తాజా వార్తలు
Chandrababu To Davos: నేడు దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు... పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవిగో..!
Rudraబ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పాటు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు నేడు బయల్దేరి వెళుతున్నారు.
Amit Shah-Babu-Pawan: విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్.. అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం.. ఉండవల్లిలో బాబు, పవన్ తో జరిగిన భేటీలో అమిత్ షా
Rudraవిశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్ అని, అందరం కలిసి దాన్ని లాభాల్లోకి తీసుకొద్దాం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే విషయంలో తన వంతు ప్రయత్నాలు చేస్తానని సానుకూలంగా స్పందించారు.
Solar Powered Vayve Eva: బ్యాటరీతో పాటూ సోలార్ పవర్‌తో నడిచే కారు, కేవలం రూ. 3.25 లక్షల నుంచి ప్రారంభం, ఐదు నిమిషాల్లో 50 కి.మీ ప్రయాణించే అవకాశం
VNSపర్యావరణ పరిరక్షణ.. పెట్రోల్-డీజిల్ భారం తగ్గించుకునేందుకు ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ వాహనాలు.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్, హైబ్రీడ్ వాహనాల తయారీ మొదలైంది. తాజాగా సోలార్ పవర్‌తోనూ నడిచే కారు కూడా వచ్చేసింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో వేవ్ మొబిలిటీ (Vayve Mobility) శనివారం సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది.
Worlds First CNG Scooter From TVS: ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ తయారు చేసిన టీవీఎస్, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 226 కి.మీ మైలేజ్
VNSపెట్రోల్‌తో నడిచే టూ వీలర్లను తయారు చేసిన ఆటోమొబైల్ సంస్థలు ఇప్పుడు సీఎన్జీ (CNG) వినియోగ వాహనాల తయారీ వైపు మళ్లుతున్నారు. ఇప్పటికే బజాజ్ ఆటో (Bajaj).. ప్రపంచంలోనే తొలి బజాజ్ సీఎన్జీ (Bajaj CNG) మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. అదే బాటలో ప్రయాణిస్తున్న టీవీఎస్ మోటార్స్ .. వరల్డ్ ఫస్ట్ సీఎన్‌జీ స్కూటర్‌ను శనివారం భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో ప్రదర్శించింది.
Curbs On Flight Operations At Delhi: ఢిల్లీలో విమానాల రాకపోకలపై ఆంక్షలు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి రోజు రెండు గంటల పాటూ ఆంక్షలు విధింపు
VNSఢిల్లీలో ఉదయం 10.20 గంటల నుంచి 12.45 గంటలకు వచ్చే ఎనిమిది రోజులు విమాన సర్వీసుల (Flight Operations) రాకపోకలపై నిషేధం విధించినట్లు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (DIAL) ప్రకటించింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఐఏఎల్ శనివారం ప్రకటించింది.
India, England Teams Reached Kolkata: కోల్‌కతా చేరుకున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు, ఈ నెల 22 నుంచి మూడు టీ -20ల సిరీస్
VNSజనవరి 22 నుంచి భారత్-ఇంగ్లాండ్ (IND Vs ENG) మధ్య ఐదు మ్యాచుల టీ20 (T20 Match) సిరీస్ ప్రారంభం కానున్నది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు శనివారం కోల్‌కతా (Kolkata)కు చేరుకున్నాయి. మూడు సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది.
Bade Chokkarao Killed In Chhattisgarh Encounter: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ, చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత దామోదర మృతి
VNSతెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు (Bade Chokkarao) పోలీసుల కాల్పుల్లో మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్‌లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Chhattisgarh Encounter) ఆయన మృతిచెందినట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్‌తో పాటు మరో 17 మంది మరణించారు.
