World

Mayan Calendar: తూచ్..అంతా ఫేక్, మరోసారి తప్పు చెప్పిన మాయన్ క్యాలెండర్, జూన్ 21 యుగాంతం అనేది అంతా అబద్దమే, 2012లో కూడా పుకారు లేపిన మయాన్ క్యాలెండర్

Hazarath Reddy

జూన్ 21, 2020న ప్రపంచం అంతమవుతుందని (End of the world) సోషల్ మీడియాలో నిన్న పుకార్లు బాగా హల్ చల్ చేసిన సంగతి విదితమే. అయితే అదంతా ఒట్టిదే అని తేలిపోయింది. సూర్య గ్రహణం 2020, కరోనావైరస్ (Coronavirus) నేపథ్యంలో ప్రపంచంలోని పలు ప్రాంతాల నుండి చూసిన రింగ్ ఆఫ్ ఫైర్ వంటి అసాధారణ సంఘటనలు జరిగాయే కాని ఎక్కడా యుగాంతం ఆనవాళ్లు కానరాలేదు. ఇదిలా ఉంటే మాయన్ క్యాలెండర్ (Mayan Calendar) ప్రపంచం అంతం గురించి తప్పుగా అంచనా వేయడం ఇది రెండవసారి.

India Coronavirus: ఎనిమిది రోజుల్లో లక్ష కేసులు, భారత్‌లో కరోనా విశ్వరూపం, దేశ వ్యాప్తంగా 4,25,282 కోవిడ్-19 కేసులు, 13,699 మంది మృతి

Hazarath Reddy

భారత్‌లో రోజు రోజుకీ కోవిడ్‌–19 కేసుల సంఖ్య (India Coronavirus) పెరిగిపోతోంది. ఒక్కరోజులోనే 15వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా పాటిజివ్‌ కేసుల సంఖ్య 4 లక్షల 25వేల మార్క్‌ను దాటింది. ఇప్పటివరకూ భారత్‌లో 4,25,282 కరోనా కేసులు (COVID-19 Cases) నమోదు అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 14,821 కొత్త కేసులు నమోదు కాగా, 445మంది మృతి చెందారు. ఇక యాక్టివ్‌ కేసులు 1,74,387 ఉండగా, 2,37,196మంది మహమ్మారి నుంచి కోరుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ వైరస్‌ బారినపడి 13,699మంది ప్రాణాలు కోల్పోయారు.

June 21 Save The Date: ఈ రోజుకు ఎన్నో ప్రత్యేకతలు! ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఒకేసారి మోసుకొచ్చిన 2020 సంవత్సరపు జూన్ 21, నేటి తేదీతో ముడిపడి ఉన్న కొన్ని ముఖ్యమైన దినోత్సవాలను తెలుసుకోండి

Team Latestly

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రోజులు ఈరోజు వేడుక చేసుకోబోతున్నాయి. ప్రపంచ యోగా దినోత్సవం, ఫాదర్స్ డే, ప్రపంచ సంగీత దినోత్సవం, టీషర్ట్ దినోత్సవం, షేక్ హ్యాండ్ డే, హైడ్రోగ్రఫీ డే, హ్యుమనిస్ట్ డే ఇలా 7 అంతర్జాతీయ దినోత్సవాలకు 2020, జూన్ 21 వేదికైంది....

International Yoga Day 2020: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేలా ప్రాణాయామం రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది! అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం

Team Latestly

ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ద్వారా శ్వాసను నియంత్రించడాన్ని మెరుగుపరుస్తుంది. ఆ రకంగా కోవిడ్ -19 తో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి 'ప్రాణాయామం' సహాయపడుతుందని అన్నారు....

Advertisement

Solar Eclipse 2020: సూర్యగ్రహణం నేడే, ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఆకాశంలో అద్భుతం, పలు ప్రత్యేకతలతో ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం

Hazarath Reddy

ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం (Solar Eclipse 2020) ఈ రోజు ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం (Surya Grahan 2020) తెలంగాణలో ఉదయం 10:15 గంటల నుండి మధ్యాహ్నం 1:44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ఏపీలో ఉదయం 10:21 గంటల నుండి మధ్యాహ్నం 1:49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. ఇక విశ్వవ్యాప్తంగా ఉదయం 9:15:58 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు సూర్యగ్రహణం ఉంటుంది.

COVID19 Pandemic: భారత్‌లో 4 లక్షలకు చేరువైన కోవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో అత్యధికంగా 14,516 కేసులు నమోదు, ప్రపంచం 'ప్రమాదకరమైన దశ' లోకి జారుకుందని WHO హెచ్చరిక

Team Latestly

ప్రపంచవ్యాప్తంగా COVID -19 మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచం ఒక "కొత్త మరియు ప్రమాదకరమైన దశ" లోకి నెట్టబడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు....

Reliance Net Debt-Free: జియో ముఖేష్ అంబానీ మ్యాజిక్, రిల్‌లోకి 58 రోజుల్లో రూ.1,68,818 కోట్ల పెట్టుబడులు, రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో ఉందన్న జియో అధినేత

Hazarath Reddy

రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అనుకున్నది సాధించాడు. వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ ను అప్పులు లేని సంస్థగా (Reliance Net Debt-Free) మార్చివేశాడు. కాగా 2021 మార్చి నాటికి ఆర్ఐఎల్ (Reliance) సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దుతానన్న వాగ్దానాన్ని ముందే నెరవేర్చామని ఛైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందుగానే సాధించాం. "రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో" (Reliance In Golden Decade) ఉందని బిలియనీర్ అంబానీ ప్రకటించారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 58 రోజుల్లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,68,818 కోట్లు సేకరించింది.

India-China Face-Off: మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన

Hazarath Reddy

సరిహద్దులో లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో (India-China Face-Off) 76 మంది భారతీయ జవాన్లు గాయపడ్డారని ఆర్మీ (Indian Army) అధికారులు ప్రకటించారు. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని (No Indian Soldier Critical), త్వరలోనే విధుల్లో చేరుతారని అధికారులు వెల్లడించారు. గాయపడినవారిలో 18 మంది లేహ్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారని, వారు మరో 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని తెలిపారు. మిగిలిన 56 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారని, వారంతా రెండు వారాల్లో తిరిగి విధులకు హాజరవుతారని పేర్కొన్నారు.

Advertisement

Chinese Firm’s Contract Cancelled: చైనాకు రైల్వే డీఎఫ్‌సీసీఐఎల్‌ భారీ షాక్, రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు వెల్లడి, చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం

Hazarath Reddy

సరిహద్దుల్లో భారత సైనికుల మరణానికి కారణమైన చైనాపై ఇండియా అన్నివైపుల నుంచి ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా రైల్వే శాఖకు (Indian Railways) చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(DFCCIL) చైనాకు గట్టి షాకిచ్చింది. చైనా సంస్థ యొక్క రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

India Coronavirus: దేశంలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,881 కొత్త కేసులు, నాలుగు లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు (2020 Coronavirus Pandemic in India) మరింత వేగంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,881 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కొత్త కేసులతో (Coronavirus Cases in India) కలిపి ఇప్పటి వరకు నమోదైన కొవిడ్-19 కేసుల సంఖ్య 3,66,946కి చేరినట్టు తెలిపింది. ప్రస్తుతం 1,60,384 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పటి వరకు 1,94,325 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు గత 24 గంటల్లో మరో 334 మంది కరోనా (Coronavirus Pandemic) మహమ్మారికి బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 12,237కు పెరిగింది.

