సినిమా
Pakistan Model Sauleha Apology: క‌ర్తార్‌పూర్‌ గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లో ఫోటో షూట్, క్షమాపణలు చెప్పిన పాకిస్థాన్‌ మోడ‌ల్‌ సౌలేహ
Hazarath Reddyపాకిస్థాన్‌కు చెందిన మోడ‌ల్‌ సౌలేహ సిక్కు మ‌త‌స్థుల‌ను అవ‌మానించే విధంగా క‌ర్తార్‌పూర్‌లో (Gurdwara Darbar Sahib in Kartarpur) ఉన్న గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లో ఫోటో షూట్ నిర్వ‌హించింది. ఆ ఫోటోల‌ను (Bareheaded Photo) ఆమె సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.
Sivasankar Master No More: ప్రముఖ డాన్స్ మాస్టర్ శివశంకర్ జీవిత విశేషాలు ఇవే...
KrishnaSivasankar Master: ప్రముఖ డాన్స్ మాస్టర్ శివశంకర్ కరోనాతో కన్నుమూశారు. కరోనా తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల మాస్టర్‌ను వెంటిలేటర్‌పై పెట్టి వైద్యులు చికిత్సను అందించారు. ఆయనకు కొందరు సినీ ప్రముఖులు ఆర్థికంగా సాయం కూడా చేశారు. అయినా మాస్టర్ కరోనాతో పోరాడలేక వెనుదిరిగారు.
Shiva Shankar No More: సినీ పరిశ్రమలో విషాదం, కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత, నివాళులు అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు
Naresh. VNSప్రముఖ కొరియోగ్రాఫర్‌(Choreographer ), నటుడు(Actor) శివ శంకర్‌ మాస్టర్‌(72)( Shiva Shankar) కన్నుమూశారు. ఇటీవల కరోనా(Corona) బారిన పడిన ఆయన హైదరాబాద్‌ ఏఐజీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళ(Kollywood), తెలుగు(Tollywood) చిత్రాలతో పాటూ 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. శివశంకర్‌ మాస్టర్ ‘కురువికూడు’ చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా మారారు.
Acharya - Siddha's Saga Teaser: వేటకు సిద్ధమైన రాంచరణ్, ఆచార్య నుంచి సిద్ధాస్ సాగా టీజర్ విడుదల, చిరుతలా రెచ్చిపోయిన చెర్రీ...
Krishnaమెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య" నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన "సిద్ధాస్‌ సాగా" పేరుతో టీజర్ ని నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు.
Arrangements of Love: అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్ ద్వారా హాలీవుడ్ లోకి సమంత, సినిమాలో బై సెక్సువల్ అమ్మాయిగా కనిపించనున్న బ్యూటీ, ఇష్టమైన దర్శకుడితో నటించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్
Hazarath Reddyసమంత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. పెళ్లి..విడాకుల తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన కథలో నటించబోతోంది.అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ (Arrangements of Love) అనే చిత్రంతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
RRR Janani Song: జననీ.. ప్రియ భారత జననీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి ఆత్మలాంటి పాటను విడుదల చేసిన టీం, పాట కోసం రెండు నెలలు శ్రమించిన మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి
Hazarath Reddyజననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్‌ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్‌ కూడా రాశారని పేర్కొన్నారు.
Singer Harini Father Dies: సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది, బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో గాయని హరిణి తండ్రి మృతదేహం
Hazarath Reddyతెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
Chiranjeevi Konidela: ఏపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్‌ చిరంజీవి, ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్లుపై స్పందించిన టాలీవుడ్ అగ్రనటుడు
Hazarath Reddyఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల థియేటర్లు, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. టికెటింగ్‌పై పారదర్శకత ముఖ్యమన్నారు. ఈ బిల్లును మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Will Smith: సెక్స్‌ చేస్తుండగా.. వీర్యం కారే సమయంలో ప్రాణం పోయేది, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు, 16 ఏళ్లకే లవ్ బ్రేకప్ అయిందని, అందుకే విచ్చలవిడిగా శృంగారం చేశానని తన బుక్ ‘విల్’ లో వెల్లడి
Hazarath Reddyప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన తొలి లవ్ ఫెయిల్యూర్ గురించి తాజా పుస్తకం విల్ లో రాశాడు. ఈ బుక్‌లో (Will Smith's memoir Will) తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన మొదటి బ్రేకప్ గురించి ప్రస్తావించాడు. విల్ స్మిత్ తన 16వ ఏట మొదటి సారి బ్రేకప్ (Hollywood actor on using sex to cope with first heartbreak) బాధ ఎలా ఉంటుందో రుచి చూశానని పుస్తకంలో తెలిపాడు.
Kamal Haasan Health Update: కరోనా నుంచి కోలుకుంటున్న క‌మ‌ల్ హాస‌న్, త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి వస్తారంటూ శృతి హాస‌న్ ట్వీట్, కమల్‌ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న రజనీకాంత్
Hazarath Reddyనా తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం తను కోలుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది.
