తాజా వార్తలు
Hidden Camera In Oyo Room: శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం, గదిలో రహస్య సీసీ కెమెరా, ఏకాంత వీడియోలతో బెదిరింపులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ జంట..బయటపడ్డ సంచలన నిజం..వీడియో
Arun Charagondaహైదరాబాద్ శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాకం బయటపడింది. లాడ్జిలో సీసీ కెమెరా పెట్టి జంటలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కంత్రీ గాడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఓయో రూమ్‌లో హిడెన్ కెమెరా పెట్టి జంటల వీడియోలు తీస్తున్నాడు నిర్వాహకుడు.హోటల్ సిటా గ్రాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని.. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
CJI Chandrachud Impersonator: ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను టార్గెట్ చేసిన సైబర్ క్రిమినల్, సీజేఐ పేరుతో ఫేక్ అకౌంట్, క్యాబ్ చార్జీల కోసం రూ. 500 కావాలంటూ ఎక్స్ యూజర్ కు మెసేజ్
VNSసోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఈ మధ్య సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు (Fake Accounts) క్రియేట్ చేసి డబ్బులు అడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుంటున్నవారు.. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని (CJI) టార్గెట్ చేశారు.
YS Jagan Foreign Tour Updates: మరోసారి విదేశాలకు వైఎస్ జగన్, ఈసారి ఎన్ని రోజులో తెలుసా?, సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యుకేకు వైసీపీ అధినేత!
Arun Charagondaఏపీ మాజీ సీఎం జగన్ మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరగా ఓకే చెప్పడంతో యుకే టూర్ ఖరారైంది. సెప్టెంబర్ 3న ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ వెళ్లనున్నారు జగన్. సెప్టెంబర్ 3 నుండి 25 వరకు యూకేలో పర్యటించనున్నారు.
X Down Globally: ట్విట్టర్ డౌన్, సామాజిక మాధ్యమం ఎక్స్ లో సాంకేతిక సమస్య, డౌన్ డిటెక్టర్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
VNSప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (X) యూజర్లకు చుక్కలు చూపిస్తోంది. చాలా మంది యూజర్లకు న్యూస్ ఫీడ్ కనిపించడం లేదు. దీంతో ఎక్స్ డౌన్ (X Down) అయిందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
Gujarat Rains: గుజరాత్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వరదలు, 15 మంది మృతి, 20వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు, పోటెత్తి ప్రవహిస్తున్న నదులు
VNSగుజరాత్‌ను భారీ వర్షాలు (Gujrat Rains) ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. పలు నగరాల్లో రోడ్లు (Heavy Rains) జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు 23,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సుమారు 300 మందిని సహాయక బృందాలు కాపాడాయి.
Oral Cholera Vaccine: నోటిద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ తీసుకువచ్చిన భారత్ బయోటెక్, పూర్తిస్థాయి క్లీనికల్ ట్రయల్స్ అయ్యాక మార్కెట్లోకి..
VNSతెలంగాణకు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్..నోటిద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ ‘హిల్‌కాల్’ (Heal call)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెల్కమ్ ట్రస్ట్, హిలమెన్ ల్యాబోరేటరీస్ నుంచి లైసెన్స్ పొందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
K Kavitha Walks Out of Tihar Jail: ఉద్విగ్నభరిత వాతావరణంలో ఎమ్మెల్సీ కవిత విడుదల, జైలు నుంచి ఇంటికి ఆటోలో వెళ్లిన కేటీఆర్, ఇవాళ హైదరాబాద్ కు కవిత, ఘనస్వాగతానికి ఏర్పాట్లు
VNSతీహార్ జైలు నుంచి మంగళవారం పొద్దుపోయిన తర్వాత కవిత విడుదలయ్యారు (MLC Kavitha relesed). రౌస్ అవెన్యూ న్యాయస్థానం నుంచి కవిత బెయిల్‌కు సంబంధించిన పత్రాలను న్యాయవాదులు జైలు అధికారులకు సమర్పించారు. జైలు లాంఛనాలు పూర్తయిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆమె బయటకు వచ్చారు. కవిత విడుదల సందర్భంగా తీహార్ జైలు వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి.
Devara New Poster: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న దేవర కొత్త లుక్, ఓ వైపు నవ్వు మరో వైపు రౌద్ర రూపంలో జూనియర్ ఎన్టీఆర్
Vikas Mకొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర (Devara) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్‌లో రోల్‌లో నటిస్తున్న సంగతి విదితమే. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.తాజాగా కొత్త లుక్ షేర్ చేశారు మేకర్స్.
Lightning Caught on Camera: వీడియో ఇదిగో, మక్కా క్లాక్ టవర్‌పై మీద ఉరుములు మెరుపులు, అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్లు
Vikas Mఅసాధారణమైన సహజ సంఘటనలో, సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులు మెరుస్తున్నట్లు అద్భుతమైన ఫుటేజీలు వెలువడ్డాయి. ఈ అసాధారణ దృశ్యం యొక్క వీడియో ఆగష్టు 27న కనిపించింది. శక్తివంతమైన ఉరుములతో కూడిన తుఫాను సమయంలో సౌదీ అరేబియాలోని మక్కా క్లాక్ టవర్‌పై మెరుపులను తాకినట్లు సంగ్రహించబడింది.
Shreyas Iyer Imitates Sunil Narine's Action: వీడియో ఇదిగో, సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించిన శ్రేయాస్ అయ్యర్, నవ్వులే నవ్వులు
Vikas Mఆగస్ట్ 27న బుచ్చి బాబు క్రికెట్ టోర్నమెంట్‌లో TNCA XI vs ముంబై మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ తన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) సహచరుడు సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తూ బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడు. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు, 89వ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడానికి వచ్చారు.
‘Kaun Banega Crorepati 16’: కౌన్ బనేగా కరోడ్‌పతి 16, ఏ చేయి వాడాలనే దానిపై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ఆన్సర్ వింటే నవ్వులే నవ్వులు, వీడియో ఇదిగో..
Vikas Mఅమితాబ్ బచ్చన్ నిజంగానే కౌన్ బనేగా కరోడ్‌పతి 16 లో స్టార్‌గా నిలిచాడు. అతను ఏ సమయంలోనైనా సమయస్ఫూర్తిని వదలడు! సోనీ టీవీ నుండి ఒక ఫన్నీ క్లిప్‌లో, బచ్చన్ తన కుడి చేతిని ఉపయోగించడం ప్రారంభించమని తన తండ్రి సూచించినప్పుడు తనకు 8 ఏళ్లు వచ్చే వరకు తాను లెఫ్టీ అని పంచుకున్నాడు.
Wynk Music App: సంగీత ప్రియులకు షాకివ్వబోతున్న ఎయిర్‌టెల్, వింక్ మ్యూజిక్ సేవలకు గుడ్ బై.. ఇకపై యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినే అవకాశం
Vikas Mప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న వింక్ మ్యూజిక్ (Wynk) సేవల్ని త్వరలోనే నిలిపి వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాపిల్‌తో కొత్తగా కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
YouTube Premium Price Hike in India: రూ.129 నుంచి రూ. 149 కి యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ ధర పెంపు, అన్ని రకాల ధరలను సవరించిన ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం
Vikas Mప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం యూట్యూబ్ (YouTube) భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరల్ని పెంచింది. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే యూజర్లు డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. ఫ్యామిలీ, స్టూడెంట్, వ్యక్తిగత ప్లాన్ అన్నింటి ధరల్ని సవరించింది. కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.
Apple Jobs in India: ఆపిల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు, వచ్చే ఏడాది నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లుగా వార్తలు
Vikas Mగ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే ఏడాది నాటికి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 మార్చి నాటికి ఏకంగా ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనుందని భావిస్తున్నారు.
Health Tips: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaకీర దోసకాయ లో అధిక శాతం నీరు ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కీరదోస తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Jay Shah ICC New Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జైషా..డిసెంబర్ 1న ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జైషా.
sajayaభారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జై షాకు పెద్ద బాధ్యత లభించింది. ఆయన అత్యున్నత క్రికెట్ బాడీ అయిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ అయ్యాడు. మంగళవారం స్వతంత్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులు, త్వరలో ఫామ్ హౌస్ కూల్చనున్న హైడ్రా, ఇప్పటికే సర్వే పూర్తి!
Arun Charagondaతెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు హైడ్రా అధికారులు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు కొలతలు తీసుకున్నారు. త్వరలోనే జన్వాడ ఫాం హౌస్ ను కూల్చనున్నారు హైడ్రా అధికారులు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సర్వేను పూర్తి చేశారు.
CM Revanth Reddy On Prajapalana: సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం, గోషామహల్‌కు ఉస్మానియా ఆస్పత్రి తరలింపు, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు..
Arun Charagondaసెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్..రేషన్ కార్డు, హెల్త్ కార్డుల కోసం వివరాల సేకరణ చేయాలన్నారు.
MLA Bolisetty Srinivas On Allu Arjun: అల్లు అర్జున్ ఏమైనా పుడింగా?, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి ఫైర్, బన్నీకి అసలు ఫ్యాన్సే లేరని మండిపాటు, స్థాయిని మించి మాట్లాడొద్దని చురకలు
Arun Charagondaసినీ నటుడు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అల్లు అర్జున్ కు అసలు ఫ్యాన్స్ అంటూ ఎవరూ లేరని..ఉన్నదంతా కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమేనన్నారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? ,అతను ప్రచారం చేయకపోతే మాకేమైనా నష్టం జరిగిందా? అన్నారు.
BJP MLA Raja Singh On Akbaruddin Owaisi: బీఆర్ఎస్ మద్దతుతోనే మజ్లిస్ చెరువుల కబ్జా, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్, సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు
Arun Charagondaమజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారని..ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు అని దుయ్యబట్టారు.