తెలంగాణ

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం, భారీగా పెరుగుతున్న వరద ఉధృతి

Hazarath Reddy

తెలంగాణలో వర్షం విలయం సృష్టించింది. కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది.

Telugu States Floods: మా ఆలోచనలన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలతోనే, భారీ వరదల నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలపై ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ఆలోచనలు అన్నీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోనే ఉన్నాయని పేర్కొన్నారు. వరదల వల్ల ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Telugu States Floods: తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు, 432 రైళ్లతో పాటు 560కి పైగా బస్సులు రద్దు, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద

Hazarath Reddy

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది.

Telugu States Floods: వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని వెల్లడి

Hazarath Reddy

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది.

Advertisement

Telangana Rains: తెలంగాణ వరదలు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశాలు

Hazarath Reddy

కనివినీ ఎరుగని రీతిలో గత రెండు రోజులుగా వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కాలనీలకు కాలనీలే వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి.

Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, అర్థరాత్రి రూ. 2 వేలు ఇవ్వాలంటూ టీ మాస్టర్‌ని దారుణంగా కొట్టిన యువకుడు

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ. 2 వేలు ఇవ్వాలంటూ చాయ్ మాస్టర్‌ను ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. బాగ్ లింగంపల్లిలో అర్ధరాత్రి ఓ పాన్‌షాప్ దగ్గరకి వచ్చిన చోటు, నరేశ్ ఇద్దరు యువకులు అక్కడ పనిచేసే చాయ్ మాస్టర్‌తో రూ.2 వేలు ఇవ్వాలని గొడవకు దిగారు.

Telangana Rains: వీడియో ఇదిగో, బైక్‌ మీద నుంచి కిందపడిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తృటిలో తప్పిన ప్రమాదం

Hazarath Reddy

మున్నేరు పరివాహక ప్రాంతంలోని నీట మునిగిన నాయుడుపేట, జలగంనగర్, దానవాయిగూడెంలోని కాలనీలను పరిశీలించారు మంత్రి పొంగులేటి. బైక్‌పై తిరుగుతూ.. ప్రమాదవశాత్తూ కిందపడ్డారు మంత్రి శ్రీనివాసరెడ్డి. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.ఆయన ఆరోగ్యవ నిలకడగా ఉంది.

DJHS General Body Meeting: మాకూ ఇంటి స్థలాలు ఇచ్చేలా చూడండి.. ముఖ్యమంత్రి రేవంత్‌ కు డీజేహెచ్‌ఎస్‌ విజ్ఞప్తి

Rudra

జర్నలిస్టులకు ఇంటి స్థలాల విషయంలో అత్యంత సానుకూలంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) కృతజ్ఞతలు తెలిపింది.

Advertisement

Telangana Rain Alert: తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అతి తీవ్ర వర్ష సూచన.. హైదరాబాద్‌ లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక

Rudra

గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణలోని పలు జిల్లాలను వాన ముంచెత్తుతున్నది.

Home Minister Amit Shah Calls Telugu states CM's: తెలుగు రాష్ట్రాల్లో వ‌ర‌ద బీభ‌త్సంపై రంగ‌లోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా! ఏపీకి 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, తెలంగాణ‌కు ఏ సాయం కావాల‌న్నా చేస్తాన‌ని హామీ

VNS

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్ లో (Amit Shah Calls Chandrababu) మాట్లాడారు. చంద్రబాబు విన్నపంతో హోం సెక్రటరీ స్పందించింది. 6 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను ఇతర రాష్ట్రాల నుండి తక్షణమే ఏపీకి పంపుతున్నట్లు హోం సెక్రటరీ తెలిపింది

Railway Track Swept Away: భారీ వ‌ర్షాల‌కు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మ‌హ‌బూబాబాద్ లో బీభ‌త్సం సృష్టిస్తున్న వ‌ర‌ద‌లు, ప‌లు రైళ్లు ఆల‌స్యం, దారి మ‌ళ్లింపు (వీడియో ఇదుగోండి)

VNS

కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్‌ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

Rain in Telugu States: తీరం దాటిన వాయుగుడం, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్, రెండు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు సెలవులు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గత అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం (Cyclone crossed the coast at Kalingapatnam) దాటింది. ప్రస్తుతం వాయవ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి నేటి సాయంత్రం లేదంటే రేపు ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Telangana Rains: భారీ వరదలకు ఇల్లు కూలి తల్లికూతురు మృతి, రాత్రి నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన మట్టి ఇల్లు

Hazarath Reddy

నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వర్షాలకు ఎక్కమేడు గ్రామంలో ఇళ్ళు కూలి ఇద్దరు మృతి చెందారు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్ళు నానిపోయాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో నానిన ఇల్లు కూలి తల్లి హన్మమ్మ, కూతురు అంజిలమ్మ మృతి చెందారు.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లు రద్దు, మరికొన్ని ట్రైన్స్ దారి మళ్లింపు, లిస్టు ఇదిగో..

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.

Munneru River Floods Video: వీడియో ఇదిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తోన్న మున్నేరు వాగు, ముంపులో చిక్కుకున్న పలు కాలనీలు, బాధితులు ఇంటిపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూపు

Hazarath Reddy

తెలంగాణలో భారీవర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్‌ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి అపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబం చిక్కుకుంది. చిక్కుకున్నవారిలో పిల్లలతో పాటు మహిళ, వృద్ధురాలు ఉన్నారు.

Telangana Rains: వీడియోలు ఇవిగో, హైదరాబాద్ విజయవాడ హైవేపై రాకపోకలు బంద్, రెండు అడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీరు

Hazarath Reddy

వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Advertisement

Telangana Rains:భారీ వరదలు, కారులో విమానాశ్రయానికి వెళుతూ తండ్రీ కూతురు గల్లంతు, మెడవరకు నీరు వచ్చిందంటూ బంధువులకు చివరి కాల్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహిస్తోంది, ఆ సమయంలో కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరిన ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి, కూతురు … వరద ప్రవాహంలో గల్లంతయ్యారు…

Vijayawada Rains: ప్రయాణికులకు అలర్ట్, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత, ఐతవరం వద్ద రోడ్డుపైకి భారీగా వరద నీరు

Hazarath Reddy

వాయుగుండం తీరం దాటినప్పటికీ తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Telangana Rains: భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక

Hazarath Reddy

తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనాలు అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Andhra Pradesh: గాజువాకలో దారుణం, తాను సబ్ ఇన్స్‌పెక్టర్ ని అంటూ డెలివరీ బాయ్‌ని కారుతో ఢీకొట్టి బూతులు తిట్టిన కారు యజమాని

Hazarath Reddy

డెలివరీ బాయ్‌ని వెనక నుండి గుద్ది, తిడుతూ తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దౌర్జన్యం చేసిన వ్యక్తి. గాజువాక - డెలివరీ బాయ్‌ని వెనుక నుంచి గుద్ది అతని బ్యాగులను విసిరిపారేసి తిట్టిన కారు యజమాని. భారీ వర్షంలో కూడా తడుచుకుంటూ మన నిత్యావసరాలను అందించే డెలివరీ బాయ్‌ని కనికరం చూపించకుండా తాను సబ్ ఇన్స్‌పెక్టర్ అంటూ దబాయించిన వ్యక్తి.

Advertisement
Advertisement