Shiva Shankar Master Health Update: విషమంగా శివశంకర్ మాస్టర్‌ ఆరోగ్యం, రంగంలోకి దిగిన సోనూసూద్, ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి, కోవిడ్‌ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్‌
Hazarath Reddyప్రముఖ సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్‌ కరోనా బారీన (Choreographer Shiva Shankar critical with COVID-19) పడిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం (Shiva Shankar Master Health Update) విషమంగా ఉంది.
Kaikala Health Update: మా నాన్న బతికే ఉన్నాడు, ఆ చావు వార్తలు ఆపండి, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరిన కైకాల స‌త్య‌నారాయ‌ణ కూతురు, ఆయన కోలుకుంటున్నారని వీడియో ద్వారా వెల్లడి
Hazarath Reddyనాన్న‌గారి ప‌రిస్థితి బాగానే వుంది. ఆయ‌న కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అంద‌రితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్ట‌ర్ మాదాల ర‌విగారు వ‌చ్చారు. ఆయ‌న‌తో కూడా మాట్లాడి థ‌మ్స‌ప్ కూడా చూపించారు. కాబ‌ట్టి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ద‌య‌చేసి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు.
Kamal Haasan Covid: ఐసోలేషన్‌లో కమల్‌ హాసన్‌, అమెరికా నుంచి వచ్చిన తరువాత కరోనా బారిన పడిన అగ్ర నటుడు, దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ట్వీట్
Hazarath Reddyప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కరోనా (Kamal Haasan Covid) బారిన పడ్డారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్‌ చేశారు.
Kartikeya Marriege:ఓ ఇంటివాడైన ఆర్ఎక్స్ 100 హీరో, ఘనంగా హీరో కార్తికేయ వివాహ వేడుక, ఆశీర్వదించిన మెగాస్టాన్ చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు
Naresh. VNSటాలీవుడ్‌ నటుడు, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
Jr NTR Latest Video: రాజకీయంలో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం, మహిళలను పరుష పదజాలంతో దూషించడం మన సంస్కృతి కాదు, ట్విట్టర్ ద్వారా వీడియో విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్
Hazarath Reddyనిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ పరిణామాలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ఈ మేరకు శనివారం ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు. నిన్నటి అసెంబ్లీ ఘటన కలిచివేసిందని, మహిళలను పరుష పదజాలంతో దూషించడం మన సంస్కృతి కాదని పేర్కొన్నారు.
Jr NTR on AP Politics: ఏపీ రాజకీయాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్, అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆవేదన, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, వ్యక్తిగత దూషణలు సరికాదని వీడియో విడుదల
Hazarath Reddyఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై నందమూరి తారక రామారావు మనవడు, దివంగత హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. నిన్న అసెంబ్లీ ఘటన తనను కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని, అంతేకానీ అలా వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని చెప్పారు.
Balakrishna Press Meet: అసెంబ్లీలో ఉన్నామా? గొడ్ల చావిడిలో ఉన్నామా?, అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలపై మండిపడిన బాలకృష్ణ, వ్యక్తిగతంగా దాడి చేస్తే.. తాము దాడి చేయాల్సి వస్తుందని హెచ్చరిక
Hazarath Reddyచంద్రబాబు చాలా గట్టి మనిషని, ఆయన ఎప్పుడూ కంటతడి పెట్టడం చూడలేదని అన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ హయాం నుంచీ అసెంబ్లీలో సమస్యలపైనే కొట్లాడేవాళ్లమన్నారు. అలాంటిది ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఎదుటి వారి పరువుపై కొడుతున్నారని విమర్శించారు.
Kaikala Satyanarayana Health Update: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం, వెంటిలేటర్ పై చికిత్స..
KrishnaKaikala satyanarayana health condition critical: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ (88) (Kaikala satyanarayana) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Naga Chaitanya: లవ్‌ లెటర్స్‌ టూ లైఫ్‌, నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్, ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్‌ లైట్‌ అంటూ మాథ్యూ 'గ్రీన్‌ లైట్స్‌' బుక్ ని పొగిడిన చైతూ
Hazarath Reddyసినిమాలు, బైకులు, కార్ల గురించి తప్పా సోషల్‌ మీడియాలో వేరే పోస్టులు పెట్టని చైతూ తాజాగా షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పాపులర్‌ రైటర్‌ మాథ్యూ రాసిన 'గ్రీన్‌ లైట్స్‌' అనే పుస్తకాన్ని షేర్‌ చేసిన చైతూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు.
Varma Satires On Babu: నా సినిమా ట్రైలర్ చూసే చంద్రబాబుకు ఏడుపొచ్చింది, మళ్లీ తనదైన స్టైల్లో సెటైర్ వేసిన రాంగోపాల్ వర్మ, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్
Hazarath Reddyతెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే! మ‌ళ్లీ సీఎం అయ్యేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేశాడు. దీనిపై వర్మ సెటైర్ వేశాడు.