఇవ్వబడిన కాంటాక్ట్ నంబర్ల ఆధారంగా వారి కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించి ప్రభుత్వ టెండర్లకు ప్రతిపాదనలు చేస్తున్నాడు. ఇలా ఎల్‌బి స్టేడియంలో కంపెనీలకు సంబంధించిన హోర్డింగ్‌లు పెట్టడానికి మంత్రి నుంచి ప్రపోజల్...

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగ్గా మరో 115 మందికి కరోనా పాజిటివ్, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య, వైరస్ విస్తరించకుండా ప్రజలు స్వీయ నిబంధనలు పాటించాలని ఆరోగ్య అధికారుల సూచన

Team Latestly

Andhra Pradesh Bandh: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపిలో కొనసాగుతున్న బంద్, బీజేపీ మినహా అన్ని పక్షాలు బంద్‌కు సంపూర్ణ మద్ధతు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల మోహరింపు

Team Latestly

విశాఖపట్నం ఉక్కు కార్మాగారం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్ శుక్రవారం పాటిస్తున్నారు. బిజెపి మినహా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు బంద్‌కు పూర్తిగా తమ మద్ధతు ప్రకటించాయి....

Advertisement

AP Covid Update: ఏపీలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌, 8,585 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లకు సొంత భవనాలను సమకూర్చుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏపీలో తాజాగా 102 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 45,077 కరోనా పరీక్షలు నిర్వహించగా 102 మందికి కరోనా పాజిటివ్ (AP Covid Update) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Andhra Pradesh Bandh: విశాఖ ఉక్కుకు మద్దతుగా.. ఏపీ బంద్, రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపిన జగన్ సర్కారు, ఇప్పటికే మద్ధతు ప్రకటించిన టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇంకా నిర్ణయం తీసుకోని బీజేపీ-జనసేన పార్టీలు

Hazarath Reddy

రేపటి (శుక్రవారం) ఏపీ బంద్‌కు ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందని ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తెలుగువాళ్ల పోరాట ఫలితమే విశాఖ ఉక్కు అని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్నినాని అన్నారు.

Bride Escapes with Cash and Jewellery: పెళ్లి అయిన మళ్లీ రోజే నగలతో వధువు జంప్, మరోచోట తెల్లారితే పెళ్లి..వధువు పరార్, ఇంకో చోట నువ్వు నాకు తెలుసు..వ్యభిచారం చేస్తావా అంటూ అసభ్యకర మెసేజ్‌లు

Hazarath Reddy

పెళ్లి అయిందనే సంతోషం ఆ వరుడికి ఒక్కరోజు కూడా మిగలలేదు. పెళ్లైన మరుసటిరోజే భర్త ఇంటి నుంచి నగదు, నగలు తీసుకుని ఓ నవ వధువు (Bride Escapes with Cash and Jewellery) ఉడాయించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూర్ మండలం కమ్మవారిపల్లిలో (Anantapur Kammavaripalli village)సంచలనం రేకెత్తించింది.

AP Municipal Polls: ఎస్ఈసీకి మళ్లీ ఎదురుదెబ్బ, అన్ని ఉత్తర్వులను నిలుపుదల చేసిన ఏపీ హైకోర్టు, నిర్దిష్ట ఆధారాలు లేకుండా ఎన్నికల్లో మోసం జరిగిందని ఎలా చెబుతారంటూ ప్రశ్నలు

Hazarath Reddy

ఎన్నికల కమిషన్ కు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసిన తరువాత కూడా పలుచోట్ల పలువురు అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు అనుమతినిస్తూ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు (AP High Court) నిలిపివేసింది.

