తెలంగాణ
Telangana Shocker: పిల్లలు పెద్దయ్యారని చెప్పినా వినకపోవడంతో.. ప్రియుడ్ని దారుణంగా గొడ్డలితో నరికేసిన ప్రియురాలు, నల్గొండ జిల్లాలో ఘటన
Hazarath Reddyనల్గొండ జిల్లాలో దివ్యాంగుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన (Telangana Shocker) డిండి మండల పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 614 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,520 కరోనా పరీక్షలు నిర్వహించగా, 614 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 131 కొత్త కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 43, ఖమ్మం జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి.
CM KCR Press Conference: సర్జికల్‌ స్ట్రైక్స్‌పై నాకు ఎన్నో అనుమానాలున్నాయి, అడిగితే రాహుల్ గాంధీని అంత ఘోరంగా అవమానిస్తారా, కేంద్రంపై మండిపడిన తెలంగాణ సీఎం కేసీఆర్
Hazarath Reddyభారత ఆర్మీ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆధారాలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుండబద్ధలు కొట్టారు.
COVID in TS: తెలంగాణలో కొత్తగా 429 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 142 కొత్త కేసులు వెల్లడి
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 32,932 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 142 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41, రంగారెడ్డి జిల్లాలో 33, నల్గొండ జిల్లాలో 22 కేసులు గుర్తించారు.
Statue Of Equality: 120 కేజీల సువర్ణమూర్తిని లోకార్ఫణం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, రామానుజులు దేశ ప్రజల్లో సమతా చైతన్యం నింపారు-రాష్ట్రపతి కోవింద్
Krishnaశ్రీభగవద్రామానుజాచార్యుల 120 కిలోల స్వర్ణమూర్తిని లోకావిష్కరణ చేయడం తన అదృష్టమన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌జీ. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ, మైహోంగ్రూప్‌ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు శ్రీభగవద్రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌.
KCR Fires on Modi: అమెరికా రాజకీయాల్లో వేలు పెట్టడం అవసరమా? అంటూ మోదీపై కేసీఆర్ ఫైర్, కొత్త స్పూర్తి కోసం కొత్త చట్టం రావాల్సిందేనన్న తెలంగాణ సీఎం, అవసరమైతే జాతీయ పార్టీ పెడతా!
Naresh. VNSప్రధాని మోదీ (PM Modi) అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు (Trump) మద్దతివ్వడంపై కూడా కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అమెరికా ఎన్నికలతో (America Elections) మీకేం సంబంధం.. ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా.. ఇది విదేశీ నీతేనా..? అని ప్రశ్నించారు.
Rashtrapathi To Come Hyderabad Today: నేడు ముచ్చింతల్‌కు హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, 120 కిలోల బంగారు రామానుజుల విగ్రహం ఆవిష్కరించనున్న ప్రథమ పౌరుడు
Krishnaముచ్చింతల్ లో సమతామూర్తి ఉత్సవాలల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ లు రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకనున్నారు.
Statue Of Equality: 11వ రోజు వైభవంగా శ్రీభగద్రామానుజుల సహస్రాబ్ది సమారోహం, రామానుజాచార్యుల విగ్రహం ప్రపంచంలో ఎనిమిదో అద్భుతం- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Krishnaముచ్చింతల్‌లోని సమతా క్షేత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషిజీ, అశ్వనీకుమార్ చౌబే, మెగాస్టార్ చిరంజీవి సందర్శించారు. 216 అడుగుల శ్రీభగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు.
CM KCR Yadadri Tour Highlights: యాదాద్రి పర్యటనలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తోంది, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyయాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్‌ శనివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. యాదాద్రి కూడా హైదరాబాద్‌లో కలిసిపోతుందన్నారు. మిషన్‌ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేశామని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని, . భూముల విలువ విపరీతంగా పెరిగిందన్నారు.
MHA: తెలుగు రాష్టాల మద్య సమస్కల పరిష్కారానికి తొలి దఫా చర్చలు, ఈ నెల 17న హాజరు కావాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం, తెర పైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక సమావేశం (MHA Crucial Meeting) ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ఫిబ్రవరి 17న జరగనుంది.
Telangana: ఆయుధాలను పరిశీలిస్తుండగా పేలిన గన్, హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి, మరొక ఘటనలో యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయిన బాలిక
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడేం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌లో తుపాకీ ( gun misfires in Kothagudem) మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందారు.
Medaram Maha Jatara:మేడారం భక్తులకు గుడ్ న్యూస్, ఆన్‌లైన్ ద్వారా మొక్కులు చెల్లించుకునే అవకాశం, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా కానుకలు చెల్లించవచ్చు
Naresh. VNSమేడారం జాతరకు (Medaram Jatara) భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు అధికంగా ఉండడంతో కానుకలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారు. కానుకలు చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదంటోంది కెనరా బ్యాంక్ (Canara bank). క్యూ ఆర్ కోడ్(QR Code) ద్వారా భక్తులు తమ కానుకలను చెల్లించవచ్చని తెలిపింది.
Statue Of Equality 6th Day: ఆరోరోజు అత్యంత వైభవంగా శ్రీభగవద్రామానుజుల సహస్రాబ్ది సమారోహం, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరు
Krishnaసమతా క్షేత్రానికి వీవీఐపీలు తరలివస్తున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌జీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్నారు.
TSRTC Reduced Charges: తెలంగాణలో తగ్గిన ఆర్టీసీ ఛార్జీలు, గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం, ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్న యాజమాన్యం
Naresh. VNSటీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రయాణీకుల‌కు శుభ‌వార్త వినిపించింది. గ‌రుడ ప్లస్ ఛార్జీలు (Garuda Plus charges) త‌గ్గించింది. ప్రయాణికుల‌కు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ఈ నిర్ణయం తీసుకున్నది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్పష్టం చేసింది.
COVID in TS: తెలంగాణలో భారీగా తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో కొత్తగా 767 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో 228 కేసులు నిర్ధారణ
Hazarath Reddyతెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్తగా 767 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 228 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 2,861 మంది కోలుకున్నారు.
TRS MLC Kavitha on Hijab Controversy: స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది, హిజాబ్ వివాదంపై MLC కల్వకుంట్ల కవిత స్పందన..
Krishnaహిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని చెప్పారు.
TRS Mps Protest: ఏపీ విభజనపై ప్రధాని వ్యాఖ్యలు, ఉభయ సభల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌, ప్రధానిపై స‌భా హ‌క్కుల ఉల్లంఘ‌న నోటీసు ఇచ్చిన ఎంపీలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. సాయంత్రం 4 గంట‌ల‌కు స‌భ ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. వెల్‌లోకి దూసుకువెళ్లి నిర‌స‌న (TRS Mps Protest) చేప‌ట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్ర‌ధాని మోదీ రెండు రోజుల క్రితం అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు (Telangana formation remark ) చేసిన విష‌యం తెలిసిందే.
Corona in TS: తెలంగాణలో తగ్గిపోయిన కేసులు, గత 24 గంటల్లో 865 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 263 కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వ్యాప్తి బాగా తగ్గింది. గత 24 గంటల్లో 61,573 కరోనా పరీక్షలు నిర్వహించగా, 865 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 263 కేసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 60 కేసులు నమోదయ్యాయి.