తెలంగాణ

Sircilla Viral Video: ఇదేందయ్యా.. మగవాళ్లను మాత్రమే కాలితో తన్నుతూ దాడి చేస్తున్న కాకులు.. సిరిసిల్ల బస్టాండ్ లో ఘటన

Rudra

సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలో ఆశ్చర్యకరమైన ఘటన కనిపిస్తున్నది. బస్టాండ్ సమీపంలోని కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై మాత్రమే కొన్ని కాకులు దాడి చేస్తున్నాయి.

Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

Rudra

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్‌ లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌ 19వ గేటు కొట్టుకుపోయింది.

Sitarama project: ఆదివారం సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్,15న పంప్‌హౌస్‌లు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, భారీ బహిరంగసభ

Arun Charagonda

ఈనెల 15న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి సీతారామ ప్రాజెక్ట్ లోని మూడు పంప్ హౌస్ లు. ఈ ఆదివారం ట్రయిల్ రన్ కు ఏర్పాట్లు చేశారు. పంప్ హౌజ్ ల ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీతారామ ప్రాజెక్ట్ కు 67 TMC నీటి కేటాయింపులకు ప్రతిపాదనలు చేశారు.

CM Revanth Reddy: స్టాన్ ఫర్డ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ శాటిలైట్ సెంటర్ ఏర్పాటును చేయాలని కోరిన రేవంత్

Arun Charagonda

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగుతోంది. తన పర్యటనలో భాగంగా వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు రేవంత్. తాజాగా స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌ కేర్ రంగాల్లో పరస్పర సహకారంపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల్లో భాగస్వామ్యం కావాలని కోరారు

Advertisement

Khammam: నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపు, హోటల్‌ యజమానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

Arun Charagonda

ఖమ్మంలోని ఓ హోటల్ యజమానికి నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల బెదిరింపులు కలకలం రేపాయి. మమతా రోడ్డులోని కింగ్ దర్బార్ హోటల్ యాజమానిని బెదిరించిన నలుగురు దుండగులు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కి సమాచారం అందించిన హోటల్ యజమాని. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి సీతారాంపురం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు.

Hyderabad Road Accident: ఆగి ఉన్న బైక్‌ను కారుతో ఢీకొట్టిన మహిళ, ఓ వ్యక్తికి తీవ్రగాయాలు, హిమాయత్ నగర్‌లో రోడ్డు ప్రమాదం, వీడియో వైరల్

Arun Charagonda

హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా థార్ వాహనాన్ని నడిపి ఆగి ఉన్న బైకర్ ను ఢీకొట్టింది మహిళ. ఈ ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Bandi Sanjay About KTR: త్వరలో జైలుకు కేటీఆర్, బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం వార్తలు పుకార్లేనన్న బండి సంజయ్‌

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు కేంద్రమంత్రి బండి సంజయ్‌. మీడియాతో మాట్లాడిన కేటీఆర్...కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైల్లో వేస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ చేసిన అరాచకాలు, అవినీతి గురించి అందరికీ తెలుసని తెలిపారు.

Nalgonda Police: రోడ్ రోలర్‌తో బైక్ సైలెన్సర్లు నుజ్జునుజ్జు, 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసిన సైలెన్సర్స్ ను ద్వంసం చేసిన పోలీసులు

Arun Charagonda

భారీ శబ్దాలు వచ్చే బైక్ సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో తొక్కించారు నల్గొండ జిల్లా పోలీసులు. నల్లగొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అధిక శబ్దం కలిగించే 80 ద్విచక్ర వాహనాల మాడిఫై చేసి సైలెన్సర్స్ ద్వంసం చేశారు పోలీసులు. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Crows Attack: పగబట్టిన కాకులు.. మసుషులపై దాడి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన..వీడియో వైరల్‌

Arun Charagonda

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న సంఘటన చోటు చేసుకుంది. కాకులు పగబట్టాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ పక్కన.. కట్ట మైసమ్మ గుడి వద్ద పాదచారులపై దాడి చేస్తున్నాయి కాకులు. గుడికి ఆనుకొని ఉన్న వేప చెట్టు‌పై పదుల సంఖ్యలోని కాకులు గూళ్లు కట్టుకున్నాయి. అటువైపు వెళ్తున్న వారిపై దాడి చేస్తుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hyderabad Shocker: హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక

Arun Charagonda

హైదరాబాద్‌లో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరో కిడ్నాప్ జరిగింది. హబీబ్‌నగర్‌ అఘాపురాలో కరెంట్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లాడు అగంతకుడు.

Viral Video: భార్య - భర్తల గొడవ, భార్యను లాఠీతో కొట్టిన పోలీసులు, కరీంనగర్ -మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఘటన, వీడియో వైరల్

Arun Charagonda

కరీంనగర్ - మెట్ పల్లిలో అమానుషం చోటు చేసుకుంది. గొడవ పడి పోలీస్ స్టేషన్ కు వచ్చారు భార్యభర్తలు. భర్తతో గొడవపడిన మహిళను లాఠీతో కొట్టారు పోలీసులు. ఇది గమనించిన ASI ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ గొడవను ఆపడానికి వచ్చి మహిళను లాఠీతో కొట్టి ఆమెపై చేయి చేసుకున్నారు.

Telangana Shocker: అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో

Arun Charagonda

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి రహదారి లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లేందుకు గ్రామం నుంచి కిలోమీటర్ దూరం నడిచి వాగు వద్దకు చేరుకుంది నిండు గర్భిణి. నొప్పులు ఎక్కువ కావడంతో వాగు వద్దే ప్రసవించగా శిశువు మృతి చెందింది. అంబులెన్స్ చేరుకునే లోపే శిశువు మృతి చెందగా వెంకటాపూర్ పంచాయతీ బండగూడలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

Advertisement

BRS MLA Anil Jadav To Joins Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, త్వరలోనే చేరిక ఉండే అవకాశం?, 11వ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి?

Arun Charagonda

తెలంగాణలో బీఆర్ఎస్‌కు మరో షాక్ తగలనుందా?, ఓ వైపు పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తున్నా ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఆగడం లేదా?, తాజాగా 11వ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

Viral Video: ఎంతకు తెగించావ్రా..? అమ్మవారికి భక్తితో మొక్కినట్టే మొక్కి.. ఆభరణాలు చోరీ చేసిన దొంగ.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)

Rudra

దొంగతనానికి హద్దూ అదుపు లేకుండా పోతుంది. భక్తిమాటున కొందరు దొంగలు హద్దులు దాటుతున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అమ్మవారికి మొక్కినట్టే మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఓ దొంగ.

Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్

Rudra

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.

Warangal: నాలుగు రోజుల చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్క‌లు, స‌గానికి పైగా తినడంతో ఆడా? మ‌గా? కూడా గుర్తుపట్ట‌ని రీతిలో శిశువు మృత‌దేహం

VNS

వరంగల్‌ ఎంజీఎం (MGM) ఆసుపత్రి వద్ద శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఎంజీఎం వద్ద కుక్కలు నాలుగు రోజుల వయసున్న నవజాత శిశువును (New born) పీక్కుతిన్నాయి. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులతో పాటు అక్కడే ఉన్న రోగుల బంధువులు కుక్కలను చెదరగొట్టారు

Advertisement

Amgen New Innovation Center in Hyderabad: హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్న బయోటెక్‌ దిగ్గజం యాంజెన్‌, 3,000 మందికి ఉపాధి

Vikas M

అమెరికాకు చెందిన బయోటెక్‌ దిగ్గజం యాంజెన్‌ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొత్త టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హైటెక్‌ సిటీలో RMZ స్పైర్‌ టవర్‌లో వచ్చే ఏడాది మార్చిలోపు తమ పనులను ప్రారంభించనుంది. ఇందులో గరిష్ఠంగా 3,000 మందికి ఉపాధి లభించనున్నట్లు సంస్థ తెలిపింది.

Telangana: నిజామాబాద్‌లో ఏసీబీకి చిక్కిన మున్సిపల్‌ అధికారి, అధికారుల కళ్ళు చెదిరిపోయేలా నోట్ల కట్టలు బయటకు, మొత్తం రూ. 6.70 కోట్లు స్వాధీనం

Hazarath Reddy

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, రెవెన్యూ అధికారి దాసరి నరేందర్‌ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారంతో ఏసీబీ అధికారులు ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లలో శుక్రవారం సోదాలు నిర్వహించారు.

Telangana Police: నల్గొండ ఎస్పీ మంచి మనసు, రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలింపు, హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

Arun Charagonda

తెలంగాణలోని నల్గొండ పోలీసులు మంచి మనసు చాటుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర మానవత్వంతో నల్గొండ మెడికల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని పోలీస్ వాహనంలోనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ పై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

KTR On MLC Kavitha Bail: వచ్చే వారం కవితకు బెయిల్, కేటీఆర్ సంచలన కామెంట్స్,సుంకిశాల పాపం కాంగ్రెస్‌దేనని ఆరోపణ

Arun Charagonda

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ రావచ్చని వీలైతే వచ్చే వారమే బయటికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Advertisement
Advertisement