టెక్నాలజీ

SBI Credit card rules: ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇక మీకు బాదుడే బాదుడు..త్వ‌ర‌లోనే కార్డుల‌పై ఫైనాన్స్ ఛార్జీలు

VNS

క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది. యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.

Big Change In UPI: యూపీఐ లిమిట్ పెంపు, ఆర్బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు

VNS

డిజిటల్‌ చెల్లింపులను పెంచడం, చిన్న లావాదేవీలపై యూపీఐ లైట్‌ని (UPI Lite) ఉపయోగించే వారికి సౌకర్యాలను విస్తరించడమే పరిమితి పెంచడానికి ప్రధాన లక్ష్యమన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని మార్కెట్‌ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ ప్రకారం.. వినియోగదారులకు కోసం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుందని.. యూజర్లు స్వాగతించాలన్నారు.

RBI Monetary Policy Meeting 2024: వ‌రుస‌గా ప‌దోసారి కూడా రెపో రేటు 6.5 శాతంగానే ఫిక్స్, వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Hazarath Reddy

కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) నిర్ణయించింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల ‘ద్రవ్య విధాన కమిటీ భేటీ’లో (RBI Monetary Policy Meeting 2024) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

Nobel Prize in Physics 2024 Winners: ఏఐ రంగంలో చేసిన కృషికి నడిచి వచ్చిన నోబెల్ ప్రైజ్, భౌతికశాస్త్రంలో జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ లకు నోబెల్ ప్రైజ్

Hazarath Reddy

భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ కు జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ ఎంపికయ్యారు. కృత్రిమ నాడీ వ్యవస్థలతో మెషీన్ లెర్నింగ్ ను సాధ్యం చేసేలా వీరిద్దరూ సిద్ధాంతపరమైన ఆవిష్కరణలకు రూపకల్పన చేశారు.

Advertisement

Amazon Buys MX Player: ఎంఎక్స్‌ ప్లేయర్‌‌ని కొనుగోలు చేసిన అమెజాన్, మున్ముందూ ఎంఎక్స్‌ప్లేయర్‌ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని వెల్లడి

Vikas M

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ (Amazon) తన వీడియో స్ట్రీమింగ్‌ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే దిశలో మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ను (MX player) కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

Zomato CEO Deepinder Goyal: డెలివ‌రీ బాయ్‌గా వెళ్లిన జొమాటో సీఈఓకు చేదు అనుభవం, మెట్ల మార్గంలోనే మూడో అంత‌స్తుకు వెళ్లి ఆర్డ‌ర్..

Vikas M

జొమాటో డెలివ‌రీ బాయ్స్ విధుల్లో ఉండ‌గా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా తెలుసుకునేందుకు సీఈఓ దీపింద‌ర్ గోయ‌ల్ డెలివ‌రీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డ‌ర్‌ను క‌లెక్ట్ చేసుకునే క్ర‌మంలో ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అక్క‌డి సెక్యూరిటీ సిబ్బంది దీపింద‌ర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్క‌కుండా అడ్డుకున్నారు.

UPI Transactions in India: దేశంలో ప్రతిరోజు సగటున 493 మిలియన్ల UPI లావాదేవీలు, కీలక విషయాన్ని వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్

Vikas M

Ratan Tata Health Update: రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందంటూ రూమర్స్ స్పందించిన భారత వ్యాపార దిగ్గజం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని వినతి

Hazarath Reddy

భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆరోగ్యం క్షీణించిందటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వ్యాపార వర్గాల్లో కలకలం బయల్దేరింది.ఈ నేపథ్యంలో, రతన్ టాటా స్వయంగా స్పందించారు. ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

SBI Recruitment: బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్, ఎస్బీఐలో ఒకేసారి 10వేల జాబ్స్, పూర్తి వివ‌రాలివిగో..

VNS

మార్చి 2024 నాటికి ఎస్బీఐ బ్యాంక్‌లో (SBI Bank) మొత్తం సిబ్బంది 2,32,296 మంది ఉన్నారు. ఇందులో 1,10,116 మంది అధికారులు గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. “కస్టమర్ అంచనాలు మారుతున్నాయి. సాంకేతికత మారుతోంది.. డిజిటలైజేషన్ విస్తృతంగా పెరుగుతోంది. బ్యాంకులో ఉద్యోగులను అన్ని స్థాయిలలో నిరంతరం రీస్కిల్ చేస్తున్నాం” అని ఆయన చెప్పారు

Ola Showroom Fire: వీడియో ఇదిగో, నెల రోజులుగా సర్వీసింగ్ చేయడం లేదని ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టిన కస్టమర్లు, కర్ణాటకలో ఘటన

Vikas M

ఓలా ఈవీ కస్టమర్లు ఇటీవల కర్ణాటకలో ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టారు. సోషల్ మీడియాలో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్, స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య జరుగుతున్న పోరాటం ఈ పరిణామం జరిగింది. X (గతంలో Twitter)లో ఒక వినియోగదారు షేర్ చేసిన వీడియో, Ola EV కస్టమర్‌లు తమ వాహనాన్ని నెల రోజులుగా సర్వీసింగ్ చేయనందుకు ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టడం చూపిస్తుంది.

Jio Plan Update: జియో ప్లాన్‌లో కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌‌, రెండు పరికరాల్లో కస్టమర్లు స్ట్రీమింగ్‌ను వీక్షించే అవకాశం

Vikas M

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవలే రూ.1029 ప్లాన్‌ను సవరించింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. అప్‌డేట్‌లో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌‌ను జోడించింది.

