ఆంధ్ర ప్రదేశ్

Resolution Against CAA: విభజన రాజకీయాలు దేశానికి అవసరమా? సిఎఎపై కేంద్రం పున:సమీక్షించుకోవాలి, సిఎఎ వ్యతిరేక తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్

Vikas Manda

వందల సంవత్సరాలుగా విభిన్నమైన సంస్కృతి ఉన్న దేశంలో, మన వైఖరి ఏంటనేది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. విశ్వమానవ సౌభ్రాతృత్వం కోరుకునే దేశంలో ఇలాంటి చట్టాలు దేశ ప్రతిష్ఠను దిగజారుస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు దేశ రాజధానిలో పర్యటిస్తున్నప్పుడు జరిగిన అల్లర్లను సీఎం గుర్తుచేశారు.....

YS Jagan Comments on COVID-19: బ్లీచింగ్ పౌడర్‌తో కరోనాను తరిమేయండి, ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు, కరోనా మాటలను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (CoronaVirus) వ్యాధిపై ఏపీ సీఎం జగన్ (AP CM YS jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదని, అంతగా భయపడాల్సిన పని లేదన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నయమవుతుందన్నారు. కరోనాతో మనుషులు చనిపోతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కరోనాకి మందు(మెడికేషన్) పారాసిటమాల్ ట్యాబ్లెట్ అని చెప్పిన సీఎం జగన్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా వైరస్ చనిపోతుందన్నారు.

AP CS Sahni Letter To SEC: ఏపీలో కరోనా లేదు, ఎన్నికలను యథాతథంగా కొనసాగించండి, ఎన్నికల సంఘానికి లేఖ రాసిన ఏపీ సీఎస్ నీలం సాహ్ని, గవర్నర్‌తో భేటీ కానున్న ఎన్నికల కమిషనర్‌

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body polls) యథాతథంగా కొనసాగించాలని కోరతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి నీలం సాహ్ని ఎన్నికల సంఘానికి లేఖ ( AP CS Neelam Sahni Letter) రాశారు. కరోనా వైరస్‌ సాకుతో ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా వేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎస్ కోరారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

AP CM Meets Governor: ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, గవర్నర్‌ను కలిసిన ఏపీ సీఎం, ఎన్నికలు జరిపేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని విన్నపం, సీఎం వైయస్ జగన్‌పై చంద్రబాబు ఘాటు విమర్శలు

Hazarath Reddy

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా (Local Body Elections postponed) వేస్తున్నామని ఏపీ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ (SEC Ramesh Kumar) ప్రకటించిన నేపథ్యంలో ఇది రాజకీయ వేడిని రాజేస్తోంది. అధికార పార్టీ (YSRCP), ప్రతిపక్ష పార్టీల (TDP) మధ్య దీనిపై వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో (Biswabhushan Harichandan) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

Advertisement

AP Local Elections Postponed: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా, కరోనా వివరాలను వెల్లడించిన ఏపీ సర్కారు, కరోనా వైరస్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించిన కేంద్రం

Hazarath Reddy

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా (Local Body Elections Postponed) పడింది. కరోనా వైరస్‌ను (Coronovirus) కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను (AP Local Body Elections) వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (State Election Commission) నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు.

TTD Cancels Standing System: టీటీడీ సంచలన నిర్ణయం, భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి, టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతి, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి ధాటికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా చెక్ (TTD Cancels Standing System) పెట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus in India) వణికిస్తున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Singhl) వివరాలను వెల్లడించారు.

