సినిమా

Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమాకి వచ్చి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా, ఈ ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణమని మృతురాలి భర్త ఆవేదన, న్యాయం చేయాలని డిమాండ్

Hazarath Reddy

పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానంటూ రేవతి భర్త భాస్కర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పుష్ప 2 మార్నింగ్ షో సందర్భంగా ధియేటర్లో అగ్నిప్రమాదం, నల్గొండ వెంకటేశ్వరా థియేటర్లో బాణసంచా కాల్చడంతో ఎగసిపడిన నిప్పురవ్వలు

Hazarath Reddy

నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌లో గురువారం మార్నింగ్‌ షోలో పుష్ప 2 ది రూల్‌ ప్రదర్శించారు. అయితే థియేటర్ లోపల అల్లు అర్జున్‌ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో బాణసంచా కాల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి థియేటర్‌ స్క్రీన్‌పై పడడంతో మంటలు వ్యాపించాయి.

Sree Leela At Pushpa 2 Theatre: పుష్ప -2...థియేటర్లో శ్రీలీల సందడి, అభిమానులతో కలిసి సినిమా చూసిన శ్రీలీల...బాలనగర్‌ విమల్‌ థియేటర్‌లో అభిమానుల హంగామా..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమా పండగ వాతావరణం నెలకొంది. 'పుష్ప-2' ప్రీమియర్ షో చూసేందుకు హీరోయిన్ శ్రీలీల హైదరాబాద్‌ బాలానగర్‌లోని విమల్ థియేటర వెళ్లారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా ఈ సినిమాలో శ్రీలీల 'కిస్సిక్' అనే ఐటమ్ సాంగ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా పలువురు సినీ ప్రముఖులు నగరంలోని పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు చూస్తున్నారు.

Naga Chaitanya – Shobitha Wedding Video: వీడియో ఇదిగో..శోభిత మెడలో తాళి కట్టిన నాగ చైతన్య...ఈలల వేస్తూ హంగామా చేసిన అఖిల్...కుటుంబ సభ్యుల ఆనందం చూడండి

Arun Charagonda

అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 8:13 గంటలకు శుభ ముహూర్తన జరిగిన ఈ పెళ్లి వేడుకును చూసేందుకు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, స్నేహితుల, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరుకాగా పండుగ వాతావరణం నెలకొంది.

Advertisement

Pushpa 2 Review: పుష్ప 2 మూవీ రివ్యూ, అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో.. నట విశ్వరూపం చూపించిన బన్నీ, జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్

Arun Charagonda

ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూడబోతుండగా బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవబోతుంది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోండగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగా పుష్ప 2 ప్రేక్షకులను అలరించిందా?, అల్లు అర్జున్ మరోసారి మేజిక్ చేశాడా చూద్దాం..

Pushpa 2: పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళా ప్రేక్షకురాలి మృతి...అపస్మారక స్థితిలోకి చిన్నారి..వీడియో ఇదిగో

Arun Charagonda

మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసింది పుష్ప 2 సినిమా. దిల్‌సుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చింది.

Pushpa 2: The Rule: పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో కుప్పకూలిన బాలుడు, హైదరాబాద్‌ సంధ్య ధియేటర్లో ఘటన, పరిస్థితి విషమం

Hazarath Reddy

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట మధ్య ఓ యువకుడు స్పృహ కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తారు.

Allu Arjun Entry Scene Video Leaked: పుష్ప 2 మూవీ నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ లీక్, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయింది. అభిమానులు ఎక్స్ వేదికగా దీన్ని షేర్ చేస్తున్నారు.

