తాజా వార్తలు

Bird Flu Outbreak In Wanaparthy: బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్.. వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి, చికెన్ షాపులను మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశం

Arun Charagonda

తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ హడలెత్తిస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపగా తాజాగా తెలంగాణలోని వనపర్తి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందాయి

Karnataka: తీవ్ర విషాదం, ట్రక్కు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు, అదుపుతప్పి వాహనాల మీదకు దూసుకెళ్లడంతో ఒకరు మృతి, చివరకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిన వాహనం

Hazarath Reddy

కర్ణాటకలోని కలబురగిలో బుధవారం రాత్రి ట్రక్కు డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ట్రక్కు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లడంతో వరుస ప్రమాదాలు సంభవించాయి, దీని ఫలితంగా ఒకరు మరణించారు

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Arun Charagonda

తెలంగాణ బీజేపీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చింది మెటా . సోషల్‌ మీడియాలో ధ్వేష పూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తున్నట్లు ఇండియా హేట్‌ ల్యాబ్‌ (IHL) ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ మేరకు చర్యలు తీసుకుంది.

Telangana Highcourt On Hydra: హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. తీరు మార్చుకోకపోతే హైడ్రాను మూసేస్తామని హెచ్చరిక, మీరెమన్న దోపిడి దొంగలా? అని మండిపాటు

Arun Charagonda

హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా అని హెచ్చరించింది . మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసింది హైకోర్టు.

Advertisement

Hyderabad: వేరే మహిళతో అక్రమ సంబంధం.. జీహెచ్‌ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌ జానకిరామ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య, దేహశుద్ది, వైరల్ వీడియో

Arun Charagonda

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఆయన భార్య.

Food Poison At NMIMS University: జడ్చర్ల ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 80 మంది విద్యార్థులకు అస్వస్థత, వీడియో ఇదిగో

Arun Charagonda

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి వద్ద ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు.

Student Dies By Suicide: ఖమ్మం శ్రీ చైతన్య కాలేజీలో విషాదం.. చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

Rudra

విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన విద్యాలయాలు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. మార్కుల కోసం తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక, స్కూల్స్ లో పెట్టే స్కోర్ టార్గెట్లు తాళలేక ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలితీసుకుంటున్నారు.

Sangareddy Horror: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్.. సంగారెడ్డిలో ఘటన

Rudra

అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్ వాదీ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గురువారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది.

Advertisement

Telangana: బొట్టు పెట్టి పెళ్లి అయిందని నమ్మించి యువతిని మోసం చేసిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఏకంగా ఫ్లాట్ అద్దెకు తీసుకుని మరి అరాచకం, వివరాలివే

Arun Charagonda

సింధూరం పెట్టి పెళ్లి అయిందని నమ్మించి, యువతిని మోసం చేశాడు ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తె..మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ (26) బెంగుళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఒక క్లినిక్‌లో పనిచేసే యువతి పరిచయం అయింది.

Petition Filed In High Court Against KCR: కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్.. అసెంబ్లీకి రాకపోతే వేటు వేయాలని అభ్యర్ధన

Rudra

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయింది. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకి రావడంలేదని, దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని సదరు పిటిషనర్ కోరారు.

Taj Banjara Hotel Seized: హైదరాబాద్ లోని ప్రఖ్యాత తాజ్‌ బంజారా హోటల్‌ సీజ్.. పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. వీడియోలు వైరల్

Rudra

తాజ్‌ బంజారా.. ఈ పేరు వింటే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనేకాదు దక్షిణ భారత దేశంలోనే ఓ టాప్ రేటెడ్ హోటల్ అన్న స్ఫురణకు వస్తుంది. హైదరాబాద్ కు మరింత ఆకర్షణ తీసుకొచ్చిన ఈ ప్రఖ్యాత హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు.

School Student Died With Heart Attack: స్కూలుకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించిన పదో తరగతి విద్యార్థిని.. కామారెడ్డిలో ఘటన

Rudra

గతంలో గుండెపోటు అంటే 60-70 ఏండ్లు దాటిన వారికి అదీ ఊబకాయంతో బాధపడే వారికి వచ్చేది. అయితే, ఇప్పుడు యువతీయువకులతో పాటు స్కూల్ పిల్లలకు కూడా గుండెపోటు రావడంతో పాటు కొన్ని మరణాలు కూడా సంభవించడం నిత్యకృత్యంగా మారింది.

