ఆంధ్ర ప్రదేశ్

COVID in AP: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన మహమ్మారి, కొత్తగా మరో 538 మందికి కొవిడ్ పాజిటివ్, మరో 558 మంది రికవరీ, రాష్ట్రంలో 5237కు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా చిత్తూరు నుంచి 95, కృష్ణా జిల్లా నుంచి 86, గుంటూరు నుంచి 72, పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల నుంచి వరుసగా 72, 50 కొత్త కేసులు నమోదయ్యాయి....

YCP Leader Goes Viral: టోల్ ఫీజ్ కట్టేందుకు నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ వాగ్వాదం, టోల్ ప్లాజా సిబ్బంది చెంప చెల్లుమనిపించిన వైసీపీ నాయకురాలు, వైరల్ అవుతున్న వీడియో

Team Latestly

దేవళ్ల రేవతిపై టోల్ ప్లాజా సిబ్బంది మంగళగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లడమే కాకుండా తమ సిబ్బందిని దుర్భాషలాడుతూ, చేయి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, టోల్ ప్లాజా సిబ్బంది వికృత ప్రవర్తనే ఈ సంఘటనకు దారితీసిందని

Jagananna Jeeva Kranti: జగనన్న జీవ క్రాంతి పేరుతో ఏపీలో మరో కొత్త పథకం, రూ.1868.63 కోట్లు వ్యయంతో వెనుకబడిన వర్గాలకు చేయూత, రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెలు, మేకల యూనిట్లు పంపిణీ

Hazarath Reddy

అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన జగన్ సర్కారు తాజగా మరో కొత్త పథకాన్ని నేడు ప్రారంభించనుంది. అక్క చెల్లెమ్మలు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో సీఎం వైయస్ జగన్ జగనన్న జీవ క్రాంతి పథకాన్ని (Jagananna Jeeva Kranti) ప్రారంభించనున్నారు.

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 618 మందికి పాజిటివ్, మరో 785 మంది రికవరీ, రాష్ట్రంలో 5259గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఇప్పటివరకు 8,61,153 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 5,259 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల....

Advertisement

Mystery Disease in Eluru: ఏలూరు మిస్టరీ వ్యాధి బాధితుల కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం, మూడు రకాల చికిత్సలకు ప్యాకేజీలను పెంచుతూ నిర్ణయం, చికిత్స సమయాన్ని మూడు రోజుల నుండి ఐదు రోజులకు పెంపు

Hazarath Reddy

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో (Mystery Disease in Eluru) అనారోగ్యానికి గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయంతో పాటు మూడు రకాల చికిత్సలకు (three types of treatments) ప్యాకేజీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని (Health Minister Alla Nani) వెల్లడించారు. ఈ జీవో ప్రకారం మూర్ఛ వ్యాధిగ్రస్తులకు చికిత్స సమయాన్ని మూడు రోజుల నుండి ఐదు రోజులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) నిర్ణయం తీసుకుందన్నారు.

Eluru Mystery Disease: ఏలూరు మిస్టరీ వ్యాధి, నీటిలోనే సమస్య ఉందా? డిసెంబర్ 11న రానున్న ఎన్ఐఎన్ సైంటిస్టుల నివేదిక, ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

Hazarath Reddy

ఏలూరులో వింత వ్యాధికి (Eluru Mystery Disease) కారణాలు ఇంకా అంతుచిక్కలేదు. క్షేత్రస్థాయిలో వైద్య నిపుణులు, న్యూట్రేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్టులు పరిశీలించారు. తాగునీటిలో సీసం, నికోలిన్ పదార్థాలు కలిసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ వ్యాధి పరిస్థితిపై ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో (AP CM YS Jagan Video Conference) మాట్లాడారు.

YSR Upper Pennar Project: సస్యశ్యామలంగా మారనున్న అనంతపురం, రాప్తాడులో మూడు రిజర్వాయర్లకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన, వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా నామకరణం

Hazarath Reddy

Local Body Elections in AP: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు, ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్‌ నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ, తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను (Local Body Elections in AP) ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) గత నెల 17న ప్రొసీడింగ్స్‌ జారీ చేసిన సంగతి విదితమే. అయితే కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని ప్రొసీడింగ్స్‌ను నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును (Andhra Pradesh High Court ) ఆశ్రయించింది.

Advertisement

AP Volunteers Row: ఏపీలో ప్రతి నెలా వాలంటీర్ల పోస్టుల భర్తీ, ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ, 35 ఏళ్ళు నిండిన వాలంటీర్ల తొలగింపు వార్త అబద్దం

Hazarath Reddy

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లను (village and ward volunteers )ఎప్పటికప్పుడు ప్రతి నెలా భర్తీ చేయాలని ప్రభుత్వం (AP government) నిర్ణయించింది. ప్రతి నెలా 1 నుంచి 16వ తేదీల మధ్య జిల్లాల పరిధిలో ఉండే వలంటీర్ల ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ అన్ని జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్‌ నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Covid in AP: ఏపీలో తాజాగా 551 మందికి కరోనా, 4 గురు మృతితో 7,042 కి చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, ప్రస్తుతం 5,429 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 56,187నమూనాలు పరీక్షించగా 551 పాజిటివ్‌ కేసులు (AP coronavirus) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,72,839 కు చేరింది. కొత్తగా నలుగురు కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 7,042 కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 744 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు.

Mystery Disease in AP: మిస్టరీ వ్యాధిని కనిపెట్టేందుకు ఏలూరు చేరుకున్న డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి బృందం, 475కు చేరుకున్న బాధితుల సంఖ్య, 332 మంది కోలుకుని డిశ్చార్జ్, బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్, నికెల్ పదార్ధాలు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి (Mystery Disease in Andhra Pradesh Eluru) బారిన పడిన వారి సంఖ్య సోమవారం రాత్రి 10 గంటల సమయానికి 475కు చేరుకుంది. వారిలో 332 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా.. 125 మంది ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మరో 18 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. మొత్తం బాధితుల్లో 253 మంది పురుషులు కాగా.. 222 మంది మహిళలు ఉన్నారు.

Covid in AP: ఫలించిన జగన్ సర్కారు వ్యూహం, ఏపీలో భారీగా తగ్గిన కేసులు, తాజాగా 316 మందికి కోవిడ్ పాజిటివ్, యాక్టివ్‌గా 5,626 కేసులు, కరోనా ముప్పు ఇంకా పోలేదని తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ

Hazarath Reddy

కరోనావైరస్ నియంత్రణ కోసం ఏపీ సర్కారు తీసుకున్న చర్యలతో కోవిడ్ కేసులు (Covid in AP) భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ ప్రభుత్వం (AP Govt) కరోనా మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న నియంత్రణ చర్యలు ఫలితాలనిస్తున్నాయి. ఇందులో భాగంగా గడచిన కొన్నిరోజులుగా కొత్త కేసుల సంఖ్యలో (New Cases) తగ్గుదల భారీగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 43,006 కరోనా పరీక్షలు నిర్వహించగా, 316 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

Advertisement

Vijayashanti Joins BJP: కేసీఆర్‌ని గద్దె దింపేది మేమే, కాంగ్రెస్ పార్టీ పోరాడలేని స్థితికి చేరుకుంది, బీజేపీలో చేరిన విజయశాంతి, చేరిన వెంటనే తెలంగాణ సీఎంపై మాటల తూటాలు పేల్చిన రాములమ్మ

Hazarath Reddy

తెలంగాణ రాములమ్మ.. సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ తీర్థం (Vijayashanti Joins BJP) పుచ్చుకున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి బీజేపీలో చేరిన తరువాత సీఎం కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.

Movie on AP English Medium: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంపై సినిమా, ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి పునాది రాయి వేస్తానని తెలిపిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ఆవశ్యకత, యూనివర్సిటీల్లో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక తదితర అంశాలపై త్వరలో సినిమా (Movie on AP English Medium) నిర్మించనున్నట్లు ప్రముఖ తెలుగుసినిమా దర్శకుడు, నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త సినిమా నిర్మాణానికి శ్రీకారం చుడతానని విప్లవ హీరో తెలిపారు.

Eluru Mysterious Illness: ఏలూరుకు చేరుకున్న ఏపీ సీఎం, అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన వైయస్ జగన్, అధికారులతో సమీక్ష సమావేశం

Hazarath Reddy

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్‌ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం జగన్ అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను (AP CM YS Jagan arrives in Eluru)a పరామర్శించారు.

