ఆంధ్ర ప్రదేశ్

AP Coronavirus: ఏపీలో తాజాగా 1,316 మందికి కరోనా, ఇప్పటివరకు 94,08,868 పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం, 11 మంది మృతితో 6,910కి చేరిన మరణాల సంఖ్య, డిసెంబర్‌ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 94,08,868 పరీక్షలు జరిగాయి. గడిచిన 24 గంటల్లో 75,165 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,316 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,58,711కు (AP Coronavirus) చేరింది.

House Site Distribution: ఒక్క రూపాయి చెల్లింపుతో టిడ్కో ఇల్లు, డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ, పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం, స్పందన కార్యక్రమంలో ఏపీ సీఎం వైయస్ జగన్ నిర్ణయాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ (House Site Distribution) కార్యక్రమాన్ని డిసెంబర్‌ 25వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారులను ఆదేశించారు.

Covid Second Wave: కరోనా సెకండ్ వేవ్ ముప్పు, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైయస్ జగన్ సూచన, కలెక్టర్లు ఎస్‌పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌, రాష్ట్రంలో తాజాగా 1236 మందికి కరోనా

Hazarath Reddy

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తొలి దశ నుంచి రెండో దశకు (Covid Second Wave) చేరుకుంది. ఇప్పటికే పలు దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైంది. ఇక మన దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ దాటి ఏకంగా మూడవదశలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ ( AP CM YS Jagan Mohan Reddy) అధికారులను అప్రమత్తం చేశారు. ఢిల్లీ మరోసారి లాక్‌డౌన్‌కు (Delhi Lockdown) సిద్ధమవుతోందని తెలిపిన సీఎం రాష్ట్రంలో మనం జాగ్రత్తగా చాలా ఉండాలని సూచించారు.

Tungabhadra Pushkaralu: 12 ఏళ్ల తరువాత..తుంగభద్ర నది పుష్కరము, దివంగత వైఎస్సార్ తరువాత తనయుడు వైయస్ జగన్ ప్రత్యేక పూజలు, ఖరారైన ఏపీ సీఎం పర్యటన, తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు కొన‌సాగే తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌పై (Tungabhadra Pushkaralu) తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేశాయి. ఈ 12 రోజుల పాటు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వాలు స్ప‌ష్టం చేశాయి. ప‌దేళ్ల లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, 65 ఏళ్ల పైబ‌డిన‌వారు పుష్క‌రాల‌కు రావొద్ద‌ని ప్రభుత్వాలు సూచించాయి.

Advertisement

AP Local Body Elections: ఎస్ఈసీకి మరో ట్విస్ట్..కరోనాతో పోరాడుతున్నాం, ఇప్పుడు ఎన్నికలు ప్రజాహితం కాదు, ఎస్ఈసీ నిమ్మగడ్డకు లేఖ రాసిన ఏపీ చీఫ్ సెక్రటరీ నీలంసాహ్ని

Hazarath Reddy

ఏపీలో ఫిబ్రవరిలో ఎన్నికలు (AP Local Body Elections) నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషన్ స్టేట్ మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఏపీ సర్కారు స్పందించింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా నీలంసాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు లేఖ (AP CS Neelam Sahni Letter To SEC) రాశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు సరిగా లేవని ఆమె లేఖలో స్పష్టం చేశారు.

AP Covid Update: మౌత్‌వాష్‌ చేసుకుంటే కరోనా 30 సెకన్లలోనే అవుట్, యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్ర్తవేత్తల పరిశోధనలో వెల్లడి, ఏపీలో తాజాగా 1,397 మందికి కోవిడ్

Hazarath Reddy

మౌత్‌వాష్‌ (Mouthwash) వల్ల కరోనా వైరస్‌ 30 సెకన్లలోనే అంతమవుతుందని యూకేలోని కార్డిఫ్‌ యూనివర్సిటీ శాస్ర్తవేత్తలు చేసిన పరిశోధన చెబుతోంది.