Krishnapatnam Node Tenders: ఏపీలో పుంజుకోనున్న పారిశ్రామిక రంగం, కృష్ణపట్నం నోడ్‌ పనులకు టెండర్లు, సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పనులు

Hazarath Reddy

ఏపీ పారిశ్రామిక విస్తరణలో భాగంగా బెంగళూరు–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (CBIC)లో భాగంగా ప్రతిపాదిత కృష్ణపట్నం నోడ్‌ (Krishnapatnam Node) పనులకు రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) శ్రీకారం చుట్టింది. సుమారు 13,882.9 ఎకరాల్లో ఉద్దేశించిన ఈ పారిశ్రామిక నోడ్‌లో రానున్న సెప్టెంబర్‌ నుంచి పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం (AP Govt) కార్యాచరణను సిద్ధంచేసింది. తొలిదశలో రూ.2,139 కోట్ల పెట్టుబడి అంచనాతో 3,090 ఎకరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

Bus Catches Fire: ఎండాకాలం ఏసీ బస్సు ప్రయాణాల్లో జాగ్రత్త, హైదరాబాద్ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు

Vikas Manda

ప్రైవేట్ ట్రావెల్స్ వారు ప్రయాణికుల భద్రత నియమాలు ఏవీ పాటించకుండా, ధనార్జనే ధ్యేయంగా బస్సులకు విశ్రాంతి లేకుండా ట్రిప్పులు నడపడం వల్లే ఈ లాంటి ప్రమాదాలకు కారణమవుతాయి. మార్గమధ్యంలో ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగినా, ఇబ్బందులు తలెత్తినా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎంతమాత్రం స్పందిచవు.....

Advertisement

Coronavirus In India: భారత్‌లో 75కు పెరిగిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, బెంగళూరు గూగుల్ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ

Vikas Manda

ఇప్పటివరకు, ఇండియాలో కరోనావైరస్ ద్వారా ఒక మరణం సంభవించింది. కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వ్యక్తి హైదరాబాదులో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు....

SSC 2020 Hall Ticket: పదో తరగతి హాల్ టికెట్లు అన్‌లైన్‌లో విడుదల, సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే విధానం ఇలా. మార్చి 19 నుంచి పరీక్షలు ప్రారంభం

Vikas Manda

మార్చి 19, 2020 నుంచి ప్రారంభం అవుతున్న పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 6, 2020 వరకు కొనసాగుతాయి. అన్ని పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అయి మధ్యాహ్నం 12:45 లోపు ముగుస్తాయి, ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి బోర్డ్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 08 వరకు జరగనున్నాయి.

YS Viveka Murder Case: ఏపీ పోలీసులపై అసంతృప్తి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన హైకోర్ట్, సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదించాలని సూచన

Vikas Manda

దీంతో వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేశారు, తమ పిటిషన్ లో 15 మంది నిందితుల పేర్లను పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్ట్, తాజాగా సీబీఐకి విచారణకు ఆదేశించింది.....

TDP vs YSRCP: మాచెర్లలో టీడీపీ నేతలపై దాడి, వైసీపీ కార్యకర్తలే అని టీడీపీ ఆరోపణ, ఘటనను తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, ఇదంతా టీడీపీ డ్రామా అని కొట్టిపారేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

Vikas Manda

టీడీపీ ఆరోపణలు వైసీపీ నేతలు తిప్పికొట్టారు. టీడీపీ నేతలే కావాలని రెచ్చగొట్టి, దాడులకు ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ దాడులు ఇదంతా టీడీపీ కుట్రగా అభివర్ణించారు.....

Advertisement

COVID 19 in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదు, వందల సంఖ్యలో ఆంధ్రా మరియు తెలంగాణ విద్యార్థులు ఇటలీలో నిర్బంధం

Vikas Manda

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు (COVID 19 Positive Case in AP) నమోదైంది. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరుకి (Nellore) చెందిన యువకుడికి కరోనావైరస్ సోకినట్లు రిపోర్టుల్లో తేలింది.....

Foreigners Not Allowed in Tirumala: తిరుమలను సందర్శించే విదేశీయులు, ప్రవాస భారతీయులపై టిటిడి ఆంక్షలు, నెల వరకు తిరుమలకు రావొద్దని సూచన

Vikas Manda

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే కరోనాప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 465 మంది ప్రయాణికులను పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు. వీరిలో 232 మందిని ఇప్పటికే గృహ నిర్భంధంలో ఉంచాము, 7 మంది మినహా మిగతా 226 మంది 'నిర్భంధ కాలాన్ని' పూర్తి చేసుకున్నట్లు వెళ్లడించారు.....

AP Politics: టీడీపీకి భారీ షాక్, వైసీపీలోకి వెల్లువలా చేరికలు, పులివెందులలో సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వైసీపీ తీర్థం

Hazarath Reddy

స్థానిక ఎన్నికలకు ముందే ఏపీలో టీడీపీకి (TDP) భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఏపీ రాజకీయ ముఖచిత్రం (AP Politics) ఇప్పుడు పూర్తిగా హాట్ హాట్ గా సాగుతోంది. ముఖ్యంగా వైసీపీ (YSRCP) కంచుకోట పులివెందులలో (Pulivendula) అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

Parimal Nathwani Meets AP CM: సీఎం జగన్‌తో పరిమల్‌ నత్వానీ, రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తానని వెల్లడి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్‌ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని (Parimal Nathwani Meets AP CM) కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిత్వం ఇచ్చినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Happy Holi 2020 Wishes: బుక్కాగులాల్ చల్లు.. ఖుషీలు వెదజల్లు, రంగులమయం అవ్వాలి మీ హోలీ వేడుకలు! హోలీ శుభాకాంక్షలు- Holi wishes, Messages, Quotes, Images, Status, Greetings, HD Wallpaper, Pics మరెన్నో హోలీ పండుగ విశిష్టతతో అందిస్తున్నాం, పండగ చేసుకోండి

Vikas Manda

ఉల్లాసభరితమైన హోలీ పండుగను జరుపుకోడానికి మీరు సిద్ధమేనా? మీకోసం, మీ స్నేహితులు మరియు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ హోలీ శుభాకాంక్షలను అందజేస్తున్నాం. ఇవి మీ ఆత్మీయులకు పంపించి వారికి పండగ శుభాకాంక్షలు తెలపండి, వేడుకను కలిసి జరుపుకునేందుకు వారిని ఆహ్వానించండి.....

Coronavirus Threat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు చోట్ల కరోనావైరస్ నిర్ధారణ కేంద్రాలు సహా దేశవ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం. పూర్తి జాబితా చూడండి

Vikas Manda

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో కరోనావైరస్ నిర్ధారణ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. రాష్ట్రాల వారిగా ఏయే నగరాలలో వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయో తెలిపే జాబితా....

Rajya Sabha Elections: ఏపీలో ఫలించిన అంబానీ వ్యూహం, ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఆ నలుగురు పేర్లు బయటకు వచ్చేశాయి, వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వర ప్రసాద్

Hazarath Reddy

దేశవ్యాప్తంగా వచ్చే ఏప్రిల్‌లో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు (Rajya Sabha election) జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగే రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాల్లోనే పడనున్నాయి. ఇక ఏపీలో (AP ) ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలను (AP Rajya Sabha) అధికార వైసీపీ కైవసం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వైసీపీ అధిష్టానం (YSRCP) ఖరారు చేసినట్లు సమాచారం.

Coronavirus Terrifies: తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు, దగ్గు ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని కోరిన టీటీడీ అధికారులు, లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని స్విమ్స్‌కు తరలించాలని ఆదేశాలు

Hazarath Reddy

దేశంలో రోజు రోజుకు పంజా విప్పుతున్న కరోనా వైరస్ (Coronavirus Terrifies) ధాటికి రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తిరుమలలోని శ్రీవారి దర్శనంపై (Lord Venkateswara Swamy temple) ఆంక్షలు విధించారు.కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు తిరుమలలోని శ్రీవారి దర్శనానికి (Tirumala Temple) రావద్దని టీటీడీ (TTD Management) సలహా ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారి సిబ్బందిని ఆదేశించారు.

Advertisement
Advertisement