తెలంగాణ
CM KCR Review: తెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ, రూ.6వేల కోట్లు కేటాయిస్తునట్లు తెలిపిన సీఎం కేసీఆర్, బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని సీఎంను ఆహ్వానించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Hazarath Reddyతెలంగాణలో త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) తెలిపారు. రెండో విడ‌త గొర్రెల పంపిణీపై సీఎం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రులు హ‌రీష్ రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, అధికారుల‌తో మంగళవారం స‌మీక్ష నిర్వ‌హించారు.
Kokapet & Khanamet Lands Row: కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై అవినీతి ఆరోపణలు, స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్‌లోని కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై (Kokapet & Khanamet Lands Auction) భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) స్పందించింది. భూముల వేలంపై ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో హెచ్చరించింది.
Hyderabad Shocker: కూతురికి కడుపు చేసిన కామాంధుడైన తండ్రి, భార్య ఊరికి వెళ్లడంతో రాత్రి తప్ప తాగి.. భోజనంలో నిద్రమాత్రలు కలిపి కుమార్తెపై అత్యాచారం, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన
Hazarath Reddyదేశంలో రోజు రోజుకు కామాంధులు వావి వరసలు మరచిపోతున్నారు. తాగిన మత్తులో ఎవరిని ఏం చేస్తున్నామో తెలియకుండా..కన్ను మిన్ను కానరాకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కన్నకూతుర్లని కూడా ఈ కామంధులు వదలడం లేదు. తాజాగా కన్న కూతురిపై ఓ కిరాతక తండ్రి (Hyderabad Shocker) లైంగికవాంఛలు తీర్చుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.
Adilabad Shocker: పరాయివాడితో భార్య రాసలీలలు, హెచ్చరించిన భర్త, అడ్డుగా ఉన్నాడని పథకం ప్రకారం హత్య, రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించిన భార్య, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఅదిలాబాద్ జిల్లాలోని భీమారం మండలం పోలంపల్లి సమీపంలో ఐదేళ్ల క్రితం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) కేసును పోలీసులు ఛేదించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్‌ సత్యరాజ్‌ కేసును కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు.
Delta Variant Alert: తెలంగాణలో డెల్టా వేరియంట్ కరోనావైరస్ యాక్టివ్‌గా ఉంది, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరిన ఆరోగ్యశాఖ; రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 746 కోవిడ్ కేసులు నమోదు
Team Latestlyడెల్టా వేరియంట్ ఎప్పుడు బలహీనపడుతుందనే దానిపై అనిశ్చితి ఉంది, కాబట్టి ఈ పండుగల సీజన్లో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కేసుల క్షీణత నెమ్మదిగా ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు కొన్ని చోట్ల కోవిడ్ మళ్లీ తీవ్రరూపం దాలుస్తుంది...
Dalit Empowerment: లబ్దిదారులకు నిరంతరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యం, తమ అభివృద్ధిని తామే నిర్వచించుకోవాలి! తెలంగాణ దళిత బంధు పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్, అధికారులకు దిశానిర్ధేశం
Team Latestlyతమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని సీఎం అన్నారు. తక్కువ కాలంలోనే ఆర్థిక వృద్ధి కలిగించే పరిశ్రమలను పెట్టించడం ద్వారా వారికి నిరంతరమైన జీవనోపాధి లభించే పథకాలను...
RS Praveen Kumar Resigns: బ్రేకింగ్..ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ, 26 ఏళ్ల సర్వీసు చాలా సంతృప్తిని ఇచ్చిందని లేఖలో వెల్లడి
Hazarath Reddyఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎస్‌ పదవికి రాజీనామా (RS Praveen Kumar Resigns) చేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్‌- వీఆర్‌ఎస్‌) కోరుతూ సోమవారం ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (Telangana IPS Officer RS Praveen Kumar) కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు.
Eatala Praja Deevena Yatra: నన్ను చంపేందుకు కుట్ర పన్నారు, ప్రజాదీవెన పాదయాత్రలో ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు, దుబ్బాక సీన్ హుజూరాబాద్‌లో రిపీట్ అవుతుందని తెలిపిన తెలంగాణ మాజీ మంత్రి
Hazarath Reddyమాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ‘ప్రజాదీవెన పాదయాత్ర (Eatala Praja Deevena Yatra) హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రారంభమైంది. కమలాపూర్‌ మండలం బత్తినవారిపల్లె నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరారు.
Kokapet Lands Row: కోకాపేట భూముల వేలంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్, కోకాపేట భూముల సందర్శన, ధర్నాకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్
Hazarath Reddyటీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోకాపేట భూముల సందర్శనకు (Kokapet lands) ఈరోజు వెళతానని ఆయన ప్రకటించారు. కోకాపేట భూముల సందర్శనకు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేష్‌గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీతో కలిసి వెళ్లనున్నట్లు ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున నుంచి భారీగా పోలీసులను మొహరించారు.
Dalit Bandhu: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం, హుజూరాబాద్ నుంచే దళిత బంధు పథకం అమలు, ప్రత్యేకంగా రూ. 2 వేల కోట్ల ప్రభుత్వ నిధుల ఖర్చు
Vikas Mandaహుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈటల రాజేంధర్‌ను ఓడించటానికి ఎన్నో వ్యూహాత్మక అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్, అందులో భాగంగానే 'దళిత బంధు పథకం' పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజవర్గంలోనే అమలుచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు...
