టెలివిజన్
Drugs Case: డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రముఖ టీవీ నటి, ప్రీతికా చౌహాన్,‌ ఫైజల్‌ని అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ అధికారులు
Hazarath Reddyప్రముఖ హిందీ సీరియల్స్‌ నటి ప్రీతికా చౌహాన్‌(30) డ్రగ్స్‌ వినియోగం కేసులో (Preetika Chauhan drugs abuse) అరెస్టయ్యారు.నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు శనివారం ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Shobha Naidu Passed Away: కూచిపూడి దిగ్గజ నృత్యకారిణి శోభా నాయుడు అనారోగ్యంతో కన్నుమూత, సంతాపం ప్రకటించిన తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య మంత్రులు
Team Latestlyహైదరాబాద్‌లోని 40 ఏళ్ల ప్రస్థానం గల కూచిపుడి ఆర్ట్ అకాడమీకి శోభా నాయుడు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దేశవిదేశాలకు చెందిన సుమారు 1,500 మందికి పైగా విద్యార్థులకు ఆమె శిక్షణ ఇచ్చారు. కూచిపూడిలో శోభా నాయుడు చేసిన సేవలకు గానూ 2001లో భారత ప్రభుత్వం ఆమెను...
Sravani Suicide Case: పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన అశోక్‌రెడ్డి, ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల రిమాండ్‌ రిపోర్టు, ఏ1గా దేవ్‌రాజ్‌, ఏ2గా సాయికృష్ణారెడ్డి, ఏ3గా అశోక్‌రెడ్డి
Hazarath Reddyటీవీ నటి శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయాడు. పంజాగుట్ట ఏసీపీ (Panjagutta ACP) తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు.
Naga Babu Covid 19: నాగబాబుకు కరోనా పాజిటివ్, క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని తెలిపిన మెగా బ్రదర్, తనను కలిసిన వాళ్లు టెస్ట్ చేయించుకోవాలని సూచన
Hazarath Reddyలెజండ‌రీ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి, ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి వారు క‌రోనా బారిన ప‌డ్డారు. ఇప్పుడు క‌రోనా మెగా ఫ్యామిలీ మీదకు వెళ్లింది. నాగ‌బాబుకు క‌రోనా పాజిటివ్ (Naga Babu Tested possitive for coronavirus) అని నిర్థార‌ణ అయింది. అయితే దీనికి గురించి నాగ‌బాబు (Naga Babu Konidela) నోరు విప్ప‌క‌ముందే రెండు రోజుల నుంచి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఇప్పుడు ట్విట‌ర్ వేదిక‌గా నాగ‌బాబు విష‌యాన్ని వెల్ల‌డించారు. తొంద‌ర‌గా క‌రోనాను జ‌యించి ప్లాస్మాను దానం చేస్తాన‌ని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Big Boss 4: మొదలైన ట్రై యాంగిల్ లవ్ స్టోరీ! తొమ్మిది మందిని ఒకేసారి సెల్ఫ్ నామినేట్ చేసుకునేలా టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్, ఈసారి హౌజ్ నుంచి వెళ్లిపోయేదెవరు?
Team Latestlyమోనాల్ - అఖిల్ మధ్య లవ్ స్టోరి మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతున్నట్లు చూసే ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం వ్యక్తం అయింది. మరోవైపు, అభిజీత్ కూడా మోనాల్ కోసం తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లుగా అనిపించింది. అయితే అఖిల్- మోనాల్ మధ్య సాగుతున్న స్టోరీ చూసి అభిజిత్ కొద్దిగా అసూయ పడుతున్నట్లుగా తెలుస్తోంది....
Actress Sravani Suicide Case: వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య, మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టిన వెస్ట్‌ జోన్‌ డీసీపీ, మీడియాతో మాట్లాడిన డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌
Hazarath Reddyటీవీ సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసులో (TV actress Sravani Kondapalli suicide) నిందితులైన దేవరాజ్‌, సాయిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షల అనంతరం వెస్ట్‌ జోన్‌ డీసీపీ కార్యాలయంలో (West Zone DCP Office) నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియాతో (West Zone DCP Press Meet) మాట్లాడారు.
Bigg Boss Telugu 4 Launched: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వచ్చేశారు, మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదు అంటూ బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ స్టార్ట్, హోస్ట్‌ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ
Hazarath Reddyబిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ ఆదివారం సాయంత్రం (Bigg Boss Telugu 4 Launched) ప్రారంభమైంది. కింగ్ నాగార్జున వరసగా రెండో సారి వ్యాఖ్యాతగా ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో.. కరోనా కాలంలో వస్తాడో రాడో అనుకున్న సమయంలో ‘మాస్కు కావాల్సింది ముఖానికి కానీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కాదు’ అంటూ స్మాల్‌ స్క్రీన్‌పైకి బిగ్‌బాస్‌ (Bigg Boss (Telugu season 4) వచ్చేశాడు. స్టార్‌ మాలో సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షోలో హోస్ట్‌ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తన సినిమాలలోని పాటలకే సందడిగా డ్యాన్సులు చేశాడు.
Bigg Boss (Telugu season 4): బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 నేటి నుంచే, కంటెస్టెంట్ వివరాలు లీక్, కరోనావైరస్ పరిస్థితుల నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన బిగ్‌బాస్ ఎపిసోడ్
Hazarath Reddyబుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచేందుకు నేటినుంచి స్టార్ మా చానల్‌లో బిగ్‌బాస్ 4 సీజన్ (Bigg Boss 4 Telugu) ప్రారంభం కాబోతోంది. నాగార్జున హోస్ట్‌గా (Nagarjuna's Bigg Boss Telugu 4) వ్యవహరిస్తున్న ఈ షోలో పాల్గొనే వారి పేర్లు ఇప్పటికే కొన్ని బయటకు వచ్చినా కొందరు ఖండించారు. అయితే, మరికొన్ని గంటల్లో షో (Bigg Boss Telugu Season 4) ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అందులో పాల్గొనే 15 మంది పేర్లు మరోమారు బయటకువచ్చాయి.
#IntoTheWildWithBearGrylls: అడవిలో అక్షయ్ కుమార్ ఒళ్లు గగుర్పొడిచే సాహసం, into the wild with bear grylls కోసం బేర్ గ్రిల్స్‌తో కలిసి రిస్క్ చేస్తున్న అక్షయ్, సెప్టెంబ‌ర్ 14న డిస్క‌వరీ ఛానెల్‌లో ఎపిసోడ్ ప్ర‌సారం
Hazarath Reddyఅక్షయ్ కుమార్ నటించిన బేర్ గ్రిల్స్ ఇంటు ది వైల్డ్ ( Bear Grylls’ Into The Wild) ఎపిసోడ్ యొక్క కొత్త టీజర్ వచ్చింది. ప్రత్యేక ఎపిసోడ్ అడవిలో ‘పిచ్చి సాహసం’ పై ‘డేర్‌డెవిల్ ద్వయం’ చూడండి అంటూ చిన్న వీడియో టీజర్ లో ప్రారంభం అవుతోంది. బేర్ తన యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ‘లెజెండ్’ గా అక్షయ్‌ను పరిచయం చేయడంతో. "నేను రీల్ హీరో, అతను నిజమైన హీరో" అని నటుడు అంటాడు. వీడియోలో బేర్ మరియు అక్షయ్ (Akshay Kumar) దీనిని అడవిలో రఫ్ చేయడం మరియు మొసలి ఉన్న నీటి పై నుంచి వెళ్లడం కనిపిస్తుంది. ఒకానొక సమయంలో, నటుడు ‘ఏనుగు పూప్ టీ’ పై సిప్ చేస్తాడు.
