తెలంగాణ
TS Inter Academic Calendar 2021: తెలంగాణలో 2022 మార్చి 23 నుంచి ఇంటర్‌ పరీక్షలు, అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు, మొత్తం 220 పని దినాలు
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్మీడియట్‌ కాలేజీలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 13 వరకు నడుస్తాయని ఇంటర్మీ డియట్‌ బోర్డు తెలిపింది. 2021–22 అకడమిక్‌ కేలండర్‌ను (TS Inter Academic Calendar 2021) బోర్డు సోమవారం విడుదల చేసింది.
Dengue Cases Rise in GHMC: హైదరాబాద్ వాసులను హడలెత్తిస్తున్న డెంగ్యూ జ్వరాలు, తాజాగా మహిళా డాక్టర్ మృతి, భాగ్యనగరంలో రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యూ కేసులు
Hazarath Reddyతెలంగాణ రాజధాని భాగ్యనగరంలో కరోనా తగ్గుతుంటే తాజాగా డెంగ్యూ కేసులు కలవరం (Dengue Cases Rise in GHMC) పుట్టిస్తున్నాయి. తాజాగా డెంగీ వ్యాధి బారిన పడి ఓ వైద్యురాలు మృతి చెందింది. జీడిమెట్ల డివిజన్‌ మీనాక్షీ కాలనీకి చెందిన డాక్టర్‌ అర్పితారెడ్డి (32)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 230 మందికి కోవిడ్, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 5,545 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,636 కరోనా పరీక్షలు నిర్వహించగా, 230 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు వెల్లడయ్యాయి.
Hyderabad Shocker: శాడిస్ట్ భర్త, పొట్టి దుస్తులు వేసుకోవాలని భార్యకు వేధింపులు, ఇంట్లోనే ఉండాలని అత్తామామల పోరు, ఇద్దరి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
Hazarath Reddyపొట్టి దుస్తులు వేసుకుని తన ముందు నిలబడి ఫొటోలు తీసుకోవాలనే భర్త వేధింపులు (Hyderabad Shocker) తట్టుకోలేక భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు అత్తమామలపై కూడా గృహ హింస కింద కేసు నమోదు చేయాలని బాధితురాలు కోరిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ (Banjarahills Police Station) పరిధిలో జరిగింది.
Delta Plus AY-12 Variant: తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకరంగా మారిన ఏవై.12 రకం కరోనా, ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదు, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 178 కేసులు వెలుగులోకి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను ఇప్పుడు ‘ఏవై.12’ రకం కరోనా వేరియంట్ (Delta Plus AY-12 variant) ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కారణమైన డెల్టా ప్లస్ వేరియంట్‌లో ఇది ఉపరకం. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Huzurabad Bypoll 2021: దసరా తర్వాత హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, ఏపీలోని బద్వేల్‌ ఉప ఎన్నిక కూడా అప్పుడే, స్పష్టతనిచ్చిన ఎన్నికల కమిషన్
Hazarath Reddyతెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై (Huzurabad Bypoll 2021) ఎన్నికల కమిషన్ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
HYD Police: ద‌స‌రా బంపర్ ఆఫ‌ర్, ఫేక్ న్యూస్ నమ్మొద్దని కోరిన హైదరాబాద్ పోలీసులు, ఇటువంటివి వ్యాప్తి చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరిక
Hazarath Reddyసోషల్ మీడియాలో అదేపనిగా ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. పండుగ సీజన్లో బంపరాఫర్ అంటూ ఇంకా కొన్ని డిస్కౌంట్లతో కూడిన వార్తలు హల్ చల్ చేస్తుంటాయి. వీటిపై చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వార్త నిజమా కాదా అని తెలుసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని షేర్ చేయకూడదు. తాజాగా హైదరాబాద్ పోలీసులు దీనిపై వార్నింగ్ కూడా ఇచ్చారు.
Airport in Warangal: తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య, వరంగల్‌లో విమానాశ్రయం అభివృద్ధికి సూచనలు
Team Latestlyహైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (హెచ్ఐఏఎల్) కోసం రాయితీ ఒప్పందం గడువు పొడిగింపు గురించి సింధియా తన లేఖలో ప్రస్తావించారు. రాయితీ ఒప్పంద వ్యవధి పొడిగింపు కొరకు HIAL యొక్క అభ్యర్థనను పున:పరిశీలించాలని మరియు దాని సిఫార్సులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు....
Telangana Rains: హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన కుండపోత వాన, జలమయమైన భాగ్యనగరం; తెలంగాణ వ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, మరో మూడు రోజుల పాటు భారీ వర్షసూచన
Team Latestlyతెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి, మరోవైపు ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో స‌ముద్ర మ‌ట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది...
TRS Office in New Delhi: దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయ భవనానికి భూమి పూజ చేసిన కేసీఆర్, మూడు రోజుల పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీకానున్న టీఎస్ సీఎం
Team Latestlyపార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది దసరా నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి వివిధ జాతీయ మరియు ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానించాలని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు....
Krishna Water Dispute: కృష్ణా నీటి వాటాపై కొలిక్కి రాని పంచాయితీ, విద్యుతుత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణకు సూచించిన కృష్ణా రివర్ బోర్డ్, ఏకపక్ష నిర్ణయం అంటూ సమావేశం నుంచి టీఎస్ అధికారుల వాకౌట్
Team LatestlyKRMB వైఖరి ఏకపక్షంగా ఉందని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై వీలైతే టీఎస్ సీఎం కేసీఆర్ గురువారం కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తారని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని వివరించే నివేదికను సమర్పించాలని నిర్ణయించినట్లు సమాచారం....