Tirumala: వీడియో ఇదిగో, తిరుమలలో ఎగ్ బిర్యానీ తింటూ ప్రత్యక్షమైన తమిళనాడు భక్తులు, వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీస్ సిబ్బంది
Hazarath Reddyతిరుమలలోని రాంభగీచా బస్టాండ్ సమీపంలో కొందరు భక్తులు ఎగ్ బిర్యానీ భోజనం చేస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన భక్తులు తిరుపతి నుంచి భోజనం తిరుమలకు తెచ్చుకుని తింటున్న సమయంలో కోడి గుడ్లు గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
K Ravi Chandra Reddy Joins BJP: వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరిన రవిచంద్రారెడ్డి, కారణం ఏంటంటే..
Hazarath Reddyవైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. ఇందుకు సంబంధించి రవిచంద్రారెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Delhi Assembly Election: వీడియో ఇదిగో, అరవింద్ కేజ్రీవాల్ కారుపై రాళ్ల దాడి, బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాలే దాడి చేశారని ఆప్ ఆరోపణలు, ఖండించిన పర్వేష్ వర్మ
Hazarath Reddyఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుపై (Arvind Kejriwal’s car attacked) దాడి జరిగింది. ఇది బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ గూండాల పనిగా ఆప్ ఆరోపించింది. అయితే దీనిని ఆయన ఖండించారు.
RG Kar Case Verdict: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం, నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్దారించిన సీబీఐ న్యాయస్థానం, మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు
Hazarath Reddyదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పోలీస్ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను ఈ కేసులో దోషిగా నిర్ధారించింది.
Adilabad: బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య...అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు అవమానించారని ఆత్మహత్య..స్థానికంగా విషాదం
Arun Charagondaఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం... కొత్త బస్‌డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతి, పెద్దపల్లి బస్ డిపో నిర్మాణానికి నిధుల కేటాయింపు
Arun Charagondaకొత్త డిపోలు, బస్ స్టేషన్లకు సంబంధించి ఆర్టీసీ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు కొత్త బస్సు డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు అనుమతి తీసుకున్నారు.
Pawan Kalyan:నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్..స్వచ్ఛ కార్మికులకు సన్మానం, స్వయంగా ట్రాక్టర్ నడిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Arun Charagondaఏపీలోని నంబూరులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం పరిశీలించారు.
Manchu Manoj: మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా జేసీని కలిసిన మంచు మనోజ్.. మా అన్న వల్లే మొత్తం వివాదం జరుగుతోందని కామెంట్, వీడియో ఇదిగో
Arun Charagondaమంచు మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్. ప్రస్తుతం మనోజ్..జల్‌పల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిశారు మంచు మనోజ్.
India Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టబోయే 15 మంది భారత ఆటగాళ్లు వీరే, మహ్మద్ సిరాజ్ అవుట్, షమీ రీ ఎంట్రీ
Hazarath Reddyఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్ లో ఆడే భారత జట్టును నేడు ఎంపిక చేశారు.దీంతో పాటుగా త్వరలో ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేలకు కూడా భారత జట్టును (India Squad)ప్రకటించారు.
Karnataka: ఆకాశం నుంచి ఇంటి మీద పడిన పెద్ద యంత్రం, రెడ్ లైట్ వెలగడంతో భయంతో పరుగులు పెట్టిన స్థానికులు, తీరా పోలీసులు వచ్చాక తెలిసింది ఏమిటంటే..
Hazarath Reddyటాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) నుంచి వచ్చిన భారీ పరిశోధన బెలూన్ ఈ తెల్లవారుజామున బీదర్ జిల్లా హోమ్నాబాద్ తాలూకాలోని జలసంగి గ్రామంలోని ఓ ఇంటిపై పడింది.
CM Revanth Reddy: వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు..సత్ఫలితాన్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్
Arun Charagondaసింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హైయిన్‌తో భేటీ అయింది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం. వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు జరిపారు.
Mohan Babu: మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్..తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని మేజిస్ట్రేట్‌కు మోహన్ బాబు ఫిర్యాదు
Arun Charagondaమంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్. తన ఆస్తుల్లో ఉన్న వారందరిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.