Advertisement

Fraudulent Gang Arrested: ఇలా ఎవరూ మోసపోకండి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ. 20 కోట్లు కొట్టేసిన దొంగల ముఠా, చిత్తూరు పోలీసులకు చిక్కిన ముఠా నాయకుడు, మీడియాకు వివరాలను వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను దాదాపు రూ. 20 కోట్ల వరకు మోసం చేసిన ముఠాను (Fraudulent Gang Arrested) చిత్తూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినట్లు నకిలీ ఆర్డర్‌ కాపీలు (fake govt job promise)

AP Covid Update: ఏపీలో తాజాగా 135 మందికి పాజిటివ్, 8,90,215 కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, 7,170కి చేరిన కరోనా మృతుల సంఖ్య, రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.25 శాతం

Hazarath Reddy

ఏపీలో గడచిన 24 గంటల్లో 36,970 కరోనా పరీక్షలు నిర్వహించగా 135 మందికి పాజిటివ్ (AP Covid Update) అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 31 పాజిటివ్ కేసులు రాగా, విశాఖ జిల్లాలో 23 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 15, శ్రీకాకుళం జిల్లాలో 12, అనంతపురం జిల్లాలో 11, కర్నూలు జిల్లాలో 10 కేసులు గుర్తించారు.

AP Municipal Polls: ఎస్ఈసీ రీ నామినేషన్‌ ఉత్తర్వులను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు, వార్డు వాలంటీర్లపై జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టివేసిన ధర్మాసనం, వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని స్టేట్ ఎన్నికల కమిషన్‌కు సూచన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్‌ ఎన్నికల్లో (AP Municipal Polls) రీ నామినేషన్‌కు అవకాశం ఇస్తూ జారీ చేసిన ఆదేశాలను బుధవారం హైకోర్టు (AP High Court) కొట్టివేసింది. కొత్తగా మున్సిపల్‌ నామినేషన్లకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి వార్డు వాలంటీర్లపై ఎస్‌ఈసీ (SEC) జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టేసింది. వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని సూచించింది.

Telangana Shocker: నాతోనే ఉండు..పెళ్లి చేసుకోకు, యువతి అంగీకరించకపోవడంతో కత్తితో దాడి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పరిస్థితి విషమం, పోలీసులు అదుపులో నిందితుడు

Hazarath Reddy

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని కక్షగట్టిన యువకుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి (Telangana Shocker) చేశాడు. మాట్లాడుకుందామని పిలిచి ఆ యువతి ఉండే అపార్ట్‌మెంట్‌ ఆవరణలోనే చంపేసేందుకు (Man Attacks Techie With Knife in Hyderabad) ప్రయత్నం చేశాడు.

Advertisement

AP Municipal Elections 2021: మళ్లీ వైసీపీదే హవా..మునిసిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు, మొత్తం 245 డివిజన్, వార్డు స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు (AP Municipal Elections 2021) జరగనున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల తొలి రోజు అయిన నిన్న కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు ఉపసంహరించుకున్నారనే వార్తలు వస్తున్నాయి.

AP High Court: వాలంటీర్లు ఫోన్ల వాడకం పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచిన హైకోర్టు, ఎస్‌ఈసీ ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయంటూ కోర్టు గడప తొక్కిన ఏపీ ప్రభుత్వం, పురపాలక ఎన్నికలపై పిల్‌ కొట్టివేత

Hazarath Reddy

రానున్న ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వాలంటీర్లు జోక్యం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జారీ చేసిన ఆదేశాలను (SEC orders on ward volunteers ) సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో (AP High Court) విచారణ పూర్తయింది. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది.

Maritime India Summit 2021: మారిటైమ్‌ ఇండియా సదస్సులో ఏపీ సీఎం వైయస్ జగన్, నేటి నుంచి 4వ తేదీ వరకు మారిటైమ్ ఇండియా సదస్సు, మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

Hazarath Reddy

మారిటైమ్‌ ఇండియా-2021 సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను (Maritime India Vision-2030 E-Book) ప్రధాని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy), గుజరాత్ సీఎం విజయ్ రూపాని, ఫిక్కీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్‌ తదితర దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి.

AP Shocker: అద్దె అడిగినందుకు యజమానినే చంపేశాడు, మరోచోట ఆర్టీసీ బస్సులోనే కుప్పకూలిన పెద్దాయన, అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి, బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన

Hazarath Reddy

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
Advertisement