సినిమా

Vijay Devarakonda: యూరీ సెక్టార్లో భారత సైనికులతో విజయ్ దేవరకొండ... ఆర్మీ జవాన్లతో సరదాగా గడిపిన టాలీవుడ్ హీరో.. ఫైరింగ్ రేంజ్ లో తుపాకీ చేతబట్టిన వైనం.. ఫొటోలు ఇవిగో!

Jai K

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ జమ్మూ కశ్మీర్ లో సరిహద్దు ప్రాంతానికి వెళ్లారు. బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరీ సెక్టార్ ను సందర్శించారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న భారత సైనికులను కలిసి, వారితో సరదాగా ముచ్చటించారు. సైనిక జాకెట్ ధరించి, తుపాకీ చేతబట్టారు.

Katragadda Murari: ‘గోరింటాకు’, ‘త్రిశూలం’, ‘అభిమన్యుడు’, ‘సీతారామ కల్యాణం’, ‘శ్రీనివాస కల్యాణం’, ‘జానకి రాముడు’, ‘నారీనారీ నడుమ మురారి’ వంటి మ్యూజికల్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూత.. చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచిన మురారి

Jai K

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత రాత్రి చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Vishnu on Adipurush: ‘ప్రేక్షకుల్ని మోసం చేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నేను కూడా మోసపోయా.. ఇదొక యానిమేటేడ్ సినిమా అని చెప్పి ఉంటే ఇన్ని ట్రోల్స్ వచ్చేవి కాదుకదా’.. ఆదిపురుష్ టీజర్‌పై మంచు విష్ణు రియాక్షన్

Jai K

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా ఆదిపురుష్‌ గురించి తాను ఏదో ఊహించుకున్నానని, కానీ టీజర్ తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ప్రముఖ నటుడు మంచు విష్ణు అన్నారు. లైవ్, యాక్షన్ చిత్రంగా రామాయణాన్ని ఆవిష్కరిస్తారని ఆశించానని కానీ, ఇదొక యానిమేటెడ్ మూవీ అని అనుకోలేదని అన్నారు.

Lakshmi Parvathi Fire: ‘ఛీ..ఛీ.. బాలకృష్ణ అంటేనే రోత పుడుతోంది.. అతడు ఎన్టీఆర్ కొడుకేనా అని అసహ్యం కలుగుతోంది. ఆ షో చూస్తుంటే, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినవాళ్లు ఒకరినొకరు సమర్థించుకున్నట్టుగా ఉంది’.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై లక్ష్మీపార్వతి తీవ్ర వ్యాఖ్యలు

Jai K

నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ 2 కోసం ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై చిత్రీకరించిన ఎపిసోడ్ పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా దీనిపై స్పందించారు.

Advertisement

NTR-CBN Episode: ఎన్టీఆర్‌కు వెన్నుపోటుపై చంద్రబాబు వివరణ ఇదీ! 27 ఏళ్ల తర్వాత నోరు విప్పిన చంద్రబాబు, బావమరిదితో కలిసి ప్రజలకు వివరణ, ఎన్టీఆర్ దగ్గరికి ఎవరెవరు వెళ్లి మాట్లాడారో తెలుసా?

Naresh. VNS

ఆ రోజు పార్టీ కోసం ఆయనతో విబేధించాను. ఆయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలి. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తీసుకున్నది తప్పా. ఆయన చెప్పింది ప్రతిదీ చేశాను. ఆయన నాకు ఆరాధ్యదైవం. ఆయనకి నా మీద నమ్మకం ఉంది.

Mani-Rajani combo: 30 ఏళ్ల తరువాత ‘మణి’తో తలైవా! 'పొన్నియిన్ సెల్వన్' హిట్ తో ఫాంలోకొచ్చిన మణిరత్నం.. దిగ్దర్శకుడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్?!

Jai K

రజనీకాంత్, మమ్ముట్టి కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం 'దళపతి'. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్లలోను రజనీకాంత్ - మణిరత్నం మళ్లీ కలిసి పనిచేయలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

Varma Tweet: నా చూపు కూడా అనుష్క ఫోటో మీదే, అందుకే పైనుంచి కిందకు చూశా, గరికపాటి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోని షేర్ చేసిన వర్మ, మీరు కూడానా బాహుబలిగారు అంటూ కొంటె వ్యాఖ్యలు

Hazarath Reddy

గరికపాటి-చిరంజీవి వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. తాజాగా గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని ఆర్టీజీవి ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!’అని క్యాప్షన్‌ ఇచ్చాడు

RGV Tweets on Garikapati: ఈ సారి గరకిపాటిని టార్గెట్ చేసిన వర్మ, ట్విట్టర్లో దారుణంగా విమర్శలు

Hazarath Reddy

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్‌ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.తాజాగా రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా విమర్శలతో మండిపడ్డారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు

Advertisement

Amitabh Bachchan Birthday: హ్యాపీ బర్త్‌డే అమితాబ్ బచ్చన్. దాదాకు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రజినీ కాంత్

Hazarath Reddy

బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.తాజాగా రజనీకాంత్ దాదాకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Filmfare Awards South 2022:  67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఏడు అవార్డులతో సత్తా చాటిన పుష్ప, ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్ 

Hazarath Reddy

అల్లు అ‍ర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది.

Nayanthara and Vignesh: పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులైన నయన్‌, విగ్నేష్, కవలల పాదాలను ముద్దాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్, మా లైఫ్‌లో కొత్త చాప్టర్ మొదలైందంటూ సంబరపడుతున్న సెలబ్రెటీ కపుల్

Naresh. VNS

తమ లైఫ్ లో ఇది ఒక కొత్త చాప్టర్ అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు ఈ దర్శకుడు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్.

Stay on Adipurush: 'ఆదిపురుష్' ను వీడని కష్టాలు... టీజర్ లో రాముడ్ని, ఆంజనేయుడ్ని అసంబద్ధంగా చూపించారని లాయర్ ఆరోపణ.. ఢిల్లీ కోర్టులో పిటిషన్.. టీజర్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి

Jai K

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమా టీజర్ ను యూట్యూబ్ తదితర వేదికల నుంచి తొలగించాలని, సినిమా విడుదలపై స్టే విధించాలని ఆ పిటిషన్ లో కోరారు.

Advertisement

Kushboo in Hospital: హాస్పిటల్ బెడ్‌ మీద కుష్భూ, ఇంతకీ ఆమెకు ఏమైందో తెలుసా? ఆస్పత్రి బెడ్‌ మీద నుంచే సెల్ఫీ పోస్ట్ చేసిన అలనాటి హీరోయిన్, త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ట్వీట్స్

Naresh. VNS

అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో (Hospital) అడ్మిట్ అయ్యినట్లు తెలుస్తుంది. తమిళ, తెలుగుతో పాటు పలు భాషల్లో నటించిన కుష్బూకి.. తమిళనాట ఏకంగా గుడి కట్టించుకునే అంత అభిమానం సంపాధించుకుంది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. సినీ నటిగానే కాదు, రాజకీయవేత్తగా (Politician) కూడా ఆమె సేవలు అందిస్తూ వస్తుంది.

Arun Bali Dies: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం, మస్తీనియా గ్రావిస్‌ నాడీ కండరాల వ్యాధితో కన్నుమూసిన ప్రముఖ బాలీవుడ్ నటుడు అరున్‌ బాలి

Hazarath Reddy

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అరున్‌ బాలి(79)కన్నుమూశారు. మస్తీనియా గ్రావిస్‌ అనే అరుదైన నాడీ కండరాల వ్యాధితో బాధపడుతున్న బాలి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు.3 ఇడియట్స్‌, పీకే వంటి హిట్‌ సినిమాలతో పాటు అనేక సీరియళ్లు, సినిమాల్లో ఆయన నటించారు.

Dhanush-Aishwaryaa: పిల్లల సంతోషం కోసమైనా విడాకులు రద్దు చేసుకోండి.. ధనుష్, ఐశ్వర్యలను ఒప్పించిన రజనీకాంత్? త్వరలో అధికారిక ప్రకటన..

Jai K

ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర అశాంతితో ఉంటున్నారు. విభేదాలను పక్కనబెట్టి కనీసం పిల్లల కోసమైనా విడాకులపై పునరాలోచించుకోవాలని రజనీకాంత్ తన అల్లుడు ధనుష్ కు, కుమార్తె ఐశ్వర్యకు సూచించారు.

Naga Babu vs Garikapati: చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే అందరికీ అసూయ కామనే, గరికపాటికి ఇన్‌డైరక్ట్‌గా కౌంటర్ విసిరిన నాగబాబు

Hazarath Reddy

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై వ్యాఖ్యలపై చిరంజీవి తమ్ముడు నాగబాబు వ్యంగ్యంగా స్పందించారు. 'ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే' అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

Adi Purush Controversy: మహారాష్ట్రలో ఆదిపురుష్ సినిమాకు ఎదురుదెబ్బ, ధియేటర్లలో ఈ సినిమా విడుదల కానివ్వబోమని హెచ్చరించిన విశ్వహిందూ పరిషత్

Hazarath Reddy

పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ విషయంలో రోజుకో కొత్త వివాదాలు వస్తున్నాయి.తాజాగా విశ్వహిందూ పరిషత్ పబ్లిసిటీ విభాగం హెడ్ అజయ్ శర్మ ఓ ప్రకటన విడుదల చేస్తూ వివాదాస్పద చిత్రం ఆదిపురుషను ఏ సినిమా హాలులో విడుదల చేయవద్దని హెచ్చరించారు.

AP Minister Roja: ఏపీ మంత్రి రోజాకు ఘోర అవమానం, స్టేజీ మీద అందరూ చూస్తుండగానే, మెడలోని దండ విసిరికొట్టి ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు..ఏం జరిగింది..

kanha

జబర్దస్త్ ద్వారా ఎంతో సేమ్ సంపాదించుకున్నా మంత్రి రోజా ఎట్టకేలకు మరోసారి ఈటీవీలో కనిపించారు ఈసారి దసరా సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఈవెంట్ లో మంత్రి రోజా తళుక్కుమన్నారు.

Varma on KCR BRS Party: కేసీఆర్‌ తొలి ఆదిపురుష్‌, సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, జాతీయ రాజకీయాల్లో రావడాన్ని స్వాగతిస్తున్నానంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి టీఆర్‌ఎస్‌ పేరు కనుమరుగు కానుంది. 2001 జలదృశ్యం సభలో టీఆర్‌ఎస్‌ అవతరించింది.

KTR Fun with Gangavva: వైరల్ వీడియో, గంగవ్వతో మంత్రి కేటీఆర్ జోకులు, నువ్వన్న మాటలకు మహేష్ బాబు ఫీలవుతాడు గంగమ్మ అన్న మంత్రి కేటీఆర్

Hazarath Reddy

కరీంగనర్‌ కళోత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌.. మై విలేజ్‌ షో ఫేమ్‌ గంగవ్వతో కలిసి జోకులు వేశారు. తప్పకుండా మై విలేజ్‌ షోకి గెస్ట్‌గా వస్తాను అని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. గంగవ్వని సోషల్ మీడియాలో చాలాసార్లు చూశా కానీ.. స్వయంగా కలిసింది లేదు.

Advertisement
Advertisement