COVID19 in TS: కళకళలాడిన తెలంగాణ స్కూళ్లు, విద్యార్థుల హాజరు అంతంతమాత్రమే; రాష్ట్రంలో కొత్తగా 322 కోవిడ్19 కేసులు నమోదు, 5852గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyకరోనా భయాందోళనల నేపథ్యంలో మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సందేహిస్తున్నారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత మొదటిసారిగా విద్యార్థులు తరగతులకు హాజరు కావడంతో కొన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణం కనిపించింది....
Telangana: ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్, సెప్టెంబ‌ర్ 2వ తేదీ ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి భూమి పూజ చేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి, దళితబంధు పథకం మరో 4 మండలాలకు వర్తింపు
Hazarath Reddyబేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఢిల్లీకి (KCR went to Delhi) బ‌య‌ల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట ప‌లువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు.
Warangal Shocker: ఆర్థిక లావాదేవీల్లో వివాదం, అన్న కుటుంబాన్ని దారుణంగా నరికి చంపేసిన తమ్ముడు, ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు, వరంగల్ జిల్లాలో ఘటన
Hazarath Reddyవరంగల్‌లోని ఎల్బీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున దారుణం (Warangal Shocker) చోటుచేసుకుంది. సొంత తమ్ముడే అన్న కుటుంబంపై కత్తితో దాడి చేసి ముగ్గురిని (Three of family murdered brutally) హతమార్చాడు.
Schools Opened in TS: తెలంగాణలో 18 నెలల తర్వాత ప్రారంభమైన పాఠశాలలు, పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని కోరిన గవర్నర్ తమిళిసై, విద్యార్థులను తమ సొంత బిడ్డలా చూసుకుంటామని భరోసా ఇచ్చిన మంత్రి సబిత
Hazarath Reddyరాష్ట్రంలో బడి గంట మోగింది. కరోనా నేపథ్యంలో 18 నెలల తర్వాత పాఠశాలలు (Schools Opened in TS) తిరిగి ప్రారంభమయ్యాయి. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ చిన్నారులు స్కూళ్ల‌కు వ‌స్తున్నారు. హైద‌రాబాద్‌లోని రాజ్‌భ‌వ‌న్ స్కూల్‌కు విద్యార్థులు అధిక సంఖ్య‌లో వ‌చ్చారు. మాస్క్‌లు ధ‌రించిన విద్యార్థులు స్కూళ్ల‌కు హాజ‌ర‌య్యారు.
Telangana: తెలంగాణలో బుధవారం నుంచి యధాతథంగా తెరుచుకోనున్న విద్యాసంస్థలు; రాష్ట్రంలో కొత్తగా 338 కోవిడ్19 కేసులు నమోదు, 5,864గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyగురుకులాలు, రెసిడెన్సియల్‌ స్కూళ్లు మినహా మిగతా విద్యాసంస్థలను తెరవటానికి హైకోర్ట్ అనుమతి ఇచ్చినట్లు ఈ సందర్భంగా ఏజీ వివరణ ఇచ్చారు. దీంతో హైకోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా పలు సవరణలు చేస్తూ, సెప్టెంబర్ 1 నుంచి కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతుల...
Kamareddy: ఆ యువతే గొంతు కోసుకుని కట్టు కథ అల్లింది, కామారెడ్డిలో మహిళ హత్యాయత్నం ఘటనను చేధించిన పోలీసులు, గతంలో ప్రేమ వ్యవహారమే ప్రస్తుత ఘటనకు కారణమని అనుమానాలు
Hazarath Reddyకామారెడ్డి మున్సిపాలిటీలోని బర్కత్‌ పురలో వివాహితపై హత్యాయత్నం (Kamareddy incident) ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేశాడన్న యువతి మాటలు బూటకమని తేల్చారు.
Stay on Schools Reopen: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరవడంపై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు, ప్రత్యక్ష బోధనకు విద్యార్థుల హాజరు తప్పనిసరి చేయొద్దని ప్రభుత్వానికి ఆదేశం
Vikas Mandaని విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను వ్యతిరేకిస్తూ బాలకృష్ణ అనే ప్రైవేట్ టీచర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) దాఖలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్19 వ్యాప్తి మరియు థర్డ్ వేవ్ హెచ్చరికల నడుమ ప్రత్యక్ష బోధన సరికాదని పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం మరియు మార్గదర్శకాలు లేకుండానే విద్యా సంస్థలను పున:ప్రారంభించాలని....
Telangana Rains: తెలంగాణలో నేడూ, రేపు భారీ వర్షాలు, గత 24 గంటల్లో సగటున 20 సెంటీమీటర్ల వాన, పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, పలువురు మ‌ృతి
Hazarath Reddyతెలంగాణపై అకాల వర్షాలు (Telangana Rains) విరుచుకుపడ్డాయి. 24 గంటల వ్యవధిలో సగటున 20 సెంటీమీటర్ల వాన (Heavy Rains) కురిసింది. అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. యాదాద్రి జిల్లా రాజుపేట మండలం కుర్రారం వద్ద వాగు దాటుతూ ఇద్దరు యువతులు గల్లంతయ్యారు