చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫుడ్ వారికి రుచిగా అనిపించదు ఏదైనా టేస్టీగా వేడి వేడిగా తినాలని, తాగాలని అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా చూపుల రూపంలో తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ చలికాలంలో చికెన్ సూపు తీసుకున్నట్లయితే ఇది మనకు రుచితో పాటు కావాల్సిన ఆరోగ్యం కరమైన బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది. అయితే ఈ చికెన్ సూప్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు- చికెన్ పావు కేజీ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగాలు ఉప్పు మిరియాల పొడి కొత్తిమీర కార్న్ పౌడర్.
తయారీ విధానం- ముందుగా బోన్లెస్ చికెన్ ని తీసుకొని దాన్ని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యాని ఆకు కొత్తిమీర కొంచెం మిరియాల పొడి ఉప్పు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి .తర్వాత వీటన్నిటిని కలిపి కాసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగించుకునే చికెన్ లో కొంచెం మొక్కజొన్నపొడి, కొత్తిమీర తురుము వేసుకోవాలి, వేసుకొని ఇప్పుడు దానిపైన మూత పెట్టి కాస్త ఉడికించుకోవాలి, ఇందులో ఇంకొక గ్లాస్ నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. అనంతరం దీన్ని బాగా గిల కొట్టుకోవాలి. ఇందులో కాస్త వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...
అంతే కాకుండా ఇందులో చివరిగా కార్న్ పౌడర్ వేసి కొంచెం నీళ్లు కలిపి దాన్ని సూపులో వేసి బాగా కలపాలి పౌడర్ వేయడం ద్వారా ఈ సూపు కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని స్ప్రింగ్ ఆనియన్ను ముక్కలు వేసుకోవాలి. దీనికి కాస్త బటక్ కూడా వేసినట్లయితే రెండు నిమిషాల్లో వేడి వేడి చికెన్ సోప్ రెడీ ఇది. దీన్ని చలికాలంలో జలుబు దగ్గు వంటి లక్షణాలు తీసుకుంటే ఈ సమస్య చిటికెలో మాయమవుతుంది అంతేకాకుండా ఇది హెల్ది కూడా .అంతే కాకుండా దీన్ని తీసుకోవడం ద్వారా వెచ్చదనాన్ని కూడా అందిస్తుంది చికెన్ మన శరీరానికి మంచి ప్రోటీన్ అందిస్తుంది. ఇది బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అంతే కాకుండా ఈ ప్రోటీన్ వల్ల మనకు కండరాల బలానికి సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం ద్వారా టెస్ట్ కి టెస్ట్ హెల్త్ కి హెల్తీగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తాగొచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి