ఆంధ్ర ప్రదేశ్

AP Coronavirus Update: ఏపీలో తాజాగా 1,916 కరోనా కేసులు, నంద్యాలలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌, విశాఖలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి కరోనా

Hazarath Reddy

ఏపీలో కొత్తగా 1,916 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Update) నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ (COVID-19) సోకిన వారి సంఖ్య 33,019కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 952 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 17,467 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

APSRTC: కర్ణాటకకు ఏపీ బస్సులు నిలిపివేత, బెంగుళూరులో పూర్తి లాక్‌డౌన్ అమలు, జూలై 15 నుండి 23 వరకు అన్ని బస్సు సర్వీసులు నిలిపివేయాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం

Hazarath Reddy

కర్ణాటకలో కోవిడ్ -19 కేసులు( COVID-19) వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బెంగళూరులో పూర్తి లాక్డౌన్ (Bengaluru lockdown) విధించారు. ఈ నేపథ్యంలో బెంగుళూరుకు బస్సు సేవలను జూలై 15 నుండి 23 వరకు నిలిపివేయాలని (APSRTC to stops all 168 services to Karnataka) ఎపి స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (APSRTC) నిర్ణయించింది. కాగా జూన్ 17 నుండి ఏపీఎస్ఆర్టీసీ కర్ణాటకకు 168 బస్సులను నడుపుతోంది. కోవిడ్ -19 కేసులు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో కూడా బస్సు సేవలను రద్దు చేయడానికి కూడా ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. బెంగళూరులో తిరిగి లాక్డౌన్ విధించడం గురించి ఆర్టీసీ అధికారులు తమ కర్ణాటక నుండి అధికారిక సమాచారం అందుకున్న తరువాత బుధవారం నుండి కర్ణాటకకు బస్సు సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

AP Weather Report: ఏపీలో విస్తారంగా వర్షాలు, మరో రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు కురిసే అవకాశం, కళకళలాడుతున్న ప్రాజెక్టులు

Hazarath Reddy

ఏపీలో నైరుతి రుతు పవనాలు (Southwest Monsoon in AP) విస్తరించాయి. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.నేడు రేపు కూడా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (AP Weather Report) కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం (Visakhapatnam Meteorological Center) వెల్లడించింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే చేరుకొని, దేశమంతటా విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Vizag Pharma City Tragedy: విశాఖను వెంటాడుతున్న వరుస అగ్నిప్రమాదాలు, తాజాగా పరవాడ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం, కార్మికుడు మృతి, ప్రమాదఘటనపై హోంమంత్రి ఆరా

Hazarath Reddy

విశాఖపట్నంను వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. గత ఘటనలు మరచిపోకముందే వైజాగ్ పరవాడ ఫార్మా సిటీలో (Parawada Pharma City) సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్‌ పరిశ్రమలో (Ramky CETP Solvent’s building) సోమవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదంలో (Vizag Pharma City Tragedy) ఒక కార్మికుడు చనిపోయారు. మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా తెలిపారు.

Advertisement

Mudragada Padmanabham: ఆయన తర్వాత ఉద్యమాన్ని నడిపించేదెవరు? కాపు ఉద్యమానికి ముద్రగడ గుడ్‌బై, చాలా నష్టపోయానంటూ లేఖ ద్వారా వివరణ ఇచ్చిన కాపు ఉద్యమనేత

Hazarath Reddy

ఏపీలో కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కాపు ఉద్యమం (Kapu Movement) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా చాలా నష్టపోయానని వివరించారు.

AP Coronavirus Report: ఒక్కరోజే కరోనాతో 37 మంది మృతి, గత 24 గంటల్లో 1935 కోవిడ్-19 కేసులు, రాష్ట్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌

Hazarath Reddy

ఏపీలో కొత్తగా1,919 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 13 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ (AP Corona Updates) అయ్యింది. దీంతో ఈ రోజు మొత్తం 1935 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1030 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Jagananna Thodu Scheme: జగనన్న తోడు, సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం, దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి, గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే

Hazarath Reddy

వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి వారికి సరైన వ్యాపారం లేదు. ఉన్న సరుకు అమ్ముడుపోక నష్టపోయారు. ఈ నేపథ్యంలో వారు తిరిగి వ్యాపారం చేసుకునేందుకు జగనన్న తోడు పథకం (Jagananna Thodu Scheme) ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం (YS Jagan Govt) అండగా నిలుస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన, వీఎంసీ పట్టణ సామాజికాభివృద్ధి విభాగం (UCD) సౌజన్యంతో ష్యూరిటీ లేని రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది.

