Hyderabad, DEC 20: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన క్రేజీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బాలీవుడ్‌లో సరికొత్త రికార్డును సృష్టించింది. 100 ఏళ్లు కలిగిన బాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ సినిమా హిందీ సినిమా కంటే అత్యధిక వసూళ్లను సాధించింది. పుష్ప 2 ది రూల్ విడుదలైన మొదటిరోజు నుంచే హిందీలో రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డును బద్దలుకొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రం. తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది.
ఈ సినిమా తాజాగా రూ. 1500 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయ్యింది. ఇందులో వరల్డ్ వైడ్‌గా రూ.900 కోట్లు రాగా.. కేవలం హిందీలోనే రూ.632 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఫస్ట్ టైం రూ.632 కోట్లు దాటిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది.
Pushpa2 Creates A New Record In Bollywood History
#Pushpa2 creates a new RECORD in 100 Years of BOLLYWOOD HISTORY 🔥🔥🔥#Pushpa2TheRule becomes the BIGGEST HINDI NETT of ALL TIME in just 15 days 💥💥💥 #HargizJhukegaNahin pic.twitter.com/uLmeZ0yoYJ
— Pushpa (@PushpaMovie) December 20, 2024
దీంతో 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మొదటి చిత్రంగా పుష్ప 2 రికార్డులకెక్కింది. పుష్ప 2 కంటే ముందు ఈ రికార్డు ‘స్త్రీ 2’ సినిమాపై ఉంది. ఈ చిత్రం రూ.625 కోట్లు వసూళ్లను సాధించి ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా పుష్ప 2 నిలిచింది.