తెలంగాణ

Telangana: డ్రగ్స్‌కు బానిసైన కొడుకు, కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టిన తల్లి, మంట మంట అంటూ అల్లాడిన బాధితుడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన కుమారుడికి తల్లి దేహశుద్ధి చేసిన ఘటన వీడియో వెలుగులోకి వచ్చింది. కోదాడలో 15 ఏళ్ల కుర్రాడు గంజాయి లేనిదే బతకలేని స్థితికి వచ్చాడు. కొడుకు మాదక ద్రవ్యాలకు బానిస కావడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది.

TS EDCET-2022: టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌ల, రెండేండ్ల బీఎడ్ కోర్సుకు ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు

Hazarath Reddy

తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి గానూ రెండేండ్ల బీఎడ్ కోర్సుకు (TS EDCET-2022) సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ లింబాద్రి, ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ రామ‌కృష్ణ‌, ఎడ్‌సెట్ కో క‌న్వీన‌ర్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

Weather Forecast: తెలంగాణకు ఎల్లో అల‌ర్ట్, రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని తెలిపిన హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ

Hazarath Reddy

తెలంగాణలో గత వారం రోజుల నుంచి ఎండలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. తాజాగా ఎండ‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త‌ను హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ వినిపించింది.

Hyderabad vs Bengaluru: హైదరాబాద్ vs బెంగుళూరు, డీకే శివకుమార్ మంత్రి కేటీఆర్ మధ్య ఐటీ గురించి ఆసక్తికర ఛాలెంజ్ చర్చ

Hazarath Reddy

మంత్రి కేటీఆర్‌, క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తికర చ‌ర్చ జ‌రిగింది. బెంగుళూరులో మౌళిక స‌దుపాయాలు స‌రిగా లేవ‌ని కొన్ని రోజుల క్రితం ఖాతాబుక్ సీఈవో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Hyderabad Rave Party: ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో విస్తు గొలిపే విషయాలు, 148 మందిలో అందరూ వీఐపీల బిడ్డలే, ఎఫ్‌ఐఆర్‌లో నలుగురు నిందితుల పేర్లు, రాడిసన్‌ బ్లూ హోటల్‌‌లో అసలేం జరిగింది

Hazarath Reddy

భాగ్య నగరంలో పబ్‌ సంస్కృతి మితిమీరిపోతోంది. తాజాగా రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఉదంతం (Hyderabad Drugs Bust) వెలుగులోకి రావడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని బంజా రాహిల్స్‌ రోడ్‌ నం.6లో ఉన్న ర్యాడిసన్‌ బ్లూప్లాజా హోటల్‌కు చెందిన ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో ఆదివారం తెల్లవారుజామున నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు.

Covid in TS: తెలంగాణలో కొత్తగా 12 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 10,348 కరోనా పరీక్షలు నిర్వహించగా, 12 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 8 కొత్త కేసులు నమోదు కాగా, జోగులాంబ గద్వాల జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1, నాగర్ కర్నూలు జిల్లాలో 1, కామారెడ్డి జిల్లాలో 1 కేసు గుర్తించారు.

Naga Babu Reacts on Niharika: నా బిడ్డ బంగారం, ఆమె ఏ తప్పు చేయలేదనే పోలీసులు వదిలేశారు, నిహారికపై వస్తున్న వదంతులపై నాగబాబు క్లారిటీ, వీడియో రిలీజ్ చేసిన మెగా బ్రదర్

Naresh. VNS

నా కూతురు నిహారిక ఆ స‌మ‌యానికి అక్క‌డుండ‌ట‌మే. ప‌బ్ టైమింగ్స్ ప‌రిమితికి మించి న‌డ‌ప‌డం వ‌ల్ల ప‌బ్ మీద పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారు. నిహారిక‌కు సంబంధించినంత వ‌ర‌కు ఆమె క్లియ‌ర్. నిహారిక విష‌యంలో ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని పోలీసులు చెప్పారు. అనుమానాల‌కు తావివ్వ‌కూడద‌ని స్పందిస్తున్నా. నిహారిక‌పై అన‌వ‌స‌ర ప్ర‌చారాలు చేయ‌కండని విజ్ఞ‌ప్తి చేశారు నాగ‌బాబు.

Hyderabad: మాజీ ఎంపీ రేణుకా చౌదరికి చెందిన పబ్‌లో రేవ్ పార్టీ, పట్టుబడ్డ బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, ప్రముఖ నటుడి కుమార్తె, పలువురు సెలబ్రెటీలు, భారీగా కొకైన్, గంజాయి, డ్రగ్స్ స్వాధీనం

Naresh. VNS

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో నిర్వహిస్తున్న భారీ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో (Fooding and mink pub) రేవ్‌ పార్టీ (Rev party) నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం వేకువజామున 2.30 గంటల సమయంలో నార్త్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు.

Advertisement

KTR Fires on BJP: ఢిల్లీ బీజేపీ- సిల్లీ బీజేపీ రైతుల్ని ఆగం చేస్తున్నాయ్, ధాన్యం కొనేవరకు కేంద్రాన్ని వదిలేది లేదని మంత్రి కేటీఆర్ ప్రకటన, వరుస నిరసనలపై కార్యాచరణ ప్రకటించిన కేటీఆర్

Naresh. VNS

యాసంగి ధాన్యం (Yasangi Rice) కొనుగోలుపై కేంద్రంతో యుద్ధం కొనసాగించేందుకు టీఆర్‌ఎస్ రెడీ అయింది. ఈ మేరకు వరుస నిరసనలపై కార్యాచరణ ప్రకటించారు మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). లక్షలాది మంది రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Warangal: ఎంజీఎంలో ఎలుకలు కొరికిన పేషెంట్‌ మృతి, నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన శ్రీనివాస్, అవయవాలు పనిచేయకపోవడం వల్లనే చనిపోయాడంటున్న డాక్టర్లు

Naresh. VNS

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (MGM) ఎలుకలదాడిలో గాయపడిన బాధితుడు శ్రీనివాస్ మృతి (Srinivas Died) చెందాడు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. నిన్న అతడి పరిస్థితి విషమించడంతో.. వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. అయితే శ్రీనివాస్ కిడ్నీ సమస్యతో (Kidney Failure)కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు.

Telangana Governor Comments on KCR: సీఎం కేసీఆర్ లేకుండానే రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు, పండుగపూట మరోసారి బయటపడ్డ విభేదాలు, ఫ్లెక్సీలో కేసీఆర్ ఫోటో ముద్రించని రాజ్‌భవన్ వర్గాలు,ఇద్దరి మధ్య మరింత ముదురుతున్న కోల్డ్ వార్

Naresh. VNS

రాజ్ భవన్ లో ఉగాది వేడుకులకు (Rajbhavan Ugaadi Celebrations) సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది. దీనిపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా స్పందించారు. నా ఆహ్వానాన్ని గౌరవించనందుకు నేను బాధపడడం లేదన్నారు గవర్నర్ తమిళిసై (Tamilisai). 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించానని, కొందరు వచ్చారని, రాని వారి గురుంచి నేను చెప్పేదేమీ లేదన్నారామె.

Telangana: సిక్కీంలో జరిగిన పారాగ్లైడింగ్‌లో తెలంగాణ యువతి మృతి, ఆమె గైడ్ సందీప్ గురుంగ్ కూడా మృతి, వేగంగా వచ్చిన గాలులతో ఒకదానికొకటి ఢీకొన్న పారాచూట్​లు

Hazarath Reddy

నార్త్ సిక్కింలో జరిగిన పారాగ్లైడింగ్ ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన యువతి ప్రాణాలు కోల్పోయింది. బాధితురాల్ని ఖమ్మంకు చెందిన రామ్​కుమార్​ రెడ్డి కుమార్తె ఈశా రెడ్డి సంకెపల్లి(23)గా అధికారులు గుర్తించారు. సిక్కిం పర్యాటకానికి వెళ్లిన ఈశా.. శుక్రవారం ఉదయం లాఛుంగ్​ వ్యూ పాయింట్​ నుంచి పారాగ్లైండింగ్​లో పాల్గొంది.

Advertisement

Hyderabad: డ్రగ్స్ అడ్డాగా హైదరాబాద్‌, తొలి డ్రగ్ మరణం నమోదు, ఐదు గ్రాముల హష్‌ ఆయిల్‌ రూ.3 వేలు, పోలీసుల దర్యాప్తులో బయటపడ్డ షాకింగ్ విషయాలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. మోతాదుకు మించి మాదకద్రవ్యాలు తీసుకున్న ఓ 23 ఏళ్ల ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (BTech graduate Dies) ప్రాణాలు కోల్పోయాడు. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి నుంచి డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, విచారించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది

Corona in TS: తెలంగాణలో కొత్తగా 31 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాదులో 23 కొత్త కేసులు నమోదు

Hazarath Reddy

Telangana: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం, ఐసీయూలోని పేషెంట్‌పై ఎలుకలు దాడి, పేషంట్ పరిస్థితి విషమం, ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

Hazarath Reddy

ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (Warangal MGM hospital) ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్‌పై ఎలుకలు దాడి (Rodents bite patient) చేశాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భీమారంకు చెందిన పేషంట్ శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేసి ఐదు చోట్ల కొరికాయి.

Mahesh Bank Hacking Case: మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హ్యాకింగ్ జరిగిందని తెలిపిన సీపీ సీవీ ఆనంద్

Hazarath Reddy

హైదరాబాద్‌లో మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసును నగర పోలీసులు ఛేదించారు. దాదాపు 2 నెలలపాటు, 100 మంది పోలీసు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ప్రధాన హ్యాకర్ దేశంలో లేడని తెలిపారు. మొత్తం 23 మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.

Advertisement

Ruckus at Srisailam: మంచినీళ్లు అడిగినందుకు గొడ్డలితో దాడి, శ్రీశైలంలో కన్నడ భక్తుల భీభత్సం, పలు వాహనాలకు నిప్పు, కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడి చేసిన టీ షాపు యజమాని

Naresh. VNS

ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ భక్తుడు అతనితో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రం కావడంతో టీ షాపు యజమాని కన్నడ భక్తుడిపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.

Telangana Reduces School Timings: తెలంగాణలో ఇకపై 11.30 వరకే స్కూల్స్, ఎండల తీవ్రతతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇవాల్టి నుంచే అమల్లోకి కొత్త టైమింగ్స్

Naresh. VNS

స్కూల్ విద్యార్దులు వడదెబ్బ భారిన పడకుండా స్కూల్ టైమింగ్స్ కుదించింది (Reduce School Timings) ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణలో ఒంటిపూట (Half Day schools)బడులు నడుస్తున్నాయి. తాజాగా ఎండల తీవ్రతతో సమయాల్లో మార్పులు చేసింది. బుధవారం పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు పెరిగాయి.

Discount on Pending Traffic Challans Extended:వాహనదారులకు గుడ్ న్యూస్, పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ తేదీ పొడిగింపు, ఏప్రిల్ 14 వరకు ఛాన్స్, కీలక ప్రకటన చేసిన పోలీసులు

Naresh. VNS

ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన డిస్కౌంట్ తేదీని 15 రోజుల పాటూ పొడిగించారు (Date Extended). ఈ మేరకు ప్రకటన చేశారు. పాత నిబంధ‌న‌ల ప్ర‌కారం మార్చి 1 నుంచి 31 వ తేదీ వ‌ర‌కూ ఈ రాయితీ వ‌ర్తిస్తుంది. అయితే.. ప్ర‌జ‌ల్లో వ‌స్తున్న విశేష స్పంద‌న‌ను చూసి, ప్ర‌జ‌ల‌కు మ‌రింత సౌల‌భ్యాన్ని క‌ల్పించ‌డం కోసం ఈ రాయితీ (Discount )గడువును ప్ర‌భుత్వం మ‌రో 15 రోజుల పాటు పొడిగించింది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 40 మందికి కరోనా, అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 19,052 కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు

Advertisement
Advertisement