Advertisement

Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: అంగ‌రంగ వైభ‌వంగా నాగ‌చైత‌న్య‌, శోభిత పెళ్లి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు

VNS

టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya), హీరోయిన్‌ శోభిత ధూళిపాల (Shobjitha) పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో వివాహ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సరిగ్గా 8.15 గంటలకు నిర్వహించారు. పెళ్లి వేడుకకు (Naga Chaitanya Sobhita Dhulipala Marriage) ఇరు కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, సంధ్య థియేటర్‌ వద్దకు వచ్చిన అల్లు అర్జున్, అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీఛార్జ్

Hazarath Reddy

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు. రాత్రి 9.30 గంటల షోకి అల్లు అర్జున్ హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 సినిమా చూసేందుకు వచ్చారు.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో సంధ్య థియేటర్‌ వద్ద లాఠీ ఛార్జ్, అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఎగబడిన అభిమానులు

Hazarath Reddy

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, విజయవాడలో పుష్ప 2 మేనియా, శైలజ థియేటర్ ముందు టఫాసులు పేలుస్తూ ఫ్యాన్స్ హంగామా

Hazarath Reddy

థియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. తాజాగా నటుడు అల్లు అర్జున్ అభిమానులు ఈరోజు రాత్రి 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోకి ముందు విజయవాడలోని శైలజ థియేటర్ వెలుపల పటాకులు పేల్చారు.

Advertisement

Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: మూడు ముళ్లతో ఒక్కటైన అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్

Hazarath Reddy

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఒక్కటయ్యారు. కాసేపటి క్రితమే వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు రాత్రి 8.15 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సినీ పెద్దలు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

Pushpa 2 The Rule: కర్ణాటకలో పుష్ప 2 బెనిఫిట్ షోలు రద్దు, మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు జిల్లా కలెక్టర్

Hazarath Reddy

పుష్ప 2 సినిమాకు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది.ఈ మూవీని కర్ణాటకలో మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం అక్కడ చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్‌లు ఫిర్యాదు చేశారు.

Pushpa 2: The Rule: ఒళ్లు కొవ్వెక్కి మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నావు, చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో, అల్లు అర్జున్‌పై జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు తీవ్ర వ్యాఖ్యలు

Hazarath Reddy

అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని జనసేన నేత రమేష్ తెలిపారు. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుంది. నువ్వు ఒక్కడివే ఒళ్లు కొవ్వెక్కి వారికి వ్యతిరేకంగా ఉంటున్నావని మండిపడ్డారు.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత, పని చేసినవారెవరో విచారించే పనిలో ఉన్న బన్నీ ఫ్యాన్స్

Hazarath Reddy

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక పిఠాపురంలో 'పుష్ప 2' పోస్టర్లు చించివేత కలకలం రేపింది.

Advertisement

Pushpa 2: The Rule: పుష్ప-2 ఫ్లెక్సీలో వైఎస్ జగన్ ఫోటో, మా కోసం నువ్వు వచ్చావు...మీ కోసం మేము వస్తాం అంటూ అభిమానులు కొటేషన్

Hazarath Reddy

అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా రేపు(డిసెంబర్ 5) భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల సమయంలో అనంతపురం జిల్లా గుత్తిలో వైసీపీ అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Naga Chaitanya And Sobhita Dhulipala Wedding Guest List: నిరాడంబరంగా నాగచైతన్య- శోభిత వివాహం..హాజరుకానున్న సినీ, రాజకీయ ప్రముఖులు...లిస్ట్ ఇదే

Arun Charagonda

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. హీరో నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల వివాహం ఈ రాత్రి 8.13 గంటలకు జరగనుంది. వీరిద్దరి వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేక సెట్ వేశారు.

Sivamani: వీడియో ఇదిగో, దోశ పెనంపై అద్భుతమైన మ్యూజిక్ వాయించిన శివమణి, సంగీతంలో మునిగితేలిన బెంగళూరులోని విద్యార్థి భవన్ హోటల్

Hazarath Reddy

మంగళవారం ప్రముఖ డ్రమ్మర్ శివమణి అల్పాహారం కోసం రెస్టారెంట్‌ను సందర్శించినప్పుడు బెంగళూరులోని ఐకానిక్ విద్యార్థి భవన్ ప్రత్యేకమైన సందర్భాన్ని చూసింది. రిథమిక్ మేధావికి పేరుగాంచిన శివమణి వంటగదిని తన డ్రమ్ గా మార్చుకున్నాడు.

Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు

Hazarath Reddy

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు పడుతున్నాయి.

Advertisement
Advertisement