Missing Cases in AP: ఏపీలో వణికిస్తున్న మిస్సింగ్ కేసులు, నెల్లూరులో 5 మంది అదృశ్యం, సత్తెనపల్లిలో బాలుడి కిడ్నాప్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఏపీలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒకే ఇంట్లో ఐదుగురు అదృశ్యమైన ఘటన (Missing Case in Nellore) స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరు తోడికోడళ్లు, ముగ్గురు పిల్లలు అదృశ్యమయ్యారు. వెంకటగిరి మండలం జికె పల్లి గ్రామంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఐదుగురూ అదృశ్యమయ్యారు.

AP Local Body Elections: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు, న్యాయపరమైన ఇబ్బందులు లేవని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్

Hazarath Reddy

ఏపీలో వచ్చే ఏడాది పంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు (AP Local Body Elections 2020) జరగనున్నాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ (SEC Nimmagadda Ramesh Kumar) తెలిపారు.

Advertisement

Supreme Court Justice UU Lalit: సీఎం ప‌ద‌వి నుంచి వైఎస్ జ‌గ‌న్‌ను తొలగించాలని పిటిషన్, కేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపిన జ‌స్టిస్ ల‌లిత్, ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల తీరును ఖండిస్తూ సీజేఐకి ఏపీ సీఎం లేఖ

Hazarath Reddy

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను పదవి నుంచి తొలగించాలంటూ వేసిన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు స్వీక‌రించింది. న్యాయ‌వాదులు జీఎస్ మ‌ణి, ప్ర‌దీప్ కుమార్ యాద‌వ్‌, సునిల్ కుమార్ సింగ్‌తో పాటు ఎన్జీవో యాంటీ క‌ర‌ప్ష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్ర‌స్టు ఈ పిటిషన్ వేశారు. అయితే ఈ కేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ఇవాళ జ‌స్టిస్ యూ.యూ. ల‌లిత్ (Supreme Court Justice UU Lalit) తెలిపారు.

YSR Sunna Vaddi Scheme 2020: వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ చెల్లింపులు విడుదల, 14.58 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 510 కోట్లకు పైగా జమ, ఉచిత బోర్లు, పగటిపూటి 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపిన ఏపీ సీఎం

Hazarath Reddy

ఏపీలో పంట నష్టపోయిన రైతుల కోసం వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ నిధులను (YSR Sunna Vaddi Scheme 2020) విడుదల సీఎం వైయస్ జగన్ విడుదల చేశారు. వైఎస్ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం చెల్లింపుల్లో భాగంగా 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ (zero-interest loan scheme) చేశారు. తాజాగా అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేశారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు. ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపారు.

AP State Security Commission: చంద్రబాబుకు జగన్ సర్కారు ఆఫర్, రాష్ట్ర భద్రతా కమిషన్‌లో బాబుకు చోటు, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు

Hazarath Reddy

రాష్ట్ర భద్రతా కమిషన్‌ (AP State Security Commission-SSC) సభ్యుల నియామక నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన నిబంధనల్లో భాగంగా రాష్ట్ర భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు (N. Chandrababu Naidu) చోటు కల్పించింది. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ రాష్ట్ర భద్రతా కమిషన్‌ నిబంధనలు–2020లోని రూల్‌ నంబర్‌–2లోని సబ్‌ రూల్‌–2లో ప్రభుత్వం (Government of Andhra Pradesh) సవరణ చేసింది.

AP Coronavirus: ఏపీలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు, గత 24 గంటల్లో 753 కరోనా కేసులు, 1507 మంది డిశ్చార్జ్‌, ప్రస్తుతం 17892 యాక్టివ్‌ కేసులు, 6881కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

రాష్ట్రంలో కరోనా ఇప్పుడు అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా 2వేలలోపే కేసులు (AP Coronaviurs Report) నమోదయ్యాయి. ఇప్పుడు కేసుల సంఖ్య కనిష్టంలోకి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 43,044 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 753 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 854764కు (Coronavirus in Andhra Pradesh) చేరింది.