No Fresh Lockdowns: ఇకపై లాక్‌డౌన్‌ ఉండదు, స్పష్టం చేసిన ప్రధాని మోదీ, అన్‌లాక్‌-2 ఎలా అమలు చేయాలన్న దానిపై చర్చించాలని సీఎంలకు ప్రధాని సూచన

Hazarath Reddy

కోవిడ్-19పై జరుగుతున్న పోరాటంలో సమిష్టి కృషి, నిబద్ధతతోనే విజయం వరిస్తుందని ప్రధాని నరేంద్ర∙మోదీ (Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతూనే తగిన జాగ్రత్తలతో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కరోనా నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా ఆయన బుధవారం 14 రాష్ట్రాల సీఎంలు (chief ministers), కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, జమ్మూకశ్మీర్‌ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

India-China Border Violence: ఘర్షణకు ప్రధాన కారణం అదేనా? ఈ నెల 19న ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం, అన్ని పార్టీలకు పిలుపు, మీ త్యాగం దేశం ఎన్నడూ మరచిపోదన్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్

Hazarath Reddy

భార‌త‌, చైనా స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌తలు (India-China Border Face-off) నెల‌కొన్న విష‌యం తెలిసిందే. సోమ‌వారం రాత్రి జ‌రిగిన దాడిలో గాల్వ‌న్‌లో 20 మంది భార‌తీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భార‌త‌, చైనా స‌రిహ‌ద్దు విష‌యాన్ని చ‌ర్చించేందుకు ప్ర‌ధాని మోదీ అఖిల ప‌క్ష స‌మావేశాన్ని (all-party meeting) ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 5 గంట‌ల‌కు అఖిల ప‌క్ష భేటీ ఉంటుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం (PMO Office) పేర్కొన్న‌ది. ఈ స‌మావేశంలో వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అధ్య‌క్షులు పాల్గొంటార‌ని పీఎంవో ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది.

Advertisement

India-China Border Tensions: సరిహద్దుల్లో నెత్తుటి ధారలపై స్పందించిన అమెరికా, అక్కడ అసలేం జరుగుతోంది, 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?

Hazarath Reddy

గాల్వన్ లోయలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితులపై (India-China Border Tensions) అమెరికా స్పందించింది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భారత్‌-చైనా మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులును (India-China Tension) నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా (America) ప్రకటించింది. ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయారనే విషయం మా దృష్టికి వచ్చిందని, అమర జవాన్ల కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని అమెరికా ప్రతినిధి చెప్పారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రస్తుత సమస్య శాంతియుత పరిష్కారానికి తాము మద్దతు ఇస్తామని తెలిపారు. భారత్‌, చైనా సరిహద్దు సమస్యపై జూన్‌ 2న భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌లో చర్చించారని వెల్లడించారు.

India-China Tensions: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, 20 మంది భారత జవాన్లు, 40 మంది చైనా సైనికులు మరణించారని వార్తలు, ప్రధానితో రక్షణమంత్రి అత్యవసర భేటీ

Hazarath Reddy

చైనా ఇండియా మధ్య సరిహద్దుల్లో యుద్ధమేఘాలు (India-China Tensions) కమ్ముకున్నాయి. లడక్ గల్వాన్ లోయలో (Galwan Valley) బలగాల ఉపసంహరణ సమయంలో జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత జవాన్లు (Indian Army Soldiers) చనిపోయారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి కల్నల్ సంతోష్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే 20 మంది భారత జవాన్లు చనిపోయారని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.

India-China Tensions: సరిహద్దుల్లో దాడులతో బరితెగించిన చైనా, భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మృతి, కొనసాగుతున్న రెండు దేశాల మేజర్ జనరళ్ల మధ్య చర్చలు

Hazarath Reddy

భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు (India-China Tensions) తగ్గుతున్నాయని సంకేతాలు అందుతున్న వేళ ఒక్కసారిగా అక్కడ యుద్ధవాతావరణం నెలకొంది. భారత, చైనా సరిహద్దుల్లోని (India China Border) లడఖ్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య సోమవారం రాత్రి జరిగిన ఘర్ణణలో భారత ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు జవాన్లు మరణించారు. మరణించిన వారిలో భారత పదాతిదళానికి చెందిన వారున్నారు. ఈ ఘర్షణతో తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవనియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు (India China Border Tension) నెలకొన్నాయి.

