తెలంగాణ
Hyderabadi Biryani: ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని దక్కించుకున్న హైదరాబాద్ బిర్యానీ, టాప్ 10 రైస్ డిషెస్‌లో చోటు, అగ్రస్థానంలో జపనీస్ వంటకాలు
తెలంగాణசெய்திகள்
Electric Car Fire Video: వీడియో ఇదిగో, ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు, అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైన కారు
Team Latestlyహైదరాబాద్ లోని నారాయణగూడ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కలకలం సృష్టించాయి. ఈ అగ్నిప్రమాదంలో కారు పూర్తిగా కాలి బూడిదైంది. మంటల తీవ్రతకు సమీపంలో పార్క్ చేసి ఉన్న మరో కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.
Jubilee Hills Bypoll Result: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం, మాగంటి సునీతపై భారీ మెజార్టీతో విజయం సాధించిన నవీన్ యాదవ్, బీజేపీకి డిపాజిట్ గల్లంతు
Team Latestlyతెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రారంభం నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,658 ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.
Telangana Weather: తెలంగాణలో 8.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు, రాష్ట్రంలోని 29 జిల్లాల్లో పెరిగిన చలి తీవ్రత, రానున్న మూడు రోజుల్లో మరింత పెరగనున్న చలి
Team Latestlyరాష్ట్రంలో చలి మరింత తీవ్రమైంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అడవులు, కొండలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణలో చలిగాలులు విరుచుకుపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొండప్రాంతాలు మంచు ముసురుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.
Sangareddy Shocker: సంగారెడ్డిలో దారుణం, భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త, వివాహేతర సంబంధం అనుమానమే పెనుభూతంగా మారింది
Team Latestlyఅనుమానం ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపితమైంది. వివాహ బంధం నమ్మకంపై నిలబడే కాపురంలో, అనుమానం చిచ్చు పెట్టింది. భార్యపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త తన జీవిత భాగస్వామినే కిరాతకంగా హతమార్చిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎస్ఆర్ నగర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Telangana Weather Update: గజగజ వణుకుతున్న హైదరాబాద్, తెలంగాణలో పెరగనున్న చలి తీవ్రత, వచ్చే మూడు రోజుల పాటు మరింతగా తగ్గనున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
Team Latestlyతెలంగాణ రాష్ట్రం మొత్తం మీద చలి తీవ్రత పెరుగుతోంది. సాధారణంగా డిసెంబర్ మొదటి వారంలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తుండగా, ఈసారి నవంబర్ రెండో వారం నుంచే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం ప్రజలను వణికిస్తోంది.
Hyderabad Stabbing Incident: వీడియో ఇదిగో, జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య , 10 నిమిషాలు వెంటాడి దాడి చేసిన ప్రత్యర్థి, శాంతిభద్రతలపై నగరవాసుల ఆందోళన
Team Latestlyమేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో బుధవారం సాయంత్రం రౌడీషీటర్ హత్య జరిగిన ఘటన కలకలం రేపింది. పట్టపగలు, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ దారుణం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
Nalgonda Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సును వెనుక నుండి ఢీకొట్టిన లారీ, బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ప్రమాదం
Team Latestlyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద సోమవారం శ్రీ విద్యాపీట్ బస్సును లారీ వెనుక నుండి ఢీకొనడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు యు టర్న్ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.
Telangana Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి, దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు, 23 జిల్లాలకు యెల్లో అలర్ట్, మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
Team Latestlyతెలంగాణలో వర్షాలకు తెరపడగా.. ఇప్పుడు చలి దాడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండగా.. రాబోయే రోజుల్లో మరింత చలి తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Karnataka Road Accident: దైవ దర్శనానికి వెళ్ళి తిరిగిరాని లోకాలకు, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, దైవ యాత్రకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన నలుగురు తెలంగాణ వాసులు మృతి
Team Latestlyకర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్ వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో తెలంగాణ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Road Accident in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టిన టిప్పర్..ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Team Latestlyనాగర్‌కర్నూల్ జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలం చెన్నారం స్టేజ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట నుండి హైదరాబాద్ దిశగా వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన దెబ్బకు కారు రోడ్డుపై బోల్తాపడి పూర్తిగా ధ్వంసమైంది.
Chevella Bus Accident: టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే బస్సు ప్రమాదం, చేవెళ్ల బస్సు ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి, 20 మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
Team Latestlyరంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం పీర్జాగూడ ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బస్సు మీద బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Cyclone Montha Update: తీరం దాటిన మొంథా తుఫాను, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల పాటు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం
Team Latestlyబంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుపాను ‘మొంథా’ (Montha Cyclone) మంగళవారం అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. వాతావరణశాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, మచిలీపట్నం–కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా ఉన్న నరసాపురం వద్ద తుపాను తీరం దాటింది.
Narrow Escape in Hyderabad: గుండెలు ఝలదరించే వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ జారిపడిన ప్రయాణికుడు, వెంటనే ముందుకు దూకి కాపాడిన తోటి ప్రయాణికులు
Team Latestlyహైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తూ జారిపడిన ఒక వ్యక్తి ఘోర ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు. అక్టోబర్ 26న జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది, వరంగల్‌కు చెందిన 31 ఏళ్ల మణిదీప్గా గుర్తించబడిన ఈ ప్రయాణికుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలు కింద పడిపోతున్నట్లు చూపబడింది.
Karimnagar Road Accident: వీడియో ఇదిగో.. కరీంనగర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొట్టుకున్న రెండు బైక్‌లు, ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
Team Latestlyకరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రాంతంలో కలకలం రేపింది. రహదారిని దాటుతున్న సమయంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది.
Telangana Shocker: వీడియో ఇదిగో.. పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు, టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఘటన
Team Latestlyరంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు పెళ్లి చేయాలని ఒత్తిడి చేస్తూ ఒక యువకుడు హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి దూకాడు. స్థానికులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించినా, అతడు వినిపించుకోకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మరియు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
Kurnool Bus Fire Video: మంటల్లో కాలిపోతున్న కావేరి ట్రావెల్స్ బస్సు వీడియో ఇదిగో, అందరూ చూస్తుండగా క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైన ప్రైవేట్ బస్సు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన
Team Latestlyకర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైన సంగతి విదితమే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా సుమారు 300 మీటర్ల దూరం బైను అలాగే తీసుకెళ్లాడు. దీంతో మంటలు చెలరేగి బస్సు ముందు భాగంలో అంటుకున్నాయి.
Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం
Team Latestlyకర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
IMD Alert: వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు, అనేక రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు హై అలర్ట్
Team Latestlyబంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈ రోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే వారంలో దక్షిణ, తూర్పు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తృతమైన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వివరణాత్మక హెచ్చరిక జారీ చేసింది.
SC Verdict on BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు, హైకోర్టులో విచారణ సాగుతున్నందున పిటిషన్‌ను స్వీకరించబోమని స్పష్టం
Team Latestlyతెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించిన అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Hyderabad: వీడియో ఇదిగో, తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని చెప్పినందుకు దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి, కేసు నమోదు చేసిన పోలీసులు
Team Latestlyకూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 5లోని ఒక నివాస ప్రాంతంలో తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దని కోరిన దంపతులపై 30 మంది హాస్టల్ యువకులు దాడి చేశారు. దాడికి ముందు దంపతులు హాస్టల్ విద్యార్థులను మా ఇంటి ముందు బైక్ పార్క్ చేయొద్దని అడిగారు. అయితే వారిలో కొంతమంది స్పందించకపోవడంతో తలెత్తిన విరోధం దాడి రూపానికి చేరింది