Covid in India: కరోనాపై ఊరట, 4 లక్షల దిగువకు పడిపోయిన కోవిడ్ యాక్టివ్ కేసులు, దేశంలో తాజాగా 32,981 కేసులు, ఏపీలో 24 గంటల్లో 667 మందికి కరోనా పాజిటివ్

Hazarath Reddy

దేశంలో సెప్టెంబర్‌ తర్వాత మొదటిసారిగా యాక్టివ్‌ కేసులు 4 లక్షల దిగువకు పడిపోయాయి. అదేవిధంగా చాలా రోజుల తర్వాత కరోనా మృతులు నాలుగు వందలకు తక్కువగా నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 32,981 పాజిటివ్‌ కేసులు (Covid in India) నమోదయ్యాయి.

Advertisement

Eluru Mystery Disease: వైద్యులకు సవాల్‌గా మారిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి, అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి, రేపు ఏలూరులో పర్యటించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి (Eluru mystery disease) కలకలం రేపుతున్న సంగతి విదితమే. ఈ వ్యాధి సోకి అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతిచెందారు. దీంతో ఆస్పత్రిలో ఉన్న రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు విద్యానగర్‌కు చెందిన శ్రీధర్ (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుపట్టని వ్యాధితో (Mystery Disease in Eluru) అస్వస్థతకు గురైన వారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan In Eluru Tomorrow) రేపు పరామర్శించనున్నారు.

Andhra Pradesh: క్లాస్ రూంలో మైనర్ల పెళ్లి వీడియో వైరల్, ఘటనను సుమోటోగా స్వీకరించిన ఏపీ పోలీస్ శాఖ, మహిళా శాఖ అధికారులకు తెలియజేసిన రాజమండ్రి పోలీసులు

Hazarath Reddy

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెండు రోజుల క్రితం జరిగిన పెళ్లి కలకలం సృష్టించిన సంగతి విదితమే.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీస్ శాఖ దీనిని సుమోటోగా (Andhra Police Takes Suo Moto Cognizance) స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వయంగా దీని గురించి తెలుసుకుని మహిళా మరియు పిల్లల అభివృద్ధి శాఖకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

People Fell Sick in Eluru: ఏలూరు అంతు చిక్కని వ్యాధికి కారణం అదేనా? ఘటనపై ఏపీ సీఎం వైయస్ జగన్ ఆరా, రెండో సారి బాధితులను పరామర్శించిన ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిన అధికారులు

Hazarath Reddy

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుతో అంతుచిక్కని వ్యాధి (People Fell Sick in Eluru) రెండు రోజుల నుంచి కలకలం రేపుతున్న సంగతి విదితమే. ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయి. ఇంకా మూర్ఛ, వాంతులు వంటి బాధితులు (People Fall Sick in Eluru) పెరుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో వీరు చేరారు. ఇప్పటివరకూ70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారు.

People Fell Ill In Eluru: అంతుపట్టని వ్యాధితో వణుకుతున్న ఏలూరు, ఫిట్స్‌ మాదిరి నోటి వెంట నురగతో పడిపోతున్న ప్రజలు, భయపడాల్సిందేమి లేదని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

గత రెండు రోజుల నుంచి ఏలూరు నగరం విచిత్రమైన వ్యాధితో (People Fell Illness In Eluru) వణికిపోతుంది. వన్‌టౌన్‌లోని దక్షిణపు వీధి, పడమరవీధి, టూటౌన్‌ ప్రాంతంలోని గన్‌బజార్, కొత్తపేట, అశోక్‌నగర్, రూరల్‌ ప్రాంతంలోని శనివారపుపేట ఏరియా ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అస్పత్రి పాలవుతున్నారు. పలువురు ఫిట్స్‌ మాదిరి నోటి వెంట నురగతో పడిపోవడంతో (many people fell illness eluru padamara veedhi) కుటుంబీకులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త తరహాగా వ్యాధి ఉండటంతో వైద్యులకు జబ్బు ఏమిటో అర్థంకాలేదు.

Advertisement
Advertisement