Kathi Mahesh Arrested: కత్తి మహేష్‌కి 14 రోజుల రిమాండ్, శ్రీరాముడుపై అనుచిత పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేసిన సైబైర్ క్రైమ్ పోలీసులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు
Hazarath Reddyటాలీవుడ్‌ వివాదాస్పద సినీ విశ్లేషకుడు‌ కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ (Kathi Mahesh Arrested) చేశారు. సోషల్‌ మీడియాలో శ్రీరాముడిపై (Lord Sriram)అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసినందుకుగాను ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. అనంతరం నాంపల్లి కోర్టులో (Nampally court) హాజరుపరిచారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఐపీఎస్‌ సెక్షన్‌ 153(ఎ) కమ్యూనల్‌ యాక్ట్‌ కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.
Anil Murali Passes Away at 56: నటుడు అనిల్‌ ముర‌ళి కన్నుమూత, కాలేయ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మళయాళ హీరో, సంతాపం తెలిపిన మాలీవుడ్ ఇండస్ట్రీ
Hazarath Reddyమ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాద సంఘ‌ట‌న చోటుచేసుకుంది. న‌టుడు అనిల్‌ ముర‌ళి(56) (Anil Murali Passes Away at 56) క‌న్నుమూశారు. అనారోగ్య కార‌ణంతో కొచ్చిలో నేడు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధ‌ప‌డుతున్నఅనిల్ ముర‌ళి కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించారు. అనిల్ మురళి మరణం మలయాళ పరిశ్రమకు తీర‌ని లోట‌ని న‌టులు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), తోవినో థామస్ వంటి వారు సోషల్ మీడియా వేదిక‌గా త‌మ సంతాపాన్ని ప్ర‌క‌టించారు. అనిల్ ముర‌ళికి భార్య సుమ‌, పిల్ల‌లు ఆదిత్యా, అరుంధ‌తి ఉన్నారు.
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ, ముంబై నానావతి ఆసుపత్రిలో చేరిక, త్వరగా కోలుకోవాలంటూ ప్రముఖుల సంఘీభావం
Team Latestlyనాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను, ఈ విషయాన్ని అధికారికంగా తెలియపరుస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారికి సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇక నాతో....
Dil Bechara: 'పుట్టుక, చావు మన చేతుల్లో లేవు కానీ ఎలా బ్రతకాలనేది మన చేతుల్లోనే ఉంది'! కంటతడి పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి సినిమా 'దిల్ బెచారా' ట్రైలర్
Team Latestlyఒక రాజు.. ఒక రాణి, ఇద్దరు చనిపోయారు.. కథ సమాప్తం'! అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా' సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా జూలై 24న నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్‌ షో వేయబడుతోంది...
Bigg Boss 14: రేటు పెంచేసిన సల్మాన్‌ ఖాన్‌, బిగ్‌బాస్‌ 14కు ఒక్కో వారానికి 16 కోట్లు తీసుకోనున్నారని వార్తలు, అక్టోబర్‌ నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ 14..!
Hazarath Reddyబిగ్‌బాస్‌ షోకు దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న విషయం విదితమే. ఈ షోకి కర్త,కర్మ,క్రియ అన్నీ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) అని చెప్పవచ్చు. 2010 నుంచి దాదాపు 10 సీజన్‌లుగా సల్మాన్‌ ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఏడాది కరోనా కారణంగా బిగ్‌బాస్‌ షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి బిగ్‌బాస్‌ షో ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Sushant Singh Rajput: కారణమదేనా? బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య, 'ఎంఎస్ ధోనీ' బయోపిక్‌తో పాపులర్ అయిన నటుడు, షాక్‌లో బాలీవుడ్
Team Latestlyఒక బాలీవుడ్ యంగ్ హీరో, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న హీరో ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరం అని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాని, అతడి కుటుంబ సభ్యులకు దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని బాలీవుడ్ స్టార్స్ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు...
S. S. Rajamouli: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి, సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్
Hazarath Reddyతెలుగురాష్ట్రాల్లో సినిమా షూటింగ్‌లు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి AP CM SY Jagan), కె చంద్రశేఖర్ రావులకు (TS CM KCR) టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి (S. S. Rajamouli) ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందించి.. అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏపీలో థియేటర్ల ఫిక్స్‌డ్‌ పవర్‌ చార్జీల రద్దు చేయడం గొప్ప విషయమని ఏపీ సీఎంని కొనియాడారు. ఈ మేరకు బుధవారం ట్విటర్‌ వేదికగా రాజమౌళి పోస్ట్‌ చేశాడు.
Film Shootings in TS: తెలంగాణలో సినిమా షూటింగ్‌లకు అనుమతి, ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్, ధియేటర్లు ప్రారంభించడానికి అనుమతి నిరాకరించిన తెలంగాణ సర్కారు
Hazarath Reddyకోవిడ్ 19 లాక్‌డౌన్ (COVID-19 Lockdown) కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ సినిమా షూటింగ్స్ కు తెలంగాణ ప్ర‌భుత్వం (TS Govt) ఎట్ట‌కేల‌కు అనుమ‌తులు ఇచ్చింది. కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు (Film Shootings in TS) కొనసాగించుకోవ‌చ్చ‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ (Telangana CM KCR) సోమవారం సంతకం చేశారు. పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చని కేసీఆర్ స్పష్టం చేశారు.
Meera Chopra Issue: మీరా చోప్రా ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్, నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామి, ధన్యవాదాలు తెలిపిన టాలీవుడ్ నటి
Team Latestlyసినీ నటి మీరా చోప్రా ఫిర్యాదుపై తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మీరా చోప్రా చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితులకు చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని...
Sonu Sood: నిసర్గ తుఫాన్ కల్లోలం, 28 వేల మందికి సాయం చేసిన సోనూసూద్‌, వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు కోట్లు ఖర్చు పెట్టిన సోనూ భాయ్
Hazarath Reddyసోనూసూద్‌..ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. వలస కార్మికుల దగ్గర నుంచి నిన్న నిసర్గ తుఫాన్ వరకు ఆయన (Sonu Sood) చేసిన సాయం ఎనలేనిది. లాక్‌డౌన్‌ (Lockdown) కాలంలో వలస కార్మికుల పట్ల నిజమైన హీరోగా నిలిచిన ఆయన.. తాజాగా తుపాను ప్రభావం నుంచి వేలాది మందిని కాపాడారు. నిసర్గ (Cyclone Nisarga) ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో దాదాపు 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి ఆహారం పంపిణీ చేసి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు.
RGV Coronavirus Trailer: వర్మ 'కరోనా వైరస్‌' ట్రైలర్, జగన్,కేసీఆర్‌ పారాసిటామాల్, బ్లీచింగ్ పౌడర్ డైలాగ్స్ ట్రైలర్‌కి హైలైట్‌, యూట్యూబ్‌లో ట్రెండింగ్ ఇదే
Hazarath Reddyప్రముఖ దర్శకుడు‌, నిర్మాత రామ్‌ గోపాల్‌ వర్మ (Ram Gopal Varma) ట్రెండింగ్‌లో ఉన్న వాటిపై సినిమాలు తీసి ఇప్పటికే చాలాసార్లు సక్సెస్‌ అయ్యారు. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ఫీచర్‌ ఫిల్మ్‌ చేసినట్లు వర్మ ఇది వరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం తన కొత్త సినిమా 'కరోనా వైరస్‌' ట్రైలర్‌ను (Coronavirus Trailer) యూట్యూబ్‌ చానెల్‌లో రిలీజ్‌ చేశారు. 4 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ను చూస్తున్నంత సేపు చాలా భయపెట్టేలా ఉంది.