తెలంగాణ
Singer Madhupriya: వివాదంలో సింగర్ మధుప్రియ..కాళేశ్వరం గర్బగుడిలో ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణ, షూటింగ్‌పై పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు, చర్యలకు భక్తుల డిమాండ్
Arun Charagondaసింగర్ మధుప్రియ(Madhupriya) వివాదంలో చిక్కుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం(kaleshwaram temple)లో అపచారం జరిగింది.
Brutal Murder in Telangana: దారుణం, నడిరోడ్డు మీద ఆటో డ్రైవర్‌ని కత్తితో పొడిచి చంపిన మరో డ్రైవర్, కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచిన కసాయి
Hazarath Reddyహనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌ను మరో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అతను దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు.
Rashmika Mandanna: వీల్‌చైర్‌లో రష్మిక మందన్నా.. వైరల్‌గా మారిన వీడియో, ఛావా మూవీ ప్రమోషన్ కోసం ముంబైకి రష్మిక
Arun Charagondaహైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు రష్మిక. వీల్ ఛైర్‌లో వెళ్తున్న రష్మికా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IT Raids On Sukumar: దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు... పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ చెల్లింపులు జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో విస్తృత సోదాలు
Arun Charagondaహైదరాబాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీస్‌ల్లో సోదాలు జరుగుతుండగా తాజాగా సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు.
IT Raids On Tollywood Producers: రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా
Arun Charagondaవరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
MLA Vemula Veeresham: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం.. పెన్షన్ వచ్చే వరకు తానే ఆ డబ్బులు ఇస్తానని వృద్ధురాలికి భరోసా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, వీడియో
Arun Charagondaనల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మానవత్వం చాటుకున్నారు. గ్రామ సభలో సొంత డబ్బులు ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం.
Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు
Hazarath Reddyరైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సికింద్రాబాద్‌లోని జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భార్గవి (19) హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది.
MLC Kavitha: యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. గ్రామసభల్లో ప్రజాగ్రహం, కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయడం ఎవరి వల్ల కాదని వెల్లడి
Arun Charagondaయాదగిరిగుట్ట గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు కవిత.
Fire Accident At Shadnagar: షాద్ నగర్ ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో ఘటన, ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు.. వీడియో ఇదిగో
Arun Charagondaరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్ మిల్లు పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
BJP MP Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్ దాడి చేశారంటూ ఫిర్యాదు
Arun Charagondaబీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.
MLA Padmarao Goud: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు ..స్టంట్ వేసిన డాక్టర్లు, డెహ్రాడూన్ టూర్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Arun Charagondaసికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు.
CM Revanth Reddy:తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో డాటా కంట్రోల్ సంస్థ ఎంవోయూ
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సత్ఫలితాన్నిస్తోంది. తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ డాటా సంస్థ CtrlS.
Venu Swamy Apologizes: వీడియో ఇదిగో, నన్ను క్షమించండి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయను, నాగచైతన్య–శోభిత విడాకులు తీసుకుంటారనే జోస్యంపై క్షమాపణలు చెప్పిన వేణుస్వామి
Hazarath Reddyకొన్ని రోజుల క్రితం అక్కినేని నాగ చైతన్య (Nagachaitanya), శోభిత ధూళిపాల (Shobitha Dhulipalla) వివాహం సందర్భంగా ఓ చానల్‌లో ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని, విడాకులు తీసుకుంటారని వేణు స్వామి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.
Eatala Rajendar Attack Video: వీడియో ఇదిగో, రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, ఎందుకంటే..
Hazarath Reddyమేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు
Tirumala Masala Vada: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో కొత్త ఐటమ్.. భక్తులకు మసాలా వడ.. తొలిరోజు ఐదువేల మందికి వడ్డింపు (వీడియో)
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలోని వేంగమాంబ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో అన్నప్రసాదంలో కొత్తగా మసాలా వడలు పెట్టాలని నిర్ణయించింది.
Encounter In Chhattisgarh: తుపాకీ మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
Rudraతుపాకీ మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలోని కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి.
Black Ink On Cheques: బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లవా? ఆర్బీఐ దీన్ని బ్యాన్ చేసిందా? ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఈ వార్తలపై కేంద్రం ఏం చెబుతోందంటే??
Rudra‘కొత్త ఏడాదిలో కొత్త రూల్స్.. బ్లాక్ ఇంక్ తో రాసిన చెక్కులు చెల్లుబాటు కావు. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది’ అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
IT Raids In Pushpa-2 Producer Houses: టాలీవుడ్ లో కలకలం.. 'పుష్ప 2' నిర్మాతలు నవీన్ యెర్నేని, మైత్రీ మూవీస్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు (వీడియో)
Rudraమంగళవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ దాడులు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.
IT Raids In Dil Raju House: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఎనిమిదిచోట్ల ఏకకాలంలో 55 బృందాలతో దాడులు
Rudraమంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన నగరంలోని ఇల్లు, ఆఫీసులు ఇలా 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు 55 బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నారు.
Telangana: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో, నారాయణపేట దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి, రోడ్డు దాటే సమయంలో మహిళను ఢీకొట్టిన బస్సు
Hazarath Reddyఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని సింగారం చౌరస్తాలో రోడ్డు దాటే సమయంలో మహిళను బస్సు ఢీకొట్టింది. కర్నూలు నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఆమె రోడ్డు దాటుతుండగా మలుపు తీసుకుంటూ ఢీకొట్టింది