ఆంధ్ర ప్రదేశ్
Tirupati Laddu Free: ఇకపై తిరుపతి లడ్డు అందరికీ ఉచితం, జనవరి 6 నుంచి ఉచిత లడ్డు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న టీటీడీ, రోజుకు 80 వేల లడ్డులను భక్తులకు అందించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం
Hazarath Reddyతిరుపతి లడ్డులంటే(Tirupati Laddu) చాలామందికి ఎంతో ఇష్టం. తిరుపతికి వెళ్లలేని వారు ఎలాగోలా వాటిని తెప్పించుకుని ఆ ఏడుకొండల వాడు కరుణ కటాక్షం పొందుతుంటారు. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)(Tirumala Tirupati Devasthanam) నూతన సంవత్సరానికిగానూ తీపి కబురు అందించింది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు (TTD Laddu Free) అందించనున్నట్లు టీటీడీ మంగళవారం ప్రకటించింది.
AP Capital Issue-HC Comments: రాజధానిపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రభుత్వ నిర్ణయం రాకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేం, ప్రభుత్వ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాతే పిటిషన్‌పై స్పందిస్తాం, జనవరి 21లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు
Hazarath Reddyఏపీ రాజధానిపై (AP Capital)వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు (Andhra Pradesh High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధాని విషయంలో ప్రభుత్వం (AP GOVT) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఈ పిటిషన్ అపరిపక్వమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Telugu Doctors Missing In Delhi: ఢిల్లీలో మిస్సింగ్ కలకలం, ఇద్దరు తెలుగు వైద్యులు అదృశ్యం, 6 రోజులైనా దొరకని ఆచూకి, పోలీసులకు కంప్లయింట్ చేసిన సమీప బంధువు, కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇంకా క్లూ కూడా చిక్కని వైనం
Hazarath Reddyఢిల్లీలో ఇద్దరు తెలుగు వైద్యుల అదృశ్యం(Telugu Doctors Missing) కలకలం రేపుతోంది. వైఎస్సార్‌ జిల్లా (YSR Kadapa) ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్‌ హిమబిందు, ఆమె స్నేహితుడు, అనంతపురం జిల్లా (Ananthapuram) హిందూపురానికి చెందిన డాక్టర్‌ దిలీప్‌ సత్య డిసెంబర్‌ 25 నుంచి కనిపించకుండా పోయారు. హిమబిందు భర్త డాక్టర్‌ శ్రీధర్‌ అదేరోజు ఢిల్లీలోని హాజ్‌కాస్‌ పోలీస్‌స్టేషన్‌లో (Hauz Khas police station) ఫిర్యాదు చేశాడు.
Niti Aayog's Index-2019: సుస్థిర అభివృద్ధిలో సత్తా చాటిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు, తొలి స్థానంలో కేరళ, చివరి స్థానంలో బిహార్. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనలో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం
Vikas Mandaనేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ (NITI Ayog) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలు భారతదేశంలోనే 3వ స్థానంలో నిలిచాయి. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కినెట్టి తెలంగాణ....
AP Entrance Exam Shedule: ఏపీ ప్రవేశ పరీక్షలు-2020 షెడ్యూల్‌ విడుదల, ఐసెట్‌ను ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో..,లాసెట్‌ను మే 8, ఎడ్‌సెట్‌ 9, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
Hazarath Reddyఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్‌) (APCETs-2020common entrance test) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌(Educational minister Adimulapu Suresh) సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి 24 వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ ప్రవేశపరీక్షలను(AP EAMCET-2020) నిర్వహించనున్నారు. ఐసెట్‌ను(AP ICET-2020) ఏప్రిల్‌ 27, ఈసెట్‌ ఏప్రిల్‌ 30న, పీజీ ఈసెట్‌ మే 2,3,4, తేదీల్లో నిర్వహిస్తారు.
AP Political Row: అమరావతి పేరు వైయస్సార్ నగరంగా పెట్టుకోమన్న టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, ఏపీ సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు, చంద్రబాబు 5 ఏళ్లలో ఏం చేసారంటూ విమర్శలు
Hazarath Reddyతెలుగుదేశంపార్టీ(TDP) ఏపీ రాజధాని మార్పు (AP Capital Change) అంశం మీద అధికార పార్టీపై (YSRCP)నివురు గప్పిన నిప్పులా మండిపడుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఇవేమి పట్టని టీడీపీ ఎమ్మెల్యే (Guntur West TDP MLA)నేరుగా ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) మీద పొగడ్తల వర్షం కురిపించారు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కలయిక తరువాత ఎమ్మెల్యే గిరి (Maddali Giridhara Rao) సీఎంజగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
Sand Door Delivery In AP: ఇకపై ఇసుక నేరుగా మీ ఇంటికే, ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం, జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు, జనవరి 20 నాటికి అన్ని జిల్లాలకు డోర్‌ డెలివరీ
Hazarath Reddyఇసుకను సామాన్యలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం (AP GOVT) మరో ముందడుగు వేసింది. ఇక నుంచి ఏపీలో ఇసుక డోర్‌ డెలివరీ (Sand Door Delivery In AP) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 2న కృష్ణా జిల్లాలో (Krishna District) పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు జరపనుంది. జనవరి 7న తూర్పుగోదావరి, (East Godavari) వైఎస్సార్‌ కడప (YSR Kadapa) జిల్లాల్లో డోర్‌ డెలివరీ చేయనున్నారు.
Indian Navy Bans Smartphones: సంచలన నిర్ణయం తీసుకున్న ఇండియన్ నేవీ, స్మార్ట్‌ఫోన్లు, ఫేస్‌బుక్‌పై నిషేధం, నేవీ స్థావరాల్లో సోషల్ మీడియాను ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ చేసిన నేవీ ఉన్నతాధికారులు
Hazarath Reddyభారత నౌకాదళం (Indian Navy) తన సిబ్బందికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేవి సిబ్బంది ఇకపై సోషల్‌ మాధ్యమాలు (Social Media Apps) అయిన ఫేస్‌బుక్‌,(Facebook) ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లు (WhatsApp) వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.
Visakha Utsav 2019-Highlights: ముగిసిన విశాఖ ఉత్సవ్, మరోసారి సత్తా చాటిన ఏపీ సీఎం, ఎక్కడా వ్యతిరేకత కానరాని వైనం, పూల వర్షం ద్వారా ప్రతిపక్షాలకు ఝలక్, ఈ విశాఖ ఉత్సవ్ సీఎం వైయస్ జగన్‌కు ప్లస్సా..మైనస్సా.?
Hazarath Reddyఅశేష జనసందోహం హర్షాతిరేకాల మధ్య విశేష కార్యక్రమాల మేళవింపుతో విశాఖ ఉత్సవ్‌ (Visakha Utsav 2019)ఘనంగా ముగిసింది. ప్రముఖ సినీనటుడు వెంకటేష్‌(Daggubati Venkatesh), సినీ నేపధ్య గాయకులు గీతామాధురి, సింహా, ఆదిత్య , వెంకీ మామ డైరెక్టర్‌ బాబీ, సినీ సంగీత దర్శకుడు థమన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమ (Anchor Sma) వ్యాఖ్యాతగా రక్తి కట్టించారు. విశాఖ వాసులు అశేషంగా తరలిరావడంతో బీచ్‌ రోడ్‌ కిక్కిరిసిపోయింది.
AP Capital Shifting Row: ఏపీ రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం, బుగ్గన నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైవపర్ కమిటీ, ఫిబ్రవరి 1న కీలక ప్రకటన వచ్చే అవకాశం, ఇన్‌సైడర్ ట్రైడింగ్‌పై కొనసాగుతోన్న వార్
Hazarath Reddyఏపీలో (AP) మూడు రాజధానుల అంశంపై ( 3 Capital Issue) ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.మొత్తం 16 మంది సభ్యులతో రాజధానిపై హైపవర్ కమిటీని (High Power Committee) ఏర్పాటు చేసింది. పేర్నినాని, మోపిదేవి వెంకట రమణ, మేకపాటి సుచరిత, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, డీజీజీ గౌతమ్ సవాంగ్,బుగ్గన, పేర్ని నాని, కొడాలినాని, అజయ్ కల్లం, గౌతమ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.
TTD plans Temple In Jammu: జమ్మూలో పూజలు అందుకోనున్న వెంకటేశ్వరుడు, ముంబై, వారణాసిలో కొలువుతీరనున్న తిరుమల శ్రీనివాసుడు, కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ పాలక మండలి, స్థల కేటాయింపుపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్న టీటీడీ ట్రస్ట్ బోర్డ్
Hazarath Reddyతిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (TTD chairman YV Subba Reddy) అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పాలక మండలి (TTD trust board) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని(Lord Venkateswara Temple) జమ్ముకశ్మీర్‌లో(Jammu) నిర్మించేందుకు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.
Bomb Blast At Tirupati: తిరుపతిలో బాంబు పేలుడు, ఉలిక్కిపడ్డ ఆధ్యాత్మిక క్షేత్రం, ప్రసూతి ఆస్పత్రి వద్ద ఒక్కసారిగా పేలిన బాంబు, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు
Hazarath Reddyప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి (Tirupati) బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి వద్ద పెద్ద శబ్దంతో ఒక్కసారిగా బాంబు పేలుడు (Bomb blast at Tirupati government hospital) జరిగింది. కాగా నాటుబాంబులు పెట్టి ఉన్న కవర్ కుక్కలు (Dogs)లాక్కెళ్లడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.
Visakha Utsav 2019: రాళ్లు పడిన చోటే పూల వర్షం, విశాఖలో ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఘన స్వాగతం, ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా, రాజధానిపై ఆచితూచి అడుగులు, విశాఖ ఉత్సవ్ 2019పై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Andhra Pradesh Chief Minister YS Jagan) బాధ్యతలు స్వీకరించిన తరువాత శనివారం తొలిసారిగా విశాఖపట్టణంకు(Visakhapatnam) వెళ్లారు. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో విశాఖలో రెండుసార్లు ఆయనకు చేదు అనుభవం ఎదురుకాగా.. ఈసారి విశాఖవాసులు పూలజల్లులతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. 24 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రికి (Chief Minister)సాదరస్వాగతం పలికారు.
AP Cabinet Meet Highlights: అమరావతిపై సస్పెన్స్ కొనసాగింపు, ఇప్పుడు రాజధాని నిర్మాణం చేస్తే, వేరే నగరాలతో ఎన్నటికి పోటీపడగలమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్య, చంద్రబాబు హయాంలోని అవినీతిపై విచారణ, కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు
Vikas Mandaగత ప్రభుత్వం ఊహిజనిత రాజధాని నిర్మాణంపై భ్రమింపజేసింది. రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించి, మరో 21 వేల ప్రభుత్వ భూములను కలిపి 54 వేల ఎకరాలలో రాజధాని నిర్మాణం కోసం 1లక్షా పదివేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా వేసింది. కానీ గడిచిన ఐదేళ్లలో కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ...
AP Cabinet Meet: నేడు అమరావతి భవితవ్యం తేలిపోనుందా? కొనసాగుతున్న ఏపీ మంత్రివర్గ సమావేశం, అమరావతి ప్రాంతంలో ఉధృతమైన ఆందోళనలు, జీఎన్ రావు కమిటీపై చర్చించనున్న కేబినేట్, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై కూడా చర్చ
Vikas Mandaవెలగపూడిలో రోడ్డుకు అడ్డంగా మహిళలు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి, ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు, ఆ సమయంలో వచ్చిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో సీఐ, ఎస్సైలకు గాయాలయ్యాయి....
