తెలంగాణ
TS Covid: తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్, ఇకపై గాంధీ ఆస్పత్రి పూర్తిగా కరోనా పేషెంట్లకే, తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం, ఒక్కరోజే కోవిడ్‌తో 12 మంది మృతి, తాజాగా 4,446 మందికి కరోనా పాజిటివ్
Hazarath Reddyతెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... 4,446 మందికి కరోనా పాజిటివ్ (TS Coronavirus) నిర్ధార‌ణ అయింది. ఒక్క‌రోజులో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,414 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి (Covid Cases in TS) చేరింది.
Telangana Municipal Elections 2021: తెలంగాణలో మోగిన మినీ మునిసిపల్‌ ఎన్నికల నగారా, రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఏప్రిల్‌ 30న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyరాష్ట్రంలో మినీ మునిసిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో ఎన్నికలు (Telangana Municipal Elections 2021) జరగాల్సిన రెండు కార్పొరేషన్లు; ఐదు మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్‌ పార్థసారథి గురువారం షెడ్యూల్‌ జారీ చేశారు.
Nagarjuna Sagar By Election 2021: సాగర్ ఉప ఎన్నికల్లో 9 గంటల వరకు 9.8% పోలింగ్ నమోదు, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్, మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో..
Hazarath Reddyనాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ (Nagarjuna Sagar By Election 2021) ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు, ప్రత్యేక వైద్య బృందంతో పవన్‌కు చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన
Team Latestlyజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు....
Kakarla Subba Rao: దివంగత ఎన్టీఆర్ పిలుపుతో జన్మభూమికి సేవలందించిన డాక్టర్, ప్రముఖ రేడియాలజిస్ట్ డా. కాకర్ల సుబ్బారావు కన్నుమూత పట్ల సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
Team Latestlyఇంజినీరింగ్ చేద్దామనుకుంటే సీట్ రాలేదు, అయితే మెడిసిన్లో సీట్ వచ్చింది. ఇంట్లో చెప్పకుండా మెడిసిన్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అనుకోకుండా స్కాలర్ షిప్ ద్వారా రేడియాలజీ కోర్సు చేయడం కోసం అమెరికాలోని న్యూయార్క్ వెళ్లారు. అక్కడే రేడియాలజీపై ....
Second Wave in TS: గతంలోలాగా కాదు..సెకండ్ వేవ్ అంతకుమించి, తెలంగాణలో వెల్లువలా కేసులు, ఒక్కరోజులోనే 3,840 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 30 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య; ఆసుపత్రుల్లో బెడ్లు పెంచాలని సీఎస్ ఆదేశం
Team Latestlyసెకండ్ వేవ్‌లో తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఒకరోజును మించి ఒకరోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో....
All Students Pass: కరుణ చూపిన కరోనా.. పదో తరగతి పరీక్షలు రద్దు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నేరుగా సెకండ్ ఇయర్‌కి ప్రమోట్, బ్యాక్‌లాగ్స్ ఉన్న వారికి పాస్ మార్క్స్, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాలు
Team Latestlyమే 17 నుంచి జరగాల్సి ఉన్న పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. అయితే ప్రత్యామ్నాయంగా సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు రూపొందించే ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్ష ఆధారంగా పదో తరగతి విద్యార్థుల ఫలితాలు నిర్ణయిస్తామని విద్యాశాఖ పేర్కొంది. బోర్డు ఇచ్చే మార్కులతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే....
TS's COVID Report: గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది, ఇంట్లో కూడా మాస్క్ వేసుకోవాలని హెచ్చరిక; తెలంగాణలో కొత్తగా 3,307 కేసులు నమోదు, కఠిన అంక్షలు విధించే యోచనలో రాష్ట్ర సర్కార్
Team Latestlyకరోనావైరస్ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది, గాలిలో కూడా వైరస్ ఉందని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస రావు అన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించాలని ....
Sanath Nagar Shocker: రూంలో బ్యాచిలర్స్ గొడవ, కూరగాయలు కట్ చేయలేదని ఫ్రెండ్‌పై కత్తితో దాడి, స్నేహితుని పరిస్థితి విషమం, హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
Hazarath Reddyహైదరాబాద్ సనత్ నగర్‌లో దారున ఘటన చోటు చేసుకుంది. బ్యాచిలర్స్ రూంలో ఉంటున్న ఇద్దరు స్నేహితుల మధ్య కూరగాయలు కట్ చేయడంలో గొడవలు రావడంతో ఓ స్నేహితుడు మరో స్నేహితుడిపై దాడికి పాల్పడ్డాడు.
Jagadgirigutta Shocker: ఆన్‌లైన్‌ క్లాస్‌..బాలిక నోరు నొక్కేసి అత్యాచారం, ఆపై వీడియో తీసి పలుమార్లు లైంగిక దాడి చేసిన ఇంటి ఒనర్ కొడుకు, జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో దారుణ ఘటన
Hazarath Reddyహైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధి జగద్గిరిగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై ఇంటి యజమాని కుమారుడు లైంగిక దాడికి (house owner son molestation minor girl) పాల్పడ్డాడు.
