తెలంగాణ
Tirupathi Reddy On Lagacherla Incident: ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు..లగచర్ల దాడి వెనుక ఎవరున్న వదిలిపెట్టమన్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో భేటీ
Arun Charagondaవికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి.
Hydra: మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు, రాంపల్లిలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా అధికారులు...వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. మేడ్చల్ - నాగారం మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలు చేపట్టారు అధికారులు. రాంపల్లి సమీపంలో రాజ్ సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసిబి సహాయంతో కూల్చివేస్తున్నారు
Telangana: వీడియో ఇదిగో, పొలంలోకి వెళ్లేందుకు రైతులు అవస్థలు, వాగు దాటడానికి పైప్‌నే బ్రిడ్జిగా వాడుతున్న గ్రామంలోని అన్నదాతలు
Hazarath Reddyనిర్మల్ - కుంటాల పరిధి కల్లూరు-పాత బూరుగుపల్లి గ్రామాల మధ్య సుద్దవాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. వాగుకు అవతలి వైపు ఉన్న తమ పొలాల వద్దకు వెళ్లేందుకు ప్రస్తుతం పైపే బ్రిడ్జిగా మారిందని రైతులు వాపోతున్నారు.
Kodangal Lagacherla Incident: ఏ1గా బోగమోని సురేష్, లగిచర్ల ఘటనపై పోలీసుల రిమాండ్ రిపోర్ట్, పథకం ప్రకారమే దాడి చేశారని వెల్లడి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు
Arun Charagondaఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై లగచర్ల గ్రామస్థులు దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కలెక్టర్, అధికారులపై దాడి వెనుక కుట్ర కోణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఐజి నారాయణ రెడ్డి.
Telangana Horror: వీడియో ఇదిగో, ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు, రూ. 16 లక్షల విషయంలో గొడవే కారణం..
Hazarath Reddyభద్రాద్రి కొత్తగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపిన ప్రియుడు వీరభద్రం గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టారు. డెడ్ బాడీని 20 ముక్కలుగా నరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
Ranganath On Bathukamma Kunta: బతుకమ్మ కుంట చెరువుకు పూర్వ వైభవం తెస్తాం, కుంట ప్రాంతంలో ఎలాంటి కూల్చివేతలు ఉండవన్న రంగనాథ్..ప్రజలు ఆందోళన చెందవద్దని వినతి
Arun Charagondaబతుకమ్మ కుంట చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బతుకమ్మ కుంట ప్రాంతంలో ఎలాంటి ఇళ్ల కూల్చివేతలు ఉండవని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు.
Telangana: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళన, వారంలో ఒకసారి ఉండే జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంపై నిరసన
Hazarath Reddyపెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఇక 53 రైళ్లను దారి మళ్లించారు.మరో 7 రైళ్లను రీ షెడ్యూల్ చేశారు.
Mukhra K Villagers: కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి..మహారాష్ట్రలో ముఖ్రా(కె) గ్రామస్తుల ఎన్నికల ప్రచారం, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న గ్రామస్తులు
Arun Charagondaకాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. మహారాష్ట్ర - కిన్వట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖరా కె గ్రామస్తులు ఎన్నికల ప్రచారం చేశారు.
Collector Prateek Jain: తనపై దాడి జరిగింది అనే పదాన్ని వాడకండి, నిరసన కార్యక్రమాలు చేయవద్దని ఉద్యోగులకు సూచించిన కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ కలెక్టర్ గ్రేట్
Arun Charagondaవికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో తనపై జరిగిన దాడి పై స్పందించారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. వాళ్ళు మాట్లాడానికి పిలిచారు మేము కూడ మాట్లాడానికి వెళ్ళాము,తనపై దాడి జరిగింది అనే పదాన్ని వాడోద్దని మీడియాతో చెప్పారు ప్రతీక్ జైన్. దాడికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న కలెక్టరేట్ ఉద్యోగులకు ధర్నా,నిరసన కార్యక్రమాలు లాంటివి ఏమి చెయ్యొద్దని చెప్పారు.
KTR: రైతుల చేతికి బేడిలా?, కాంగ్రెస్ 11 నెలల పాలనలో తెలంగాణ చీకటి మయం అయిందన్న కేటీఆర్, అన్ని వర్గాల ప్రజలను వంచించిన కాంగ్రెస్ అని ఫైర్
Arun Charagondaకాంగ్రెస్ 11 నెలల పాలనపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు కేసీఆర్ పాలనలో పదేళ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణాలో నేడు 11 నెలల కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకున్నాయి అన్నారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల చప్పుళ్లతో అల్లాడుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య, ఉపాధి లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు
Arun Charagondaసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎర్రం కొమ్రయ్య (55) అనే నేత కార్మికుడుకి గత 8 నెలల నుండి ఉపాధి లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందుల వల్ల తెల్లవారుజామున ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు.
