World

COVID-19 Deaths In Italy: ఇటలీలో పిట్టల్లా రాలిపోతున్న జనం, ఒక్కరోజే 627 మంది కరోనాకు బలి, చైనాను అధిగమించిన ఇటలీ

Hazarath Reddy

చైనాలో (China) పుట్టి ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ (Coronavirus) ప్రపంచదేశాలను నిర్భంధంలోకి నెట్టివేసింది.చైనాలో 80 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి 3,248 మంది చనిపోయారు. అయితే ఇప్పుడు ఇటలీ (Italy) కరోనా దెబ్బకు చావు అంచుల్లోకి వెళ్లింది. ఆ దేశంలో చావులు (COVID-19 Deaths In Italy) చైనాను మించిపోయాయి. ఇటలీలో 41,035 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 3,405 మంది మరణించారు. దీంతో కరోనా మృతులలో చైనాకు ఉన్న రికార్డును ఇటలీ సొంతం చేసుకుంది. ఈ వివరాలను ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

Coronavirus Outbreak in India: తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 3 కలిపి దేశవ్యాప్తంగా 206కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మహారాష్ట్రలో విజృంభిస్తున్న వైరస్

Vikas Manda

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు గురువారం నాటికి 2 లక్షలు దాటాయి, ఇక వీరిలో 85 వేల మంది కోలుకున్నట్లు సమాచారం. అయితే వైరస్ బారినపడి ఇప్పటికి 9,800 మంది ప్రాణాలు కోల్పోయారు.....

Ignaz Semmelweis: చేతులు కడుక్కోవడంపై ఏనాడో చెప్పిన ఓ గొప్పశాస్త్రవేత్త, తల్లులకు పునర్జన్మను ప్రసాదించిన మహానుభావుడు, కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్‌వైస్‌ను స్మరిస్తూ గూగుల్ ప్రత్యేక డూడుల్

Vikas Manda

డాక్టర్ ఇగ్నాజ్ మరణం అత్యంత దురదృష్టకరమైనది. 1865 అతడి మానసిక ఆరోగ్యం క్షీణించింది. ఆయనను ఇతర డాక్టర్లు, సెక్యురిటీ సిబ్బంది కొట్టి పిచ్చోడిగా ముద్రవేశారు. మానసిక రోగుల ఆసుపత్రిలో చేర్చారు.....

Coronavirus Outbreak in India: భారతదేశంలో 173కి పెరిగిన కరోనావైరస్ పాజిటివ్ కేసులు, దేశ ప్రజలనుద్దేశించి ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

Vikas Manda

దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కరోనావైరస్ ను ఎదుర్కోవటానికి చేసే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ప్రజల సహకారం గురించి మోదీ మాట్లాడనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది......

Advertisement

Spring 2020: వచ్చేసింది నవవసంతం, ఆమని ఆగమనంతో కిలకిల రాగాలు పలుకుతోంది లోకం. వసంత రుతువు ప్రారంభమైన సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్

Vikas Manda

వసంత రుతువు సమయంలో, పగలు మరియు రాత్రులు దాదాపు సమానంగా 12 గంటలు ఉంటాయి. ఆ తర్వాత వసంతం వేసవిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు, పగటి కాలం ఎక్కువ మరియు రాత్రులు తక్కువ అవుతాయి....

Coronavirus Pandemic: 7 దేశాల్లో 276 మంది ఇండియన్లకు కరోనా పాజిటివ్, ఒక్క ఇరాన్‌లోనే 255 మందికి సోకిన వైరస్, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం

Hazarath Reddy

విదేశాలకు వెళ్లిన ఇండియన్లపై కరోనా పంజా (Deadly Coronavirus) విసిరింది. మొత్తం 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు వైరస్ (COVDI-19) సోకినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వీరిలో ఇరాన్ లో అత్యధికంగా 255 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకింది. వారంతా లద్దాక్ నుంచి ఇరాన్ పర్యటనకు వెళ్లి చిక్కుకుపోయారు.

Coronavirus War: అమెరికా, చైనాల మధ్య కరోనా వార్, ట్రంప్ ‘చైనీస్ వైరస్’ ట్వీటుపై డ్రాగన్ కంట్రీలో నిరసనలు, అమెరికా సైన్యమే వైరస్ వ్యాప్తికి కారణమంటున్న చైనా

Hazarath Reddy

ప్రపంచాన్ని కరోనావైరస్ (Coronovirus) వణికిస్తోంది. అన్ని దేశాలు కోవిడ్ 19 (COVID-19) దెబ్బకి హడలిపోతున్నాయి. చైనాలోని వుహాన్ లో (Wuhan In China) జన్మించిన ఈ వైరస్ దాదాపు అన్ని దేశాలకు విస్తరించి ముప్పతిప్పలు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ మీద రెండు అగ్ర దేశాల మధ్య వార్ (Coronavirus War) మొదలైంది. ఇప్పుడు కరోనా వైరస్‌పై అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

COVID-19 Outbreak in India: ఇండియాలో కరోనా కల్లోలం, 147 కేసులు నమోదు, ముగ్గురు మృతి, అత్యధికంగా మహారాష్ట్రలో 41 కేసులు నమోదు, విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు

Hazarath Reddy

దేశంలో కరోనా (COVID-19) కేసుల సంఖ్య 147కు.. ఆ వైరస్‌ కారణంగా చనిపోయినవారి సంఖ్య 3కు చేరింది. తెలంగాణలో ఐదో పాజిటివ్‌ కేసు నమోదైంది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కరోనా భారీన పడిన వారిలో (COVID-19 Outbreak in India) 122 మంది భారతీయులు కాగా, 25 మంది విదేశీయులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ర్టలో ఒక్కొక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Coronavirus Treatment: కరోనా కట్టడిలో కీలకమలుపు, కరోనా సోకిన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ పనితీరుపై విజయం సాధించిన ఆస్ట్రేలియా పరిశోధకులు, కరోనా బారిన పడిన మహిళపై పరిశోధన

Hazarath Reddy

కరోనాపై (Coronavirus) పరిశోధనలో శాస్ర్తవేత్తలు ఓ అడుగు ముందుకేశారు. కరోనా వైరస్ (Coronavirus Patient) సోకిన వ్యక్తిలోని రోగ నిరోధక శక్తి ఎలా స్పందిస్తుంది అనే అంశంపై ఆస్ట్రేలియా పరిశోధకులు (Australian researchers) విజయం సాధించారు. ఇదే వ్యాధిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ దిశగా కీలక ముందడుగు పడిందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.

Shirdi Temple Closed Down: కరోనా దెబ్బ, షిర్డీ ఆలయం మూసివేత, నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి అమల్లోకి, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు భక్తులకు సాయి దర్శనం ఉండదు

Hazarath Reddy

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (coronavirus outbreak) మహమ్మారి ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ (Shirdi) పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా ఆలయంలోకి భక్తులను అనుమతించొద్దని (Shirdi Saibaba Temple to Shut) నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

COVID-19 in India: దేశవ్యాప్తంగా 125కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, అత్యధికంగా 39 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర టాప్, తెలంగాణలో 4 కేసులు నమోదు, మహారాష్ట్ర నుంచి వచ్చే వారిపై నిఘా

Vikas Manda

పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై కూడా తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టింది. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే వారిని కూడా స్క్రీనింగ్ టెస్టులు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది......

COVID-19 Patient Recovery Fact: ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడా?, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత ?

Hazarath Reddy

ఇప్పుడు కరోనావైరస్ (Coronavirus) ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని గడగడలాడిస్తోంది. మన దేశంలో ఈ వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. వ్యాధి తీవ్రత ఎంతగా ముదిరినప్పటికీ దానికి విరుగుడు మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఫస్ట్ కరోనా బాధితుడు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాడనే వార్త ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అందులో నిజమెంతో తెలియదు కాని అది బాగా వైరల్ అవుతోంది. కొందరు దీనిని ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.

Advertisement

Coronavirus Cases in India: కరోనా దెబ్బకి మహారాష్ట్ర విలవిల, 32కి చేరిన కోవిడ్ 19 బాధితులు, దేశంలో 107కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు, అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus Scare) వణుకుపుట్టిస్తోన్న సంగతి విదితమే. ఇది ఇండియాలో మరీ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రను (Maharashtra) ఈ కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ కోవిడ్‌ –19 (కరోనా వైరస్‌) మహారాష్ట్రలో వేగంగా వ్యాపిస్తోంది. అక్కడ ఒక్కరోజులోనే 16 మంది కోవిడ్‌ రోగులు (Novel coronavirus cases) పెరిగారు. దీంతో రాష్టంలో కరోనా బాధితుల సంఖ్య 32కి చేరింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

Coronavirus Outbreak: ఇండియాలో 107కి చేరిన కరోనా కేసులు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ధియేట్లరు, స్కూళ్లు, పబ్‌లు, మాల్స్ అన్నీ బంద్, అమెరికాలో అత్యవసర పరిస్థితి విధించిన ట్రంప్ సర్కారు

Hazarath Reddy

కరోనా వైరస్‌ (Coronavirus) దేశంలో వేగంగా విస్తరిస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌లో ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య (Coronavirus In India) 105కు పెరిగింది. మహారాష్ట్రలోనే శనివారం ఐదు కరోనా కేసులు వెలుగుచూడటంతో ఆ రాష్ట్రంలో వైరస్‌ (COVID-19) సోకిన వారి సంఖ్య ఇప్పటికీ 31కి చేరింది. పుణే, ముంబై, నాగపూర్‌, యావత్మాల్‌లో కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వంద దాటగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా దీనిని నిర్ధారించలేదు.