Advertisement

AP Covid Report: కరోనా తరువాత సమస్యలు, తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి, రాష్ట్రంలో తాజాగా 1 ,056 మందికి కోవిడ్, 18,659కి దిగివచ్చిన యాక్టివ్ కేసులు, 14 మంది మృతితో 6,868కు చేరిన మరణాల సంఖ్య

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 53,215 నమూనాలు పరీక్షించగా.. 1 ,056 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు (AP Covid Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,54,011కు (Coronavirus Cases) చేరింది. నిన్న ఒక్కరోజే 2,140 మంది వైరస్‌ బారినుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,28,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Cricket Betting in Guntur: క్రికెట్ బెట్టింగ్‌..ఇద్దరు యువకులు ఆత్మహత్య, అప్పులపాలవ్వడంతో పురుగుల మందు తాగిన ఇద్దరు యువకులు, గుంటూరు జిల్లాలో విషాద ఘటన

Hazarath Reddy

ఏపీలో గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్‌ బెట్టింగ్‌ (Cricket Betting in Guntur) ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది. గుంటూరు జిల్లాలోని బెల్లంకొండలో బెట్టింగ్‌ నిర్వహించిన ఇద్దరు యువకులు అప్పులపాలయ్యారు. ఈ అప్పులు ఎక్కువ కావడంతో ఈనెల 9న ఇద్దరు యువకులు సురేష్‌, కొమరయ్య పురుగుల మందు (Two Youth Committed Suicide) సేవించారు.

Corona in AP: విశాఖ మన్యం వాసులను పరుగులు పెట్టించిన పీపీఈ కిట్ మ్యాన్, చలికి తట్టుకోలేక వేసుకున్నాడట, రాష్ట్రంలో తాజాగా 1,657 కేసులు నమోదు, 19,757 కు దిగివచ్చిన యాక్టివ్ కేసుల సంఖ్య

Hazarath Reddy

విశాఖ మన్యం పాడేరులో పీపీఈ కిట్‌తో (Personal Protective Equipment) ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. అతన్ని చూసిన జనాలు కోవిడ్ రోగి అందరికీ అంటిస్తున్నాడని భయంతో పరుగులు తీశారు.

COVID Status in AP: ఆంధ్రప్రదేశ్‌లో 90 లక్షలు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు, 8.50 లక్షలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 20,262గా ఉన్న ఆక్టివ్ కేసులు

Team Latestly

. ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వందకు తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు, ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన వైరస్ నిర్ధారణ పరీక్షలు 90 వేల మార్కును దాటింది.....

Advertisement

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 1728 మందికి పాజిటివ్, మరో 1777 మంది రికవరీ, రాష్ట్రంలో 20,857గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఉభయ గోదావరి జిల్లాల్లో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 290, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 239 కేసులు రాగా, కృష్ణా జిల్లా నుంచి 223, గుంటూరు నుంచి 212 మరియు చిత్తూరు జిల్లా నుంచి 206 కొత్త కేసులు నమోదయ్యాయి....

Heavy Rain Alert to AP: ఏపీకి భారీ వర్ష సూచన, ఆందోళన పడుతున్న రైతులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన విపత్తుల నిర్వహణ శాఖ

Hazarath Reddy

పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న నాలుగైదు గంటలు పలు ప్రాంతాలలో భారీ వర్షాలు (Heavy Rain Alert in AP) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఐఎండి (IMD)వాతావరణ సూచనల ప్రకారం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.

Corona in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 1732 మందికి పాజిటివ్, మరో 1761 మంది రికవరీ, రాష్ట్రంలో 20,915గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 344, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 227 మరియు కృష్ణా జిల్లా నుంచి 246, చిత్తూరు నుంచి 198 మరియు గుంటూరు నుంచి 195 కేసుల చొప్పున నమోదయ్యాయి...

Obscene Videos in SVBC Office: తిరుపతి వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీసులో పోర్న్ వీడియోల కలకలం, తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విచారణకు ఆదేశం

Hazarath Reddy

పవిత్రమైన తిరుమల భక్తి ఛానల్ ఆఫీసులో అశ్లీల వీడియోల కలకలం రేపింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీసులో ఉద్యోగులు పోర్న్ వీడియోలు చూడటంపై టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎస్వీబీసీ ఉద్యోగుల నిర్వాకంపై తీవ్రంగా స్పందించిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. కాగా ‘శతమానం భవతి’ కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు మెయిల్‌ చేయగా, అతడికి ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్‌ సైట్‌ లింక్‌ పంపించాడు. దీంతో ఈ ఘటనపై ఆ భక్తుడు టీటీడీ చైర్మన్‌, ఈవోకి ఫిర్యాదు చేశాడు.

Advertisement
Advertisement