Corona in Telangana: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ ఉధృతి.. కొత్తగా 2,157 మందికి పాజిటివ్, రాష్ట్రంలో స్వల్ప కాలంలోనే 25 వేలు దాటిన కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య, మున్ముందు మరింత పొంచి ఉన్న కోవిడ్ ముప్పు
Team Latestlyదేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అకస్మాత్తుగా రోజురోజుకి పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండటం, రికవరీలు తగ్గుతుండటం మూలానా రాష్ట్రంలో కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గత నెల మార్చి 1న తెలంగాణలో 1,907గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే 25 వేలకు చేరుకుంది...
Ambedkar Jayanti 2021:హైదరాబాద్ ట్రాఫిక్ రూట్లలో పలు మార్పులు, ఏప్రిల్ 14వ తేదీ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు సంధర్భంగా ట్రాఫిక్ అడ్వైజరీ చార్ట్ విడుదల చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్, వాహనాదారులు సహకరించాలని సూచన
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 14వ తేదీన ట్రాఫిక్ ఆంక్్షలు విధించనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి, కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) వారి అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో వివరాలను పొందుపరిచారు..
COVID in TS: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన.. కొత్తగా 3,052 కేసులు నమోదు; రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత, 30 లక్షల వ్యాక్సిన్ డోసుల అత్సవసర పంపిణీకి కేంద్రానికి టీఎస్ ప్రభుత్వ విజ్ఞప్తి, కేవలం 3.62 లక్షల డోసులకు ఓకే చెప్పిన కేంద్రం!
Team Latestly, రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో టీకాల పంపిణీని వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజుకు 2 లక్షల డోసుల వ్యాక్సినేషన్ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5.67 లక్షల డోసులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదే విషయమై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్....
CM's Ugadi Message: జీవితంలో కష్టసుఖాలకు, మంచి చెడులకు సాంప్రదాయ చిహ్నమే ఉగాది పచ్చడి.. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్, వ్యవసాయ పనులకు ఉగాదే నాంది అని సందేశం
Team Latestlyఈ ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రంలో నీరు నిండుగా ప్రవహిస్తుందని, తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆశాభావం సీఎం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని కేసీఆర్ అన్నారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందన్నారు.....
Happy Ugadi 2021 Wishes & Greetings: ఉగాది శుభాకాంక్షలు తెలిపే విషెస్, కొటేషన్లు మీకోసం, కరోనా పీడ తొలగిపోవాలని కోరుకుంటూ అందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను ఈ మెసేజ్‌లతో చెప్పేద్దామా..
Hazarath Reddyపులుపు, తీపి, కారం, వగరు, చేదు, ఉప్పు... షడ్రుచుల మిశ్రమమే ఉగాది (Happy Ugadi). వసంతుడు చెరకుగడతో తియ్యటి బాణాలు సంధిస్తాడు... వేప పూత చేదుతో క్రిమికీటకాలునశిస్తాయి.. పుల్లటి రుచితో శరీర తాపబాధ తగ్గుతుంది.. వగరు రుచి సన్నని పొగరు కలిగిస్తుంది.. అందరిలోనూ కలిసిపోతూ రుచిని పెంచుతుంది ఉప్పు కోయిలమ్మ తియ్యటి కంఠస్వరంతో ప్రకృతి పరవశిస్తుంది.. ఇదే ఉగాది పండుగ..
Cyberabad Traffic Police Tweet: షాకింగ్ వీడియోను ట్వీట్ చేసిన సైబరాబాద్ పోలీసులు, మద్యం మత్తులో రోడ్డు పైకి వచ్చిన వ్యక్తిని బలంగా ఢీకొట్టిన వాహనం
Hazarath Reddyసైబరాబాద్ పోలీసులు ట్విట్టర్లో షాకింగ వీడియోను పోస్ట్ చేశారు. మద్యం తాగి రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఓ నాలుగు చక్రాల వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దానికి జతగా మద్యం మత్తులో రోడ్డు పైకి రావద్దు. రాజేంద్ర నగర్ లో జరిగిన ప్రమాదంలో గాయపడిన పాదచారుడు అంటూ కోట్ ఇచ్చారు. #RoadSafety #RoadSafetyCyberabad అంటూ అందరికీ అవగాహన కల్పిస్తూ ముందుకెళుతున్నారు.
Vikarabad: కల్లు తాగి బావిలో ఈత, అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లను వెంటాడిన మృత్యువు, వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో విషాద ఘటన
Hazarath Reddyతెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉగాది పండగకు అత్తారింటికి వచ్చిన ఇద్దరు అల్లుళ్లను మృత్యువు వెంటాడింది. సరదాగా బావిలో ఈతకు వెళ్లి ఇద్దరే మరణించారు. ఓ వ్యక్తి నీట మునిగిపో తుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరొకరు కూడా మృత్యువాత (two sons in law fell into well and death) పడ్డాడు
TS Covid Update: హైదరాబాద్‌లో ప్రమాదకరంగా కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 355 కేసులు నమోదు, రాష్ట్రంలో తాజాగా 2,251 కోవిడ్ కేసులు నమోదు, మాస్కులు ధరించని 6,500 మందిపై పోలీసులు కేసులు నమోదు
Hazarath Reddyకోవిడ్ సెకండ్ వేవ్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,251 పాజిటివ్ కేసులు (TS Covid Update) నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఈమేరకు వివరాలను వెల్లడించింది. ఇదే సమయంలో 565 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.