ఆంధ్ర ప్రదేశ్

Diwali Celebrations in AP: ఏపీలో టపాసుల వినియోగంపై సర్కారు కీలక సూచనలు, రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే కాల్చుకోవాలని ఆదేశాలు

Hazarath Reddy

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దీపావళి సంబరాలపై (Diwali Celebrations in AP) ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం (AP Govt) చర్యలు చేపట్టింది.

AP Corona Report: పేదలకు ఖరీదైన వైద్యం ఉచితం, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరిన ఏపీ సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో తాజాగా 1,886 మందికి కరోనా

Hazarath Reddy

ఎంత ఖరీదైన వైద్యం అయినా సరే పేదలకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ (YSR Arogyasri) పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధికారులను ఆదేశించారు.

Dress Code to Village Secretariat Staff: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగులకు డ్రస్ కోడ్, బ్లూ షర్ట్, బిస్కెట్‌ కలర్‌ ప్యాంట్, ఒకటి రెండు జిల్లాల్లో తొలుత పైలెట్ ప్రాజెక్ట్

Hazarath Reddy

సచివాలయాల్లో పనిచేసేవారు ప్రత్యేకంగా కనిపించాలన్న ఆలోచనతో ఏపీ ప్రభుత్వం వారికి డ్రస్‌ కోడ్‌ అమలు (Dress Code to Village Secretariat Staff) చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పైలెట్‌ సచివాలయాల కింద కొన్నింటిని గుర్తించి ముందుగా అక్కడి సిబ్బందికి డ్రస్‌ కోడ్‌ (Dress Code) అమలు చేయాలని నిర్ణయించింది.

YSR Aarogyasri: ఆస్పత్రి బిల్లు వేయి దాటితే ప్రభుత్వమే చెల్లిస్తుంది, 13 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ అమల్లోకి వస్తుందని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, నేటి నుంచి ఉచిత బోరు తవ్వకాలు ప్రారంభం

Hazarath Reddy

ఏపీలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకు వర్తింపచేసింది. నేటి నుంచి రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో ఆరోగ్యశ్రీ (YSR Aarogyasri) అమల్లోకి వస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ చికిత్సల విస్తరణను (Dr YSR Aarogyasri Health Plan) ఆయన ప్రారంభించారు. ఇకపై క్యాన్సర్ సహా 2,434 వైద్య ప్రక్రియలకు సంబంధించి ఉచితంగా చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

AP Floods Aid Row: వరదలతో రూ.6,386 కోట్లు నష్టపోయాం, తక్షణమే కేంద్రం రూ. 5 వేల కోట్లు విడుదల చేయాలి, కేంద్ర బృందాన్ని కోరిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

Hazarath Reddy

ఏపీలో గత నెలలో కురిసిన కుండపోత వర్షాలు, వరదలతో దారుణంగా నష్టపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వరద నష్టం పరిశీలనకు రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన సౌరవ్‌ రాయ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం సోమవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో అధికారులతో సమావేశమైంది.

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖం పట్టిన కొవిడ్, కొత్తగా మరో 1392 మందికి పాజిటివ్, మరో 1549 మంది రికవరీ, రాష్ట్రంలో 21,235గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1549 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,13,427 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 21,235 ఆక్టివ్ కేసులు...

Nandyal Family Suicide Case: నంద్యాలలో కుటుంబం ఆత్మహత్య, నిందితులు ఎవ్వరినీ వదలమని తెలిపిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, సీఐ,హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

Hazarath Reddy

నంద్యాలలో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్‌ సలామ్‌ కుటుంబ సభ్యులను (Nandyal Family Suicide Case) సోమవారం డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా పరామర్శించారు. అబ్దుల్ సలామ్‌ కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు అండగా ఉంటామని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ( AP Deputy CM Amjad Basha) హామీ ఇచ్చారు. అన్యాయంగా, అక్రమంగా ప్రజలపై ఎవరు అత్యుత్సాహం ప్రదర్శించిన చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Machil Encounter: ఉగ్రదాడిలో అమరులైన తెలుగు బిడ్డలు, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ఒక సైనికాధికారి వీర మరణం, ఇద్దరు ఉగ్రవాదులు హతం

Hazarath Reddy

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మచిల్ భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో (Machil Encounter) ముగ్గురు జవాన్లు, ఒక సైనికాధికారి వీర మరణం పొందారు. ఉత్తర కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ)కు సమీపంలోని మచిల్‌ సెక్టార్‌లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన పెట్రోలింగ్‌ బలగాలు నిఘాను పటిష్టం చేశాయి. శనివారం అర్ధరాత్రి ఉగ్రవాదులు మాచిల్‌ సెక్టార్‌ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదుల కదలికలను జవాన్లు గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు.

Advertisement

AP Covid Report: ఏపీ ప్రభుత్వం నుంచి మరో శుభవార్త, కరోనా నుంచి కోలుకున్న వారికి అనారోగ్య సమస్యలు వస్తే ఆరోగ్యశ్రీ కింద చికిత్స, ఏపీలో తాజాగా 2,237 మందికి కోవిడ్-19

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 76,663నమూనాలు పరీక్షించగా 2,237 పాజిటివ్‌ కేసులు (AP Covid Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,42,967 కు చేరింది. కొత్తగా 12 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,791కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 2,256మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు.

Nandyal Family Suicide Case: కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్య, నంద్యాల ఘటనపై తక్షణం విచారణ జరపాల్సిందిగా డీజీపీ సవాంగ్‌కు ఏపీ సీఎం ఆదేశాలు, నంద్యాల వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌ సస్పెండ్‌

Hazarath Reddy

ఏపీలో విషాదాన్ని నింపిన కుటుంబం ఆత్మహత్య (Nandyal Family Suicide Case) ఘటనపై ఏపీ సీఎం వైయస్ జగన్ విచారణకు ఆదేశించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన షేక్‌ అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై తక్షణం విచారణ జరపాల్సిందిగా డీజీపీ సవాంగ్‌కు ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.

YSR Kapu Nestham Scheme 2020: పేద మహిళల అకౌంట్లలోకి నేరుగా రూ.15 వేలు, రెండవ ధపా వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ఎన్నికల హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా గతేడాది పరిపాలనలోకి వచ్చిన తరువాత పేద మహిళల కోసం వైఎస్సార్‌ కాపు నేస్తం పధకాన్ని (YSR Kapu Nestham Scheme) తీసుకువచ్చిన సంగతి విదితేమే. ఇప్పటికే వైఎస్సార్‌ కాపు నేస్తం పథకంలో (YSR Kapu Nestham Scheme 2020) భాగంగా తొలి ధఫా మొత్తం విడుదల చేయగా రెండో ధపా మొత్తాన్ని నిన్న విడుదల చేశారు.

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 2367 మందికి పాజిటివ్, మరో 2747 మంది రికవరీ, రాష్ట్రంలో 21,434గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 2747 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,12,517 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 21,434 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ...

Advertisement

AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో మరో 2 వేల 4 వందల మందికి పాజిటివ్, అదే స్థాయిలో రికవరీలు నమోదు, రాష్ట్రంలో 21,825గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా పాజిటివ్ కేసులు తూర్పు గోదావరి జిల్లా నుంచి 401, గుంటూరు జిల్లా నుంచి 323, కృష్ణా నుంచి 298 మరియు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా 298 కేసుల చొప్పున నమోదయ్యాయి...

AP Corona Report: వచ్చే ఏడాదే కోవిడ్-19 వ్యాక్సిన్, 2021 ఫిబ్రవరి లోనే లాంచ్‌ చేసే అవకాశం ఉందని తెలిపిన భారత్ బయోటెక్ సైంటిస్టు, ఏపీలో తాజాగా 2,745 కోవిడ్ కేసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 85,364 నమూనాలు పరీక్షించగా 2,745పాజిటివ్‌ కేసులు (AP Corona Report) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,35,953 కు ( Covid-19 cases) చేరింది. కొత్తగా 13 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,757కి (Covid Deaths) చేరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

AP Cabinet Key Decisions: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం, నవంబర్ 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభం, కొత్త ఇసుక పాలసీ విధానం అమల్లోకి..

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్‌ పలు నిర్ణయాలకు (AP Cabinet Key Decisions) ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

Vizag Steel Plant Fire Accident: విశాఖ ఉక్కు కర్మాగారంలో అగ్ని ప్రమాదం, రూ. 2 కోట్ల ఆస్తి నష్టం, తప్పిన ప్రాణాపాయం, టర్బన్ ఆయిల్‌పై నిప్పు రవ్వలు పడటంతో ఘటన

Hazarath Reddy

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో (Visakhapatnam Steel Plant) గురువారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టర్బన్‌ ఆయిల్‌ లీక్‌ కావడంతో స్టీల్‌ప్లాంట్‌ టీపీపీ-2లో ఒక్కసారిగా మంటలు (Vizag Steel Plant Fire Accident) చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లోని 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటర్లు దగ్ధం కావడంతో సుమారు రూ.2కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ప్రొడక్షన్, ఎలక్ట్రికల్ యూనిట్లలో మంటలు చెలరేగాయి.

Advertisement

AP Covid Report: కాచుకుని ఉన్న కరోనా సెకండ్ వేవ్, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన, ఏపీలో తాజాగా 2,477 మందికి కోవిడ్‌ పాజిటివ్‌, 21,438 యాక్టివ్‌ కేసులు, 6,744కు చేరిన మరణాలు

Hazarath Reddy

ఏపీలో గత 24 గంటల్లో 74,465 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..2,477 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా (AP Covid Report) నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా (COVID-19) నుంచి కొత్తగా 2,701 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,05,026 గా ఉంది.

Mega Projects in AP: ఏపీలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు, త్వరలో మూడు మెగా ప్రాజెక్టులు, రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్‌ఐపీబీ ఆమోదం, విశాఖలో ఐటీ యూనివర్సిటీ ఏర్పాటు

Hazarath Reddy

ఏపీలో ఇకపై భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు మెగా ప్రాజెక్టులకు (Mega Projects in AP) సంబంధించిన రూ.16,314 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(SIPB) సమావేశం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఇంటెలిజెంట్‌ సెజ్‌ లిమిటెడ్, ఏటీసీ ఏపీ ప్రైవేట్‌ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌లు తమ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, వీటి ద్వారా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.

AP Local Polls Row: కరోనా తగ్గింది, ఎన్నికలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నాం, హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్, ఏపీలో పనిచేస్తూ హైదరాబాద్‌లో అధికార నివాసం ఎందుకని ప్రశ్నించిన హైకోర్టు

Hazarath Reddy

కరోనావైరస్ కారణం చూపుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను (Local polls) వాయిదా వేయడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ (Nimmagadda Ramesh kumar) హైకోర్టుకు నివేదించారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ (State Election Commission) రెడీగా ఉందని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. తనతో పాటు ఎన్నికల కమిషన్‌కు భద్రతను పెంచాలన్నారు.

AP Covid Update: ఏపీలో భారీగా పెరుగుతున్న రికవరీ రేటు, తాజాగా 2,849 మందికి కరోనా, 3,700 మంది కోలుకుని డిశ్చార్జ్, 15 మంది మృతితో 6,734కు చేరుకున్న కోవిడ్ మరణాల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 సాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 84,534 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,849 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,30,731కి (Confirmed Cases) పెరిగింది. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement