World

PM Modi Bangla Tour: 'బంగబంధు బ్రతికి ఉంటే బంగ్లాదేశ్ మరో స్థాయిలో ఉండేది'! బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని, కోవిడ్19 వ్యాప్తి తర్వాత నరేంద్ర మోదీ చేస్తున్న మొదటి విదేశీ పర్యటన ఇదే

Team Latestly

శుక్రవారం ఉదయం ఢాకా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సాదర స్వాగతం పలికారు. తొలిరోజు షెడ్యూల్ లో భాగంగా బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎకె అబ్దుల్ మోమెన్ మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం....

New Double Mutant Strain: ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనావైరస్ ఇండియాలో, డబుల్ మ్యుటెంట్ రకంపై కేంద్రం కీలక ప్రకటన, దేశంలో మొత్తం 771 రకాల కరోనా వైరస్‌లు, 18 రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా ఆనవాళ్లు

Hazarath Reddy

దేశంలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. తాజాగా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. ‘డబుల్ మ్యుటెంట్’ రకంగా (Double Mutant Strain) పిలవబడే ఈ వైరస్ వివరాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. బుధవారం ఈ కొత్త కరోనా వైరస్ లు, డబుల్ మ్యుటెంట్ వైరస్ (New double mutant strain) గురించి పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

Sex Acts Inside the Parliament: పార్లమెంట్ లోపల సెక్స్ దుకాణం, బయటి వేశ్యలతో విచ్చ‌ల‌విడిగా శృంగార‌ం, వైరల్ అవుతున్న ఆస్ట్రేలియా పార్లమెంట్‌‌ శృంగార వీడియోలు, ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు, దేశ ప్ర‌తిష్ట‌కు అవ‌మాన‌క‌ర‌మ‌ని ఆవేదన వ్యక్తం చేసిన ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్

Hazarath Reddy

ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్‌ కాస్తా సెక్స్ చేసుకునేందుకు వేదికగా (Sex Acts Inside the Parliament) మారింది. ఆస్ట్రేలియా పార్ల‌మెంట్లో విచ్చ‌ల‌విడిగా శృంగార‌ ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. పార్లమెంట్ భవనం ఆఫీసుల్లోనే సిబ్బంది శృంగారంలో తేలిపోతున్న కొన్ని వీడియోలు ఇప్పుడు ఆస్ట్రేలియా మీడియాలో వైర‌ల్ (Videos of sex acts inside Aus parliament leaked) అయ్యాయి. దీంతో ఆస్ట్రేలియా ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Australia Floods: మెరుపు వరదలు..భయం గుప్పిట్లో వేలాదిమంది ప్రజలు, 1960 తర్వాత ఆ స్థాయి వరదలతో విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా, జలమయమైన సిడ్నీ,న్యూసౌత్ వేల్స్

Hazarath Reddy

అనుకోని వర్షాలతో ఆస్ట్రేలియా అతలాకుతలం అవుతోంది. అక్కడి జనాలు అర్ధరాత్రిళ్లు ఇళ్లొదిలి.. ప్రాణాలు అరచేత పట్టుకుని.. బిక్కు బిక్కుమంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిడ్ని నగరాన్ని, న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాన్ని వానలు (Australia floods) ముంచెత్తాయయి. నదులు పొంగి ఇళ్ళలోకి రావడంతో అక్కడి వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని రోడ్ల మీదకు పరుగులు తీస్తున్నారు.

Advertisement

Imran Khan COVID-19: చైనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే కరోనా, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్యకు కోవిడ్ పాజిటివ్, స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన దంపతులు, డొనాల్డ్‌ ట్రంప్‌ రిసార్టులో కరోనా కలకలం

Hazarath Reddy

పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా పాజిటివ్‌ (Pakistan PM and His Wife Bushra Bibi Test Positive for COVID) తేలింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌ రావడం విస్మయం కలిగిస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో కలకలం రేపుతోంది.

