తాజా వార్తలు
Money Fraud In Hyderabad: హైదరాబాద్‌లో రూ.500 కోట్ల భారీ మోసం, ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి, అధిక వడ్డీ ఆశతో డబ్బులు వసూలు, బోర్డు తిప్పేసిన కంపెనీ
Arun Charagondaహైదరాబాద్‌లో మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో ప్రజలను ముంచేసింది డీకేజెడ్ టెక్నాలజీస్ సంస్థ. ఏకంగా రూ.500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుండి డబ్బులు వసూలు చేశారు కంపెనీ నిర్వాహకులు. రెండు నెలలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు. ఒత్తిడి ఎక్కువ కావడంతో మాదాపూర్‌లోని ఆఫీసుకి తాళం వేసి.. పరారయ్యారు . హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుల ఫిర్యాదు చేశారు
Madhya Pradesh: షాకింగ్ సంఘటన, అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు పత్రాలతో కలెక్టరేట్ వరకు పాక్కుంటూ వచ్చిన బాధితుడు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaమధ్య ప్రదేశ్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. తన గ్రామంలో అవినీతి, అక్రమాలపై 7 ఏళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు కంకారియాకు చెందిన ముకేశ్. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో ఫిర్యాదు పత్రాలను తాడుకి కట్టి కలెక్టరేట్ వరకు పాక్కుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
YS Sharmila On Rainy Season: వర్షాకాలానికి సరికొత్త అర్ధం చెప్పిన వైఎస్ షర్మిల, రైనీ సీజన్ అంటే షర్మిల ఏం చెప్పిందో తెలుసా?, అందుకే నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారా!
Arun Charagondaఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు మరోసారి ట్రోలింగ్‌గా మారారు. గతంలో పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని చెప్పి నవ్వుల పాలైన షర్మిల తాజాగా వర్షాకాలనికి అలాంటి సమాధానమే చెప్పింది. విజయవాడలో పర్యటించిన షర్మిల...మీడియాతో మాట్లాడుతూ రైనీ సీజన్ అంటే రైన్స్ వచ్చే సీజన్ అని చెప్పేశారు. అంతే నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు
Vijayawada Floods: కన్నీరు తెప్పిస్తున్న వీడియో, వరద నీటిలో శవమై తేలిన 14 ఏళ్ల బాలుడు,విజయవాడలో కన్నీటి దృశ్యాలు
Arun Charagondaవరద నుండి ఇప్పుడిప్పుడే విజయవాడ బయటపడుతోంది. ఇక సహాయక చర్యల్లో భాగంగా హృదయ విదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. చిట్టినగర్ పరిధిలో అదృశ్యమైన 14 ఏళ్ల బాలుడు వరద నీటిలో శవమై తేలాడు. నడుములోతు నీటిలో మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్తుండగా కొడుకుని తలుచుకుని రోదిస్తున్న ఆ తల్లి బాధ మాటల్లో చెప్పలేదని. ఈ దృశ్యాలు అందరిని కంటతడి పెట్టిస్తున్నాయి.
Nandigam Suresh Arrest: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్, టీడీపీ కార్యాలయంపై దాడి ఎఫెక్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు
Arun Charagondaవైసీపీ నేత, మాజీ ఎంపి నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో హైదరాబాద్‌లో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మంగళగిరికి ఆయన తరలించారు.
Teachers Day Wishes In Telugu 2024: టీచర్స్ డే సందర్భగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక రోజున శుభాకాంక్షలను పంపడం ద్వారా మీ గురువుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి సమయం ఆసన్నమైంది.
Teacher's Day 2024 Wishes In Telugu: మీ స్నేహితులు, గురువులకు టీచర్స్ డే సందర్భంగా మంచి స్ఫూర్తి వంతమైన గ్రీటింగ్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 5, 1888న ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించారు. మద్రాసులోని క్రిస్టియన్ కాలేజీలో చదువు పూర్తి చేశారు. డాక్టర్ కృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి అనేక విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు.
Teachers Day 2024 Wishes & Quotes In Telugu: టీచర్స్ డే సందర్భంగా మీ గురువులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో విషెస్ తెలియజేయండిలా..
sajayaప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5న జరుపుకుంటే, భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5న జరుపుకోవడం గమనార్హం. ఇది దేశ మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిగా జరుపుకుంటారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఈ రోజున జన్మించారు
Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల కోసం ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన బీజేపీ, సీఎం నయాబ్ సింగ్ సైనీ పోటీ చేసేది ఇక్కడి నుంచే!
VNSహర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Elections) కోసం 67 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో సీఎం నయాబ్ సింగ్ సైనీ (CM Nayab Singh Saini ) పేరు కూడా ఉంది. ఆయనకు లాద్వా (Ladwa) అసెంబ్లీ టికెట్‌ను కేటాయించారు. మనోహర్‌లాల్ ఖట్టర్ సీఎంగా ఉన్న టైంలో కురుక్షేత్ర ఎంపీగా నయాబ్ సింగ్ సైనీ ఉండేవారు.
Sukanya Samriddhi Yojana update: సుకన్య సమృద్ది యోజన అకౌంట్ దారులకు అలర్ట్! కొత్త రూల్స్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఈ ఖాతాలను వెంటనే మార్చకపోతే ఇబ్బందులు తప్పవు
VNSనిబంధనలకు అనుగుణంగా లేని పొదుపు ఖాతాలను (Savings Account) క్రమబద్ధీకరించడానికి ఆర్థిక వ్యవహారాల శాఖ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నియమాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.
Vijay Sethupathi to Host Bigg Boss Tamil Season 8: బిగ్ బాస్ 8 హోస్ట్ గా విజయ్ సేతుపతి, కొత్త ప్రోమో చూశారా? కమల్ హాసన్ ను రీప్లేస్ చేసిన విలక్షణ నటుడు
VNSబిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు (Bigg boss 8 tamil) రంగం సిద్ధమైంది. అదేంటి? ఆల్‌రెడీ మొదలైంది అంటారా! అవును, తెలుగులో మూడు రోజుల క్రితమే లాంచ్ అయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ బిగ్‌బాస్ గురించి! అక్కడ కూడా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ షురూ కానుంది
Central Govt Committee: ఏపీలో వరదలపై సాయానికి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం, రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర కమిటీ, అమిత్ షా ట్వీట్
VNSవిజయవాడలో దారుణ పరిస్థితులపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. ఏపీలో వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith Shah) తెలిపారు.
YS Jagan Comments on Chandrababu: కరకట్ట దగ్గర ఇళ్లు మునిగింది కాబట్టే..చంద్రబాబు కలెక్టరేట్ లో ఉంటున్నారు! సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ జగన్
VNSవిజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు (Chandra Babu) ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆరోపించారు. బుధవారం విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.
MK Stalin Rides Bicycle: అమెరికాలో స్టాలిన్ సైకిల్ సవారీ వీడియో వైరల్, చెన్నైలో మనిద్దరం ఎప్పుడు సైకిల్ తొక్కుదామంటూ రాహుల్ గాంధీ రిప్లై, తమిళనాడు సీఎం ఏమన్నారంటే..
Hazarath Reddyఅమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin).. షికాగో సరస్సు తీరంలో సైకిల్ తొక్కుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వెంటనే స్పందించారు
No Pension for MLAs Who Defect: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇకపై నో పెన్సన్, కీలక బిల్లును తీసుకువచ్చిన హిమాచల్ ప్రభుత్వం, సభలో చర్చ అనంతరం బిల్లు ఆమోదం
Hazarath Reddyఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ (Pension Cut) సదుపాయాన్ని నిలిపివేస్తూ బిల్లును తీసుకువచ్చింది.
PM Modi Plays Drum: వీడియో ఇదిగో, సింగపూర్‌లో డోలు వాయించిన ప్రధాని నరేంద్ర మోదీ, అన్నయ్యా అంటూ రాఖీ కట్టిన మహిళ
Hazarath Reddyప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు బ్రూనై పర్యటనను ముగించుకొని సింగపూర్ (Singapore) వెళ్లారు. సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది.
Telangana: కేసీఆర్ కనబడుట లేదు, ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత ఎక్కడంటూ పోస్టర్లు వైరల్
Hazarath Reddyకేసీఆర్ కనబడుట లేదని తెలంగాణలో పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. రెండు సార్లు అధికారం ఇచ్చినా... ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే బయటకు రాని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లు.రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Godavari Water Level Rises: వీడియో ఇదిగో, గోదావరిలో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీ వరద ఉధృతి
Hazarath Reddyతుఫాను ప్రభావం వలన ఎగువ రాష్ట్రాల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం బుధవారం సాయంత్రానికి పెరుగుతూ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే ఎగువన 31.770 మీటర్ల నీటిమట్టం, స్పిల్ వే దిగువన 23.100 మీటర్ల నీటిమట్టం నమోదయింది.
Vijayawada Floods: అటు కృష్ణానది, ఇటు బుడమేరు కలిసి విజయవాడను ముంచేశాయి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyరాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరదల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నదిలో అదనంగా 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని అన్నారు.
Devara Daavudi Video Song: దేవర నుంచి దావూదీ వీడియో సాంగ్ ఇదిగో, పోటీపడి మరీ డ్యాన్స్ వేసిన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్
Vikas Mమేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ప్రకటించిన ప్రకారం దావూదీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ పాటలో తారక్, జాన్వీకపూర్ పోటీపడి మరీ డ్యాన్స్ చేసినట్లు వీడియో సాంగ్ చెబుతోంది.