ఎంటర్టైన్మెంట్
Singh Rajput Death Case: సుశాంత్ కేసుకు రాజకీయ రంగు, బీహార్ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని క్వారంటైన్‌కి తరలించిన ముంబై పోలీసులు, ఖండించిన సీఎం నితీష్ కుమార్
Hazarath Reddyబాలీవుడ్‌ యంగ్‌హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య (Singh Rajput Death Case) ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్‌ ప్రభుత్వాల (Maharashtra vs Bihar Govt) మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తు కోసం పాట్నా నుంచి ముంబై వెళ్లిన తమ రాష్ట్ర పోలీసు అధికారి వినయ్ తివారీని అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని బీహార్ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఖండించారు.
Anil Murali Passes Away at 56: నటుడు అనిల్‌ ముర‌ళి కన్నుమూత, కాలేయ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మళయాళ హీరో, సంతాపం తెలిపిన మాలీవుడ్ ఇండస్ట్రీ
Hazarath Reddyమ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌టుడు అనిల్‌ ముర‌ళి(56) (Anil Murali Passes Away at 56) క‌న్నుమూశారు. అనారోగ్య కార‌ణంతో కొచ్చిలో నేడు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్నఅనిల్ ముర‌ళి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించారు. అనిల్ మురళి మరణం మలయాళ పరిశ్రమకు తీర‌ని లోట‌ని న‌టులు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), తోవినో థామస్ వంటి వారు సోషల్ మీడియా వేదిక‌గా త‌మ సంతాపాన్ని ప్ర‌క‌టించారు. అనిల్ ముర‌ళికి భార్య సుమ‌, పిల్ల‌లు ఆదిత్యా, అరుంధ‌తి ఉన్నారు.
S. S. Rajamouli COVID-19 Positive: ఎస్. ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్, కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లోకి, కోలుకోగానే ప్లాస్మా దానం చేస్తామని తెలిపిన దర్శక ధీరుడు
Hazarath Reddyదర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా (SS Rajamouli COVID-19 Positive) నిర్దారణ అయింది. ఈ విషయాన్ని జక్కన్న (SS Rajamouli) స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా (Coronavirus) కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు.
Justice for Sushant: నిజాలు బయటకు రావాల్సిందే, సుశాంత్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని సోద‌రి శ్వేతా కీర్తిసింగ్ డిమాండ్, సుశాంత్‌ మృతిపై పోలీసులను ఆశ్రయించిన తండ్రి కెకె సింగ్
Hazarath Reddyబాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కేకే సింగ్‌ (KK Singh) పోలీసులను ఆశ్రయించిన సంగతి విదితమే.. ఇప్పుడు తాజాగా సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించిన కేసులో న్యాయం చేయాల‌ని కోరుతూ సుశాంత్ సోద‌రి శ్వేతా కీర్తిసింగ్ (Sushant Singh Rajput's sister Shweta Kirti Singh) డిమాండ్ చేశారు.
Poonam Pandey Engagement: పూనం పాండే పెళ్లికి రెడీ అయింది, బాలీవుడ్ దర్శకుడు సామ్‌ బాంబెతో హాట్ బ్యూటీ నిశ్చితార్థం, వివాహ తేదీపై ఇంకా క్లారిటీ ఇవ్వని ముద్దుగుమ్మ
Hazarath Reddyఫిలీం ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. నిన్ననే టాలీవుడ్ హీరో నితిన్ వివాహం జరగ్గా.. ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన హాట్ బ్యూటీ పూనమ్ పాండే (Poonam Pandey) వివాహానికి రెడీ అవుతున్నది. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ బాలీవుడ్ దర్శకుడు సామ్‌ బాంబెతో పూనమ్‌ నిశ్చితార్థం (Poonam Pandey - Sam Bombay engaged) జరిగింది. ఈ విషయాన్ని సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. వారిద్దరు రింగ్‌లు మార్చుకున్న ఫొటోను సామ్‌ షేర్‌ చేశారు. ‘చివరకు మేము.. పూర్తి చేసాం’ అని పేర్కొన్నారు. దీనిపై కామెంట్‌ చేసిన పూనమ్‌.. బెస్ట్‌ ఫీలింగ్‌ అని అన్నారు.
Sonu Sood ‘New Mission’: సోనూ సూద్ కొత్త మిషన్, జార్జియాలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాలు, ట్విట్టర్ ద్వారా తెలిపిన సోనూ సూద్
Hazarath Reddyకరోనావైరస్ లాక్డౌన్ మధ్య భారతీయులలో వేలాది మంది వలస కార్మికులు (Migrants) తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి నటుడు సోను సూద్ (Actor Sonu Sood) చేసిన సహాయం ఎవరూ మరచిపోరు. సోషల్ మీడియాలో (Social Media) ఇప్పుడు ఆయన హీరో అయ్యారు. తాజాగా ఏపీలో ఓ రైతు కష్టాన్ని చూసి చలించి ఆయన ఇంటికి నేరుగా ట్రాక్టర్ పంపిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ సోనూ సూద్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Varma vs Pawan Kalyan Fans: పవర్ స్టార్ వర్సెస్ పరాన్న జీవి, ట్విట్టర్ వేదికగా ముదిరిన యుద్ధం, వర్మను కుక్కతో పోల్చిన హీరో నిఖిల్, ఆ నిఖిల్..కిఖిల్ ఎవడో తెలియదంటూ వర్మ రివర్స్ కౌంటర్
Hazarath Reddyదర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా ‘పవర్‌ స్టార్‌’ అనే సినిమా చేయబోతున్నట్లు ట్వీటర్‌ వేదికగా ప్రకటించి సంచలనం రేపిన సంగతి విదితమే. అయితే ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి ట్విట్టర్ వేదికగా వర్మ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ (Varma vs Pawan Kalyan Fans) అన్నట్లుగా వార్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ (Pawan Kalyan Fans) వర్మపై విరుచుకుపడుతుండగా వర్మ ఫ్యాన్స్ (Varma Fans) గబ్బర్ సింగ్ అభిమానుల మీద విరుచుకుపడుతున్నారు.
Nithiin-Shalini Wedding: పెళ్లికి రావాలని తెలంగాణ సీఎంని ఆహ్వానించిన యంగ్ హీరో నితిన్, ఈ నెల 26న హైదరాబాద్‌లో షాలినితో నితిన్ వివాహం, కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం
Hazarath Reddyత్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ ‌హీరో నితిన్‌ తన వివాహ వేడుకకు (Nithiin Wedding) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం (Nithiin Invites Telangana CM K Chandrashekar Rao) పలికారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు స్వయంగా శుభలేఖను అందజేసి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని నితిన్‌ కోరారు. నితిన్‌తోపాటు ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా సీఎం కేసీఆర్‌ను కలిశారు.
#LionInLamborghini: లంబోర్గిని కారులో రజనీకాంత్, ఖుషీ అవుతున్న ఫ్యాన్స్, కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్
Hazarath Reddyతమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్ లంబోర్గిని కారును (Lamborghini Car) స్వయంగా నడుపుతున్నట్లు కనిపిస్తున్న ఓ ఫొటో సోషల్ ‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో రజనీకాంత్ (Rajinikanth) ముఖానికి మాస్క్‌ ధరించి కారును డ్రైవ్‌ చేస్తున్నారు. కాగా ఆయన డ్రైవ్‌ చేస్తున్న కారు ప్రపంచంలో అత్యంత వేగంవంతమైన కార్లలో ఒకటి. సాధారణమైన తెల్లని కుర్తా పైజామా ధరించి తనదైన స్టైల్‌లో లంబోర్గిని కారును నడుపుతున్నట్లు సూపర్‌ స్టార్‌ కనిపిస్తున్నారు.
Suicide or Murder: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఇతివృత్తంగా సినిమా, సూసైడ్ ఆర్ మర్డర్ పేరిట తెరకెక్కిస్తున్న బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా, టిక్ టాక్ స్టార్ సచిన్ తివారీ లీడ్ రోల్
Hazarath Reddyఇటీవలే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ( Sushant Singh Rajput Suicide) చేసుకోగా, ఆయన ఆత్మహత్యకు గల కారణాలేంటనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కొందరు ఇది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ నిర్దిష్ట కారణాలు వెల్లడి కాలేదు కాని..ఆయన మరణంపై సినిమాలు మాత్రం వస్తున్నాయి. సుశాంత్ మృతిని ఇతివృత్తంగా తీసుకుని బాలీవుడ్ నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా 'సూసైడ్ ఆర్ మర్డర్' ( Suicide or Murder) పేరిట సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు.
Upasana Konidela Birthday: ద‌యా హృద‌యంతో నీవు చేసే పనులు ఎప్పటికీ వృధాకావు, శ్రీమతికి చెర్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు, పూల హరివిల్లు మధ్యన ఉపాసన
Hazarath Reddyటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) స‌తీమ‌ణి ఉపాస‌న ఈ రోజు 31వ వ‌సంతంలోకి (Upasana Konidela Birthday) అడుగుపెట్టింది. ఈ సంద‌ర్బంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆమెకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ముఖ్యంగా ఆమె భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ .. త‌న శ్రీమ‌తికి సంబంధించిన ఫోటో ఒక‌టి షేర్ చేస్తూ.. ద‌యా హృద‌యంతో నువ్వు చేసే ప‌నులు చిన్న‌వైన ఎప్ప‌టికీ వృధాకావు. రివార్డులు వ‌చ్చిన కూడా నీ ప‌నుల‌ని ఇలానే కొన‌సాగిస్తావ‌ని ఆశిస్తున్నాను.. హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ చ‌ర‌ణ్ త‌న పోస్ట్‌లో తెలిపారు. ఫోటోలో పూల హ‌రివిల్లు మ‌ధ్య కూర్చున్న ఉపాస‌న (Upasana Kamineni Konidela) దూరంగా దేన్నో నిశితంగా చూస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.
#Prabhas21: ప్రభాస్ 21లో సర్‌ప్రైజ్, డార్లింగ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ దీపిక, అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్
Team Latestlyప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రం రాధా కృష్ణ కుమార్ పాత్రలో 'రాధే శ్యామ్' అనే సినిమాతో బిజీగా ఉన్నారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఇటీవలే ఆవిష్కరించబడింది. యూరప్‌లో ఓ జంట మధ్య ఆవిష్కరింపబడే ప్రేమ కథగా రాధేశ్యామ్ రూపొందుతోంది. మరోవైపు దీపిక తన భర్త రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న '83 సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన 1983 క్రికెట్ ప్రపంచ కప్..
Sushant Singh Rajput Death Case: సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ, బీహార్ ఎంపి పప్పు యాదవ్ లేఖపై స్పందించిన హోంమంత్రి, సుశాంత్ సింగ్ గర్ల్‌ఫ్రెండ్‌కి తప్పని వేధింపులు
Hazarath Reddyసుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై (Sushant Singh Rajput Suicide) సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హోంమంత్రి అమిత్ షాకు బీహార్ ఎంపి పప్పు యాదవ్ (Bihar MP Pappu Yadav) లేఖ పంపారు. బీహార్ ఎంపి పప్పు యాదవ్ ఈ లేఖను షాకు జూన్ 16 న సంబంధిత విభాగం ముందుకు తీసుకెళ్లినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాగా సుషాంత్ మరణించిన సరిగ్గా నెల తరువాత జూలై 14 న పప్పు యాదవ్ అమిత్ షా నుండి నిర్ధారణ లేఖను పంచుకున్నారు.
Sarrainodu Hindi Version: బన్ని సినిమా సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 300 మిల్లియన్స్ వ్యూస్ కొల్లగొట్టిన సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్‌, ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ మాస్ యాక్షన్
Hazarath Reddyస్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ ‘సరైనోడు’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ (Sarrainodu Hindi Version) యుట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఏకంగా మూడు వందల మిలియన్ వ్యూస్ (300 million YouTube views) క్రాస్ చేసి దేశంలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. బన్నీ సినిమాకి దరిదాపులలో ఒక్క హిందీ సినిమా కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని అనలిస్ట్‌ కమల్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు
Love Story: నాగ చైతన్య సినిమాకు కొరియోగ్రఫీ చేయనున్న సాయి పల్లవి, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న 'లవ్ స్టోరీ'!
Team Latestlyసాయి పల్లవి మంచి నటి మాత్రమే కాదు, తన డాన్సింగ్ స్కిల్స్ తో కూడా ఎంతో మందిని ఫిదా చేసింది, తాను స్వతహాగా మంచి శిక్షణ పొందిన డాన్సర్ కూడా. దీనిని దృష్టిలో పెట్టుకొని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన లవ్ స్టోరీలో...
Chiranjeevi's 'Acharya': మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఆసక్తికరం, చెర్రీతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కు కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ ఫిక్స్, మరిన్ని విశేషాలు చదవండి
Team Latestlyఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ నక్సలైట్ పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి. మరోవైపు రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల కాంబినేషన్లో ఎస్.ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న RRR సినిమాపై కూడా అభిమానుల్లో ఆత్రుత నెలకొని ఉంది...
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ, ముంబై నానావతి ఆసుపత్రిలో చేరిక, త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల సంఘీభావం
Team Latestlyనాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను, ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక నాతో....
Radhe Shyam First Look: ప్రభాస్ న్యూ లుక్ వెరీ రొమాంటిక్, అదరగొడుతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే, రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదల
Hazarath Reddyఅభిమానులు ఎంత‌గానో ఎదురుచూసిన ప్ర‌భాస్ 20వ సినిమా ఫస్ట్‌లుక్ (Prabhas 20 First Look) రానే వ‌చ్చింది. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఏమాత్రం మెరుపు త‌గ్గ‌ని ప్ర‌భాస్ (Prabhas) రాయ‌ల్ లుక్‌లో అద‌ర‌గొడుతున్నాడు. బాహుబలి' తరువాత గత సంవత్సరం 'సాహో'తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్, ఇప్పుడు 'జిల్' దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తన 20వ చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి 'రాధే శ్యామ్' అనే (Radhe Shyam First Look) టైటిల్ని ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు.
Suddala Ashok Teja: నేను మీ దయతో బాగానే ఉన్నాను, పుకార్లు నమ్మకండి, వీడియో ద్వారా సందేశాన్ని పంపిన గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ
Hazarath Reddyప్రముఖ తెలుగు సినిమా గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ (Suddala Ashok Teja) తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని ఓ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఆరోగ్యం విషమించిందనే వార్తల్లో (health condition) ఎలాంటి నిజం లేదని అలాంటి పుకార్లు నమ్మవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
Dil Bechara: 'పుట్టుక, చావు మన చేతుల్లో లేవు కానీ ఎలా బ్రతకాలనేది మన చేతుల్లోనే ఉంది'! కంటతడి పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బెచారా' ట్రైలర్
Team Latestlyఒక రాజు.. ఒక రాణి, ఇద్దరు చనిపోయారు.. కథ సమాప్తం'! అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా జూలై 24న నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌ షో వేయబడుతోంది...