BSNL New Plan: మోసపూరిత ఎస్సెమ్మెస్‌లపై బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త ఫీచర్, ఇకపై సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు

Vikas M

బీఎస్ఎన్ఎల్ తాజాగా తమ వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. స్పామ్, అవాంఛిత వాణిజ్య ప్రకటనలు (యూసీసీ)పై ఫిర్యాదు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఎస్సెమ్మెస్‌లు, వాయిస్ కాల్స్‌పై బీఎస్ఎన్ఎల్ యూజర్లు ఇప్పుడు సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

Advertisement

SBI Jobs Update: నిరుద్యోగులకు అలర్ట్, ఎస్‌బీఐలో 10 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయం

Vikas M

దేశంలోని అతిపెద్ద రుణదాత, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భారీ ఉద్యోగాల జాతరకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Zomato to Allot Shares to Employees: జొమాటో ఉద్యోగుల‌కు నిజంగా పండుగే! ఏకంగా 1.2 కోట్ల షేర్ల‌ను ఎంప్లాయిస్ కు ఇస్తూ నిర్ణ‌యం, ఎవ‌రెవ‌రికి ద‌క్కుతాయంటే?

VNS

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ (Zomato) అర్హులైన తమ ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్ ఆప్షన్‌లను (12 million shares) మంజూరు చేయడానికి ఆమోదించింది. ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్‌ ప్లాన్‌(ESOP)గా మంజూరు చేసిన మొత్తం షేర్ల సంఖ్య 11,997,768 అని ఇటీవల ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో జొమాటో ప్రకటించింది

Google Tests Verified Check Marks: ఫేక్ వెబ్ సైట్ల‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ బిగ్గెస్ట్ ఫీచ‌ర్, ఇది అందుబాటులోకి వ‌స్తే స్కామ‌ర్ల‌కు ఇక చుక్క‌లే

VNS

వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ (Verified).. అంటే.. మీరు విజిట్ చేసిన ఆ వెబ్‌సైట్ ఫేక్ లేదా రియల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఆయా వెబ్‌సైట్లను ట్రస్ట్‌వర్తీ బిజినెస్ వెబ్ సైట్ అని యూజర్లు సులభంగా గుర్తుపట్టవచ్చు.

BSNL 4G Phone: బీఎస్ఎన్ఎల్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్, చాలా త‌క్కువ ధ‌ర‌లో 4జీ ఫోన్ తీసుకువ‌స్తున్న కంపెనీ, అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో కొత్త ఫోన్

VNS

దేశంలోని ప్రతి మూలకు సరసమైన 4జీ కనెక్టివిటీని తీసుకురావడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌, కార్బన్ మొబైల్స్ (Karbonn Mobiles) చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నాయి. దేశ "4జీ సాథీ పాలసీ" కింద ప్రత్యేక సిమ్ హ్యాండ్‌సెట్ బండ్లింగ్ ఆఫర్‌ను ప్రారంభించనున్నాయి.

Advertisement

Youtube Update: యూట్యూబ్ క్రియేట‌ర్ల‌కు ఇక పండుగే! ఇక‌పై షార్ట్ వీడియోలు 3 నిమిషాల పాటూ అప్ లోడ్ చేయొచ్చు

VNS

కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. షార్ట్స్‌ వీడియోల (YouTube Shorts) నిడివిని పెంచింది. యూట్యూబ్‌లో నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో షార్ట్స్‌ వీడియోలు (Youtube Shorts) ఒకటి. ఇప్పటి వరకూ 60 సెకెన్ల వరకూ ఉన్న షార్ట్స్‌ మాత్రమే అప్‌లోడ్‌ చేసుకునే వీలుండేది.

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కాం, నీ కూతురు సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుందని మహిళకు బెదిరింపులు, గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన బాధితురాలు

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళ 'డిజిటల్ అరెస్ట్' స్కామ్‌లో సైబర్ దొంగల భయాందోళనలకు గురై గుండెపోటుతో మరణించింది. మాల్తీ వర్మ అనే బాధితురాలు డిజిటల్ బ్లాక్‌మెయిల్‌కు గురై అకాల మరణానికి దారితీసినట్లు సమాచారం.

Solar Flare Video: వీడియో ఇదిగో, భూమి వైపు అతి పెద్ద సోలార్ ఫ్లేర్‌ వదిలిన సూర్యుడు, ఏడేళ్లలో ఇదే అతి పెద్దది

Vikas M

అక్టోబరు 3, గురువారం నాడు సూర్యుడు భూమి వైపు ఒక ప్రధాన సౌర మంటను విడుదల చేశాడు. ఈరోజు సూర్యుడు భూమికి ఎదురుగా ఉన్న సౌర మంటను X9-తరగతిగా వర్గీకరించినట్లు NASA తెలిపింది. NASA యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సోలార్ ఫ్లేర్ యొక్క ఇమేజ్‌ని క్యాప్చర్ చేసి, Xలో ఇమేజ్‌ని షేర్ చేసింది

Auto Ride at Rs 1: రూపాయికే ఆటో రైడ్ , బెంగళూరు ప్రజలకు బంపరాఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు

Vikas M

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బెంగ‌ళూరు ప్ర‌జ‌ల‌కు కేవ‌లం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. గ‌త నెల 27 నుంచి ప్ర‌క‌టించిన‌ బిగ్ బిలియ‌న్ డేస్ సేల్ సంద‌ర్భంగా త‌మ యూపీఐ పేమెంట్స్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ ఆఫ‌ర్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు సంస్థ తెలిపింది.

Advertisement
Advertisement