Vinayak Chaturthi Festivities in HYD: సెప్టెంబర్‌ 10 నుంచి భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవాలు, 19వ తేదీన నిమజ్జన కార్యక్రమం, ప్రభుత్వం రా మెటీరియల్ టైమ్‌కి ఇవ్వాలని కోరిన భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు (Vinayak Chaturthi Festivities in HYD) నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి (Bhagyanagar Ganesh Utsav Samithi) శనివారం తెలిపింది. ఈ ఏడాది అన్ని జాగ్రత్తలతో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు (Bhagwanth Rao) పేర్కొన్నారు.
Rats Destroyed Currency Notes: పెద్దాయనకు ఎంత కష్టం..వైద్యం కోసం దాచుకున్న రూ.రెండు లక్షల నగదును కొరికేసిన ఎలుకలు, ప్రభుత్వం సహకరించి తన ఆపరేషన్‌కు సాయం చెయ్యాలని వినతి
Hazarath Reddyరెక్కల కష్టం చేసి.. చెమటపెట్టి సంపాదించిన 2 లక్షల నగదును ఎలుకలు కొట్టేయండతో (Rats Destroy Currency Notes) అది పనికిరాకుండా పోయాయి. ఈ భాధాకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఎండ‌న‌క, వాన‌న‌క‌.. నిత్యం కూర‌గాయ‌లు అమ్ముకుంటూ.. వైద్యం కోసం రూ 2 లక్షలు ఓ పెద్దాయన పోగు చేసుకుంటే అవి కాస్తా ఎలుకలకు (rats destroy currency notes worth RS 2 lakh) ఆహారమయ్యాయి.
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు, తెలుగు రాష్ట్రాల మధ్య ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ, ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లు పట్టాలెక్కుతాయని తెలిపిన దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య
Hazarath Reddyరైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తే. కరోనావైరస్ కారణంగా ఆగిపోయిన రైళ్ల సేవలు మళ్లీ మొదలవనున్నాయి. ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. అయితే ఇందులో 66 ప్యాసింజర్ రైళ్లే కావడం (Several train services to be restored) గమనార్హం.
Corona in Telangana: ఆగష్టు చివరి నాటికి థర్డ్ వేవ్ కరోనా వచ్చే అవకాశం; తెలంగాణలో కొత్తగా 715 కరోనా కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో మరో 784 మంది రికవరీ
Team Latestlyఆగస్టు చివరిలో కోవిడ్‌-19 థర్డ్‌ స్టేజ్‌ దేశాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. అయితే సెకండ్‌ వేవ్‌ అంత తీవ్రంగా మూడో దశ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. సూపర్ స్ప్రెడర్...
Water Allocation: ఇకపై కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై పూర్తి అధికారం బోర్డులదే, గెజిట్ విడుదల వివరాలను వెల్లడించిన కేంద్ర జలశక్తి అధికారులు, ఇరు రాష్ట్రాల అవసరాల మేరకు నీటి కేటాయింపులు
Team Latestlyఇకపై కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ ఆయా బోర్డుల పరిధిలోకి రానున్నాయి. వీటిపై పూర్తి పెత్తనం, నిర్ణయాధికారం బోర్డుకే ఉంటుంది, ప్రాజెక్టుల నీటి పంపకాలు, విద్యుదుత్పత్తి బోర్డులే చూసుకుంటాయి....
Heavy Rain Alert: తెలంగాణలో విస్తారంగా వర్షపాతం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మరో రెండు రోజుల వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక
Team Latestlyహైదరాబాద్‌లో భారీ వర్షాలకు సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, డిఆర్‌ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వరదలకు సంబంధించి ఏదైనా అత్యవసర సహాయం కోసం 100 లేదా 040-29555500 డయల్ చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు...
Food Processing Policy: ఆహారశుద్ధి పరిశ్రామిక విధానానికి తెలంగాణ మంత్రి మండలి ఆమోదం, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 3.7 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వ అంచనా, ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకాలు
Team Latestlyఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31 వరకు పొడిగించాలని...
Telangana Govt Jobs: ఉద్యోగ ఖాళీల వివరాలపై అస్పష్టత, ఐదు రోజుల్లో పూర్తి వివరాలు అందజేయాలని అధికారులకు తెలంగాణ కేబినేట్ ఆదేశం, జిల్లాల వారీగా సంఖ్య చూపించాలని సూచన
Team Latestlyఅధికారులు నివేదించిన 28 విభాగాలలో 56,000 ఖాళీలను భర్తీ చేయడానికి కేబినెట్ ఆమోదించింది. హోం శాఖలో అత్యధికంగా 21,500 పోస్టులు ఉన్నాయి, ఆ తరువాత వైద్య, ఆరోగ్య శాఖలో 10,000 మరియు ఉన్నత విద్యలో 3,800 ఖాళీలతో ఉన్నాయి...
COVID in TS: తెలంగాణలో కొత్తగా 749 కరోనా కేసులు నమోదు మరియు 5 మంది మృతి; గడిచిన ఒక్కరోజులో మరో 605 మంది కరోనా నుంచి రికవరీ
Team Latestlyథర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయనే ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చురుకుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలంగాణలో 1.28 లక్షల డోసుల పంపిణీ జరిగినట్లు....
COVID In TS: తెలంగాణలో కరోనావైరస్ థర్డ్ వేవ్..అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించిన రాష్ట్ర మంత్రిమండలి, తాజాగా 767 మందికి కోవిడ్ పాజిటివ్, ఇంకా 10,064 మందికి కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,18,778 కరోనా పరీక్షలు నిర్వహించగా, 767 మందికి పాజిటివ్ గా నిర్ధారణ (Telangana logs 767 COVID-19 cases) అయింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 84 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులను గుర్తించారు. మంచిర్యాల జిల్లాలో 65, పెద్దపల్లి జిల్లాలో 59, నల్గొండ జిల్లాలో 52 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.