Amaravathi Protests: 'మా బతుకులకే గ్రహణం పట్టింది'! అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న నిరసనలు, మందడం వద్ద ఉద్రిక్తత, టీడీపి నేతల హౌజ్ అరెస్ట్, రేపటి ఏపీ కేబినేట్ భేటీపై ఉత్కంఠత
Vikas Mandaడిసెంబర్ 27న సీఎం జగన్ అధ్యక్షతన కేబినేట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అమలు, రాజధాని అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమరావతిపై ఏం తేలుస్తారు? అంతకుముందు చెప్పినట్లుగా మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉంటారా?...
AP Cabinet Meeting: 3 రోజుల్లో తేలిపోనున్న ఏపీ రాజధాని భవిష్యత్తు, ఈ నెల 27న విశాఖలో క్యాబినెట్ మీటింగ్, స్వాగతించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా, చంద్రబాబుకి సవాల్ విసిరిన స్పీకర్ తమ్మినేని, అమరావతిలో కొనసాగుతున్న నిరసనలు
Hazarath Reddyమరో మూడు రోజుల్లో ఏపీ రాజధాని భవిష్యత్తు తేలిపోనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Ap Cabinet Meeting) డిసెంబర్ 27న విశాఖలో జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో ఏపీ రాజధాని అంశంపై ఓ స్పష్టత రానుంది. విశాఖలో(Visakhapatnam) కేబినెట్ భేటీకి సంబంధించిన ఏర్పాట్లు చేయమని ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈ కేబినెట్ భేటీలోనే ఏపీ రాజధానిపై సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు.
NRC-AP CM YS Jagan: ఎన్‌ఆర్సీపై బీజేపీకి ఏపీ సీఎం షాక్, రాష్ట్రంలో ఎన్‌ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదు, మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన సీఎం వైయస్ జగన్, కడపలో నీటిపారుదల ప్రాజెక్టులకు, ఉక్కు పరిశ్రమకు శంకు స్థాపన
Hazarath Reddyదేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్రబిందువైన జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్సీ) అమలుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఎన్‌ఆర్సీకి (National Register of Citizens)వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ ప్రకటించారు.
AP Capital Political Row: తెరపైకి రాజధానిగా తిరుపతిని తీసుకువచ్చిన చింతా మోహన్, మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటున్న అమరావతి రైతులు, ఆడపడుచులు రోడ్డెక్కారంటున్న చంద్రబాబు, కొనసాగుతున్న రైతుల ధర్నాలు, ప్రకంపనలు రేపుతున్న ఏపీ రాజధాని అంశం
Hazarath Reddyఏపీ రాజధాని అంశం (AP Capital Row)ఆంధ్రప్రదేశ్ రాజీకీయాల్లో పెను ప్రకంపనలే రేపుతోంది. మూడు రాజధానుల అంశం ( 3 Capitals) తెరపైకి రావడంతో అది రాజకీయ రంగును పులుముకుంది. అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan)మూడు రాజధానులు ఉండొచ్చని చెప్పడం, జీఎన్ రావు కమిటీ (GN Rao Committee) తన నివేదికను సమర్పించడం, వారు రాజధాని గురించి మీడియాతో మాట్లాడటం వంటివి వేగంగా జరిగిపోవడంతో ఏపీ రాజధాని అంశం (AP Capital) ఇప్పుడు కీలక మలుపు తిరుగుతోంది.
AP Capital Suspense: ఏపీ రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్స్, ఇంకా తేలని ప్రభుత్వ నిర్ణయం, ఎవరివాదనలు వారివే, తెరపైకి 25 జిల్లాలను తీసుకువచ్చిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి, ఈ నెల 27న క్యాబినెట్ మీటింగ్‌లో సస్పెన్స్ కి తెరపడే అవకాశం
Hazarath Reddyఅసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ (CM YS Jagan) మూడు రాజధానులు (3 Capitals) అంశం తెరపైకి తెచ్చినప్పటి నుంచి ఏపీలో రాజకీయ సమీకరణాలు( AP POlitics) పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్ష పార్టీలోని కొందరు నేతలు దీన్ని సమర్ధిస్తున్నారు. అలాగే కొన్ని జిల్లాలు ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అమరావతి పరిసర ప్రాంతాల ప్రజలు ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.