తెలంగాణ
Telangana Floods: కన్నారం వాగులో బైక్‌తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి మృతి, వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
Hazarath Reddyకన్నారం వాగులో బైక్ సహా కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. హనుమకొండ - కన్నారం గ్రామానికి మహేందర్ అనే వ్యక్తి కన్నారం వాగు మీద బైక్ పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కన్నారం వాగులో పడి కొట్టుకుపోయాడు. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు జాలర్ల సహాయంతో గాలించగా అతని మృతదేహం లభ్యం అయింది. వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Telangana Floods: వీడియో ఇదిగో, కన్నారం వాగు దాటుతూ బైక్‌తో సహా కొట్టుకుపోయిన యువకుడు, జాలర్ల సహాయంతో గాలిస్తున్న పోలీసులు
Hazarath Reddyహనుమకొండ (Hanmakonda) జిల్లా వేలేరు మండలం కన్నారం గ్రామం వద్ద వాగు దాటుతూ ద్విచక్రవాహనదారుడు గల్లంతయ్యాడు. వాహనంపై మహేందర్ అనే వ్యక్తి వాగుమీదుగా వెళ్తుండగా బైకు అదుపుతప్పి వరదలో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు
Video: వరదలో బైక్ మీద కొట్టుకుపోయిన యువకుడిని కాపాడిన స్థానికులు, తాళ్ల సహాయంతో బయటకు తీసుకువచ్చిన గ్రామస్తులు
Hazarath Reddyతెలంగాణలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలం గోవిందాపురం వద్ద నక్కల వాగు ఉదృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయిన ప్రయాణికుడు, తాళ్ల సహాయంతో కాపాడి బైటకు లాగిన స్థానికులు.
Telangana Rains: భారీ వర్షానికి నీట మునిగిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు, తెలంగాణను వణికిస్తున్న భారీ వరదలు
Hazarath Reddyతెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి
Telangana Floods: వీడియో ఇదిగో, వరద నీటిలో మునిగిపోయిన లక్నవరం వంతెన, తెలంగాణను వణికిస్తున్న భారీ వరదలు
Hazarath Reddyతెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Telangana Rains: ఆపరేషన్ మోరంచపల్లి సక్సెస్, గ్రామస్తులందరినీ సురక్షితంగా బోట్ల ద్వారా తరలించిన అధికారులు, ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyహెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను అధికారులు రక్షించారు. సహాయక చర్యల్లో 2 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గ్రామస్తులను 6 ఫైర్‌ డిపార్ట్‌మెంట్ బోట్లు తరలించాయి. గ్రామం మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని హెలికాప్టర్ ద్వారా సిబ్బంది రెస్క్యూ చేశారు.
Telangana Floods: మోరంచపల్లిలో ఇళ్లు పూర్తిగా నీటిలో ఎలా మునిగిపోయాయో చూడండి, దాదాపు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyతెలంగాణలోని జయశంకర్ - భూపాలపల్లి జిల్లాలో 24 గంటల సమయంలో రికార్డు స్థాయిలో 600mm+ వర్షపాతం తర్వాత మోరంచపల్లె గ్రామంలో తీవ్ర వరద పరిస్థితి వీడియో ఇది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచ వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.
Telangana Floods: భారీ వరదలకు చెరువులా మారిన కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌, పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Hazarath Reddyతెలంగాణలో రికార్డు స్థాయిలో వానలు కురుస్తుండటంతో పలు గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వానల నేపథ్యంలో కాజీపేట్‌ రైల్వే స్టేషన్‌(జంక్షన్‌)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రైల్లే పట్టాలపై నీరు చేరడంతో రైలు ప్రయాణాలకు ఆటంకం ఏర్పడింది.
Telangana Rains: భారీ వరదల్లో పూర్తిగా మునిగిపోయిన లారీ, సాయం కోసం డ్రైవర్, క్లీనర్ ఎదురుచూపులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో వరదల్లో చిక్కుకుపోయిన ట్రక్కు లోపల డ్రైవర్, క్లీనర్ సాయం కోసం ఆర్థిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. వాహనం వరద నీటిలో మునిగిపోయి, డ్రైవర్ మరియు సహాయకులు హైవేపై చిక్కుకుపోయినట్లు చూపిస్తుంది. ట్రక్కులోపల నీటి మట్టం అనేక అడుగులు పెరిగి, సీట్లను కప్పివేసి, ట్రక్ డ్రైవర్, సహాయకులలో భయం, ఆందోళన కలిగించింది.
Telangana Rains: తెలంగాణలో రేపు విద్యాసంస్థలకు సెలవు, అతిభారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
Hazarath Reddyరాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రేపు (శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Video: కొడుకు మృతదేహం చూసి కుప్పకూలిపోయిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గుండెపోటుతో మృతి చెందిన పెద్ద కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డి
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు. కొడుకు మృతదేహం చూసిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.
Telangana Floods: మూసీ నదిలోకి భారీగా పెరిగిన వరద ప్రవాహం, అప్రమత్తమైన అధికారులు, నల్గొండ మూసీ ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత
Hazarath Reddyహైదరాబాద్‌ నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఫలితంగా గండిపేట 2 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లు తెరవడంతో.. మూసీ నదిలోకి వరద ప్రవాహం పెరిగింది. మూసీకి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Telangana Floods: దిగువ గ్రామాలకు వణుకుపుట్టిస్తున్న కడెం ప్రాజెక్ట్, భారీగా చేరుతున్న వరద నీరు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో.. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి (700 అడుగులు) చేరుకుంది.
Patancheru MLA Son Dies: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడు మృతి, కిడ్నీలు పాడవటంతో ఆస్పత్రిలో చేరిన విష్ణువర్ధన్‌రెడ్డి
Hazarath Reddyసంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్దకుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో మృతిచెందారు. గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో మృతి చెందారు.
Telangana Floods: అర్థరాత్రి గ్రామాన్ని ముంచెత్తిన వరద, 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న వాగు, జలదిగ్భంధంలో చిక్కుకుపోయిన మోరంచపల్లి గ్రామం, రంగంలోకి దిగిన సీఎం కేసీఆర్
Hazarath Reddyతెలంగాణలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మోరంచపల్లి గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుంది. ఇళ్లు, భవనాలు మునిగిపోవడంతో మేడలపైకి వెళ్లి.. వర్షాల్లో తడుస్తూ మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అంటూ.. సెల్ఫీవీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి
Red Alert Issued For Telangana: బీ అలర్ట్! ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు, తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో గతరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన
VNSతెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద (Flood) నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
Tourists Rescued By NDRF: ములుగు అడవిలో తప్పిపోయిన 84 మంది టూరిస్టులు సేఫ్‌, సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన ఎన్డీఆర్ఎఫ్, రాత్రంగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్
VNSములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని అడవిలో చిక్కుకున్న 84 మంది పర్యాటకులను (Rescued By Police) పోలీసులు రక్షించారు. గ్రామ సమీపంలోని ముత్యంధార జలపాతం (Mutyaladhara waterfalls) చూసేందుకు 84 మంది పర్యాటకులు బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చారు.
Telangana Rains: షాకింగ్ వీడియో, వాగు దాటుతూ మహిళ గల్లంతు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘటన..
kanhaవాగు దాటుతూ మహిళ గల్లంతు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు.
Telangana Rains: భద్రాచలం వద్ద కొద్ది సేపటి క్రితం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ, 48 అడుగులకు చేరిన గోదావరి వరద
kanhaభద్రాచలం వద్ద కొద్ది సేపటి క్రితం రెండవ ప్రమాధ హెచ్చరిక జారీ గోదావరిలో రాత్రి 9.30 గంటలకు భద్రాచలం దగ్గర 48 అడుగులకు చేరిన గోదావరి వరద. రెండో ప్రమాద హెచ్చరిక జారీ. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం ప్రధాన రహదారులపైకి చేరిన వరద నీరు, నిలిచిపోయిన రాకపోకలు.
Mulugu District Shocker: ములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది టూరిస్టులు..
kanhaములుగు జిల్లా వీరభద్రవరం అడవుల్లో ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి చిక్కుకున్న 84 మంది పర్యాటకులు.