Jr NTR

Hyderabad, OCT 04: ఎన్టీఆర్ క‌థానాయకుడిగా వ‌చ్చిన దేవ‌ర (Devara) చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రుగులు పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన సంద‌ర్భంగా చిత్ర‌బృందం తాజాగా స‌క్సెస్ ఈవెంట్‌ను (Devara Succes meet) నిర్వ‌హించింది. ఇక ఈ వేడుక‌కు.. ముఖ్య అతిథులుగా.. ఎన్టీఆర్‌తో ()NTR పాటు కొర‌టాల శివ‌, రాజ‌మౌళి, అనిరుధ్ రవిచందర్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, దిల్ రాజు, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు.

Devara Daavudi Son in Theatres: దేవ‌ర అభిమానుల‌కు గుడ్ న్యూస్, రేప‌టి నుంచి థియేట‌ర్ల‌లోకి దావూదీ సాంగ్ 

ఇక ఈ స‌క్సెస్ ఈవెంట్‌లో న‌టుడు ఎన్టీఆర్ (NTR Speech) మాట్లాడుతూ.. ఎంతో కోలాహలంగా, అట్టహాసంగా.. గ్రాండ్‌గా అభిమానులంద‌రితో జ‌రుపుకోవాలి ఈ స‌క్సెస్ ఈవెంట్‌ను కానీ.. కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల‌న.. దేవి న‌వ‌రాత్రులు ఉండ‌డం వ‌ల‌న సెక్యూరిటీ అనేది దృష్టిలో పెట్టుకుని అనుమ‌తి రాలేదు. అందుకే ఇలా చిన్నగా ఈ వేడుక‌ను దేవ‌ర టీంతో (Devara) నిర్వ‌హించాం. ముందుగా ఇంతటి భారీ స‌క్సెస్‌ను అందించిన‌టువంటి ప్రేక్ష‌క దేవుళ్లందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను.

టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌నతా గ్యారేజ్, జై ల‌వ కుశ‌, అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు దేవ‌ర‌. ఈ ఏడు చిత్రాల విజ‌యం వెన‌క నా ద‌ర్శ‌కుల‌తో పాటు సంకేతిక నిపుణుల‌తో పాటు నా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్య‌మైన‌ది మా అభిమానులు. ఏ జన్మలో చేసుకున్న రుణమో.. ఈ జన్మలో క‌లిసి ఒక గర్భంలో పుట్టకపోయిన.. కలిసి రక్తాన్ని పంచుకోకపోయిన.. రక్త సంబంధం కంటే కూడా రుణప‌డిపోయో అనుభందం ఏర్పడింది మీ అంద‌రితో. ఎప్పుడు నా వెన్నంటే ఉండి.. నాకోసం పోరాడుతూ.. ఎల్ల‌ప్పుడూ మీ ఆశీస్సులను అంద‌జేస్తున్నందుకు శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అంటూ తార‌క్ ఎమోష‌నల్ అయ్యాడు. ఈ జన్మలో కాక‌పోయిన వ‌చ్చే జ‌న్మ‌లో అయిన మీ రుణం తీర్చుకుంటాను. అప్ప‌టివ‌ర‌కు వ‌డ్డిని లెక్కవేస్తుంటాను. ఈ సినిమా ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిడానికి కార‌ణం దేవ‌ర టీం. ఈ సినిమాకోసం క‌ష్ట‌ప‌డ్డా ప్ర‌తిఒక్క‌రికి కృతజ్ఞతలు అంటూ చెప్పుకోచ్చాడు.