తెలంగాణ

COVID in TS: తెలంగాణలో కొత్తగా 102 మందికి కరోనా, హైదరాబాదులో 35 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 25,449 కరోనా పరీక్షలు నిర్వహించగా, 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 35 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 287 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.

Telangana Governor Tamilisai: నన్ను ఎవరూ భయపెట్టలేరు, నేను దేనికి భయపడను, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు

Krishna

తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగం లేకుండా సభ నిర్వహిస్తే సభ్యులు చర్చించే హక్కును కోల్పోయినట్టేనని తమిళిసై అన్నారు.

TS Budget Session 2022: ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, 9వ తేదీన బ‌డ్జెట్‌పై సాధార‌ణ చ‌ర్చ, 15వ తేదీన ద్ర‌వ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ

Hazarath Reddy

తెలంగాణ బీఏసీ సమావేశం ముగిసింది. ఈ నెల 15వ తేదీ వ‌ర‌కు శాస‌న‌స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలను (TS Budget Session 2022) నిర్వ‌హించాల‌ని బీఏసీ(శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల స‌ల‌హా సంఘం) నిర్ణ‌యించింది. శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన బీఏసీ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Telangana: సింగరేణిలో ఘోర ప్రమాదం, బొగ్గు గని పైకప్పు కూలడంతో నలుగురు మృతి, సంఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్

Hazarath Reddy

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ఆర్‌జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గని పై కప్పు కూలడంతో రాళ్ళ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకుపోయారు. వీరిలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో అసిస్టెంట్‌ మేనేజర్‌తోపాటు ముగ్గురు కార్మికులు ఉన్నారు.

Advertisement

TS Budget Session 2022: రాష్ట్ర అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు, రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు

Hazarath Reddy

ఇది బడుగుల జీవితాలను మార్చే బడ్జెట్ అని చెప్పారు. ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని తెలిపారు. రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌‌ను (Rs 2.56 lakh crore budget 2022-23) రూపొందించారు. తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు.

TS Budget Session 2022: రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్‌, అసెంబ్లీ నుంచి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్రకటించిన స్పీకర్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (TS Budget Session 2022) గవర్నర్‌ ప్రసంగం లేకుండానే ప్రారంభం కావడం గమనార్హం. ప్రారంభం అయిన వెంటనే తెలంగాణ శాస‌న‌స‌భ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యేల‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స‌స్పెండ్ (BJP MLAs suspended) చేశారు.

TS Budget Session 2022: తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం, కేసీఆర్‌కు సీఎం పదవిలో కొనసాగే హక్కు లేదు, అసెంబ్లీలో ముగ్గురమే ఉన్నా ప్రజలంతా మా వైపే, ప్రభుత్వంపై మండిపడిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Hazarath Reddy

గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాల (TS Budget Session 2022) ప్రారంభంపై గన్ పార్క్ వద్ద నల్ల కండువాలతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. 40 - 50 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కి.. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (bjp mla etela rajender ) మండిపడ్డారు.

Telangana Budget Session 2022: మరి కొద్ది సేపట్లో అసెంబ్లీకి తెలంగాణ వార్షిక బడ్జెట్, మూడోసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీశ్ రావు, నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభం (Telangana Budget Session 2022) కానున్నాయి. మ‌రికాసేప‌ట్లో ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు.

Advertisement

Yadadri Bhuvanagiri Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, RTC బస్సు ఢీ కొని రోడ్డు పనులు చేసుకునే 4 గురు కూలీలు మృతి..

Krishna

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డ ప్రమాదం జరిగింది. నలుగురు కూలీలు మృతి చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ రెడ్డు వద్ద డివైడర్ పనులు చేస్తున్న కూలీలపై ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. డివైడర్ ను ఢీకొన్న తర్వాత అక్కడే ఉన్న ట్రాక్టర్ ను కూడా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Khammam Crime: బాబాయితో శృంగారం చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది, నిలదీసినందుకు కట్టుకున్న భర్తను రోకలిబండతో దారుణంగా కొట్టి చంపిన మహిళ..