Heavy Rains in AP: ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, రాష్ట్రంపై కొనసాగుతున్న షియర్‌ జోన్‌ ప్రభావం, అలర్ట్ జారీ చేసిన విశాఖ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఏర్పడిన ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి బలహీనపడింది. దీనివల్ల గాలుల కలయికతో ఏర్పడిన షియర్‌ జోన్‌ ప్రభావం రాష్ట్రంపై కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు కోస్తా, రాయలసీమపై చురుగ్గా ఉన్నాయి.వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో.. నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1933 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 19 మంది మృతి, రాష్ట్రంలో 30 వేలకు చేరువైన మొత్తం కొవిడ్19 బాధితుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 19 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 328 కు పెరిగింది....

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మరో 1813 పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే మరో 17 మంది మృతి, రాష్ట్రంలో 27 వేలు దాటిన మొత్తం కొవిడ్19 బాధితుల సంఖ్య

Team Latestly

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 17 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 309 కు పెరిగింది....

Pending Central Funds Update: 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,597.27 కోట్లను విడుదల చేయండి, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ను కోరిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్

Hazarath Reddy

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ రావాల్సిన నిధుల కోసం (Pending Central Funds) పలువురు కేంద్రమంత్రులనకు కలిసారు. ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్, నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌లతో శుక్రవారం ఇక్కడ సమావేశమయ్యారు.

Polavaram Project Update: పోలవరంపై కేంద్రమంత్రితో ఏపీ ఆర్థిక మంత్రి భేటీ, పోలవరం నిధులు విడుదల చేయాలని జల శక్తి శాఖ మంత్రి షెకావత్‌ని కోరిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టు విషయంపై కేంద్ర జల శక్తి శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో (Gajendra Singh Shekhawat) ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్ట్‌కు(Polavaram Project) సంబంధించి నిధుల విడుదల విషయంలో జాప్యం లేకుండా చూడాలని ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర జల శక్తి శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు (Polavaram Project Funds) త్వరితగతిన విడుదల చేయాలని కోరాను.

Advertisement

AP Coronavirus: ఏపీలో మంత్రి కుమారుడికి కరోనా, తాజాగా 1608 కోవిడ్-19 కేసులు నమోదు, సచివాలయానికి మరోసారి కరోనా సెగ, కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

Hazarath Reddy

ఏపీలో శుక్ర‌వారం కొత్త‌గా 1608 క‌రోనా కేసులు (AP Coronavirus) న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో 21,020 సాంపిల్స్‌ను ప‌రిక్షించగా అందులో 1576 కేసులు (new COVID-19 cases) ఏపీలో న‌మోద‌వ్వ‌గా, మిగ‌తా 32 క‌రోనా కేసులు ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది. ఈ మేర‌కు ఏపీ వైద్యారోగ్య‌శాఖ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి కొత్త‌గా 981 మంది డిశ్చార్జి కాగా .. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 13,194గా ఉంది.

COVID-19 Rapid Test Kits: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, 15 నిమిషాల్లోనే కరోనా ఫలితాన్ని ఇచ్చే రాపిడ్ కిట్లు అందుబాటులోకి, అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు పరీక్షలు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇకపై అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారు కోవిడ్‌–19 టెస్ట్‌ (COVID-19 Test) ఫలితం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పనిలేదు. ఇకపై కేవలం 15 నిమిషాల్లో ఫలితం తెలుసుకుని చికిత్స అందించే విధంగారాష్ట్ర ప్రభుత్వం (AP Govt) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోవిడ్‌–19 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్‌లను (COVID-19 Rapid Test Kits) అందుబాటులోకి తీసుకొచ్చింది.

AP Coronavirus: ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా, తాజాగా 1555 కోవిడ్-19 కేసులు నమోదు, 13 మంది మృతి, రాష్ట్రంలో 23,814కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య

Hazarath Reddy

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1555 పాజిటివ్‌ కేసులు (AP Coronavirus) నమోదయ్యాయి. గత 24 గంటల్లో 13 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందినవారు 1500 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 53 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరు ( Andhra Pradesh) ఉన్నారు. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం 23,814 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా.. 277 మంది మృతి చెందారు. వివిధ ఆస్పత్రులలో 10,544 చికిత్స పొందుతున్నారు. 10,250 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Food Poison in AP: చనిపోయిన ఆవును తిని 70 మంది ఆస్పత్రి పాలు, ఆరుగురి పరిస్థితి విషమం, బాధితులను పరామర్శించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, విశాఖ మన్యంలో ఘటన

Hazarath Reddy

లుషిత ఆహారం (Food Poison in AP) తిని 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన విశాఖ ఏజెన్సీలోని మాడుగుల మండలం గడుతురు పంచాయతీ పరిధిలోని మగతపాలెంలో (Magatapalem village) చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని స్థానికులు పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన ఆవు మాంసాన్ని తినటం వల్ల ఈ ఘటన జరిగినట్టు వైద్యులు గుర్తించారు.

Advertisement

Corona Medical Fee in AP: ఆరోగ్యశ్రీ ఉంటే కరోనా సేవలు ఉచితం, మందుల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది, ఏపీలో ప్రైవేట్ అస్పత్రులకు కోవిడ్-19 ఫీజులను నిర్ణయించిన ప్రభుత్వం

Hazarath Reddy

కోవిడ్‌-19 బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందుతుండగా ఇకపై ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ వైద్యానికి అనుమతించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోనూ ప్రభుత్వపరంగా కోవిడ్‌ బాధితులకు చికిత్స అందుతోంది. వైద్యం, మందుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుండటంతో ఇక్కడ కూడా రోగులకు ఉచితంగా సేవలందుతున్నాయి. డబ్బు చెల్లించి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్న వారికి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ( private hospitals) కరోనాకు చికిత్స పొందేందుకు వీలు కల్పిస్తూ వైద్యారోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు.

AP New Liquor Policy: మద్యం అక్రమంగా తరలిస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులు, 5 నుంచి 8 ఏళ్ళ వరకు జైలు శిక్ష, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఏపీలో మద్యం అక్రమ రవాణాపై (Liquor smuggling) రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను మరింత కఠినతరం చేసింది. ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేస్తే కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎవరైనా అక్రమంగా మద్యం సరఫరా చేస్తే నాన్‌ బెయిలబుల్‌ కేసులతో పాటు పదే పదే మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే (Liquor smugglers) ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించారు.

Vizag Gas Leak: విశాఖ సెంట్రల్‌ జైలుకు ఎల్జీ పాలిమర్స్‌ నిందితులు, 14 రోజుల రిమాండ్‌ విధించిన సెకండ్‌ అడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు

Hazarath Reddy

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన కేసులో అరెస్టు అయిన 12 మందిని విశాఖ పోలీసులు (Visakhapatnam police) బుధవారం సెకండ్‌ అడిషనల్‌ ఛీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు మందు హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 12 మందిని కోర్టు న్యాయమూర్తి ఎదుట హజరు పరచగా వీరికి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అనంతరం పోలీసులు నిందితులను విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించారు. కాగా స్టైరీన్‌ గ్యాస్‌ ప్రమాద ఘటనకు (LG Polymers gas leakage) సంబంధించి ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు సహా 12 మంది ప్రతినిధులను విశాఖ పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

YSR Rythu Dinotsavam: మాది రైతుల ప్రభుత్వం, గత ప్రభుత్వ బకాయిలను పూర్తిగా చెల్లిస్తున్నామని తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ ఏడాది ఆరు నీటి ప్రాజెక్టులు లైవులోకి..

Hazarath Reddy

దివంగత మ‌హానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతిని (YS Rajasekhara Reddy Birthday) వైఎస్సార్‌ రైతు దినోత్సవంగా (YSR Rythu Dinotsavam) నిర్వహిస్తోంది. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో (Tadepalli CM Office) నిర్వహించిన వైఎస్సార్‌ రైతు దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో (TDP Govt) వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను సీఎం విడుదల చేశారు. ఇప్పటికే వడ్డీలేని రుణాల కోసం 96.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కాగా టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు కింద చెల్లించాల్సి బకాయిల మొత్తం 1150 కోట్ల రూపాయలుగా ఉంది.

Advertisement
Advertisement