Mufasa The Lion King Mahesh Babu poster

హాలీవుడ్ దిగ్గజ ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ వాల్ట్ డిస్నీ సారథ్యంలో దర్శకుడు బ్యారీ జెన్కిన్స్ & టీమ్ నిర్మించిన తాజా యానిమేటెడ్ ఫిలిం “ముఫాసా ది లయన్ కింగ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2019లో విడుదలైన “ది లయన్ కింగ్”కు సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ లో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడంతో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఏర్పడింది.

ముఫాసాలానే నన్ను కూడా నాన్న పెంచారు, తండ్రి మహేష్ బాబుపై సితార మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

ది లయన్ కింగ్ కు హీరో నాని డబ్బింగ్ చెప్పడం కూడా ఇంకా క్యూరియాసిటిని రేపింది. ఇంకా తెలుగు నటులు బ్రహ్మానందం, ఆలీ, షేకింగ్ శేషు,సత్యదేవ్, అయ్యప్ప శర్మ, ఆర్.సి.ఎం రాజు వంటి వారు ఈ సినిమాకు వాయిస్ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఇది చాలా ముఖ్యమైన సినిమాగా చెప్పుకోవాలి. రాజమౌళి చేతిలో బందీ కాబోతున్న సూపర్ స్టార్ నుంచి వచ్చే 5 ఏళ్ళ వరకు సినిమాలు లేకపోవడంతో ఫ్యాన్స్ ఈ రకంగానైనా చూసి సంబరపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యానిమేటెడ్ సినిమా ఎలా ఉందో చూద్దాం.

ముఫాసాః ది లయన్ కింగ్ కథ

తొలిసారి వచ్చిన “ది లయన్ కింగ్” చిత్రం సింబ కథతో మొదలవ్వగా.. తాజాగా సీక్వెల్ గా వచ్చిన “ముఫాసా ది లయన్ కింగ్” కథ సింబ తండ్రి ముఫాసా కథతో ప్రారంభం అవుతుంది. అసలు ముఫాసా ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు? తన తల్లిదండ్రులకు దూరమయ్యి.. అనాథగా వేరే తెగ జంతువుల మధ్యన పెరిగి.. అడవికి రాజుగా ఎలా ఎదిగాడు? ఈ ఎదిగే క్రమంలో తనకంటే బలవంతుడైన కిరోస్ తో ఎలా పోరాడి నిలిచాడు? అందుకు టాకా ఏ విధంగా సహాయపడ్డాడు, అసలు సహాయ పడ్డాడా అనేది సినిమా సారాంశం. చివరికి వీళ్ళందరూ రాజ్యం మిలేలేకి ఎలా చేరుకున్నారు? వీళ్లందరినీ రఫీ ఎలా ఇక చోటకు చేర్చాడు? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే “ముఫాసా ది లయన్ కింగ్” చిత్రం చూడాల్సిందే.

ఎవరి క్యారక్టర్ ఎలా ఉంది.

ఇది లైవ్ యానిమేషన్ చిత్రం కావడంతో క్యారక్టర్ల గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమి ఉండదు. చాలా సహజంగా కనిపించే యానిమేషన్ క్వాలిటీ ఆడియన్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఈ సినిమాకి ప్రధాన బలం డబ్బింగ్. జంతువులకు డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టుల వాయిస్ సినిమాను మరో లెవల్ కి తీసుకువెళుతుంది. అయితే ఈ సినిమాలో ఆర్టిస్టుల వాయిస్ కొంచెం బలమనే చెప్పుకోవాలి.

ముఫాసా పాత్ర తాలూకు ఎమోషన్ ను హ్యాండిల్ చేస్తూ మహేష్ బాబు చెప్పిన డబ్బింగ్ చాలా బాగుంది. ఆడియన్స్ ను మరో లోకం లోకి తీసుకువెళుతుంది.పుంబాకు బ్రహ్మానందం చెప్పిన డబ్బింగ్ కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. టిమాన్ కు అలీ వాయిస్ కూడా బాగా సెట్ అయింది. ఇక పిట్ట గొంతుకు షేకింగ్ శేషు వాయిస్ అయితే నవ్వులు పూస్తాయి. కా క్యారెక్టర్ కు సత్యదేవ్, వైట్ లయన్ రోల్ కి అయ్యప్ప శర్మ ,రఫీకి ఆర్.సి.ఎం రాజు వాయిస్ లు బాగా సెట్ అయ్యాయి. ఇక తెలుగు అనువాదం కారణంగా పాటల్లో సాహిత్యం సరిగా మ్యాచ్ కాలేదని చెప్పుకోవాలి. పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయను చెప్పుకోవచ్చు.

ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చే సినిమా. ఇక మహేష్ బాబు అభిమానులకు ఇది పండగలాంటిదే. ఎప్పుడో వచ్చే సినిమా వరకు వెయిట్ చేయకుండా సూపర్ స్టార్ నుంచి వారికి వాయిస్ రూపంలో రావడం వాళ్లను ఖుషీ చేస్తోంది. ఈ సినిమాని మొబైల్ లో చూడటం కన్నా 3D లేదా 4DXలో చూస్తే ప్రేక్షులకు బాగా ఆస్వాదించవచ్చు.