Train Derailment In Peddapalli:పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, 37 రైళ్ల రద్దు, పలు రైళ్లు దారి మళ్లింపు
Arun Charagondaతెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో రాఘవాపురం-రామగుండం మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 44 వ్యాగన్లతో కూడిన గూడ్స్ రైలులో 11 వ్యాగన్‌లు పట్టాలు తప్పాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది. దీంతో 37 రైళ్లను రద్దు చేయగా పలు రైళ్లను దారి మళ్లించారు.
Warangal: దొంగగా మారిన ఆర్టీసీ డ్రైవర్, బంగారం కొట్టేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు..ఓ ప్రయాణికుడి వీడియోతో బయటపడ్డ డ్రైవర్ బాగోతం...వీడియో ఇదిగో
Arun Charagondaఓ ఆర్టీసీ డ్రైవర్ దొంగగా మారాడు. మహిళా ప్రయాణికురాలి బ్యాగ్‌లో నుండి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తున్న మహిళ, తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను డ్రైవర్ సీటు వెనకాల పెట్టింది. ఈ క్రమంలోనే ఆ బ్యాగ్‌పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్‌గా నొక్కేశాడు. అయితే, ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్‌లో రికార్ట్ చేయడంతో బండారం బయటపడింది.
CM Revanth Reddy: రైజింగ్ తెలంగాణ మా నినాదం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను విస్మరిస్తున్న ప్రధాని, దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన జరగాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
Arun Charagondaఅభివృద్ధి – సంక్షేమం రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిపై మాకొక స్పష్టమైన విజన్ ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ, రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్స్.. వంటి లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం అన్నారు. ఇప్పుడు మా నినాదం రైజింగ్ తెలంగాణ... చైనా ప్లస్ వన్ కంట్రీకి సరైన మార్గంగా చైనా ప్లస్ తెలంగాణ చూపిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
KTR Slams Congress: పార్టీ మారిన ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చిన కేటీఆర్, అతి పెద్ద గొర్రెల కొనుగోలుదారుడిని అందించినందుకు కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు అంటూ ఖర్గే వ్యాఖ్యలకు కౌంటర్
Hazarath Reddyఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రధాని మోదీ ఎమ్మెల్యేలను గొర్రెలు కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీరు ఒకసారి తెలంగాణ వచ్చి చూస్తే.. ఇక్కడ గొర్రెల వ్యాపారం ఎంత బాగా నడుస్తుందో చూసి ఆశ్చర్యపోతారని విమర్శించారు
KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్
Hazarath Reddyతెలంగాణకు చెందిన అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) స్కీమ్ టెండర్లలో జరిగిన అవినీతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిశీలించాలని కెటి రామారావు (కెటిఆర్) డిమాండ్ చేశారు.
Telangana Land Acquisition Protest: వికారాబాద్‌లో అధికారులపై దాడి, 55 మందిని అదుపులోకి తీసుకున్న పొలీసులు, కలెక్టర్‌పై దాడి ఘటనలో కుట్రదారులెవరో విచారణ చేస్తామని తెలిపిన ప్రభుత్వం
Hazarath Reddyలగిచెర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మరియు ఇతర ఉన్నతాధికారులపై దాడి జరిగిన ఒక రోజు తర్వాత, పోలీసులు కనీసం 55 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు మరియు ఇంటర్నెట్ సేవలను కూడా మూసివేశారు.
Telangana: వీడియో ఇదిగో, స్పెషల్ క్లాసుల పేరుతో కామాంధుడైన టీచర్, ప్రైవేటు పార్ట్స్ తాకుతూ పైశాచికానందం, మహిళా టీచర్‌కు గోడు వెళ్లబోసుకున్న బాధితులు
Hazarath Reddyస్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినుల పట్ల కీచక టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన తెలంగాణలో వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులకు మాత్రమే పాఠాలు చెబుతానంటూ ప్రైవేటు పార్ట్స్ తాకుతూ లైంగిక దాడికి పాల్పడ్డాడు ఫిజిక్స్ టీచర్
Women Fighting in Bus Video: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో సీట్ కోసం తన్నుకున్న మహిళలు, బంగారం పోయిందని మహిళ ఆరోపణ
Hazarath Reddyఆర్టీసీ బస్సులో మహిళలు సీట్ కోసం కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి నుండి ముప్పారం గ్రామానికి వస్తున్న నితీషా(37) అనే మహిళపై సీట్ కోసం ముగ్గురు మహిళలు దాడి చేశారు. దాడిలో తన బంగారు పుస్తెలు అపహరించారంటూ నితీషా ఆరోపించింది.ఈ ఘటనపై పోలీసులకు బస్సు కండక్టర్ ఫిర్యాదు చేశారు.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, ప్రయాణికుల బంగారు ఆభరణాలు దొంగతనం చేసిన ఆర్టీసీ బస్ డ్రైవర్
Hazarath Reddyవరంగల్ నుండి నిజామాబాద్ వస్తున్న బస్సు డ్రైవర్ ప్రయాణికుల బ్యాగు నుంచి బంగారు ఆభరణాలను దొంగిలిస్తుండగా వీడియో తీసిన తోటి ప్రయాణికులు. ఇలాంటి వారిపై ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రయాణికులు.