'Superbug' Candida Auris: కరోనా కన్నా మరో ప్రమాదకర వైరస్, కాండిడా ఆరిస్‌ శరీరంలోకి ప్రవేశిస్తే మరణమే, మారుమూల సముద్ర తీరాల్లో జీవిస్తోందని కనుగొన్న శాస్త్రవేత్తలు, సీ ఆరిస్‌ లక్షణాలు ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

ఇండియాలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ కొత్త కొత్త వైరస్ లు దేశాన్ని వణికించేందుకు రెడీ అయ్యాయి. తాజాగా పరిశోధకులు కాండిడా ఆరిస్‌ ('Superbug' Candida Auris) అనే మరో ప్రాణాంతక సూక్ష్మజీవిని కనుగొన్నారు. సీ ఆరిస్‌గా పిలిచే ఈ సూక్ష్మజీవి భారత్‌లోని మారుమూల సముద్ర తీరాల్లో జీవిస్తోందని కనుగొన్నారు. ఇది మనుషుల్లోకి ప్రవేశిస్తే ఇది కరోనా కంటే ప్రాణాంతకమైనదని.. ప్రపంచం మొత్తం వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Sri Lanka Bus Accident: భయానక వీడియో..లోయలో పడిన బస్సు, 14 మంది అక్కడికక్కడే దుర్మరణం, 30 మందికి తీవ్ర గాయాలు, శ్రీలంకలో పసరా పట్టణానికి సమీపంలో విషాద ఘటన

Hazarath Reddy

శ్రీలంకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో (Sri Lanka Bus Crash) పడింది. దీంతో 13 మంది దుర్మరణం పాలవగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించగా ఈ ఘోర ప్రమాదం (Bus crash kills 14 in Sri Lanka) సంభవించింది. శ్రీలంకలోని పసరా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రిసిపైస్‌ గ్రామంలో విషాదం అలుముకుంది.

US Spa Shooting: కాల్పుల మోతతో మళ్లీ దద్దరిల్లిన అమెరికా, ఎనిమిది మంది మృతి, మసాజ్‌ పార్లర్‌, స్పాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో మారు మోగిపోయింది. దుండగులు అట్లాంటాలోని మసాజ్‌ పార్లర్‌, స్పాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా చోటు చేసుకున్న కాల్పుల్లో (US Spa Shooting) ఎనిమింది మంది చనిపోయారు. మృతుల్లో ఏడుగురు మహిళలే ఉండగా.. వీరిలో ఆరుగురు ఆసియన్లు ఉన్నారని పోలీసులు అధికారులు తెలిపారు.

Advertisement

Pakistan SC Slams Imran Khan Govt: పాక్ ప్రధానికి పాలించే సామర్థ్యం లేదు, దేశాన్ని పాలించే పద్ధతి ఇది కాదు, సీసీఐ సమావేశం ఆలస్యంపై ఇమ్రాన్ సర్కారుపై మండిపడిన ఆ దేశ సుప్రీంకోర్టు

Hazarath Reddy

గత రెండు నెలలుగా కామన్ ఇంటరెస్ట్ కౌన్సిల్ (సీసీఐ) సమావేశం ఏర్పాటు చేయడంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విఫలం అవుతూ వస్తున్నారు. ఈ విషయం మీద పాకిస్తాన్‌ ప్రధానిపై ఆ దేశ సుప్రీంకోర్టు ఆగ్రహం (Pakistan SC Slams Imran Khan Govt) వ్యక్తం చేసింది. ఇమ్రాన్‌ఖాన్‌కు దేశాన్ని పాలించడం రావడంలేదని (Incapable of Running Country) ఆక్షేపించింది.

Python Attacks Zookeeper: భయంకరమైన వీడియో, ఫైథాన్ దాడి నుంచి రెప్పపాటులో తప్పించుకున్న యజమాని, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న వీడియో, 9 లక్షలకు పైగా వ్యూస్

Hazarath Reddy

పాములతో వ్యాపారం నిర్వహించడం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే ఇట్టే తెలిసిపొతుంది. కాలిఫోర్నియాలో ఒక జూ నిర్వాహకుడిపై పెద్ద పాము దాడి చేసింది. అయితే ఆయన దాని దాడి (Huge Snake Attacks Zookeeper) నుంచి తృటిలో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Video goes viral in Social Media) అయ్యింది. జే బ్రూవర్ అనే స్నేక్ వ్యాపారి ఈ వీడియోని తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

AstraZeneca Vaccine: వ్యాక్సిన్‌తో గడ్డ కడుతున్న రక్తం, ఆస్ట్రాజెనెకా టీకాను తాత్కాలికంగా నిషేధించిన యూరప్ దేశాలు, తమ టీకా సురక్షితమేనని భరోసా ఇచ్చిన ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ

Hazarath Reddy

ఆ వ్యాక్సిన్ వాడకం అనంతరం రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్లు పడిపోవడం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయంటూ డెన్మార్క్, ఆస్ట్రియా, ఎస్టోనియా, లిథువేనియా, నార్వే, థాయిలాండ్, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లండ్, బల్గేరియా వంటి దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) వినియోగంపై ఈ దేశాలన్నీ తాత్కాలిక నిషేధం విధించాయి.

Coronavirus Pandemic: గబ్బిలాల నుండే కరోనావైరస్ వ్యాపిస్తోంది, సార్స్-కోవ్-2 వైరస్‌‌లో అనేక జన్యు రూపాలు, సంచలన విషయాలను వెల్లడించిన స్కాట్లాండ్‌లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్‌ వైరస్‌ రీసెర్చ్‌ టీం

Hazarath Reddy

నోవల్ కరోనావైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో (Novel Coronavirus Jumped From Bats To Humans) తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది

Advertisement

Sri Lanka to Ban Burqa: బుర్ఖాలు ధరించడం ఇకపై నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న శ్రీలంక ప్రభుత్వం, వెయ్యికి పైగా ఇస్లామిక్ పాఠశాలలను మూసివేస్తున్నామని తెలిపిన ప్రజా భద్రత మంత్రి శరత్ వీరశేఖర

Hazarath Reddy

ఇస్లామిక్ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. ఆ దేశంలో ఇకపై బుర్కా ధరించడాన్ని నిషేధించాలని (Sri Lanka to Ban Burqa) నిర్ణయించింది. అలాగే వెయ్యికి పైగా ఇస్లామిక్ పాఠశాలలను మూసివేయాలని (shut many Islamic schools) నిర్ణయించినట్లు ప్రజా భద్రత మంత్రి శరత్ వీరశేఖర తెలిపారు. దేశంలోని మైనారిటీ ముస్లిం జనాభాను ప్రభావితం చేసేలా తాజా చర్యలు ఉండనున్నాయి.

Coronavirus Scare: ల‌క్ష మందికి పైగా మృతి, షాపులు, రెస్టారెంట్లు, స్కూళ్ల‌ు మూసివేయాలని ఇటలీ ప్రభుత్వం నిర్ణయం, ఆక్స్‌ఫ‌ర్డ్‌ వ్యాక్సిన్ ఆపాల్సిన అవసరం లేదని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో, జాన్సన్ అండ్‌ జాన్సన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం

Hazarath Reddy

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. దేశాలకు దేశాలే మళ్లీ చీకటిలోకి వెళ్లిపోయేలా ఉన్నాయి. అగ్ర దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ కరోనావైరస్ కల్లోలం (Coronavirus Scare) ఆగడం లేదు. తాజాగా ఇట‌లీలో వైర‌స్ కేసులు అధికం అవుతున్న నేప‌థ్యంలో అక్కడ మ‌ళ్లీ క‌ఠిన ఆంక్ష‌లు ( Italy to shut shops and schools) అమ‌లు చేయ‌నున్నారు.

Gautam Adani Beats Elon Musk: గౌతం అదానీ దెబ్బకు ఎలన్‌ మస్క్‌, జెఫ్ బెజోస్‌ అవుట్, 2021లో అత్యధికంగా సంపాదించిన వారిలో నెంబర్ వన్ గా నిలిచిన భారత్‌ వ్యాపార వేత్త , అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్‌ డాలర్లకు చేరిక

Hazarath Reddy

భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్‌ అదానీ సంపాదన భారీగా పెరిగింది. అదానీ గ్రూప్‌నకు చెందిన వివిధ రంగాల షేర్లు అనూహ్యంగా పుంజుకోవడంతో ఈ ఏడాది(2021)లో అతి ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా (Gautam Adani beats Elon Musk) నిలిచారు. ప్రపంచ కుబేరుల్లో నంబర్‌ 1 స్థానానికి పోటీ పడుతున్న ఎలన్‌ మస్క్‌, బెజోస్‌ కంటే అదానీ ఈ విషయంలో ముందున్నారు. అదాని సంపద ( biggest wealth surge) ఓ ఉప్పెనలా ఎగిసిందని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.

