తెలంగాణ
Amgen Invests Hyderabad: తెలంగాణలో అమ్‌జెన్ బయోటెక్ పెట్టుబడులు, 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
Arun Charagondaతెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి టీమ్ భేటీ కాగా వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద బయోటెక్ సంస్థల్లో ఒకటైన అమ్‌జెన్ బయోటెక్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది.
Snake Bite: జగిత్యాల గురుకుల పాఠశాలలో పాము కాటు, ఒక విద్యార్థి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
Arun Charagondaతెలంగాణలోని జగిత్యాల జిల్లా ఉదయం పాము కాటుతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దపూర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకోగా తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు.
Telangana Shocker: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన
Arun Charagondaహైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కంచన్ బాగ్ - బాబా నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రియాజ్(45)ను బాలాపూర్‌లో దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై ఆరు హత్య కేసులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Viral Video: బస్సు ఆపలేదని కండక్టర్‌పై పాము విసిరిన మహిళ, మద్యం మత్తులో బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి, వీడియో వైరల్
Arun Charagondaహైదరాబాద్ విద్యానగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. చెయ్యి ఎత్తినా ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఆగ్రహంతో బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది ఓ మహిళ. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసమైంది. దీంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో తన వద్ద ఉన్న పామును విసిరింది మహిళ.
Husband Built Temple For Deceased Wife: మరణించిన భార్యకు గుడి కట్టించిన భర్త.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన (వీడియో)
Rudraవివాహం అనేది పవిత్రమైన బంధం. పెళ్లి అనే ఒక్క కారణంతో కన్నవాళ్ళను సైతం వదిలిపెట్టి భర్తే సర్వస్వం అని భావించి, తనతో జీవితాంతం బతుకడానికి ప్రతీ భార్య మెట్టింటికి వస్తుంది.
Telangana New Ration Cards: తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్
Rudraకొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయడానికి, అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Nag Panchami 2024: నేడు నాగ పంచమి.. ఈ పర్వదినంనాడు మీ బంధువులకు, స్నేహితులకు, లేటెస్ట్ లీ అందించే ఈ స్పెషల్ కార్డ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి
Rudraనేడు నాగ పంచమి. శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణుడు తన బాల్యంలో కాళీయనాగుని ఓడించి యమునా నది నుండి సురక్షితంగా బయటపడ్డాడని నమ్ముతారు.
Suma in Real Estate Fraud: రియల్ ఎస్టేట్ ఫ్రాడ్ లో యాంకర్ సుమ కనకాల, సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన స్టార్ యాంకర్
VNSటాలీవుడ్ బుల్లితెరపై టాప్ యాంకర్ ఎవరు అంటే.. సుమ కనకాల (Suma Kanakala) అని ఠక్కున చెప్పేస్తారు ఎవరైనా.. ఆమె మాటలో చమత్కారం, స్పాంటేనియస్ అందర్ని ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఫంక్షన్‌నైనా తన ప్రతిభతో రక్తికట్టిస్తుంది.
Telangana Rain Update: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyతెలంగాణలో రాబోయే రెండ్రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్‌గా ఉండటం.. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Hyderabad: వీడియో ఇదిగో, నిర్లక్ష్యంగా కారును డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టిన డ్రైవర్, త్రుటిలో తప్పించుకున్న చిన్నారి
Hazarath Reddyహైదరాబాద్‌లోని చైతన్యపురిలో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లో ఓ డ్రైవర్ రోడ్డుపై పార్క్ చేసిన కారును స్టార్ట్ చేసి సర్వీస్ రోడ్డులోని కిల్లా మైసమ్మ దేవాలయం సమీపంలో ప్రయాణిస్తున్న బైక్‌ను అకస్మాత్తుగా ఢీకొట్టాడు. తన చిన్నారి బాబును స్కూల్ నుంచి తీసుకెళ్తున్న వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు,
Cyberabad Police: సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడకండి..పోలీసుల ప్రాథమిక జాగ్రత్తలు, ప్రతిఒక్కరూ తెల్సుకోవాల్సిన వీడియో
Arun Charagondaసైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుడా ఉండటానికి తీసుకోవాల్సి ప్రాథమిక జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు సైబరాబాద్ పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Dog Attack in Karimnagar: షాకింగ్ వీడియో, ఆడుకుంటున్న 18 నెలల బాలుడుపై వీధి కుక్క దాడి, తృటిలో తప్పించుకున్న మరో బాలుడు
Hazarath Reddyకరీంనగర్ జిల్లాలో పద్దెనిమిది నెలల బాలుడుపై వీధీ కుక్క దాడి చేసింది. శాతావాహన యూనివర్సిటీ సమీపంలోని విద్యానగర్ వీధీలో రోడ్డుపై ఆడుకుంటున్న హరినందన్ అనే చిన్న పిల్లాడిపై వీధి కుక్క దాడి చేసింది. ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటుండగా ఎక్కడనుంచి వచ్చిందో అకస్మాత్తుగా నల్ల కుక్క దూసుకొచ్చింది
Nagarjuna Sagar Project Gates Open: తెరుచుకున్న నాగార్జునసాగర్ 26 గేట్లు, పర్యాటకుల తాకిడి, నిండుకుండలా మారిన పులిచింతల
Arun Charagondaగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది.
CM Revanth Reddy: గుడ్ న్యూస్..తెలంగాణలో చార్లెస్ ష్యాబ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్, భారత్‌లో ఫస్ట్ టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్‌లోనే
Arun Charagondaతెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ అందించారు. అమెరికన్ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ ష్యాబ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ అనంతరం ఈ ముఖ్యమైన నిర్ణయం, గుడ్ న్యూస్‌ని ప్రకటించారు.
School Bus Accident Video: వీడియో ఇదిగో, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వేగంగా వెనక్కి వెళ్ళిన స్కూలు బస్సు, పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా
Hazarath Reddyరంగారెడ్డిలోని మైలార్‌దేవ్‌పల్లిలో పయనీర్ స్కూల్‌కు చెందిన స్కూల్ బస్సు బోల్తా పడింది. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో వెనక్కి వెళ్లిన బస్సు.. పలు వాహనాలను ఢీకొట్టి బోల్తా పడింది. పలువురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు
Bitthiri Satthi: భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఆరోపణలపై స్పందించిన బిత్తిరి సత్తి (వీడియో)
Rudraభగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడన్న ఆరోపణలపై బిత్తిరి సత్తి స్పందించారు. తాను సరదాగా చేసిన వీడియోని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Shyam Prasad Reddy: ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట విషాదం.. సతీమణి వరలక్ష్మి కన్నుమూత
Rudraటాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్ టైన్స్ మెంట్ ప్రొడక్షన్స్ అధినేత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు.
Telangana IPS Officers: డీజీపీలుగా తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రమోషన్ పొందింది వీరే
Arun Charagondaతెలంగాణలో ఐదుగురు సీనియర్ IPS అధికారులకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. పదోన్నతులు పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,బి. శివధర్ రెడ్డి, అభిలాష బిష్త్,సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు.
Telangana Politics: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కోర్టులో దావా వేస్తామని వెల్లడి
Hazarath Reddyబీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Youth Commits Suicide: పెళ్లి కావడంలేదని గడ్డేన్న వాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు.. నిర్మల్ లో ఘటన (వీడియో)
Rudraయువత క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యామని కొందరు, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మరికొందరు, పెళ్లికాలేదని మరికొందరు.. సూసైడ్ కు పాల్పడుతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి.