జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు చాలా కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే రాహువుని దుష్ట గ్రహంగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు తెలివితేటలు కీర్తి ప్రతిష్టలు అన్నిటిని కూడా ఇస్తారని నమ్ముతారు. అయితే కొన్నిసార్లు రాహు సంచారం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 28వ తేదీ ఆదివారం సాయంత్రం4:30 నిమిషాలకు రావు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కన్యా రాశి- కన్య రాశి వారికి రాహు అనుగ్రహం ఉంటుంది. విద్యార్థుల్లో చదువుకునే సామర్థ్యం పెరుగుతుంది. సారీస్ యొక్క మానసికమైన ఉపశమనాలు లభిస్తాయి. యువత వారి తగిన శ్రమకు ఫలితం లభిస్తుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలకు వెళతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. వారికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. వ్యాపారం కోసం మీరు చేసే ప్రయాణాలు లాభాలను ఇస్తాయి. వ్యాపారన విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. వివాహితులకు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Astrology: వాస్తు ప్రకారం ఇంట్లో మంచాన్ని ఏ దిక్కులో ఉంచాలి..
మకర రాశి-మకర రాశి వారికి రాహు సంచారం కారణంగా అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. యువత తమకేరీలో ముందుకు వెళతారు. అనేక కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే మేకల నెరవేరుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకున్న కల కూడా నెరవేరుతుంది. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇది మీ ఆందోళనను బయటపడేస్తుంది.
మేష రాశి- మేష రాశి వారికి రాహు సంచారం కారణంగా అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. మీరు పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. ఆర్థిక పరిస్థితి గతం గడ్డ మెరుగ్గా ఉంటుంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపార విస్తరణ కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు మీద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మునుపటి కంటే ఇప్పుడు జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం లభిస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. దీని ద్వారా మీరు మానసిక ప్రశాంతత కలుగు కలిగి ఉంటుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.