డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్‌ కానుకగా ఈనెల 20న ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మహేశ్‌బాబు కుమార్తె సితార మాట్లాడుతూ..‘‘ముఫాసా’కి నాన్న డబ్బింగ్‌ చెప్పడం ఆనందంగా ఉంది. సినిమాలో ముఫాసా మాదిరిగా నిజ జీవితంలోనూ నాన్న చాలా ప్రేమ, కేరింగ్‌ చూపిస్తారు’’ అని చెప్పారు.నిజజీవితంలోనూ పిల్లలపై కేరింగ్ విషయంలో ముఫాసాకి నాన్నకు దగ్గర పోలికలున్నాయని సితార వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సితార మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్,సూపర్ స్టార్ వాయిస్‌తో ముఫాసా: ది లయన్‌‌ కింగ్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

Sitara on Her Father Mahesh Babu 

 

View this post on Instagram

 

A post shared by sitara (@sitaraghattamaneni)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)