తెలంగాణ

Telangana Assembly: త్వరలో కొత్త అసెంబ్లీ భవనం, రూ.49 కోట్లతో నిర్మిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి, మండలి భవన రిపేర్లపై సమీక్ష సందర్భంగా వెల్లడి

Arun Charagonda

రాష్ట్రంలో త్వరలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మించనున్నట్లు వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రూ.49 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. మండలి భవన రిపేర్లపై సమీక్ష సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ కౌన్సిల్ కు ఒకే దగ్గర భవనాలు ఉంటాయని తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి.. మండలి భవన రిపేర్లపై సమీక్ష నిర్వహించారు.

Telangana AEOs Protest: 160 మంది ఏఈవోలను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, నిరసనగా ఇవాళ అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చిన ఏఈవోలు

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం 160 మంది ఏఈవోలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ఆందోళనకు పిలుపునిచ్చారు ఏఈవో లు. సస్పెండ్ చేసిన 160 మంది ఏఈవో లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2600 మంది ఏఈవో కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు తరలి రావాలన్న ఏఈవో ల సంఘం నేతలు కోరారు.

Cyclone Dana: రేపు తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఉత్తరాంద్రకు హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అక్టోబర్ 23 నాటికి తుఫాన్‌గా బలపడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

KTR on Ganga Reddy Murder Case: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణలో శాంతిభద్రతలు లేవని గత కొన్ని నెలలుగా అందరూ చెబుతున్న మాటనే ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అంటున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. జగిత్యాలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

Advertisement

Ganga Reddy Murder Case: నీకో దండం నీ పార్టీకో దండం, కాంగ్రెస్ పార్టీపై మండిపడిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తలకే భరోసా లేదని ఆవేదన

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

Jagtial: కాంగ్రెస్ నేతను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి రీల్, పోలీసుల తీరును తప్పుబట్టిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరున్ని హత్యచేసిన నిందితుడు సంతోష్ లొంగిపోతూ రీల్ చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు పోలీసుల తీరును తప్పుబట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Ranga Reddy District: ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ

Arun Charagonda

రంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసింది ఏసీబీ. రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి. రూ.5 కోట్ల 5లక్షల 71వేల 676రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తించగా రూ.4 కోట్ల 19లక్షల 40వేల 158 రూపాయల విలువైన అనుమానిత ఆస్తుల గుర్తించారు.

Jaggareddy: సీఎం రేవంత్ ఏం మాట్లాడినా బావ బామ్మర్దులు వక్రీకరిస్తున్నారు..కేటీఆర్ ఓ బచ్చా అని మండిపడ్డ జగ్గారెడ్డి, ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని హితవు

Arun Charagonda

కేటీఆర్ బచ్చాలా వ్యవహరిస్తుండు అని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆరే అయినా నడిపించింది మాత్రం కేటీఆరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏం మాట్లాడినా బావ బామ్మర్దులు వక్రీకరిస్తున్నారు...మీ కథలు అట్లున్నాయ్ కాబట్టే సీఎం రేవంత్ మిమ్మల్ని తిడుతున్నాడు అని దుయ్యబట్టారు.

Advertisement

Telangana Shocker: దారుణం, మైనర్ బాలికల ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు పెట్టి టీచర్ పైశాచికానందం, HMకు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థినులు

Hazarath Reddy

మైనర్ బాలికల ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తున్న కీచక టీచర్.విషయం స్కూల్ HM కు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్నా విద్యార్థులు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డా స్కూల్ HM.సిరిసిల్ల పట్టణం గీతా నగర్ లోని ఓ ప్రభుత్వ హై స్కూల్ లో ఓ కీచక టీచర్ బాగోతం.

Mahesh Kumar Goud: హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు, గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Arun Charagonda

హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Students Request TGSRTC Bus Services: టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు విద్యార్థుల లేఖ, షాద్‌నగర్‌ రూట్‌లో బస్సు సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన...వీడియో ఇదిగో

Arun Charagonda

షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు. షాద్ నగర్ - ఆమన్ గల్ రూట్లో గతంలో 10 బస్సులు నడిస్తే ఇప్పుడు 4 బస్సులే నడుపుతున్నారు అన్నారు. బస్సుల సంఖ్యను పెంచాలి అంటూ సజ్జనార్‌కు లేఖ రాశారు విద్యార్థులు.

Talasani Srinivas yadav: త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం...మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు..వెల్లడించిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Arun Charagonda

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం, మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తామని వెల్లడించారు.

Advertisement

Hyderabad: కుక్కను తరుముతూ 3వ అంతస్తు నుండి పడి యువకుడు మృతి, మృతుడిని తెనాలికి చెందిన ఉదయ్‌గా గుర్తించిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో కుక్కల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో హోటల్ మూడో అంతస్తు నుంచి పడి 23 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని తెనాలికి చెందిన ఉదయ్‌గా గుర్తించారు. అతడు రామచంద్రపురంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఉదయ్‌ స్నేహితులతో కలిసి చందానగర్‌లోని వీవీ ప్రైడ్‌ హోటల్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Dharani Portal: ధరణి నిర్వహణ ఎన్‌ఐసీకి, మూడు సంవత్సరాల పాటు భూ రికార్డుల నిర్వహణ బాధ్యత చూడనున్న ఎన్‌ఐసీ, కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Arun Charagonda

భూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సెంటర్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూడనుంది ఎన్ఐసీ. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకురావడానికి మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

Congress MLA Anirudh Reddy On AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్, తిరుమలలో ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తిరస్కరించడంపై ఆగ్రహం

Arun Charagonda

ఏపీ సీఎం చంద్రబాబు పై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో యాక్సెప్ట్ చేయడం లేదని.. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయన్నారు.

Youtuber Harsha Sai: బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ హర్ష సాయి.. నేడే విచారణ.. ఏమవుతుందో??

Rudra

తనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Jeevan Reddy Follower Killed: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి దారుణ హత్య.. పోలీసులపై మండిపడ్డ కాంగ్రెస్ నేత

Rudra

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

Jagtial: స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్‌లో పురుగుల మందు తాగిన యువకుడు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన స్నేహితులు..వీడియో ఇదిగో

Arun Charagonda

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో గ్రూప్ వీడియో కాల్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి.

Gangula Kamalakar: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట విషాదం, గంగుల కమలాకర్ తల్లి కన్నుమూత, సంతాపం తెలిపిన కేసీఆర్

Arun Charagonda

కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట విషాదం నెలకొంది. గంగుల కమలాకర్ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.

Hyderabad Horror: వెంట‌ప‌డిన కుక్క.. భయపడి పరిగెత్తుతూ హోటల్ భవనం నుంచి కిందప‌డి యువ‌కుడి మృత్యువాత‌.. హైదరాబాద్ లో దారుణం

Rudra

హైద‌రాబాద్‌ లోని చందాన‌గ‌ర్ లో ఘోరం జరిగింది. ఓ కుక్క నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తెనాలికి చెందిన ఉద‌య్ (23) అనే యువ‌కుడు ఆర్‌సీ పురంలోని అశోక్‌ న‌గ‌ర్‌ లో నివాసం ఉంటున్నాడు.

Advertisement
Advertisement