Farmers' Protest: భారత రైతు ఉద్యమంపై బ్రిటీష్ పార్ల‌మెంట్‌లో చ‌ర్చ, అంశాలపై చర్చను తప్పు బట్టిన భార‌తీయ హై క‌మీష‌న్, అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశంపై అనుచిత ఆరోప‌ణ‌లు చేస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

సోమ‌వారం రోజున బ్రిటీష్ పార్ల‌మెంట్ సుమారు 90 నిమిషాలు భార‌త్‌లో జ‌రుగుతున్న రైతు నిర‌స‌న‌ల‌పై చ‌ర్చించింది. దీంతో పాటుగా ఇండియాలో ఉన్న ప్రెస్ ఫ్రీడం అంశాన్ని కూడా చ‌ర్చించారు. రైతు నిర‌స‌న‌ల ప‌ట్ల ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును లేబ‌ర్ పార్టీ, లిబ‌ర‌ల్ డెమోక్రాట్స్‌, స్కాటిష్ నేష‌న‌ల్ పార్టీ ఎంపీలు ఖండించారు.

Advertisement

Greece Coronavirus: కరోనాతో కన్నుమూసిన 37 రోజుల పసిబిడ్డ, 17 రోజుల పాటు కోవిడ్‌తో పోరాడి ఓడిన శిశువు, ఘటన తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందంటూ ట్వీట్ చేసిన గ్రీస్ ప్ర‌ధాన‌మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్

Hazarath Reddy

క‌రోనాతో ప‌సిపాప మ‌ర‌ణించిన‌ట్లు గ్రీస్ ప్ర‌ధాన‌మంత్రి కైరియాకోస్ మిసోట‌కిస్ ట్విటర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. 37 రోజుల శిశువు 17 రోజుల పాటు క‌రోనాతో పోరాడి ఓడిపోవ‌డం చాలా బాధాక‌ర‌మైన విష‌యమ‌ని ప్ర‌ధాని తన ట్వీట్ లో పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి చిన్నారిని బ‌లి తీసుకోవ‌డం త‌న‌ను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింద‌న్నారు.

Olivier Dassault Dies: హెలికాఫ్టర్ ప్రమాదం, రాఫెల్ యుద్ధ విమాన తయారీ అధినేత ఒలీవర్‌ డస్సాల్ట్‌ దుర్మరణం, ఆయన మృతి దేశానికి తీరని లోటని తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మెక్రాన్‌

Hazarath Reddy

రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ అధినేత ఒలీవర్‌ డస్సాల్ట్‌ ‌(69) హెల్‌కాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం (Olivier Dassault Dies) చెందారు. వాయువ్య ఫ్రాన్స్‌లోని నార్మండి ప్రాంతంలోని డ్యూవిల్లే యొక్క తీరప్రాంత రిసార్ట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.

International Women’s Day 2021: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8వ తేదీనే ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ?

Hazarath Reddy

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది. మహిళ.. ఒక అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా ఇలా అనేక రూపాలలో ప్రేమను పంచుతుంది.

India Covid Updates: తెలంగాణలో 18 మందికి యుకె కరోనా స్ట్రెయిన్, రాఫ్ట్రంలో తాజాగా 111 మందికి కరోనా, ఏపీలో 136 కొత్త కేసులు, దేశంలో తాజాగా 18,599 మందికి కరోనా పాజిటివ్, తమిళనాడు వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

Hazarath Reddy

విదేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారిలో 18 మందికి బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా (UK covid Strain) ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి చివరివారం వరకు కేవలం లండన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకే హైదరాబాద్‌ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారిని కూడా పరీక్షించి బయటకు పంపిస్తున్నారు.

Advertisement
Advertisement