Game Changer Jaragandi Song (Photo-Video Grab)

Hyderabad, DEC 18: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స‌మ‌యం రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ‘గేమ్ ఛేంజర్ ట్రైల‌ర్ (Game Changer Trailer) ఎప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను (Game Changer Trailer Event) ముంబైలో భారీగా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈవెంట్ కూడా డిసెంబ‌ర్ 27 లేదా 28న జ‌రుగ‌నున్న‌ట్లు తెలుస్తుంది. బిహార్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జ‌రిగిన పుష్ప 2 (Pushpa-2) ట్రైల‌ర్ ఈవెంట్ కంటే గ్రాండ్‌గా ఇది ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

KISSIK Full Video Song: పుష్ప 2 ది రూల్‌ నుంచి కిస్‌ కిస్‌ కిస్‌ కిస్సిక్‌ ఫుల్‌ వీడియో సాంగ్‌ ఇదిగో, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న అల్లు అర్జున్‌, శ్రీలీల డ్యాన్స్‌  

కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌(Ram Charan), దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ (Shankar) కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Ram Charan Game Changer Teaser

భారీ బ‌డ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ (Kiara Advani) క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. సునీల్, ఎస్ జే సూర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. సూప‌ర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ట్రైల‌ర్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.