తెలంగాణ
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణనాథుడి దర్శనానికి ఇదే చివరి రోజు..నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, భారీగా తరలివచ్చిన భక్తులు
Arun Charagondaవినాయక నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17న మంగళవారం గణేశ్ నిమజ్జనం జరగనుండగా పోలీసు బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఇక ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు ఇవాళే చివరి రోజు.
Road Accident At Rayadurgam: హైదరాబాద్ రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్‌ను తప్పించబోయి కారును ఢీ కొట్టిన ఆటో, మహిళ మృతి...వీడియో
Arun Charagondaహైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి పక్కనే ఉన్న కార్ కు ఢీకొట్టింది ఆటో. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దృశ్యాలు.
Warangal: వరంగల్‌లో రెచ్చిపోతున్న రౌడీలు, ఓ వ్యక్తిని చితకబాదిన వైనం, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు..వీడియో
Arun Charagondaవరంగల్ నగరంలో రెచ్చిపోయారు రౌడీలు. బీఆర్ నగర్‌లో కూలీ పనులు చేసుకొని వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తిపైవ్యక్తిపై ఉమ్మేశారు మల్లికార్జున్. ఇదేంటి అని ప్రశ్నించగా స్నేహితునితో కలిసి చితకబాదారు మల్లికార్జున్. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతుండగా దాడికి పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Minister Ponnam Prabhakar: గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి, ఫేక్ న్యూస్‌ని నమ్మోద్దు..అందరం కలిసి గణేశ్ నిమజ్జనం విజయవంతం చేద్దామని పిలుపు
Arun Charagonda17వ తేదీ మంగళవారం హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు. నిమజ్జనంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Ganesh Immersion At Tank Bund: ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసుల ఫ్లెక్సీలు, భారీ కేడ్ల ఏర్పాటు..వాటిని తొలగించిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు..టెన్షన్ వాతావరణం
Arun Charagondaట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జానానికి సంబంధించిన టెన్షన్ కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలను, బారీ కేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో అక్కడికి చేరుకున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు...ఫ్లెక్సీలు, బారీకేడ్లను తొలగించారు.
Water in Petrol: పెట్రోల్ లో నీళ్లు పోసి విక్రయం.. రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకులో మోసం (వీడియో)
Rudraరంగారెడ్డి జిల్లా హస్తినాపురంలోని హెచ్ పీ పెట్రోల్ బంకు నిర్వాహకులు మోసానికి తెగబడ్డారు. పెట్రోల్ లో నీళ్లు కలిపి విక్రయాలు చేస్తున్నారు.
CM Revanth Reddy: మతం ఏదైనా విద్వేషం వదిలి శాంతియుతంగా జీవించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి అని వెల్లడి
Arun Charagondaశాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే ముహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రవక్త బోధనలైనా, భగవద్గీత, బైబిల్ సారాంశాలైనా మనకు చెప్పేది మంచి విషయాలే అని, విద్వేషాలు వదిలి శాంతియుతంగా జీవించడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
Khairatabad Big Ganesh Darshan: ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు.. రేపు గంగమ్మ ఒడికి చేరనున్న భారీ గణపయ్య
Rudraఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి నేడే ఆఖరి రోజు అని అధికారులు తెలిపారు. మంగళవారం ఈ భారీ గణనాథుడిని నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు.
Students Crying Over Teacher Transfer: టీచర్ ట్రాన్స్‌ఫర్..విద్యార్థుల కంటతడి, మమ్మల్ని వదిలి వెళ్లకండని వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు..వీడియో
Arun Charagondaమహబూబ్ నగర్ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పన్నెండు ఏళ్లుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. దీంతో తమను వదిలి వెళ్లకండి టీచర్.. ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Telangana High Court: బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా, తెలంగాణ పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం
Arun Charagondaతెలంగాణ పోలీసుల తీరుపై విస్మయం వ్యక్తం చేసింది హైకోర్టు. బండి నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసా? అని ప్రశ్నించింది. నంబర్ ప్లేట్ లేకుండా బండి నడిపిన వ్యక్తి పై చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.
Rain Update in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వానలు.. వచ్చే వారం రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.
Hyderabad Shocker:రాంనగర్‌లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య, అక్కడిక్కడే మృతి
Arun Charagondaహైదరాబాద్ - రాంనగర్‌లో విషాదం నెలకొంది. గిరి శిఖర అపార్ట్‌మెంట్స్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది సనా బేగం(23) అనే మహిళ. దీంతో అక్కడికక్కడే మృతి చెందగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Ranganath On Hydra: హైడ్రా చట్ట వ్యతిరేకంగా పనిచేయడం లేదు..కూల్చివేతలు ఆపమన్న రంగనాథ్.. హైడ్రా చట్టబద్దతపై ప్రభుత్వమే స్పందిస్తుందని కామెంట్
Arun Charagondaహైడ్రా చట్ట వ్యతిరేక పని చెయ్యడం లేదు అని తెలిపారు రంగనాథ్. జూలై 19న జీఓ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్టబద్ధత ఉందా? లేదా? అని ఈ రోజు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
CID Notices To Somesh Kumar: రూ.1400 కోట్ల కుంభకోణం..మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసుల నోటీసులు
Arun Charagondaమాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వాణిజ్య పన్నుల శాఖ కుంభోకోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు రూ. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించారు సీఐడీ అధికారులు. సోమేశ్ కుమార్‌తో పాటు వాణిజ్య పన్నలు శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ శివరాం, ప్రసాద్‌లకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.
Ganja Seize In Hyderabad: 170 కేజీల గంజాయిని సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట వద్ద పట్టుకున్న పోలీసులు..వీడియో
Arun Charagondaముందు ఎస్కార్ట్ వెహికిల్.. వెనుక గంజాయి బండి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ట్రాలీ ఆటోలో 170 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
KTR Vs Revanth Reddy: కేటీఆర్ వర్సెస్ రేవంత్..నాడు రాళ్లతో కొట్టి చంపండని..ఇప్పుడు చేస్తుంది ఏంటి?, రేవంత్ పాత వీడియో వైరల్
Arun Charagondaఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావు డప్పులు కొట్టండని మాట్లాడిన రేవంత్ రెడ్డి వీడియో వైరల్‌గా మారింది. మా పార్టీ వాళ్ళెవరూ ఆయన మాట్లాడినంత అసహ్యంగా మాట్లాడలేదు అని చెప్పారు. కేటీఆర్ - రేవంత్ మాటల వీడియో వైరల్‌గా మారింది.
Telangana Shocker: ఆస్తి కోసం బామ్మర్దిని హత్య చేయించిన బావ, రూ.10 లక్షలతో సుపారీ డీల్, ఆలస్యంగా వెలుగులోకి ఘటన
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో ఈనెల 1న యశ్వంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్టు కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. బావ శ్రీకాంత్‌తో కలిసి హాస్టల్‌లో ఉన్నారు యశ్వంత్.
Jagga Reddy On KTR: రోజా చేసిన చేపల పులుసు తింటారు..కేటీఆర్‌పై జగ్గారెడ్డి సెటైర్, అధికారం లేకపోయే సరికి నిద్రపడటం లేదని కామెంట్
Arun Charagondaబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫన్నీ కామెంట్ చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. జగన్ దగ్గరికి పోతరు.. రోజా చేసిన చేపల పులుసు తింటరు.. ఏందిరా నాయనా మీ పంచాయితీ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. పదేళ్లు అధికారం అనుభవించి.. ఇప్పుడు పవర్ లేకపోయేసరికి నిద్రపడతలేదా? అని సెటైర్ వేశారు.
KTR Visits Kaushik Reddy House: సీఎం రేవంత్ రెడ్డిది పైశాచిక ఆనందం, ఫ్యాక్షన్ సినిమాను తలపించేలా ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేశారని కేటీఆర్ ఫైర్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్..పైశాచిక ఆనందం కోసం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.దాడి జరిగినప్పుడు ఇక్కడ విధుల్లో విఫలం అయిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిజిపీని డిమాండ్ చేశారు.
Ganesh Idol: రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు
Arun Charagondaకోటిన్నర కరెన్సీ నోట్లతో వినాయకుడికి ప్రత్యేక అలంకరణ చేశారు వరంగల్ వాసులు. శివనగర్ వాసవీ కాలనీకి చెందిన వినాయక ట్రస్ట్ సభ్యులు ఏకంగా కోటిన్నరతో వినాయకుడికి అలంకరణ చేశారు.రూ. 10, 20, 100, 200, 500 నోట్లతో గజమాలలు తయారు చేసి అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.