Arrest warrant issued against Robin Uthappa in EPF fraud case(X)

Delhi, December 21:  టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పకు షాక్ తగిలింది. ఉద్యోగులను మోసం చేసిన ఈపీఎఫ్‌ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ విరాళాలకు సంబంధించి మోసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు అధికారులు.

రూ. 23,36,602 నష్టపరిహారాన్ని చెల్లించడంలో ఉతప్ప విఫలమయ్యారని డిసెంబర్ 4న జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌లో ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ సదాక్షరి గోపాల్ రెడ్డి తెలిపారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను పరిష్కరించలేకపోతున్నామని ఆయన్న అరెస్ట్ చేసి వారెంట్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.  రాజస్థాన్‌ యువతి బౌలింగ్‌కు సచిన్ ఫిదా, లేడి జహీర్ అంటూ కితాబు... సచిన్ ట్వీట్ కు స్పందించిన జహీర్‌ ఖాన్‌

ఉతప్ప భారతదేశం తరపున 59 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. ధోని సారథ్యంలో టీమిండియా టీ20 వరల్డ్ గెలవగా అందులో ఉతప్ప సభ్యుడు. నోటీసు జారీ చేసేందుకు పోలీసులు రాబిన్ ఉతప్ప ఇంటికి వెళ్లారు. కానీ, ప్రస్తుతం ఆ నివాసం ఉండడంలేదు. దీంతో రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్‌ అమలులోకి వచ్చింది.