Advertisement

Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

Rudra

భారత డబుల్స్ బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి ఇంట విషాదం చోటుచేసుకుంది.. సాత్విక్ సాయిరాజ్ కి పితృవియోగం నెలకొంది.

24*7 Shops In Ramadan Month: 24 గంటలూ దుకాణాలు ఓపెన్.. మార్చి 2వ తేదీ నుండి 31 వరకు తెరుచుకోవడానికి అనుమతి.. రంజాన్ సందర్భంగా కార్మిక శాఖ ఉత్తర్వులు

Rudra

ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం సందర్భంగా కార్మిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో మార్చి 2వ తేదీ నుంచి 31 వరకు దుకాణాలు 24 గంటలూ తెరుచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

IAS Transfers in Telangana: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారుల బదిలీ, ఆరోగ్య శ్రీ సీఈవో శివకుమార్‌ స్థానంలో కర్ణన్‌

VNS

తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ (IAS Transfers) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా కె.సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్‌.శివకుమార్‌ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Indiramma Houses In Telangana: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముహుర్తం ఖరారు, రేపు నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌

VNS

ఇల్లు లేని కుటుంబాలకు ఇండ్లు (Indiramma Houses) మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. మొదటి విడుతలో మంజూరు చేసిన 72,045 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అప్పకపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, రషిద్‌ బౌలింగ్‌‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద సౌమ్య సర్కార్ కు దొరికిపోయిన భారత్ స్టార్ బ్యాటర్

Hazarath Reddy

భారత జాతీయ క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషద్ హొస్సేన్ 22 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఛేజింగ్ చేస్తున్నప్పుడు 23వ ఓవర్ నాలుగో బంతికి ఈ వికెట్ సంఘటన జరిగింది. రిషద్ హొస్సేన్ ఆఫ్-స్టంప్ వెలుపల లెంగ్త్ డెలివరీ వేశాడు. కోహ్లీ బ్యాక్ ఫుట్ ద్వారా కట్ చేయగా బ్యాక్‌వర్డ్ పాయింట్ ప్రాంతంలో సౌమ్య సర్కార్ సులభమైన క్యాచ్ తీసుకున్నాడు

Jaker Ali’s Stunning Pushpa Celebration: వీడియో ఇదిగో, నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్న బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ

Hazarath Reddy

చాంపియన్స్ ట్రోఫీలోనూ బన్నీ మేనియా కనిపించింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో తగ్గేదేలే సెలబ్రేషన్ వైరల్ అయింది. హాఫ్ సెంచరీ బాదిన బంగ్లా బ్యాటర్ జేకర్ అలీ బ్యాట్‌తో తగ్గేదేలే అంటూ సెలబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్‌ను హెల్మెట్ కింద నుంచి తీసుకెళ్తూ తగ్గేదేలే పోజ్‌ను దించేశాడు జేకర్ అలీ

Shubman Gill Slams First Century: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీతో అదరగొట్టిన శుభ్‌మన్‌ గిల్‌, ఆరు వికెట్ల తేడాగో బంగ్లాపై భారత్ ఘన విజయం

Hazarath Reddy

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన 2013 ఛాంపియన్స్ బంగ్లాపై ఆరు వికెట్ల తేడాతో సమగ్ర విజయాన్ని సాధించారు.భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. భారత ఓపెనర్ 101 పరుగులతో అజేయంగా నిలిచి తన జట్టును ఆధిపత్య విజయానికి నడిపించాడు

Shubman Gill Six Video: వీడియో ఇదిగో, గిల్ కొట్టిన సిక్స్ దెబ్బకు ఒక్కసారిగా షాకైన రోహిత్ శర్మ, ఇదేం షాట్ అంటూ వెరైటీ ఎక్స్‌ప్రెషన్

Hazarath Reddy

ఈ మ్యాచ్ లో వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కొట్టిన ఓ షాట్‌కు రోహిత్ షాక్ అయ్యాడు. బౌన్సర్‌ను వెంటనే పిక్ చేసిన గిల్.. లెగ్ సైడ్ కళ్లుచెదిరే రీతిలో పుల్ షాట్‌గా మలిచాడు. నిల్చున్న చోటు నుంచే స్టేడియంలోకి తరలించాడు. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది.

Advertisement
Advertisement