తెలంగాణ

Telangana Rains: వీడియో ఇదిగో, శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు, తృటిలో తప్పించుకున్న కార్లు

Hazarath Reddy

శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Telangana Rains: వీడియో ఇదిగో, వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన పోలీసులు

Hazarath Reddy

గతరాత్రి 40 మంది ప్రయాణికులతో వేములవాడ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురం శివారులో వరద నీటిలో చిక్కుకుపోయింది. అలాగే నాగర్ కర్నూల్ లోని నాగనూల్ వాగులో కొట్టుకుపోయి చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు సాహసోపేతంగా కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Hyderabad Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, రాష్ డ్రైవింగ్ తో పాదచారుల దూసుకొచ్చిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనస్థలిపురం ngos కాలనీ వివేకానంద పార్క్ ముందు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ డ్రైవింగ్ తో పాదచారుల పైకి కారు ఒక్కసారిగా దూసుకు వచ్చింది.ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Telangana Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు కాలువలో కొట్టుకొచ్చిన రెండు కార్లు, ఓ కారులో కోదాడ వాసి మృతి

Hazarath Reddy

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఇక కోదాడలో భారీ వర్షానికి రెండు కార్లు కాలువలొ కొట్టుకు వచ్చాయి.. ఓ కారులో ఒకరు మృతి చెంది కనిపించారు

Advertisement

CM Revanth Reddy On Rains: భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులకు సూచన

Arun Charagonda

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల పరిస్థితులపై ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారితో మాట్లాడిన సీఎం... ముఖ్యంగా మున్సిప‌ల్‌, విద్యుత్‌, వైద్యారోగ్య, రెవెన్యూ శాఖల యంత్రాంగం మరింత చురుకుగా వ్యవహరించేలా చూడాల‌ని సీఎస్‌ శాంతికుమారికి సూచించారు.

RTC Bus Stuck In Water: వాగులో చిక్కుపోయిన ఆర్టీసీ బస్సు, కాపాడండి అంటూ ప్రయాణీకుల ఆర్తనాదాలు, రాత్రి నుండి వర్షంలోనే ఉన్నామని ఆవేదన..వీడియో

Arun Charagonda

మహబూబాబాద్ - నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో చిక్కుకుపోయింది ఆర్టీసీ బస్సు. రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను వేడుకుంటున్నారు ప్రయాణికులు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Railway Track Destroyed Due To Rains: భారీ వర్షం, కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, మహబూబాబాద్‌లో ఘటన, నిలిచిపోయిన పలు రైళ్లు, తప్పిన పెను ప్రమాదం

Arun Charagonda

మహబూబాబాద్ - కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.దీంతో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లను నిలిపేశారు రైల్వే అధికారులు. భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ కొట్టుకుపోగా తక్షణమే రైల్వే సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.

Viral Video: తండాను ముంచేసిన వాన.. మహబూబాబాద్ జిల్లాలో నీటమునిగిన బొడ్డి తండా ఇళ్లు (వైరల్ వీడియో)

Rudra

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజాజీవితం అస్తవ్యస్తమవుతున్నది. భా మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని బొడ్డి తండాలో భారీ వర్షానికి ఇళ్లు మొత్తం మునిగిపోయాయి.

Advertisement

Railway Track Destroyed: భారీ వర్షానికి ధ్వంసమైన రైల్వే ట్రాక్.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన.. నిలిచిపోయిన పలు రైళ్లు (వీడియో)

Rudra

భారీ వర్షాలతో తెలంగాణవ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

Viral Video: వాన నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు.. ఏరుకుని సంచిలో వేసుకున్న స్థానికులు.. హైదరాబాద్ వైరల్ వీడియో

Rudra

హైదరాబాద్ లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వానధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఇలా నగరంలోని ఓ రైతు బజార్లో వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని కూరగాయలు, ఆకుకూరలు నీటిలో కొట్టుకుపోయాయి.

Weather Update: హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. తెలంగాణలో మరో 6 రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటన

Rudra

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతున్నది. రానున్న మరో ఆరు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం తెలిపింది.

Traffic Diversion In Kodad: హైద‌రాబాద్- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై భారీ ట్రాఫిక్ జామ్, కోదాడ వ‌ద్ద వాహ‌నాల మ‌ళ్లింపు, నందిగామ వ‌ద్ద రోడ్డుపై ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న వాగు

VNS

సూర్యాపేట జిల్లా కోదాడలో (Suryapet -kodad Highway) భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి చేరిన వరద నీరు చేరింది. దాంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా అధికారులు మళ్లించారు.

Advertisement

IAS Transfers in TG: తెలంగాణ‌లో 9 మంది ఐఏఎస్ ల బ‌దిలీ, ప‌లువురికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గింత‌, కీల‌క శాఖ‌ల్లో ఐఏఎస్ ల మార్పు

VNS

తెలంగాణలో పలువురు ఐఏఎస్ (IAS Transfers) అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanthi kumari) ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ డైరెక్టర్‌గా కే సురేంద్ర మోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పింది.

Hyderabad Rains: హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు సెలవు...భారీ వర్షాలతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

sajaya

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో సోమవారం స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా ఈ సెలవు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కాగా వచ్చే ఐదు గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌లో అతి భారీ వానలు ఆదివారం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Telangana Rains Update: భారీ వర్షాలు, ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌, వైద్య బృందాల అప్రమత్తం

Arun Charagonda

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Telangana Shocker: ప్రేమ పేరుతో 9వ తరగతి విద్యార్థినికి వేధింపులు, ఆత్మహత్య యత్నం, వికారాబాద్‌లో విషాద సంఘటన

Arun Charagonda

9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా అంటూ 10వ తరగతి విద్యార్థి వేధించిన ఘటన వికారాబాద్‌లో చోటు చేసుకుంది. వికారాబాద్ - బంట్వారం మండలం తుర్మామిడిలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటానంటూ వేధించారు 10వ తరగతి విద్యార్థి. అయితే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది బాలిక.

Advertisement

Hydra Commissioner Ranganath: లోటస్ పాండ్‌కు హైడ్రా నోటీసులపై స్పందించిన రంగనాథ్, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి

Arun Charagonda

వైఎస్ జగన్ ఇంటికి హైడ్రా నోటీసులు అంటూ వస్తున్న ఫేక్ న్యూస్ పై వివరణ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. జగన్ కు సైతం హైడ్రా నోటీసులు ఇచ్చిందని జోరుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. జగన్‌కు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు.

Suryapeta:వానరాల దండయాత్ర, ఒకే ఇంటిపై 2 వేల కోతులు, రెండు గంటల పాటు రణరంగం, స్థానికుల భయాందోళన

Arun Charagonda

సూర్యాపేట జిల్లా నూతనకల్‌(భగత్‌సింగ్ నగర్‌)లో వానరాలు దండయాత్ర చేశాయి. ఇళ్లపై చేరాయి సుమారు 2 వేల కోతులు. రెండు గంటల పాటు రణరంగం సృష్టించడంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.

Telangana Rains: భారీ వర్షాలు వాగులో చిక్కుకున్న కారు, రక్షించిన స్థానికులు..వీడియో ఇదిగో

Arun Charagonda

భారీ వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మల్లేపల్లి వాగులో ఓ కారు చిక్కుకుపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు కారును ఒడ్డుకు చేర్చి అందులోని వారిని రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Raids on Pubs in Hyderabad: హైదరాబాద్‌ లోని పబ్బులు, బార్ లపై అధికారుల దాడులు.. ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

Rudra

రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ ను రూపుమాపడమే లక్ష్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోని పబ్బులు, బార్లలో శుక్రవారం రాత్రి అధికారులు సోదాలు నిర్వహించారు.

Advertisement
Advertisement