Coronavirus Outbreak in India: రూ.4 లక్షలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కేంద్రం, కరోనా పేషంట్లకు ఆస్పత్రి ఖర్చులు కూడా చెల్లించదు, కొత్త నోటిఫికేషన్ జారీ చేసిన హోం శాఖ

Hazarath Reddy

కరోనావైరస్ (Coronavirus) కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి కేంద్రం నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించిన కొన్ని గంటల తరువాత, ఆ నిర్ణయాన్ని కేంద్రం (Centre) ఉపసంహరించుకుంది. ఈఘోరమైన వైరస్ కారణంగా మరణించిన ప్రజల కుటుంబాలకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కింద రూ. నాలుగు లక్షలు ఇస్తామని ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ వైరస్ కోసం చికిత్స పొందిన ఆసుపత్రి ఖర్చును కూడా చెల్లిస్తామని అందులో నిర్ణయించింది.

TTD Cancels Standing System: టీటీడీ సంచలన నిర్ణయం, భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి, టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే దర్శనానికి అనుమతి, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం రద్దు

Hazarath Reddy

కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి ధాటికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా చెక్ (TTD Cancels Standing System) పెట్టింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (Coronavirus in India) వణికిస్తున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ (TTD EO Anil Singhl) వివరాలను వెల్లడించారు.

Advertisement

Coronavirus Mass Graves: అక్కడ కరోనా సామూహిక సమాధులు, కరోనా మృతులను సామూహిక ఖననం చేస్తున్న ఇరాన్, ఒక్కో సమాధి 100 గజాల పొడవు

Hazarath Reddy

ఇరాన్‌ దేశం అయితే కోవిడ్ 19 (COVID -19) దెబ్బకు విలవిలలాడిపోతోంది. ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా 429 మంది మాత్రమే తమ దేశంలో చనిపోయారని చెబుతున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికే 10, 075 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడ కరోనాతో చనిపోయిన వారిని స్పెషల్ కేసుల కింద పరిగణిస్తున్నారు. వారి కోసం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో సామూహిక సమాధులు (coronavirus Mass Graves) తవ్వుతున్నారు.

Bill Gates: మైక్రోసాఫ్ట్‌‌కు బిల్ గేట్స్ రాజీనామా, పూర్తిగా సామాజిక సేవ వైపు బిలియనీర్, 2014లో ఛైర్మెన్ పదవికి రాజీనామా, మిళిందా ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్

Hazarath Reddy

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ (Bill Gates) మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిల్ గేట్స్ ఇకపై మైక్రోసాఫ్ట్ (Microsoft) సలహాదారుగా కొనసాగనున్నారు. వారెన్ బఫెట్ కంపెనీ నుంచి కూడా ఆయన తప్పుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇకపై బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు సాంకేతిక సలహాదారుగా కొనసాగనున్నారు.

Coronavirus Scare In Bengaluru: ఇన్ఫోసిస్‌కు కరోనా ఎఫెక్ట్, బెంగుళూరులో ఇన్ఫోసిస్‌ కార్యాలయం ఖాళీ, ఉద్యోగికి క‌రోనా పాజిటివ్ అని తేలడంతో అందర్నీ బయటకు పంపిన టెక్ గెయింట్

Hazarath Reddy

కరోనా (Coronavirus)దెబ్బకు దేశం కుదేలవుతోంది. ఎక్క చూసినా జనం భయం భయంగా బతుకుతున్నారు. ఇక కంపెనీలో పనిచేసే వారయితే కరోనా కేసు తగలగానే ఆఫీస్ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు. తాజాగా టెక్ గెయింట్ ఇన్ఫోసిస్ కూడా దీని భారీన చిక్కుకుంది. బెంగుళూరులో (Bengaluru) ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌కు (Infosys) చెందిన ఓ బిల్డింగ్‌ను ఖాళీ చేయించారు. ఆ కంపెనీలో ప‌నిచేస్తున్న ఓ ఉద్యోగికి క‌రోనా సోకిన‌ట్లు తేల‌డంతో.. ఆ బిల్డింగ్‌లో ప‌నిచేస్తున్న వారిని బ‌య‌ట‌కు పంపించారు.

Excise Duty Hike: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం పెంపు, పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు, తాజా నిర్ణయంతో ప్రభుత్వానికి రూ. 2000 కోట్ల మేర అదనపు ఆదాయం వచ్చే అవకాశం

Hazarath Reddy

కోవిడ్‌-19 అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న వేళ పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. లీటరుకు మూడు రూపాయల చొప్పున సుంకాన్ని పెంచినట్లు పేర్కొంది. అదే విధంగా పెట్రోల్‌పై ప్రత్యేక ఎక్సైజ్‌ సుంకాన్ని రూ. 2 నుంచి 8 రూపాయలకు, డీజిల్‌పై రూ.4కు పెంచుతున్నట్లు ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement