Science

ISRO SSLV-D2 Launch Mission: ఇస్రో సైంటిస్టులకు అభినందనలు తెలిపిన సీఎం జగన్, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

శ్రీహరికోటలో ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌ ప్రయోగం విజయవంత కావడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో విజయం సాధించడంపై సైంటిస్టులకు సీఎం జగన్‌ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ISRO SSLV-D2 Launch Mission: నింగిలోకి దూసుకుపోయిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌, మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌

Hazarath Reddy

ఏపీలోని శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2.. మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. కాగా, 13 నిమిషాల 2 సెకన్లలో రాకెట్‌ ప్రయోగం పూర్తికానుంది. దీని ద్వారా 2 దేశీయ, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాయి

HAL's Helicopter Factory: దేశంలోనే అతిపెద్ద హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం, కర్ణాటకలోని తుమకూరులో ప్రారంభించిన ప్రధాని మోదీ

Hazarath Reddy

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్ణాటక తుమకూరులో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Rare Green Comet: వారంపాటూ ఖగోళంలో అద్భుతం, 50వేల ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా రానున్న తోకచుక్క, విజయవాడ వాసులకు దగ్గరగా చూసే అదృష్టం

VNS

మంచు యుగంలో దాదాపు 50,000 సంవత్సరాల తర్వాత ఈ తోకచుక్క తిరిగి మన దారిలోకి వస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు విజయవాడ (Vijayawada) నగర వాసులు ఈ అరుదైన తోక చుక్కను స్పష్టంగా వీక్షించవచ్చు. నగరానికి ఉత్తర దిక్కున ధృవ నక్షత్రం, సప్తర్షి మండలం మధ్యలో చూడొచ్చునని అంతరిక్ష పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Vagir Submarine: శత్రు దేశాలకు ఇక చావు దెబ్బే, భారత నౌకాదళంలోకి 5వ INS వాగీర్​ సబ్ మెరైన్, అత్యంత నిశబ్దంగా ప్రయాణించగల జలాంతర్గామి ఇదే..

Hazarath Reddy

దేశీయంగా తయారైన వాగిర్ సబ్ మెరైన్ జనవరి 26వ తేదీన భారత ఢిఫెన్స్ లోకి ప్రవేశించనుంది. భారత నావికాదళం ఐదవ స్కార్పెన్ - తరగతికి చెందిన (fifth Submarine of Project 75 Kalvari class) సబ్‌మెరైన్ వాగీర్ (Vagir Submarine) త్వరలో ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో Adm R హరి కుమార్ CNS సమక్షంలో భారత నావికాదళంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.

2023's First Sunrise: ఈ ఏడాది తొలి సూర్యోదయం వీడియో ఇదే, సూర్యుడు మెల్లిగా బయటకు వస్తున్న దృశ్యం నిజంగా అద్భుతమే, కొత్త ఏడాది, తొలి సూర్యోదయం అంటూ ట్వీట్ చేసిన జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా

Hazarath Reddy

కొత్త ఏడాదిలో మొదటి రోజు సూర్యోదయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని జపాన్ వ్యోమగామి కొయిచీ వటాకా చెబుతున్నారు. ఓ ప్రాజెక్టు పనిమీద ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న కొయిచీ.. కొత్త సంవత్సరాన్ని తొలి సూర్యోదయంతో స్వాగతించారు.

Russia-Ukraine War: ర‌ష్యాపై మిస్సైల్‌తో విరుచుకుపడిన ఉక్రెయిన్, సుమారు 400 మంది సైనికులు మృతి, మ‌కీవ్‌కా న‌గ‌రంలో బిల్డింగ్‌ను టార్గెట్ చేసిన మిస్సైల్

Hazarath Reddy

ర‌ష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్‌తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యా ఆక్ర‌మిత డోన‌స్కీ ప్రాంతంలో ఆ క్షిప‌ణి దాడి జ‌రిగింది. మ‌కీవ్‌కా న‌గ‌రంలో ఉన్న ఓ బిల్డింగ్‌ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్‌లో ర‌ష్యా ద‌ళాలు ఉంటున్న‌ట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్ప‌ష్టంగా తెలియ‌దు.

Making Pig Livers Humanlike: మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు, అమెరికాలో గత 12 ఏళ్ల నుంచి శరవేగంగా జరుగుతున్న ట్రయల్స్

Hazarath Reddy

అమెరికాలో మనుషులకు పంది కాలేయాన్ని అమర్చే ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. లివర్ అవయవ కొరతను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు అమెరికాలో గత కొన్నేండ్లుగా ఈ ప్రయోగాలు చేస్తున్నారు. మనిషి కాలేయంలో ఉండే లక్షణాలను పంది కాలేయంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Geminid Meteor Shower 2022:W ఈ రోజు రాత్రి ఆకాశంలో అద్భుతం, స్పష్టంగా కనిపించనున్న జెమినిడ్ ఉల్కాపాతం, జెమినిడ్ ఉల్కాపాతాన్ని ఈ నెల 17 వరకు చూసే అవకాశం

Hazarath Reddy

ఈ రోజు రాత్రి వినువీధిలో అద్భుతం చోటు చేసుకోనుంది. జెమినిడ్ ఉల్కాపాతం ఆకాశంలో అద్బుతాన్ని ఆవిష్కరించనుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉల్కాపాతం (Geminid Meteor Shower) చాలా స్పష్టంగా, అద్భుతంగా కనిపిస్తుంది.

Christmas Asteroid 2022: భూమికి అత్యంత సమీపంలోకి ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’.. ఎప్పుడు వస్తుందంటే??

Rudra

భూమికి అత్యంత సమీపంలో ఓ గ్రహశకలం కనువిందు చేయనున్నది. దీనికి ముద్దుగా ‘క్రిస్మస్ ఆస్టరాయిడ్ 2022’గా పేరు పెట్టారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంత పరిమాణంలో ఉండే ‘2015 ఆర్ఎన్ 35’ పేరుగల ఈ గ్రహశకలం ఈ నెల 15న భూమికి 6,86,000 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్తుందని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.

WHO Measles Updates: తట్టు సోకిన వ్యక్తి ద్వారా మరో 18 మందికి వైరస్ సోకే ప్రమాదం.. డబ్లూహెచ్ వో వెల్లడించిన మరిన్ని ముఖ్యాంశాలు ఏమిటంటే?

Rudra

ప్రపంచవ్యాప్తంగా తట్టు కేసులు అంతకంతకూ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని, ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లూహెచ్ వో) తెలిపింది. తట్టు సోకిన ఓ వ్యక్తి కారణంగా 12 నుంచి 18 మందికి ఈ వ్యాధి సోకొచ్చని హెచ్చరించింది.

Agni-3: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి అగ్ని 3, ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమయిందని తెలిపిన రక్షణ మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

ఒడిశా తీరంలోని APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 యొక్క శిక్షణా ప్రయోగాన్ని భారతదేశం బుధవారం విజయవంతంగా నిర్వహించింది.

Advertisement

Earth Rising On Moon: జాబిల్లిపై ఉదయిస్తున్న పుడమి... దృశ్యాలను చిత్రీకరినించిన జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. వీడియో ఇదిగో!

Rudra

భూమిపై సూర్యోదయం, సూర్యాస్తమయాలు తెలిసిందే. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టే.... భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తుంటాడు. భూమికి చంద్రుడు ఉపగ్రహం. మనకు సూర్యోదయం అయినట్టే, చంద్రుడిపై భూమి ఉదయిస్తుంది. దీనికి సంబంధించిన అద్భుత దృశ్యాలను జపాన్ కు చెందిన లూనార్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ కగుయా చిత్రీకరించింది.

Vikram-S: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి విక్రమ్‌-ఎస్‌, దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ని ప్రయోగించిన ఇస్రో, మిషన్‌ ప్రారంభ్‌ విజయవంతమైందని ప్రకటన

Hazarath Reddy

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి దేశంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌ నింగిలోకి దూసుకెళ్లింది. దేశీయంగా ప్రైవేట్‌ రంగంలో రూపొందిన మొదటి రాకెట్‌ విక్రమ్‌-ఎస్‌.

Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం.. నేడే నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్.. ఉదయం 11.30 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం.. 101 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న అనంతరం సముద్రంలో కూలిపోనున్న రాకెట్

Sriyansh S

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నేడు మరో చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ నిర్మించిన తొలి రాకెట్‌ను నేడు నింగిలోకి పంపనుంది. హైదరాబాద్‌‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ పేరు విక్రమ్ సబార్టియల్ (వీకేఎస్).

Vikram-S: ఇస్రో చరిత్రలో మరో సంచలనం, తొలిసారిగా ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ రేపు నింగిలోకి, ఎర్త్ ఇమేజింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,బ్రాడ్‌బ్యాండ్, GPS సేవలను అందిచనున్న విక్రమ్ ఎస్

Hazarath Reddy

భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-ఎస్' రేపు, నవంబర్ 18న ISRO ప్రయోగించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్‌ను అభివృద్ధి చేసింది. విక్రమ్-ఎస్' ప్రారంభంతో భారతదేశం ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ సంస్థల తయారీలో అరంగేట్రం చేస్తుంది.

Advertisement

Sperm Count: మగాళ్లకు షాకింగ్ న్యూస్, వారిలో వీర్యకణాలు భారీగా తగ్గుతున్నాయని పరిశోధనలో వెల్లడి, వృషణ క్యాన్సర్ బారీన పడి ఆయుష్షు తగ్గిపోతుందని స్టడీలో వెల్లడి

Hazarath Reddy

అంతర్జాతీయ పరిశోధకుల బృందం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో స్పెర్మ్ గణనలలో గణనీయమైన క్షీణతను (decline in sperm counts) కనుగొంది.ఈ స్టడీలో భారత్‌తో పాటు ( including India) ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నదని వెల్లడైంది.

Artemis 1 launch: చంద్రుడిపై శాశ్వత నివాసం కోసం నాసా కీలక ప్రయోగం, ఇప్పటికే రెండు సార్లు ఫెయిలయిన నాసా, ఈ రోజైనా సక్సెస్ అయ్యేనా! నాసా ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచదేశాలు

Naresh. VNS

ప్ కెనావెరల్‌లోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నాసా నిర్వహించనుంది. 2024లో ఆర్టెమిస్‌-2 (Artemis 2) ప్రయోగాన్ని చేపట్టి వ్యోమగాములను కచ్చితంగా చంద్రుడిపైకి (Moon) తీసుకెళ్లాలని నాసా భావిస్తుంది. చంద్రుడిపై శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేయడంలో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నది.

Alien Child in Bihar: బీహార్‌లో వింత శిశువు జననం.. ముక్కులేకుండా జన్మించిన శిశువు.. గ్రహాంతరవాసిగా ప్రచారం..

Sriyansh S

బీహార్‌లో జన్మించిన ఓ వింత శిశువును గ్రహాంతరవాసిగా ప్రచారం చేస్తున్నారు. శిశువు ముక్కు స్థానంలో రెండు కళ్లు ఉండడమే ఈ ప్రచారానికి కారణం. అయితే, కొందరు మాత్రం వినాయకుడు పుట్టాడని చెబుతున్నారు.

Coronary Stent: హృద్రోగులకు శుభవార్త.. ఇకపై అందుబాటులో ‘కరోనరీ స్టెంట్’.. జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో కరోనరీ స్టెంట్‌ను చేర్చిన కేంద్రం.. స్టాండింగ్ నేషనల్ కమిటీ ఆన్ మెడిసిన్స్’ సిఫార్సుల మేరకు నిర్ణయం.. జాబితాలో కొత్తగా చేరిన 34 మందులకు ఇది అదనం

Sriyansh S

హృద్రోగ బాధితులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వారికి అత్యవసర సమయాల్లో వాడే ‘కరోనరీ స్టెంట్’ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో దానిని చేర్చింది. ఫలితంగా ఇది అందరికీ అందుబాటు ధరలో ఉంటుంది.

Advertisement
Advertisement