China Coronavirus: చైనాపై మళ్లీ కరోనా దాడి, బీజింగ్‌లో తాజాగా 27 కోవిడ్-19 కేసులు నమోదు, న‌గ‌రంలో ప‌రిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న‌ట్లు అధికారులు వెల్లడి

Hazarath Reddy

చైనా రాజ‌ధాని బీజింగ్‌లో తాజాగా క‌రోనా వైర‌స్ కేసులు (Coronavirus Cases in Beijing) బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఆ న‌గ‌రంలో ప‌రిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. జిన్‌పాడి మార్కెట్‌లో కేసులు బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత‌.. సుమారు ప‌ది ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. అయితే కోవిడ్‌19 కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డం ప‌ట్ల అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో భారీ స్థాయిలో టెస్టింగ్ నిర్వ‌హిస్తున్నారు. న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ వైర‌స్ టెస్టింగ్ చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Coronavirus in India: కరోనాని కట్టడి చేయడం ఎలా ? రాష్ట్రాల సీఎంలతో మరోసారి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌, దేశంలో 3 లక్షల 50 వేలకు చేరువలో కోవిడ్-19 కేసులు

Hazarath Reddy

దేశ ప్రజలను కరోనా వైరస్‌ (Coronavirus in India) గజగజ వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 380 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,43,091 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,53,178 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 1,80,013 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో 9,900 మంది కరోనాతో (Coronavirus Deaths) చనిపోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,10,744 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 4,128 మంది చనిపోయారు. తమిళనాడులో 46,504(మృతులు 479), ఢిల్లీలో 42,829(మృతులు 1,400), గుజరాత్‌లో 24,104(మృతులు 1,506), యూపీలో 14,091(మృతులు 417) కేసులు నమోదు అయ్యాయి.

Indian Officials Missing in Pak: పాకిస్థాన్‌లో ఇద్దరు భారత దౌత్యాధికారులు మిస్సింగ్, అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన భారత్

Hazarath Reddy

దాయాది దేశం పాకిస్థాన్‌లో (Pakistan) ఇద్దరు భారత దౌత్యాధికారులు అదృశ్యం కావడం (Indian Officials Missing in Pak) కలకలం రేపుతోంది. పాక్ లోని ఇస్లామాబాద్‌లో (Islamabad in Pakistan) గల భారత హై కమిషన్‌లో పనిచేస్తోన్న ఆ ఇద్దరు అధికారులు ఒకేసారి కనపడకుండాపోయారని తెలుసుకున్న భారత్‌ దీనిపై స్పందింది. అధికారుల అదృశ్యంపై పాకిస్థాన్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి వారు ఒక్కసారిగా అదృశ్యమైనట్లు తెలిసింది. ఇటీవలే న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్‌లో ఇద్దరు పాక్‌ అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

COVID-19 in India: గత 24 గంటల్లో 325 మంది మృతి, దేశ వ్యాప్తంగా 3,32,424కు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య, నవంబర్‌ రెండో వారం నాటికి గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందన్న ఐసీఎంఆర్‌

Hazarath Reddy

భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య (2020 Coronavirus Pandemic in India) ప్రతి రోజూ పదకొండు వేల మార్కును దాటుతున్నాయి. . గత 24 గంటల్లో దేశంలో 11,502 కేసులు రికార్డు అయ్యాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ (Coronavirus in India) ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో భారత్‌ బ్రిటన్‌ను దాటి నాలుగోస్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 325 మంది మృతి చెందారు.

COVID Treatment Bill: కోవిడ్ చికిత్సకు హార్ట్ ఎటాక్ తెప్పించే బిల్లు! కరోనా నుంచి కోలుకున్న వృద్ధుడికి రూ. 8,52,61,811 బిల్లు వేసిన ఆసుపత్రి, నవ్వులు పోయి నువ్వులైన వేళ ఊరటనిచ్చిన ఆరోగ్య బీమా

Team Latestly

70 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఈ ప్రాణాంతక వైరస్ తో పోరాడాడు, మరణం అంచుల దాకా వెళ్లి మరీ ఈ మహమ్మారిని జయించాడు. దీంతో ఆ పెద్దాయనకు, ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. ఇక ఆనందంతో డిశ్చార్జ్ అయ్యే సమయంలో చికిత్సకు సంబంధించిన బిల్లు...

Advertisement
Advertisement