తాజా వార్తలు
Mass Suicide In Delhi: ఢిల్లీలో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా.. తండ్రి, నలుగురు కుమార్తెల ఆత్మహత్య
Rudraదేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా కనిపించారు. బీహార్ నుంచి కుటుంబంతో సహా నగరానికి వలసవచ్చిన ఓ వ్యక్తి దివ్యాంగులైన తన నలుగురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగపురి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Harish Rao: తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. హైడ్రా మూసీ బాధితులతో మాట్లాడనున్న మాజీ మంత్రి (వీడియో)
Rudraహైడ్రా మూసీ బాధిత కుటుంబాలు శనివారం ఉదయం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో కాసేపటి క్రితం తెలంగాణ భవన్ కు చేరుకున్న సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. కాసేపట్లో వారితో మాట్లాడి వారి సమస్యలను వినబోతున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు.
Telangana Darshini: తెలంగాణ దర్శిని..విద్యార్థులు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం
Arun Charagondaప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన. కల్పించనున్నారు.
FIR Against Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ షాక్.. మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నకోర్టు.. అసలేం జరిగింది?
Rudraకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బిగ్ షాక్ తగిలింది. మంత్రిపై కేసు నమోదు చేయాలని బెంగళూర్ తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Road Accident: వావిలాలలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోళ్తా, 40కి పైగా ఆవులు మృతి..వీడియో ఇదిగో
Arun Charagondaజనగామ జిల్లా పాలకుర్తి మం. వావిలాల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడగా ఈ ఘటనలో 40కి పైగా ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. 60కి పైగా ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అర్థరాత్రి హైదరాబాద్ కు అక్రమంగా ఆవులను తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
Mumbai On Alert: ఉగ్ర ముప్పు హెచ్చరికలు.. ముంబై హైఅలర్ట్.. ఎక్కడికక్కడ తనిఖీలు
Rudraదేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్నట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు నగర పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో అలర్ట్ అయిన సిటీ పోలీసులు ముంబై నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.
HYDRA Notices to Shilpa Mohan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి 'హైడ్రా' నోటీసులు.. సంగారెడ్డి జిల్లాలోని నల్లవాగును కబ్జా చేసి వెంచర్ వేసినట్లు గుర్తింపు
Rudraఏపీ మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగ్సన్ పల్లిలోని నల్లవాగును ఆయన ఆక్రమించి వెంచర్ వేసినట్లు హైడ్రా అధికారులు గుర్తించారు.
HYDRA Ranganath: 'హైడ్రా' కూల్చివేతల భయంతో కూకట్ పల్లిలో మహిళ బలవన్మరణం.. ఈ ఘటనతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్న కమిషనర్ రంగనాథ్
Rudraసహజ నీటి వనరులను అక్రమంగా చెరపట్టిన అక్రమార్కులపై పంజా విసురుతూ హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ హైడ్రా ఈమధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నది. అయితే, కూకట్ పల్లి పరిధిలోని యాదవ బస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తమ ఇంటిని ఎక్కడ కూల్చివేస్తదో అన్న భయంతో బలవన్మరణానికి పాల్పడింది.
Constable Suicide: తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన
Rudraరంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో తనను తాను కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Maggie Smith Dies: హాలీవుడ్ లో విషాదం, అకాడమీ అవార్డు విజేత, హ్యరీ పొటర్ నటి మ్యాగీ స్మిత్ కన్నుమూత
VNSహాలీవుడ్ (Hollywood) చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అకాడమీ అవార్డు విజేత, హ్యారీ పోటర్(Harry Potter) సినిమా ఫేం ప్రముఖ బ్రిటిష్ నటి మ్యాగీ స్మిత్ (Maggie Smith) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 89. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు స్మిత్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Money Rules Will Affect Finances From October: అక్టోబర్ 1 వ తేదీ కొత్త రూల్స్, క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులపై చార్జీల భారం, ఇళ్లు కొనేవారికి టీడీఎస్..మరిన్ని మార్పులివిగో..!
VNSపెట్టుబడులు పెడుతున్నారా? సేవింగ్స్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా? వచ్చే నెల నుంచి ఆర్థిక విషయాలకు సంబంధించి నిబంధనలు మారనున్నాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.
Jani Master Case: నన్నే ఆ అమ్మాయి వేధించింది! నా ఎదుగుదలను ఓర్వలేకనే కుట్ర చేశారు! పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ కీలక విషయాలు
VNSఅసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో మూడో రోజూ జానీ మాస్టర్ ను (Jani Master) పోలీసులు విచారించారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో (Police Custody) జానీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.
Traffic Advisory in Hyderabad: హైదరాబాద్ లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయంటే?
VNSశనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (draupadi murmu) హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సితక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడం నుంచి ఆమె నగరం విడిచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే వుండనున్నారు సీతక్క. రాష్ట్రపతి పర్యటనలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు
Devara Movie Success Meet: నా తమ్ముడు హిట్ కొట్టేశాడు! దేవర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ పై కల్యాణ్ రామ్ కామెంట్స్
VNSఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం దేవర (Devara). ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆరేండ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా రావడంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ దేవర సినిమా చూసి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా సాధించిన విజయం పట్ల దేవర టీం సక్సెస్ మీట్ నిర్వహించింది.
GHMC Commissioner Amrapali: హైదరాబాద్‌లో పోస్టర్లు బ్యాన్, ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలి,పోస్టర్లు వేస్తే భారీ జరిమానా విధించాలని ఆదేశం
Arun Charagondaహైదరాబాద్‌లో పోస్టర్లు బ్యాన్ చేస్తున్నట్లు వెల్లడించారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి. వాల్ పోస్టర్లు, వాల్ పెయింటింగ్స్‌పై సీరియస్‌గా వ్యవహరించాలని సర్క్యులర్ జారీ చేశారు కమిషనర్. సినిమా థియేటర్ వాళ్ళు కూడ ఎక్కడా పోస్టర్లు అతికించకుండ చూడాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టర్లు వేస్తే జరిమానా విధించాలని ఆదేశించారు.
CM Revanth Reddy On Musi River Development: పర్యాటక ప్రాంతాలుగా చారిత్రాత్మక భవనాలు,సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaమూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.
Another Mpox Case Reported in Kerala: కేరళలో మరో మంకీ పాక్స్ కేసు నమోదు, విదేశాల నుంచి తిరిగివచ్చిన వ్యక్తికి వ్యాధి నిర్ధారణ, భారత్‌లో మూడో కేసు ఇది
Hazarath Reddyకేరళలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైంది. ఇటీవల విదేశాల నుంచి ఎర్నాకులం తిరిగి వచ్చిన వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. ఈ మేరకు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతడి నమూనాలను పరీక్షలకు పంపించగా పాజిటివ్‌గా తేలిందని తెలిపారు.
Pune Horror: పూణేలో దారుణం, కాలేజీ క్యాంపస్‌లో 16 ఏళ్ల బాలికపై 6 నెలల పాటు నలుగురు సామూహిక అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyపూణె కాలేజీలో చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సామాజిక మాధ్యమాల్లో స్నేహం చేసి అత్యాచారం చేశారన్న ఆరోపణలపై 20 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, మరో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Telangana Shocker: తెలంగాణలో దారుణం, ప్రేమించడం లేదని బస్సులో యువతిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు
Hazarath Reddyతెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కదులుతున్న బస్సులో ప్రియురాలిపై ఓ ప్రేమికుడు గురువారం చిన్న కత్తితో దాడి చేశాడు.నిందితుడిపై సెక్షన్ 74, 78 BNS, 320, 118 (1) BNS కింద ఫిర్యాదు నమోదు చేయబడింది. ఈ విషయంపై విచారణ నిమిత్తం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
‘Human Sacrifice’ in UP: యూపీలో దారుణం, స్కూలు బాగు కోసం 2వ తరగతి బాలుడిని నరబలి ఇచ్చిన ఉపాధ్యాయులు, కుద్రపూజలు పేరిట హత్య
Hazarath Reddyయూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర పూజల పేరిట హత్రాస్‌లో 2వ తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారు. విద్యార్ధి చదువుతున్న పాఠశాల అభివృద్ధి చెందుతుందని స్కూల్ హాస్ట్‌లోనే బాలుడిని హత్య (‘Human Sacrifice’ in UP) చేశారు. వారం కిందట జరిగిన ఈ అమానుషం తాజాగా వెలుగులోకి వచ్చింది.