ఆంధ్ర ప్రదేశ్

AP Three Capitals Row: రాజధానితో మాకు సంబంధం లేదని తెలిపిన కేంద్రం, రిట్‌ పిటిషన్‌ 20622/2018కు ప్రతిగా ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ

Hazarath Reddy

ఏపీ రాజధాని అంశంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అంశంపై (AP Three Capitals Row) ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ (Home Ministry) గురువారం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాజధాని తుది నిర్ణయం రాష్ట్ర పరిధిలోకే వస్తుందని కేంద్ర హోంశాఖ హైకోర్టులో (AP High Court) దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధాని (AP Capital) నిర్ణయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల మధ్య జరిగిన చర్చ.. కోర్టుల్లో న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది.రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనువైన ప్రాంతంలో గానీ, అభివృద్ది చేయాలని భావించిన ప్రాంతం నుంచి గానీ పరిపాలన చేయవచ్చని చెప్పింది. ఈ అంశంపై పూర్తి అధికారాలు రాష్ట్రాల్లోని ప్రభుత్వానిదేనని చెప్పింది.

AP Coronavirus Bulletin: ఏపీలో 95 ఏళ్ల వృద్ధుడు కరోనాని జయించాడు, లక్ష మార్కును దాటిన కోవిడ్ డిశ్చార్స్ కేసులు, తాజాగా 10,128 కేసులు నమోదు, లక్షా 90 వేలకు చేరువలో కోవిడ్-9 కేసులు

Hazarath Reddy

ఆంధ‌ప్ర‌దేశ్‌లో కేసుల సంఖ్య మ‌రోసారి‌ ప‌ది వేలు (AP Coronavirus Bulletin) దాటింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 60,576 క‌రోనా వైర‌స్‌ ప‌రీక్ష‌లు చేయ‌గా 10,128 పాజిటివ్ కేసులు (new coronavirus cases) న‌మోదైన‌ట్లు వైద్యారోగ్య శాఖ బుధ‌వారం హెల్త్ బులెటిన్‌లో ( health bulletin) పేర్కొంది. దీంతో మొత్తం ప‌రీక్ష‌ల సంఖ్య 22,35,646కు చేరుకోగా మొత్తం కేసుల సంఖ్య 1,86,461గా న‌మోదైంది. కొత్త‌గా 8,729 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అవ‌గా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,04,354కు చేరింది.

AP Unlock 3.0 Guidelines: ఏపీలో అన్‌లాక్ 3.0 అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ ప్రక్రియ, కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 3.0 అమలు (AP Unlock 3.0) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ ఉండనుంది. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్‌లకు అనుమతినివ్వలేదు. తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్‌లు, జిమ్‌లకు నేటి నుంచి అనుమతి ఇవ్వనుంది. స్వతంత్ర దినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ ఉంటుందని ఏపీ ప్రభుత్వం (AP Government) వెల్లడించింది.

Apex Council Meeting Postponed: తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా, తదుపరి సమావేశాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపిన కేంద్ర జల శక్తి శాఖ

Hazarath Reddy

కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం వాయిదా (Apex Council Meeting Postponed) పడింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని (Apex Council Meeting) కేంద్ర జలశక్తి శాఖ వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జల శక్తి శాఖ తెలిపింది.ముఖ్యమంత్రి కేసీఆర్ అపెక్స్ కమిటీ మీటింగ్‌కు హాజరుకాలేనని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శికి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర జల శక్తిశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. త్వరలోనే మరో సమావేశం తేదీని తెలియచేస్తామని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.

Advertisement

Kasibugga CI Suspended: దళితుడిని బూటు కాలితో తన్నిన కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్‌, స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిన విశాఖ‌ప‌ట్నం డీఐజీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో దళితుడిని బూటుకాలితో తన్నిన సీఐ వేణుగోపాల్‌ను (Srikakulam kasibugga ci) పోలీస్ ఉన్న‌తాధికారులు స‌స్పెండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని సీరియస్ గా తీసుకున్న ఏపీ డీజీపీ కార్యాల‌యం (AP DGP Office) దీనిపై విచారణ చేపట్టింది. ప్రాథమిక విచార‌ణ జ‌రిపిన అనంత‌రం విశాఖ‌ప‌ట్నం డీఐజీ కాళిదాస్ రంగారావు సీఐ వేణుగోపాల‌న్‌ను (kasibugga CI Suspended) స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

AP Covid-19 Update: కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ఆరోగ్యశాఖ, కోవిడ్ బారీన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఏపీలో తాజాగా 9,747 కేసులు నమోదు

Hazarath Reddy

ఏపీలో కొత్తగా 9,747 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు (AP Coronavirus Report) 1,76,333కి చేరాయి. తాజాగా 67 మంది మృతితో (AP Coronavirus Deaths) మొత్తం మరణాలు 1,604కి చేరాయి. ఆస్పత్రుల నుంచి 6,953 మంది డిశ్చార్జ్‌ అవడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 95,625కి చేరింది. యాక్టివ్‌ కేసులు (Active Cases) 79,104 ఉన్నాయి. మిలియన్‌ జనాభాకు 40,732 పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల జోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 వరకు 64,147 మందికి పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 21,75,070కి చేరింది.

Three Capitals Row: మూడు రాజధానులపై హైకోర్టు స్టే, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ఏపీ హైకోర్టు, ఆగస్టు 14కు విచారణ వాయిదా

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై (three separate capitals) రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయితే, కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆగస్టు 14వరకు యథాతధ స్థితి ఉండాలని స్పష్టం చేసింది.

Three Capitals Issue: చంద్రబాబు 48 గంటల సవాల్, అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామంటూ పిలుపు, మీరు రాజీనామా చేసి వస్తే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని తెలిపిన పేర్ని నాని

Hazarath Reddy

మూడు రాజధానుల అంశంపై (Three Capitals Issue) ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇస్తున్నానని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం రాజీనామా చేయాలని, అందరం కలసి ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరదామని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి మీడియాతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పకుండా ఇప్పుడు రాజధానిని (AP Capital) ఎలా మారుస్తారని ప్రశ్నించారు.

Advertisement

Gollapudi Rape and Murder Case: చిన్నారిపై అత్యాచారం,హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష, సంచలన తీర్పు వెలువరించిన విజయవాడ స్పెషల్‌ పోక్సో కోర్టు, 2019లో అమానుష ఘటన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో విజయవాడ స్పెషల్‌ పోక్సో కోర్టు (Vijayawada POCSO Court) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో పెంటయ్య అనే వ్యక్తి ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, తనను హతమార్చాడు. గొల్లపూడిలోని (Gollapudi village) నల్లకుంటలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం పెంటయ్యను దోషిగా తేల్చి మంగళవారం ఉరిశిక్ష ఖరారు చేసింది.

Vizag Vijayasri Pharma Explosion: వైజాగ్‌లో మరో పేలుడు, విజయశ్రీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, తప్పిన పెనుప్రమాదం

Hazarath Reddy

ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా రాబోతున్న విశాఖపట్నంలోని పరిశ్రమల్లో పదే పదే అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖలో ఈ రోజు ఉదయం మరో పరిశ్రమలో పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది.

AP Govt Key Decision: వరుస ప్రమాదాలు..ఏపీ సీఎం కీలక నిర్ణయం, పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు, జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీ

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు (Industrial Accidents) జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం (AP Govt Key Decision) తీసుకుంది. పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ (Special Drive) చేపట్టాల్సిందిగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పరిశ్రమల తనిఖీ కోసం కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించింది. వివిధ విష వాయువులు కలిగిన పరిశ్రమలు, ప్రమాదకర రసాయనాలు, పేలుడు పదార్ధాలు, రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఇలా అన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

PM Kisan Yojana: బ్యాంకు అకౌంట్లో నేరుగా రూ. 2 వేలు, పీఎం కిసాన్ ఆరవ విడత డబ్బులు ఆగస్టు 1 నుంచి విడుదల, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో..లేదో తెలుసుకోండి

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ (Prime Minister Kisan Samman Nidhi Yojana) ద్వారా అందిస్తున్న డబ్బులను మళ్లీ రైతుల బ్యాంక్ అకౌంట్లలో (Farmers Accounts) జమ చేయనుంది. ఆగస్ట్ నెల 1 నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,000 జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. మోదీ సర్కార్ రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన సమ్మాన్ నిధి స్కీమ్ (PM Kisan Yojana) ద్వారా వారికి ఏడాదికి రూ.6,000 అందిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Vangapandu Dies: వంగపండు ప్రసాదరావు కన్నుమూత, సంతాపం తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్, ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న పలువురు ప్రముఖులు

Hazarath Reddy

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) (Vangapandu Prasad Rao) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో (Cardiac arrest) కన్నుమూశారు. వంగపండు ప్రసాదరావు మృతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం (AP CM Jagan expresses condolence) వ్యక్తం చేశారు.

Heavy RainFall Warning: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం, రాగ‌ల 24 గంట‌ల్లో అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశ‌ం

Hazarath Reddy

ఉత్త‌ర బంగాళాఖాతం ప‌రిస‌ర ప్రాంతాల్లో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. దానికి అనుబంధంగా 7.6 కిలోమీట‌ర్ల ఎత్తులో నైరుతి వైపు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డిన‌ట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగ‌ల 24 గంట‌ల్లో అల్ప‌పీడ‌నం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశ‌మున్న‌ట్లు వెల్ల‌డించింది. అల్ప‌పీడనం ప్ర‌భావంతో ద‌క్షిణ కోస్తా, ఉత్త‌ర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం (Heavy RainFall Warning) ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబ‌డి గంట‌కు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురుగాలులు వీస్తున్నాయ‌ని , మ‌త్స‌కారులెవ‌రూ వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.

AP Inter Reverification Results 2020 Declared: ఏపీ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల సమాచారం

Hazarath Reddy

AP ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు 2020 (AP Inter Reverificaiton Results 2020 Declared) వెలువడ్డాయి. BIEAP 2 వ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం AP ఇంటర్ రివెరిఫికేషన్ ఫలితాలను ( Re-verification Results) 2020 అధికారికంగా ప్రకటించింది. అధికారిక సమాచారం ప్రకారం, BIEAP ఇంటర్ రివెరిఫికేషన్ ఫలితాలు 2020 మరియు AP ఇంటర్ రీకౌంటింగ్ ఫలితాలు 2020 ఈ రోజు ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ప్రచురించబడ్డాయి. AP ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితం 2020 కోసం నమోదు చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ అవ్వడం ద్వారా వారి వివరణాత్మక ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

COVID-19 in AP: కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి, ఏపీలో తగ్గుముఖం పట్టిన కోవిడ్-19 కేసులు, తాజాగా 7,822 కరోనా కేసులు నమోదు

Hazarath Reddy

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (Former Bhadrachalam MLA Sunnam Rajaiah) కరోనాతో మృతి చెందారు. స్వగ్రామం వీఆర్‌పురం మండలం సున్నం వారి గూడెంలో రాజయ్య తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. పరిస్థితి విషమించడంతో విజయవాడ తరలించగా...చికిత్స పొందుతూ రాజయ్య మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భద్రాచలం నియోజకవర్గం నుండి మూడు పర్యాయాలు రాజయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రచాలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో మూడుసార్లు ఆయన సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement

CM Jagan Raksha Bandhan Greetings: నా ప్రియమైన అక్కాచెల్లెమ్మలకు శుభాభినందనలు, ట్విట్టర్ ద్వారా రాఖీ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం, గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వైయస్ జగన్

Hazarath Reddy

రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jagan Mohan Reddy) రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు (CM Jagan Raksha Bandhan Greetings) తెలిపారు. తోబుట్టువుల మధ్య ప్రేమానుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగ రక్షాబంధన్‌ అని, ఒకరికి ఒకరు రక్షణగా ఉంటామని బాస చేసుకునే పర్వదినం అని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రాఖీ పండుగ స్ఫూర్తిని కొనసాగిస్తూ, అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.

Andhra Pradesh e-Pass: ఏపీకి వచ్చేవారికి ఇకపై నో కండీషన్స్, ఆటోమేటిక్ ఈ పాస్ సిస్టంను ప్రవేశపెట్టిన ఏపీ సర్కారు, స్పందనలో నమోదు చేసుకుంటే తక్షణమే ఈ పాస్

Hazarath Reddy

దేశ వ్యాప్తంగా అన్‌లాక్‌ 3.0 (Unlock 3) ప్రారంభమైంది. ఆగస్టు 1 నుంచి కేంద్రం కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే కేంద్రం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిబంధనలు ( AP Border) సడలించారు. కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్ డౌన్ (Lockdown) కొనసాగుతుందని.. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, గూడ్స్ రవాణాపై పూర్తిగా ఆంక్షలు తొలిగించింది. అలాగే మరికొన్ని నిబంధనల్ని కూడా సడలించింది. రాష్ట్రాల్లో కూడా ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.. కొన్ని నిర్ణయాలు మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించారు.

AMRDA Replacing APCRDA: ఏపీసీఆర్‌డీఏ కనుమరుగు, దాని స్థానంలో 11 మందితో ఏఎంఆర్‌డీఏ ఏర్పాటు, కమిషనర్‌గా పి.లక్ష్మీనరసింహం, ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీసీఆర్‌డీఏ (APCRDA) స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ (ఏఎంఆర్‌డీఏ)ని (Amaravati Metropolitan Region Development Authority (AMRDA)) ప్రభుత్వం 11 మందితో ఏర్పాటు చేసింది. చైర్‌పర్సన్‌గా పర్యావరణ మండలిలో సభ్యునిగా పనిచేసిన లేదా పట్టణ గవర్నెన్స్, ప్లానింగ్, రవాణా రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నియమిస్తూ తరువాత ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Visakhapatnam Crane Collapsed: రూ. 50 లక్షల నష్టపరిహారం, శాశ్వత ఉద్యోగం, రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం, క్రేన్‌ ప్రమాదంపై కేసు నమోదు, దర్యాప్తు

Hazarath Reddy

విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డులో (Hindustan Shipyard Ltd) శనివారం క్రేన్‌ కూలిన దుర్ఘటనలో (Visakhapatnam Crane Collapsed) 10 మంది ఉద్యోగులు, కార్మికులు మృతిచెందిన విషయం విదితమే. వీరి కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎస్‌ఎల్‌ యాజమాన్యంతో ఆదివారం జరిపిన చర్చలు ఫలించాయి. క్రేన్‌ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున నష్టపరిహారం (Rs 50 lakh ex-gratia) మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, హెచ్‌ఎస్ఎల్‌ సీఎండీ శరత్‌బాబు సంయుక్తంగా ప్రకటించారు.

Advertisement
Advertisement