Krishna

కట్టుకున్న భర్తను కాదని.. వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హతమార్చిందో భార్య. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

Mahesh Babu: రియల్ హీరో అనిపించుకుంటున్న మహేష్ బాబు, చిన్నారుల ఆపరేషన్ల కోసం ఫౌండేషన్ ప్రారంభించిన సూపర్ స్టార్, ఇప్పటి వరకు 1200 మందికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు

Naresh. VNS

మహేష్ బాబు మరో ముందడుగు వేశారు. ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్‌(Andhra Hospitals), రెయిన్ బో హస్పటల్స్(Rainbow Hospitals) తో కలిసి మహేష్ చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయిస్తూ వారికి పునర్జన్మనందిస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ 1200 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించినట్లు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చాడు.

Congress Leader Bhatti Vikramarka: కల్లు తాగుతూ కార్యకర్తల్లో జోష్ నింపిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మధిరలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న భట్టివిక్రమార్క

Krishna

గీత కార్మికుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదన్నారు. తాటిచెట్లు ఎక్కడానికి ఎలక్ట్రానిక్ మోకులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క కల్లు తాగారు.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 152 మందికి కరోనా, రాష్ట్రంలో నేటివరకు 3,36,46,433 కరోనా టెస్టులు

Hazarath Reddy

తెలంగాణలో కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 30వేల 146 కరోనా పరీక్షలు చేయగా 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు.

KCR Meet Hemant Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో సీఎం కేసీఆర్ భేటీ, ప్రస్తుత దేశ రాజ‌కీయాలపై చర్చలు

Hazarath Reddy

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శోభ‌, రాష్ట్ర ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

Telangana: గల్వాన్‌ అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ పరామర్శ, సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

గల్వాన్ అమరవీరులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం జార్ఖండ్‌ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం (Galwan martyrs) పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు.

Ibrahimpatnam shooting: ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసును చేధించిన రాచ‌కొండ పోలీసులు, ఆరుగురిని అరెస్ట్ చేశామని తెలిపిన సీపీ మహేష్ భగవత్

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కేసులో (Ibrahimpatnam shooting) మిస్టరీ వీడింది. మట్టారెడ్డి సహా ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు ఆయుధాలు, 20 రౌండ్ల బులెట్లు స్వాధీనం చేసుకున్నారు. మట్టారెడ్డిని కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు.

Advertisement

Corona in TS: తెలంగాణలో కొత్తగా 164 కేసులు, అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 61 మందికి పాజిటివ్

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 31,303 కరోనా పరీక్షలు నిర్వహించగా, 164 కొత్త కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 61 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి.

CM KCR Delhi Tour: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, బీకేయూ నేత రాకేష్ టికాయత్‌తో సీఎం కేసీఆర్ భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, బీకేయూ నేత రాకేష్ టికాయత్ తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని నివాసంలో సీఎం కేసీఆర్ వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపైన చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం, ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా నన్ను సెల‌వుపై పంపించలేదు, కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

Hazarath Reddy

న‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా సెల‌వుపై పంపించింద‌ని రేవంత్ చేసిన ఆరోప‌ణ‌లపై డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి (DGP Mahendar Reddy) స్పందించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని డీజీపీ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల త‌న ఇంట్లో తాను జారిప‌డ‌టంతో ఎడ‌మ భుజానికి గాయ‌మైందని డీజీపీ తెలిపారు.

Telangana Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు, జేఈఈ మెయిన్స్ కారణంగా మారిన తేదీలు, ఇంటర్ బోర్డు కొత్తగా రీ షెడ్యూల్ చేసిన తేదీలు ఇవే!

Naresh. VNS

గతంలో తెలంగాణలో ఇంటర్ పరీక్షల (Telangana Inter Exams) షెడ్యూల్ విడుదల చేసిన అధికారులు.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 21వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. కానీ జేఈఈ పరీక్షల కారణంగా ఎగ్జామ్స్ ను రెండు రోజులు వెనక్కు మార్చారు.

Advertisement
Advertisement